English | Telugu

బాలయ్యంటె భయపడుతున్నారా?

 

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ సినిమాకు ఆరునెలల క్రితమే ఒప్పందం కుదిరింది. రెండు వారాల క్రితం లాంఛనంగా షూటింగ్ మొదలైంది. అయినా ఇప్పటివరకు ఆ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. రకరకాల ఊహాగానాలు మాత్రమే తెరపైకి వచ్చి.. వచ్చినంత వేగంగా వెళ్లిపోతున్నాయ్.

 

యంగ్ హీరోయిన్స్ ఎవరూ బాలకృష్ణతో జతకట్టేందుకు అంగీకరించకపోతుండడం.. బాలకృష్ణతో ఇంతకుముందు జతకట్టి ఉన్న నయనతార, అనుష్క వంటివారు బిజీగా ఉండడంతో.. హీరోయిన్ల ఎంపిక కొలిక్కిరావడం లేదు. ఛార్మి, లక్ష్మీరాయ్ వంటివారితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణపై యాక్షన్ సీన్స్ షూట్ చేయడం ప్రారంభించాలని దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది!