English | Telugu
'చెక్' ప్రమోషన్స్‌లో రకుల్ ఎందుకు లేదు?
Updated : Feb 27, 2021
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' మూవీ శుక్రవారం విడుదలై ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ పొందుతోంది. యేలేటి మార్క్ సినిమా లాగా లేదని విమర్శకులు తేల్చేసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ సైతం ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో లేవు. కాగా ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ మానస క్యారెక్టర్ చేసింది. టెర్రరిస్ట్‌గా ముద్రపడి ఉరిశిక్షకు గురై జైల్లో మగ్గుతున్న ఆదిత్య తరపున వాదించే క్యారెక్టర్‌లో రకుల్ కనిపించింది.
అయితే 'చెక్' మూవీ ప్రమోషన్స్‌లో రకుల్ కనిపించకపోవడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందు పెట్టిన ప్రెస్‌మీట్‌లో కానీ, ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కానీ రకుల్ కనిపించలేదు. ఆమెకు బదులు ప్రియా ప్రకాశ్ వారియర్ కనిపించింది. ప్రియ ఈ మూవీలో చేసింది చిన్న క్యారెక్టరే. నితిన్ లవర్‌గా కొద్దిసేపు కనిపిస్తుందంతే. ఆమె చేసింది.. ఓ డ్యూయెట్, నాలుగైదు సీన్లు! అయినా సినిమాలో ప్రేక్షకులపై ముద్ర వేసింది ఆమె చేసిన యాత్ర క్యారెక్టరే. సినిమా అయ్యాక మానస పేరు కంటే యాత్ర పేరే మనకు ఠక్కున స్ఫురిస్తుంది.
ఆ విషయం పక్కన పెడితే.. రకుల్ ఎందుకు చెక్ ప్రమోషన్స్‌లో ఏ ఒక్కదానికీ రాలేదనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. మీడియాకు ఇచ్చిన గ్రూప్ ఇంటర్వ్యూల్లోనూ నితిన్‌తో కలిసి ప్రియా ప్రకాశ్ పాల్గొంది కానీ, రకుల్ పాల్గొనలేదు. కాకపోతే.. 'చెక్'కు సంబంధించి కొన్ని ట్వీట్స్, రిట్వీట్స్ మాత్రం చేసి సరిపెట్టింది రకుల్. దీంతో ఏదో విషయంలో రకుల్ హర్టయ్యిందనీ, అందుకే ప్రమోషన్స్‌కు ఆబ్సెంట్ అయ్యిందనీ సినీ జనాలు చెప్పుకుంటున్నారు. నిజమేంటో ఆమెకూ, యూనిట్‌కే తెలియాలి.