పంజాబ్ ఉగ్రదాడి.. మన వాళ్ల ప్రమేయం..?

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఉగ్రవాదులు దాడి జరపడానికి మన ఇంటి దొంగల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురుదాస్ పూర్ ఎస్పీ స్వీందర్ పై అనుమానాలు వ్యక్త చేస్తున్నారు పోలీసులు. ఎస్పీ స్వీందర్ కి జైషెహమ్మద్.. ఐఎస్ఐలతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ అతని మిత్రుడు, వంట మనిషిలను ఎన్ఐఏ విచారణ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐఎస్ఐ అమ్మాయిలను ఎరగా వేసి ఎస్పీని లోబరుచుకున్నారా అన్న దిశగా కూడా విచారణ చేపట్టారు.

పపన్ కోసం టీడీపీ-బీజేపీ ప్రయత్నం..

హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల్లో వేడి మొదలైంది. గ్రేటర్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే పార్టీల జోరు పెంచాయి.. ఇప్పుడు షెడ్యూల్ కూడా విడుదలైన పిమ్మట.. కొత్త కొత్త పార్టీ వ్యూహాలతో ప్రజలలోకి వెళుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాధ్యతను పూర్తిగా కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు. మరోవైపు మిత్రపక్షమైన బీజేపీ-టీడీపీ కూడా గతంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న మాదిరి.. ఈసారి కూడా ఆ ఫలితాలను రాబట్టుకునేందుకు టీడీపీ-బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి ఎన్నికల ప్రచారంలో ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించాలని భావిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పార్టీల గెలుపులో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ అన్న విషయం కూడా అందరికి తెలిసిందే. దీంతో ఇప్పుడు  గ్రేటర్‌లోను పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేపిస్తే తమకు లాభిస్తుందని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఆయనను రంగంలోకి దించేందుకు గాను ఆయనతో మాట్లాడాలని.. ఆయనను కలవడానికి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఓకే చెబుతారో లేదో చూడాలి.

టీడీపీలోకి కాంగ్రెస్ నేత ఎం.మహిధర్ రెడ్డి

తెలంగాణలో టీడీపీ లో ఉన్న కొంతమంది నాయకులు అధికారపార్టీ టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం వేరు. ఇతర పార్టీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరడానికి సముఖత చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న భరోసా రాజకీయ-పరిపాలన అనుభవం నేపథ్యంలో పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ఎం.మహిధర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని సమాచారం.మహిధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మహిదర్ రెడ్డి తమ పార్టీల్లోకి తీసుకురావాలని వైసీపీ.. టీడీపీలు రెండూ ప్రయత్నించగా మహిందర్ రెడ్డి మాత్రం టీడీపీలోకి రావడానికే సముఖత చూపినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగ తరువాత మహిధర్ టీడీపీలో చేరవచ్చని భావిస్తున్నారు. గతంలో ఎం.మహిధర్ రెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో పురపాలక శాఖా మంత్రిగా పనిచేశారు. 

మోడీ పై శివసేన కామెంట్స్.. కప్పు టీ తో ఏడుగురు భారత జవాన్లు మృతి

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో శివసేన ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్రమోడీ పై అలాంటి వ్యాఖ్యలే చేసింది. పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన గాను శివసేన తమ అధికార పత్రిక అయిన సామ్నాలో మోడీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ నమ్మరాదని గతంలోనే మోడీని హెచ్చరించామని.. అయినా తమ మాటలను మోడీ లెక్కచేయలేదని.. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మానుకుని భారత్ పై దృష్టి పెట్టాలని ఘాటుగానే సూచించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కప్పు టీ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు భారత జవాన్లు అమరులయ్యారని విచారం వ్యక్తం చేశారు. మరి శివసేన చేసిన వ్యాఖ్యలకు మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

తెలంగాణ అమరులపై ప్రజా తెలంగాణ..

