English | Telugu
వాళ్ళను మించి కొట్టమంటున్న బాలయ్య
Updated : Jun 11, 2013
చిరంజీవికి శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.,నాగార్జునకి 'కింగ్', 'మాస్', వెంకటేష్ కు 'తులసి' లాంటి బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రుపొందనున్న చిత్రానికి సంగీతం అందించనున్న విషయం విషయం అందరికి తెలిసిందే.
అయితే చిరంజివి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకులకు బ్రాండెడ్ టైటిల్ సాంగ్స్ ని అందించాడు దేవి. మరి బాలయ్య ఊరుకుంటాడా? బాలయ్య-దేవి కాంబినేషన్ లో వస్తున్నా ఈ చిత్రంలో కూడా ఒక అదిరిపోయే టైటిల్ సాంగ్ తో పాటు, మరో మాస్ మసాల పాటను కూడా పెట్టాలనీ, ఈ రెండు పాటలు మాత్రం ఎప్పటికి దుమ్ము లేచిపోయేలా ఉండే విధంగా చూడమని దేవికి చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటె... ఈ చిత్రంలో బాలయ్య చేత ఓ చిన్న బిట్ సాంగ్ అయిన పాడించాలని దేవి సన్నాహాలు చేస్తున్నాడట.
మరి వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందో లేదో చూడాలి.