English | Telugu
అక్కినేని సన్మానానికి ఆలస్యం ఎందుకు
Updated : Apr 26, 2011
అక్కినేని సన్మానానికి ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న ఫిలింనగర్ లో జనాన్ని వేధిస్తోంది. వివరాల్లోకి వెళితే భారత ప్రభుత్వంచే అత్యంత ప్రతిష్టాత్మక "పద్మవిభూషణ్" అవార్డునందుకున్న లెజెండరీ యాక్టర్ నటసామ్రాట్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు గారిని ఘనంగా సన్మానించాలని మన తెలుగు సినీ పరిశ్రమ తీర్మానించింది. కానీ ఆ సన్మానానికి మాత్రం ఇంకా ముహూర్తం కుదరలేదు. ఇదిగో అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంకొందరైతే సూపర్ స్టార్ కృష్ణకు "పద్మ భూషణ్" , మోహన్ బాబుకి "పద్మశ్రీ", యస్.పి.బాలసుబ్రహ్మణ్యం "పద్మశ్రీ"లు వచ్చాయి గనుక అక్కినేనితో పాటు వీరికి కూడా సన్మానం చేయాలన్న ఆలోచన లేవనెత్తారు.
మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు గారికి "దాదాసాహెబ్ ఫాల్కే" అవార్దు వచ్చిన సందర్భంగా జరిగిన సన్మానానికి సూపర్ స్టార్ కృష్ణ కూడా వచ్చారు.అప్పుడీ ఆలోచన ఎందుకు రాలేదో ఈ పెద్దలకు. నిజానికి అక్కినేనికి సన్మానం ఆలస్యం అవటంలో దాసరి హస్తం, ఆయన అనుచర గణాల హస్తాలు కూడా ఉన్నాయని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. గతంలో అక్కినేనికీ, దాసరికీ విభేదాలున్నాయన్న విషయం సినీ వర్గాల్లో అందరికీ తెలిసిందే. అందుకనే ఆయన కావాలనే ఈ సన్మానం ఆలస్యం అయ్యేలా చూస్తున్నారని సినీ జనం అంటున్నారు. ఎవరికి ఎన్ని విభేదాలున్నా అక్కినేని మన సినీ పరిశ్రమకు చేసిన అపారమైన సేవలను గుర్తించి గౌరవించటం మన కనీస ధర్మం.