English | Telugu
పవన్ కళ్యాణ్ ది షాడో కి క్రిష్ మాటలు
Updated : Apr 19, 2011
పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న"ది షాడో" చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ మాటలు వ్రాస్తున్నారట. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఫిలింస్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం " ది షాడో".
ఈ చిత్రానికి ముందుగా ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి సంభాషణలు వ్రాస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అబ్బూరి రవి స్థానంలో దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న"ది షాడో" చిత్రానికి మాటలను వ్రాయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
క్రిష్ గతంలో తన దర్శకత్వంలో వచ్చిన "వేదం" చిత్రానికి చాలా పవర్ ఫూల్ డైలాగులు వ్రాసిన సంగతి మనకు తెలిసిందే. మరి క్రిష్ ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న"ది షాడో" చిత్రానికి ఇంకా ఎంతటి శక్తివంతమైన మాటలు వ్రాస్తారో వేచి చూడాలి. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న"ది షాడో" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సారాజేన్ 2007 ఫెమీనా మిస్ ఇండియాగా ఎన్నికైంది. ఆ తర్వాత ఆమె "గేమ్" అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సారా జేన్ ప్రస్తుతం క్ర్తికెటర్ విరాట్ కొహ్లీతో డేటింగ్ చేస్తోంది.