English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ మరో శక్తి కానుందా...!

అల్లు అర్జున్ "బద్రీనాథ్" మరో "శక్తి" కానుందా...! అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా ద్విపాత్రాభినయం చేయగా, ఇలియానా హీరోయిన్ గా నటించగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మించిన "శక్తి" చిత్రం రిలీజ్‍ కు ముందు భారీ అంచనాలతో ప్రేక్షకులను, యన్ టి ఆర్ అభిమానులను బాగా ఊరించింది. తీరా విడుదలయ్యాక అందులో విషయం లేదని అభిమానులే తిట్టుకుంటూ పోయారు. ఆ చిత్రంలో యన్ టి ఆర్ శక్తి పీఠానికి "రక్షకుడు"గా నటించారు. ఈ "శక్తి" యన్ టి ఆర్ పెళ్ళికి ముందు విడుదలైంది.

అలాగే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "బద్రీనాథ్". "బద్రీనాథ్" చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా అంటే ఇదోరకం రక్షకుడిగా నటిస్తున్నారు. ఇందులో పోస్టర్స్ కూడా కత్తులతో కంగారు పెట్టిస్తున్నాయి. అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. కాకపోతే "శక్తి" యన్ టి ఆర్ పెళ్ళికి ముందుగా వస్తే "బద్రీనాథ్" అల్లు అర్జున్ పెళ్ళయిన తర్వాత వస్తోంది అంతే తేడా. "బద్రీనాథ్" హిట్టవ్వాలనే కోరుకుందాం. కాకపోతే ఈ శకునాలన్నీ చూస్తుంటే "బద్రీనాథ్" మరో "శక్తి" కానుందా అన్న అనుమానం సినీజనంలో కలుగుతోంది.