English | Telugu
తమన్నా ముద్దు ఖరీదు 1.25 కోట్లు
Updated : May 3, 2011
తమన్నా ముద్దు ఖరీదు 1.25 కోట్లు అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రముఖ హీరోయిన్ మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా "హ్యాపీడేస్" తో వెలుగులోకి వచ్చి అంచలంచెలుగా నేటి ప్రముఖ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి తమన్నా భాటియాని ఒక తమిళ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటింపజేయటానికి అడిగితే కోటి పాతిక లక్షల పారితోషికం అడిగిందట తమన్నా భాటియా. సకలకళావల్లభుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు "దశావతారం" ఫేం కె.యస్.రవికుమార్ ఒక తమిళ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం దర్శకత్వం వహించటానికి సన్నాహాలు చేస్తున్నాడట.
ఆ దిశలో భాగంగా ఆయన తమన్నా భాటియా హీరోయిన్ అయితే ఎలా ఉంటుందని కమల్ హాసన్ అని అడిగారట. అందుకు కమల్ హాసన్ కూడా తనన్నాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ కూడా ఉందట. ఈ లిప్ లాక్ సీన్ గురించి చెప్పగానే అది కూడా కమల్ వంటి ముసలోడితో అనే సరికి తమన్నా భాటియా తన పారితోషికం కోటి పాతికలక్షలు అందట. ఈ మాట వినగానే దర్శక, నిర్మాతలు షాక్ కి గురయ్యారట. అంటే తమన్నా ముద్దు విలువ కోటి పాతిక లక్షలన్నమాట.