English | Telugu
'భళా తందనాన' అంటున్న శ్రీవిష్ణు
Updated : Feb 16, 2021
ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలనే ఎంచుకుంటూ ఉంటారని పేరుపొందిన శ్రీవిష్ణు మరో ఆసక్తికర కాన్సెప్ట్‌తో మన ముందుకు రానున్నారు. 'బాణం' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమై అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న చైతన్య దంతులూరి ఇప్పుడు మరో సూపర్బ్ స్క్రిప్ట్‌తో, ఇదివరకు ఎన్నడూ చేయని రోల్‌లో శ్రీవిష్ణును ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
నిర్మించిన ప్రతి చిత్రంతో వార్తల్లో నిలుస్తూ వచ్చే ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మించే ఈ చిత్రానికి 'భళా తందనాన' అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. తన చిత్రాలకు స్వచ్ఛమైన తెలుగు పేర్లను పెట్టే చైతన్య దంతులూరి ఇప్పుడు స్క్రిప్టుకు సరిగ్గా సరిపోయే, వినగానే కుతూహలం రేకెత్తే టైటిల్ పెట్టారు.
మంగళవారం పూజా కార్యక్రమాలతో 'భళా తందనాన' చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాక్ నివ్వగా, యస్.యస్. రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్టును శ్రీవల్లి (కీరవాణి సతీమణి), రమ (రాజమౌళి సతీమణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్యక్రమాల్లో హీరో నారా రోహిత్, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.
శ్రీవిష్ణు సరసన నాయికగా తొలిసారి కేథరిన్ ట్రెసా నటించే ఈ చిత్రంలో 'కేజీఎఫ్'లో విలన్ గరుడగా నటించి, అందరి ప్రశంసలూ అందుకున్న రామచంద్రరాజు విలన్ రోల్ చేస్తున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పిస్తుండగా, రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకాంత్ విస్సా సంభాషణల రచయితగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.