English | Telugu

తెలంగాణ ఎన్నికలపై టాలీవుడ్ లో భారీ బెట్టింగ్ లు!

బెట్టింగ్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది క్రికెట్. ఐపీఎల్, వరల్డ్ కప్ సమయంలో లక్షలు, కోట్లు చేతులు మారుతుంటాయి. అలాగే ఎన్నికల సమయంలో కూడా జోరుగానే బెట్టింగ్ లు జరుగుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపై టాలీవుడ్ లో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయట.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ మాదే గెలుపుని ధీమాగా చెబుతున్నాయి. వరుసగా మూడోసారి గెలిచి సరికొత్త రికార్డు సృష్టిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. ఇక ఎప్పుడూ లేనంత జోష్ లో ఉన్న కాంగ్రెస్ ఈసారి మాదే అధికారమంటోంది. పలు సర్వేలు సైతం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ ఇప్పుడు రేసులో కాస్త వెనకపడినట్లు కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం సైలెంట్ గా సంచలనం సృష్టిస్తామని అంటున్నారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనేది డిసెంబర్ 3న తేలిపోతుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే అనేది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడు పలువురు తెలుగు సినీ ప్రముఖులు సైతం ఈ రెండు పార్టీలపై భారీగా బెట్టింగ్ లు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ గెలుస్తుందని కొందరు, కాంగ్రెస్ దే గెలుపుని మరికొందరు.. లక్షలు, కోట్లల్లో బెట్టింగ్ లు పెడుతున్నారట. వారిలో పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారట. ముఖ్యంగా ఇద్దరు నిర్మాతలైతే ఒకరు బీఆర్ఎస్ గెలుస్తుందని, మరొకరు కాంగ్రెస్ గెలుస్తుందని భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టారట. అందులో ఎవరు బెట్ ఓడిపోయినా ఆ మొత్తం ఒక చిన్న సినిమా తీసి చేతులు కాల్చుకున్న డబ్బుతో సమానమని అంటున్నారు.