English | Telugu

"కల్కి"గా యువరత్న బాలకృష్ణ

"కల్కి"గా యువరత్న బాలకృష్ణ నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, రవిచావలి దర్శకత్వంలో, యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, "మిరపకాయ్" ఫేం రమేష్ పుప్పాల నిర్మిస్తున్న చిత్రానికి "కల్కి" అన్న పేరు నిర్ణయించినట్లు వినపడుతూంది. "కల్కి" అనగా శ్రీమహావిష్ణువు ఏత్తే దశావతారాల్లో ఆఖరి అవతారం. ఈ కలియుగంలో దుర్మార్గం విపరీతంగా  పేట్రేగిన తర్వాత దాన్ని అంతం చేయటానికి "కల్కి" అవతారాన్ని వైకుంఠవాసి ఎత్తుతారని మన పురాణాలు చెపుతున్నాయి.

అటువంటి శక్తివంతమైన పేరుతో, బాలయ్య హీరోగా తీసే ఈ "కల్కి" సినిమా ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈ "కల్కి" పేరుని ఇటీవల ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేశారట. ఈ "కల్కి" చిత్రంలో బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్ ఒక హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న "అధినాయకుడు" సినిమా పూర్తికాగానే ఈ "కల్కి" చిత్రం ప్రారంభమవుతుందట.