English | Telugu

మీనాకు అంత ఇంపార్టెన్స్‌ ఇవ్వడానికి రీజన్‌ అదేనా?

సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్ళడం, అక్కడ కూడా విజయం సాధించి ఉన్నత పదవుల్ని అలంకరించడం మనం చూశాం. సినీ ప్రముఖులందరూ రాజకీయాల్లో సక్సెస్‌ కాలేరు. అలా రాజకీయాల్లోకి వెళ్లి.. అంతే వేగంగా వెనక్కి వచ్చేసినవారు కూడా ఉన్నారు. తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ మీనా రాజకీయాల్లోకి రాబోతోందన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. మీనా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఢల్లీిలో కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ నిర్వహించిన పొంగల్‌ వేడుకలకు మీనాను ఆహ్వానించడంతో ఆమె రాజకీయ ప్రవేశం చేయనుందన్న వార్తకు బలం చేకూరింది. 

ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మీనాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె బీజేజీలో చేరబోతోందని, అందుకే ఆమెకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా మీనా కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగానే ఉన్నట్టు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఏది ఏమైనా మరో సినీ సెలబ్రిటీలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.