English | Telugu
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అజిత్.. 30 ఏళ్ళ తర్వాత తెలుగు సినిమా!
Updated : Nov 26, 2023
ఈమధ్య తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ 'వారసుడు' అనే సినిమా చేశాడు. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా చేసిన ధనుష్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు మరో తమిళ హీరో అజిత్ కూడా తెలుగు డైరెక్టర్ తో చేతులు కలబోతున్నట్లు సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అజిత్ అంగీకరించాడట. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే రవితేజ హీరోగా మైత్రి బ్యానర్ లో మలినేని ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అధిక బడ్జెట్ కారణంగా ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. అయితే ఇప్పటికే మలినేనికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్న మైత్రి.. మరో హీరోతో ఆయన డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో మైత్రి బ్యానర్ లో సినిమా చేయడానికి అజిత్ అంగీకరించడంతో.. దానికి మలినేని దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా 1993లో 'ప్రేమపుస్తకం' అనే తెలుగు సినిమాలో నటించిన అజిత్.. ఏకంగా 30 ఏళ్ళ తర్వాత తెలుగులో సినిమా చేస్తుండటం విశేషం.