English | Telugu

రామ్ గోపాల వర్మ రంగీలాకి సీక్వెల్

రామ్ గోపాల వర్మ రంగీలాకి సీక్వెల్ తీసే ఉద్దేశంలో ఉన్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గతంలో అంటే 1995 వ సంవత్సరంలో అమీర్ ఖాన్ హీరోగా, ఊర్మిళ మంటోడ్కర్ హీరోయిన్ గా, రామ్ గోపాల వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం"రంగీలా". ఈ చిత్రానికి నేటి ఆస్కార్ అవార్డ్ విజేత ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన సంగీతాన్నందించారు.

ప్రస్తుతం రామ్ గోపాల వర్మకు టైమ్ ఏమాత్రం అనుకూలంగా లేదు. అతను ఇటీవల తెలుగులో తీసిన "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" సినిమా ఫ్లాపయ్యింది. అలాగే ప్రయోగాత్మకంగా కేనన్ 5 డి కెమెరాతో కేవలం అయిదు రోజుల్లో తీసిన "దొంగల ముఠా" కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సమయంలో ఎ.ఆర్.రెహమాన్ "రంగీలా" సినిమాకి సీక్వెల్ తీస్తే బాగుంటుందని రామ్ గోపాల వర్మకి సలహా ఇచ్చారట.

 

ప్రస్తుతం హిందీలో అమితాబ్‍ బచ్చన్ తో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "బుడ్డా" అనే చిత్రాన్ని రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వర్మ "రంగీలా" చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తారని హిందీ జనం అనుకుంటున్నారు. మరి ఈ "రంగీలా" సీక్వెల్లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తాడా...? ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే "రంగీలా" చిత్రం పూర్తయిన తర్వాత ఇక జన్మలో అమీర్ ఖాన్‍ తో సినిమా చేయనని వర్మే అన్నాదు. ఇక ఊర్మిళ ముసలిదై పోయింది. మరి ఈ "రంగీలా" సీక్వెల్ ని ఇంకెవరితో రామ్ గోపాల వర్మ తీస్తాడో వేచి చూడాలి.