English | Telugu
జూలై రెండవ వారంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్
Updated : May 4, 2011
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని ఆ చిత్ర దర్శకులు "మిరపకాయ్" లాంటి డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈ మధ్య వెబ్ సైట్లలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆగిందా...? అంటూ కొన్ని అవాస్తవాలను వ్రాయటంతో తెలుగువన్ డైరెక్టర్ హరీష్ శంకర్ ని ఈ విషయంపై వివరణ కోరగా "ఇలాంటి అనవసర విషయాన్నింటికీ ఎక్కడ రెస్పాండ్ అవుతాం సార్. అవన్నీ అవాస్తవాలు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం "దిషాడో" సినిమా ప్రారంభానికి కలకత్తా వెళ్తున్నారు.
ఆ సినిమా తొలి షెడ్యూల్ కాగానే నా దర్శకత్వంలో ఆయన హీరోగా నటించే "గబ్బర్ సింగ్" సినిమా ప్రారంభమవుతుంది. బహుశా జూలై సెకండ్ వీక్ లో కానీ ఆ ప్రాంతాల్లో మంచి రోజు చూసుకుని "గబ్బర్ సింగ్" కచ్చితంగా ప్రారంభించబోతున్నాం. ఇలాంటి అబద్ధపు వార్తలు వ్రాసే వాళ్ళ కోసమే నా ట్విట్టర్ లో వాస్తవమేంటో పోస్ట్ చేశాను" అని అన్నారు. అదండీ విషయం హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "గబ్బర్ సింగ్" చిత్రం ఆగలేదు. మనల్ని నమ్మి మనం రాసే వార్తలు నిజమనుకునే ప్రేక్షకులకు వీలయినంతవరకూ నిజాలనే అందించే ప్రయత్నం చేస్తే మనమీద వారికి విశ్వసనీయత ఉంటుంది. లేకపోతే ఉండదు.