English | Telugu
ఎన్టీఆర్ - నాగచైతన్య సినిమా ఫిక్స్??
Updated : Dec 11, 2014
తెలుగు తెరపై మరో క్రేజీ మల్టీస్టారర్ సిద్ధం కాబోతోందా?? రెండు కుటుంబాలకు చెందిన కథానాయకులు.. కలసి ఓ సినిమాలో మెరవబోతున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు. ఆ ఇంటి నుంచి వారసులొచ్చినా ఇప్పటి వరకూ కలసి ఒక్క సినిమాలోనూ నటించలేదు. నాగార్జున - ఎన్టీఆర్ కలయికలో ఓ చిత్రం ఊరించినట్టే ఊరించి వెనక్కి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ స్థానంలో కార్తి వచ్చి చేరాడు. దాంతో అటు నందమూరి, ఇటు అక్కినేని ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అయితే.. ఇప్పుడు మళ్లీ నందమూరి, అక్కినేని కుటుంబాలు కలవబోతున్నాయి. ఎన్టీఆర్, నాగచైతన్య కథానాయకులుగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. పీవీపీ సినిమాస్ సంస్థ ఈ మల్టీస్టారర్ ని తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఆల్రెడీ కథ సిద్ధమైంది. ఇప్పుడు వీరిద్దరినీ డీల్ చేయగలిగే దర్శకుడిని వెదికిపట్టుకొనే పనిలో పడింది పీవీపీ సినిమాస్. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినే అవకాశాలున్నాయి. దర్శకుడు కన్‌ఫామ్ అవ్వగానే.. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.