English | Telugu

అనుష్క ఇక అంతా స్పైసీయేనంట...!

 

అనుష్క నటించిన "అరుంధతి" చిత్రం నుండి ఇప్పటి వరకు దాదాపు అన్ని చిత్రాల్లో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది కానీ గ్లామర్ పాత్రలు సరిగ్గా చేయలేదు. అయితే అనుష్క ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించబోతుంది. అజిత్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో అనుష్క చాలా గ్లామర్ గా, ఆల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా స్పైసీ స్పైసీగా కనిపించబోతున్నారట. వేసవిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మీద తను చేసే సినిమాలన్నీ గ్లామర్ పాత్రలే చేయాలని అనుష్క నిర్ణయించుకుంది. అలాగే అనుష్క తెలుగులో నటిస్తున్న "రుద్రమదేవి", "బాహుబలి" వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకేక్కుతున్నాయి. అనుష్క సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.