English | Telugu

తమన్నాకి ఈ సంవత్సరం కలిసి రాలేదు

తమన్నా..టాలీవుడ్ లో ముద్దుగా మిల్కీ బ్యూటి అని పేర్కొంటుంటారు. ఈమె తెలుగులో, హిందీలో వరుస సినిమాలు చేసిన సక్సెస్ లో మాత్రం బాగా వెనుకబడిపోయింది. బాలీవుడ్ లో 'హిమ్మత్ వాలా'తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. 'హమ్ షకల్స్' చేసినా ఈ సినిమా కూడా సక్సెల్ కాలేదు. అయినా ఏమాత్రం కృంగిపోకుండా 'ఎంటర్ టైన్ మెంట్' అనే సినిమా చేసింది. అది కూడా హిట్ కాలేదు. వరుసగా బాలీవుడ్‌లో ఫ్లాపులు చవిచూస్తోన్న తమన్నా మీద అప్పుడే ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర పడిపోయింది. ఆ మాటకొస్తే, తమన్నాకి తెలుగులోనే సక్సెస్‌ అంత తేలిగ్గా దొరకలేదనుకోండి.. అది వేరే విషయం. ఈమెకి కలిసివచ్చింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమే. ఎందుకంటే ఈమెకు వచ్చిన ఎక్కువ హిట్ సినిమాలు అక్కడివే. ఈ సంవత్సరం అజిత్‌తో నటించిన ‘వీరమ్‌’ ఒక్కటే తమన్నాకి ఊరటనిచ్చింది. తెలుగులో నటించిన ఆగడు కూడా డిజాస్టర్‌ అయ్యింది. దీంతో తమన్నా ఆశలన్నీ‘బాహుబలి’ మీద వున్నాయి. రాజమౌళి ఇంతవరకు ఫ్లాప్‌ ఇవ్వలేదు కాబట్టి తమన్నా అతడే తన రాత మార్చేస్తాడని ఫిక్సయిపోయింది.