English | Telugu

వినాయక్ కి ఏమైంది.. ఇంత పెద్ద విషయాన్ని సీక్రెట్ గా ఉంచారా!

ఒకప్పుడు వి. వి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. వినాయక్ దర్శకత్వంలో 'ఆది', 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మి', 'కృష్ణ', 'అదుర్స్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి వినాయక్ కొంతకాలంగా రేస్ లో వెనకబడిపోయారు. గత ఆరేళ్లలో ఆయన నుంచి రెండే సినిమాలు వచ్చాయి. 2018 వచ్చిన 'ఇంటిలిజెంట్' ఫ్లాప్ కాగా, కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ కూడా గతేడాది విడుదలై చేదు ఫలితాన్ని మిగిల్చింది. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా.. వినాయక్ నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ లేదు. సినిమా సంగతి అటుంచితే.. కనీసం ఆయన బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో అసలు వినాయక్ కి ఏమైంది? ఎందుకు ఇతర సినిమా వేడుకల్లో కూడా కనిపించడం లేదు? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

వినాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. లివర్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లెమ్ తో ఆయన బాధపడుతున్నారట. అందుకే వినాయక్ పెద్దగా బయట కనిపించడం లేదని, ట్రీట్ మెంట్ తీసుకొని ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఎందుకంటే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ కి హెల్త్ ప్రాబ్లెమ్ వస్తే.. సినీ ప్రముఖులకి, మీడియాకి ఇంతకాలం తెలియకుండా ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్. దీనిపై అధికారిక సమాచారం వచ్చేవరకు ఇప్పుడే ఓ అంచనాకు రాలేము.