English | Telugu
అప్పుడు బాలయ్యతో..ఇప్పుడు ఎన్టీఆర్ తో..?
Updated : Feb 26, 2014
గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన "గాండీవం" చిత్రంలోని ఓ పాటలో అక్కినేనితో కలిసి ఆడిపాడిన మోహన్ లాల్ అందరికి సుపరిచితుడే. మోహన్ లాల్ ఇటీవలే నటించిన పలు చిత్రాలు తమిళంలో విజయం సాధించడంతో తెలుగులో కూడా మోహన్ లాల్ ను తీసుకోవడానికి "రభస" ప్రయత్నాలు చేస్తుందట.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "రభస" చిత్రంలో ఓ కీలక పాత్రలో మోహన్ లాల్ ను తీసుకోవడానికి చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే అపుడు బాబాయ్ సినిమాలో కనిపించిన మోహన్ లాల్ ఇపుడు అబ్బాయి సినిమాలో కనిపించి మరోసారి అలరించనున్నాడన్నమాట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. సమంత, ప్రణీత కథానాయికలు.