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు గాను 36 మంది అమరులకు తెరాస ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించింది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ఈ ఉద్యమంలో ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారని..  ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్లు ఉన్నారని వాళ్లకు కూడా మంచి ఫలితాలు వస్తే బావుటుందని "ప్రజా తెలంగాణ" అనే ప్రతిక ఆరోపిస్తుంది. దీని గురించి ప్రజా తెలంగాణ స్పందిస్తూ.. డిసెంబర్ 14 నుండి ఇప్పటి వరకు ప్రతి రోజూ జిల్లా కేంద్రాల్లో ‘ప్రజా తెలంగాణ’ ఆధ్వర్యంలో జరిగిన శిబిరాల్లో దాదాపు ఐదువేల మంది ఉద్యమంలో తమ పాత్రకు సంబంధించి ఆధారాలతో వచ్చారని..సామాన్య ప్రజలు, పలురకాల జేఏసీ సభ్యులు, టీ.ఆర్.ఎస్ సహా పలు పార్టీల క్రియాశీల సభ్యులూ, ఉద్యమ కారులూ, కుల సంఘాలు అందరూ ఇందులో ఉన్నారని తెలిపారు. ప్రజా తెలంగాణ దగ్గర 1254 మంది అమరుల బేసిక్ డేటా ఉందని.. ప్రభుత్వం ప్రతి ఒక్క అమరునికీ న్యాయ చేయాల్సిన బాధ్యత తమదేనని తెలిపింది. వాస్తవానికి.. ప్రభుత్వ లెక్కలకీ చాలా తేడాలున్నాయంటూ.. ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి న్యాయం జరగాలని.. ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదైన నేపథ్యంలో వారు కేసులు కొట్టివేయాలని కోరుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన డిమాండ్స్ కూడా తెలియజేశారు. డిమాండ్స్ * పన్నెండు వందల పైచిలుక అమరుల కుటుంబాలన ఆదుకోవాలి. అందరి చరిత్ర అధికారికంగా లిఖించాలి. అసెంబ్లీ సాక్షిగా అమరు ల కుటుంబాలకు యిచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. * ఉద్యోగాలు కోల్పోయి, చదువులు కోల్పోయి, నేడు ఏ ఆసరా లేని త్యాగధనులపై అన్ని కేసులూ ఎత్తివేయాలి. వీరు జీవితాల్లో స్థిర పడేందుకు గాను అన్ని చర్యలూ చేపట్టాలి. * ఇప్పటికే చాలా విలువైన సమయం కోల్పోయి ఉన్న యువతకు స్వాంతన నిచ్చేందుకు వీలుగా, పై డిమాండ్లను నెల రోజుల లోగా నెరవేర్చాలి.    

మహిళలపై నేరాలకు పాల్పడితే కాల్చేస్తా..

దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి గాను ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కాల్చిచంపేస్తానని.. లేదంటే ఉరితీసి చంపేస్తానని అన్నారు. కానీ రాజ్యాంగం అందుకు అనుమతించదు.. రాజ్యాంగం నింబంధనల ప్రకారమే నడుకుంటానని అన్నారు. అంతేకాదు పురుషులు మహిళలను చెడు దృష్టితోనే చూస్తున్నారని.. తల్లిగానో చెల్లిగానో చూడటం లేదని అందుకే చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్ద వయలు గల మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్న మహిళల భద్రతకు తాము కృషిచేస్తామని అన్నారు.

టీడీపీ కార్యకర్త దారుణ హత్య..

కర్నూలు జిల్లాలో పాతకక్షలు మరోసారి బయటపడ్డాయి. దీంతో కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలం రామకృష్ణాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా తెలుగుదేశం కార్యకర్త వల్లూరి నగేష్‌(35)ను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. వివరాల ప్రకారం.. ప్రత్యర్థులు వల్లూరి నగేష్‌ కోసం కాపు కాసి అతను బయటకు రాగనే ముందుగా అతనిపై రాళ్లతో దాడి చేసి ఆతరువాత వేట కొడవళ్లతో నరికి చంపేశారు. అనంతరం దండగులు పారిపోయారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు నమోదు చేయగా.. పోలీసులు హత్యచేసి పారిపోయిన నిందితులకోసం గాలిస్తున్నారు. మృతుడు నగేష్ గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడని.. ప్రతికారంతోనే ప్రత్యర్థులు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కన్నాకు క్లాస్ పడాల్సిందేనా..?

