English | Telugu
శంకర్ సినిమాలో కమల్, రజనీ...?
Updated : Dec 20, 2011
సూపర్ స్టార్ రజనీ కాంత్, సకలకళావల్లభుడు కమల్ హాసన్ కలసి ఒకే చిత్రంలో నటించనున్నారట. వివరాల్లోకి వెళితే ఒకప్పుడు "అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది" వంటి అనేక చిత్రాల్లో రజనీకాంత్, కమల్ హాసన్ కలసి నటించారు. అప్పటి పరిస్థితి వేరు. ఇద్దరూ అప్పుడే పైకొస్తున్న హీరోలుగా కలసి నటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇద్దరూ చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు.
ఈ ఇద్దరూ కలసి నటించాలంటే ఎలాంటి కథ కావాలి.....? అలాంటి కథని హ్యాండిల్ చేయగల దర్శకుడెవరు అనే ప్రశ్నలకు సమాధానంగా "అపరిచితుడు" ఫేం శంకర్ పేరు వినపడుతూంది. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా, శంకర్ దర్శకత్వంలో, తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రం సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 14 వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. మరి ఇదెంతవరకూ నిజమో కాలమే చెప్పాలి. ఇదే నిజమైతే రజనీకాంత్ "రాణా" అటకెక్కినట్లే.