English | Telugu

అనుష్క హిందీ చిత్రం ఎలా మిస్సయ్యింది

అందాల యోగా టీచర్ అనుష్క ఇటు "అరుంధతి" చిత్రంతో తెలుగులోనూ, అటు "సింగం" (తెలుగులో "యముడు")చిత్రంతో తమిళంలోనూ టాప్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపుతోంది. అనుష్కకు ఈ రెండు భాషల్లోనూ చిత్రానికి కోటి రూపాయలకు పైగానే పారితోషికం ముడుతోందని వినికిడి.అయితే ఈ "యముడు"చిత్రాన్ని హిందీలోకి అజయ్ దేవగన్ ని హీరోగా పెట్టి రీమేక్ చేయాలని రోహిత్ షెట్టి అనే దర్శకుడు సన్నాహాలు చేస్తూ, ఆ చిత్రంలో కూడా అనుష్కనే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడు.అందుకు హీరో అజయ్ దేవగన్ అనుమతి కూడా తీసుకున్నాడు.కానీ ఆ చిత్రంలోకి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దుసుకొచ్చింది.కారణం అనుష్కకు డేట్లు కుదరక అని వినపడుతున్నా నిజానికి అది కారణం కాదని తెలిసింది.లోగుట్టు ఏమిటని విచారించగా అనుష్క ఆ హిందీ చిత్రంలో నటించటానికి కోటిన్నరకు పై పారితోషికం కావాలని డిమాండ్ చేసిందట.దాంతో అనుష్క స్థానంలో కాజల్ వచ్చిందని సినీ వర్గాలంటున్నాయి.