English | Telugu
'భాగ్ సాలే' అంటున్న శ్రీసింహా కోడూరి
Updated : Feb 23, 2021
'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా పరిచయమై, తొలియత్నంతోటే ఇటు విజయాన్నీ, అటు తన పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలూ పొందిన శ్రీసింహా కోడూరి త్వరలో తెల్లవారితే గురువారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ మూవీలో అతను నటించనున్నాడు. ఫిబ్రవరి 23 అతని బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ద్వారా నిర్మాతలు ప్రకటించారు. ఆ సినిమా పేరు 'భాగ్ సాలే'.
నిహారిక, రాహుల్ విజయ్ జంటగా నటించిన 'సూర్యకాంతం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రణీత్ బ్రహ్మాండపల్లి 'భాగ్ సాలే'ను రూపొందించనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్‌బాబు సమర్పించే ఈ మూవీని మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి సుందర్‌రామ్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.