English | Telugu

అక్కినేని సన్మానం ఆలస్యానికి దాసరి కారణం

అక్కినేని సన్మానం ఆలస్యానికి కారణం ఏమిటనేది ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే మన తెలుగు సినీ పరిశ్రమకు గత అరవై సంవత్సరాలుగా నటసామ్రాట్, పద్మశ్రీ, పద్మవుభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేసిన సేవలు అపారం. ఆయన చేసిన సేవలను గుర్తించిన మన భారత ప్రభుత్వం అక్కినేనికి ప్రతిష్టాత్మకమైన "పద్మవిభూషణ్" బిరుదునిచ్చి సత్కరించింది. మన తెలుగు సినీ పరిశ్రమలో "పద్మవిభూషణ్" బిరుదునందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. అలాంటి ఆయనకు "పద్మవిభూషణ్" అందుకున్న సందర్భంగా సన్మానం చేయాలని సినీ పరిశ్రమ అనుకుంది.

కానీ ఆ సన్మానం ఇంకా జరుగలేదు. కనీసమ ఆ ఊసైనా ఎత్తటం లేదు. దీనికి కారణం దాసరి నారాయణరావు అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. గతంలో దాసరి దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటిస్తూ "ప్రేమాభిషేకం" అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. తనవల్లే "ప్రేమాభిషేకం" అంత పెద్ద హిట్టయ్యిందన్న అలుసుతో దాసరి తన సినిమాల షుటింగ్ ను అన్నపూర్ణ స్టుడియోలో చేసుకుని డబ్బులివ్వటం మానేయటంతో అక్కినేనికీ, దాసరికీ మధ్య విభేదాలు తలెత్తాయట.

 

ఆ తర్వాత అక్కినేనికి ఉన్న అన్నపూర్ణ ఏడెకరాల స్టుడియో స్థలం ఫెడరేషన్ కి ఇప్పించాలని శతవిధాలుగా తెరవెనుక ఉండి ప్రయత్నాలు చేసినట్లుగా సినీజనం చెప్పుకుంటారు. ఇలా అక్కినేనితో తనకున్న విభేదాల కారణంగానే దాసరి ఆయన సన్మాన కార్యక్రమాన్ని జరుగకుండా ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని ఆయన మీద ఆరోపణలు సినీ జనం బహిరంగంగానే అంటున్నారు. ఇది దాసరి వంటి పెద్దలకు సరికాదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇలాంటి విషయాల్లో దాసరి సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం.