English | Telugu
ఆలీది అంత ఉత్తిదేనట...!
Updated : Feb 26, 2014
నటుడు ఆలీకి ఇటీవలే డాక్టరేట్ వచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే. "అత్తారింటికి దారేది" సినిమా షూటింగ్ టైంలో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడే ఆలీతో కేక్ కట్ చేయించి, ఆలీకి సన్మానం కూడా చేసాడు. అలాగే ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో కూడా ఆలీ గురించి గొప్పగానే పవన్ మాట్లాడాడు. అయితే ఈ డాక్టరేట్ ప్రధానం కొనుక్కున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డాక్టరేట్ కోసం లక్షన్నర అకాడెమీ ఆఫ్ గ్లోబల్ పీస్ సంస్థ వారికీ ముట్టజెప్పి, డాక్టరేట్ తెచ్చుకున్నట్లు తెలిసింది. అంటే ఇది టాలెంట్ ను మెచ్చి ఇచ్చింది కాదని.. డబ్బు పెట్టి కొని తెచ్చుకున్న డాక్టరేట్ అని అర్థమవుతుంది. మరి ఈ విషయం తెలిస్తే పవన్ ఎలా స్పందిస్తాడో త్వరలోనే తెలియనుంది.