English | Telugu

పవన్ హీరోయిన్ విరాట్ కొహ్లీతో డేటింగ్

పవన్ కళ్యాణ్ హీరోయిన్ విరాట్ కొహ్లీతో డేటింగ్ చేస్తూందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ది షాడో" మూవీలో హీరోయిన్ గా నటించటానికి అంగీకరించిన సారా జేన్ దియాస్ ప్రస్తుతంన భారత యువ క్రికెటర్ విరాట్ కొహ్లీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందట.

బెంగుళూరులో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన ఒక పార్టీలో వీళ్ళిద్దరూ కలిశారట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రూల్ ప్రకారం అప్పటి నుంచీ సారా జేన్, విరాట్ కొహ్లీ ఇద్దరూ చాటు మాటుగా కలుసుకుంటూ డేటింగ్ లో ఉన్నారట. వీళ్ళిద్దరినీ చాలా మంది చాలా ప్రదేశాల్లో అంటే రెస్టారెంట్లలో, పబ్బుల్లో చూశారట. అంతకు ముందు చాటు మాటుగా కలుసుకునే వీళ్ళిద్దరూ ఇప్పుడు బహిరంగంగానే కలుసుకుంటున్నారట.

 

గతంలో క్రికెటర్ రవిశాస్త్రి, సినీ నటి అమృతాసింగ్ లు కూడా ఇలాగే డేటింగ్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ కలిసుండలేకపోయారు. మరి సారా జేన్, విరాట్ కొహ్లీల ప్రేమ పెళ్ళిమండపం వరకూ వెళుతుందా...? ల;ఏక ఇదేదో టైమ్ పాస్ ప్రేమలా మిగిలిపోయుందా అనేది కాలమే చెప్పాలి.