English | Telugu
యశ్ నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ 'జాతస్య'
Updated : Feb 18, 2021
'కేజీఎఫ్ '2 తర్వాత యశ్ చేసే సినిమా ఏమిటో వెల్లడైంది. దాని టైటిల్ 'జాతస్య'. ప్రశాంత్ నీల్ శిష్యుడు, 'మఫ్టీ' (2017)తో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయిన నర్తన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని అతను స్వయంగా వెల్లడించాడు. "Happy to announce my next project #Jatasya @TheNameIsYash #Yash @hombalefilms" అని అతను ట్వీట్ చేశాడు. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మించనున్నది.
'జాతస్య' అనే సంస్కృత పదాన్ని మనం భగవద్గీతలో విన్నాం. "జాతస్య హి ధ్రువో మృత్యుః" అనే శ్లోకాన్ని ఘంటసాల గాత్రంలో ఇప్పటికీ వింటూనే ఉన్నాం. దాని అర్థం "పుట్టినవాడికి మరణం తప్పదు" అని. 'జాతస్య' అంటే 'పుట్టినవాడికి' అనేది అర్థం. టైటిల్‌తోటే ఆసక్తిని క్రియేట్ చేశాడు నర్తన్. కన్నడ చిత్రసీమలో గేయరచయితగా పేరున్న నర్తన్ తర్వాత, ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఫిల్మ్ 'ఉగ్రమ్'కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. డైరెక్టర్‌గా తన తొలి సినిమా 'మఫ్టీ'లో శివ రాజ్‌కుమార్‌ను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత తన రెండో సినిమాను ప్యాన్ ఇండియా స్టార్ యశ్తోటే తీసే అవకాశం దక్కించుకున్నాడు.
మరోవైపు యశ్ 'కేజీఎఫ్ 2' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జూలై 16న ఆ సినిమా రిలీజ్ కానున్నది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్, రవీనా టాండన్, నిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారులు.