English | Telugu
దాసరి పరిస్థితేంటి ?
Updated : Jun 28, 2013
రెండు నెలల క్రితం తన బర్త్డే సందర్భంగా దర్శకరత్న డా.దాసరి దాదాపు అరడజను సినిమాలు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తన దర్శకత్వంలో కొన్ని.. తన శిష్యుల దర్శకత్వంలో తను నిర్మాతగా కొన్ని దాసరి ప్రకటించారు. వాటిలో "వడ్డి కాసులవాడు" అనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేసారు కూడా.
అయితే రెండు వారాల క్రితం దాసరిపై సి.బి.ఐ దాడులు జరగడంతో ఈ సినిమా విషయమై అయోమయం నెలకొంది. సి.బి.ఐ వ్యవహారం నెల్రోజుల్లోనో, రెండు నెలల్లోనో తేలిపోయేది కాదు. సంవత్సరాల తరబడి నడిచే తతంగమది. దాంతో.. దాసరి ఎనౌన్స్ చేసిన సినిమాలన్నీ అటకెక్కినట్లేనని తెలుస్తోంది.
అలాగే.. దాసరి తలపెట్టిన "పొలిటికల్ అండ్ సినీ విక్లీ" కూడా ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే.. నిన్నమొన్నటివరకు దాసరిని ఆహ్వానించకుండా.. ఏ సినిమా ఫంక్షన్ జరిగేది కాదు. రెండ్రోజులకొకసారైనా ఆయన మీడియాలో హల్చల్ చేస్తుండేవారు. సి.బి.ఐ దాడులు జరిగినప్పటినుంచి ఆయనకు ఆహ్వానాలు కూడా అందడం లేదు!