English | Telugu

అప్పుడు నేను ఎత్తుకొనేదాన్ని.. ఇప్పుడు న‌రేష్ న‌న్నెత్తుకున్నాడు!

 

ఈ టీవీలో గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ షోకి జ‌డ్జ్‌లుగా న‌టి, ఎమ్మెల్యే రోజా, గాయ‌కుడు మ‌నో వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, యాంక‌ర్‌గా ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ షోలో తాజాగా అవాక్క‌య్యే సీన్ సాక్షాత్క‌రించింది. సీనియ‌ర్ న‌టి రోజా.. యంగ్ హీరో అ్ల‌రి న‌రేష్‌తో క‌లిసి స్టేజ్‌పై చిందులేయ‌డం.. ఆ త‌రువాత ఆమెని న‌రేష్ అమాంతం పైకెత్తి గాల్లో తిప్పి ఆడుకోవ‌డం అందరినీ అవాక్క‌య్యేలా చేస్తోంది.

గ‌త ఎనిమిదేళ్ల విరామం త‌రువాత అల్ల‌రి న‌రేష్ 'నాంది' చిత్రంతో సూప‌ర్ హిట్ మూవీని సొంతం చేసుకున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా హీరో అల్ల‌రి న‌రేష్ 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'లో పాల్గొన్నారు. చాలా రోజుల త‌రువాత రోజాని చూడ‌టంతో ఆనందం ప‌ట్ట‌లేక‌పోయిన న‌రేష్ ఆమెతో క‌లిసి రొమాంటిక్ సాంగ్‌కి స్టెప్పులేశాడు.

అంత‌టితో ఆగ‌లేదండోయ్.. రోజాని అమాంతం పైకెత్తుకుని ల‌వ‌ర్ త‌న గార్ల్ ఫ్రెండ్‌ని ఎత్తుకుని ఆడించిన‌ట్టుగా ఓ ఆట ఆడేసుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రోజా చెప్పిన మాట‌లు ఆస‌క్తిక‌రంగా వున్నాయి. "సీతార‌త్నంగారి అబ్బాయి సినిమా చేస్తున్న‌ప్పుడు న‌రేష్ స్కూల్‌కి వెళుతున్నాడు. అప్పుడు న‌రేష్‌ని ఎత్తుకుని ఆడుకునేదాన్ని. ఇప్పుడు త‌ను న‌న్ను ఎత్తుకుని ఆడుకున్నాడు" అంది రోజా. ఎనిమిదేళ్ల త‌రువాత మ‌ళ్లీ రోజాగారితో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా వుంద‌ని అల్ల‌రి న‌రేష్ సిగ్గుల మొగ్గయ్యాడు. ఈ నెల 26న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.