English | Telugu

యన్ టి ఆర్ కట్నం మూడు వేల కోట్లు

యన్ టి ఆర్ కట్నం మూడు వేల కోట్ల రూపాయలని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రముఖ యువ హీరో యంగ్ టైగర్ యన్ టి ఆర్ వివాహం ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె కుమారి లక్ష్మీ ప్రణతితో "మే" నెలలో అయిదవ తేదీన జరుగనుంది. అయితే నార్నే శ్రీనివాసరావు తన అల్లుడు యన్ టి ఆర్ కి కట్నంగా మనమెవరూ ఊహించనంత మొత్తాన్ని అందజేస్తున్నారని వినవచ్చింది. నార్నే శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ లో సంపాదించిన మొత్తం ఆస్తి ఆరువేల కోట్ల రూపాయలని అనుకుంటున్నారు.

ఆయన ఈ ఆరువేల కోట్ల రూపాయల ఆస్తి అంతా స్తిరాస్తి రూపంలో ఉందట. అంటే స్థలం రూపంలోనూ, నగదు రూపంలో కొంత ఉందని తెలిసింది. ఈ ఆరు వేల కోట్లలో సగం అంటే మూడు వేల కోట్లు తన ప్రియపుత్రిక కుమారి లక్ష్మీ ప్రణతి పేరు మీద వ్రాయనున్నారట. మిగిలింది తన కుమారుడికి ఇవ్వనున్నారట. కూతురే పెద్దది కనుక కొడుకు కోసం మిగిలిన మూడు వేల కోట్లతో పాటు మళ్ళీ సంపాదించవచ్చని నార్నే శ్రీనివాసరావు ఉద్దేశమని ఫిలిం నగర్ వాసులంటున్నారు. ఏదేమైనా యన్ టి ఆర్ మహర్జాతకుడనటానికి ఇంతకంటే రుజువేం కావాలి...?