టీడీపీ, బీజేపీలు మిత్రపక్షమని అందరికీ తెలిసిన విషయమే. కానీ మిత్రపక్షమైనప్పటికీ బీజేపీ నేతలు మాత్రం అప్పుడప్పుడు టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీ నేతలు చేసిన విమర్శలను టీడీపీ నేతలు మొదట పట్టించుకోకపోయినా.. ఆతరువాత మాత్రం వారి విమర్సలకు ధీటుగానే సమాధానం చెపుతూ వచ్చారు. మొన్న‌టి వ‌ర‌కూ రాజ‌మండ్రికి చెందిన సోము వీర్రాజు వంటి నేతలు టీడీపీ నేతలపై విరుచుకుపడేవారు.. అయితే ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్న బీజేపీ ఆయనకు ఫుల్లు క్లాస్ తీసుకొని వదిలిపెట్టింది. ఇక అప్పటినుండి సోము వీర్రాజు ఆయన నోటికి పని చెప్పడం తగ్గించారు. ఇప్పుడు సోము వీర్రాజు లాగానే.. బీజేపీకి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటున్నా ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వ‌డం లేద‌ని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం సరికాదని.. రాజకీయ పబ్బంగడుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై లేనిపోని అబాండాలు మోపాలని చూస్తే ఊరుకునేదిలేదని కాస్త ఘాటుగానే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎప్పటికప్పుడు సహాయపడుతూనే ఉందని.. అన్నీ ఆలోచించుకోవాలని అన్నారు. ఇక ఇప్పుడు కన్నా చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నా నోరు అదుపులో పెట్టుకోవాలని.. అతనికి కూడా క్లాస్ పడితే కాని సైలెంట్ గా ఉండడని అంటున్నారు. మరి కన్నా వ్యాఖ్యలకు బీజేపీ అతనికి క్లాస్ పీకుతుందో.. లేదో చూడాలి.

నేనెక్కడికీ వెళ్లలేదు.. పుణ్యక్షేత్రాలకి వెళ్లా.. మల్లాది

కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి విజయవాడలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. కల్తీ మందు వ్యవహారంలో కేసు నమోదైన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేనెక్కడికీ వెళ్లలేదు..పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లా అని తెలిపారు. విచారణ బృందం ఎదుట రేపు హాజరవుతా, విచారణకు సహకరిస్తా.. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటా అని మల్లాది అన్నారు. కృష్ణలంకలోని స్వర్ణబార్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని.. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా బార్ ప్రస్తావనే లేదని వెల్లడించారు. కాగా మల్లాది విష్ణు ముందస్తు బెయిన్ ను కోర్టు నిన్న డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రేపు సిట్ అధికారుల ముందు తప్పనిసరిగా హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను మల్దాది విష్ణు తరపు న్యాయవాదులకు అందించింది.

అజ్ఞాతం వీడిన మల్లాది విష్ణు..!

కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత నెల రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అజ్ఞాతం వీడినట్టు తెలుస్తోంది. అజ్ఞాతం వీడిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయినట్టు సమాచారం. కాగా మల్లాది విష్ణు రేపు కృష్ణలంక పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా మల్లాది విష్ణు ముందస్తు బెయిన్ ను కోర్టు నిన్న డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రేపు సిట్ అధికారుల ముందు తప్పనిసరిగా హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను మల్దాది విష్ణు తరపు న్యాయవాదులకు అందించింది.

టీడీపీకి కేటీఆర్ మద్దతు.. టీడీపీతో ఉండండి

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు పంథాలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలుపొందాలని పావులు కదుపుతుంది. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. అటు టీఆర్ఎస్ కు ఓటు వేయమని చెబుతూనే.. టీడీపీకి కూడా మద్దతు పలుకుతున్నారంట కేసీఆర్ తనయుడు కేటీఆర్.. కేటీఆర్ ఏంటీ.. టీడీపీకి మద్దతు పలకడమేంటీ అనుకుంటున్నారా.. అదేంటంటే.. గ్రేటర్ లో సెటిలర్లు ఎక్కువ కాబట్టి.. వారిని తమ వైపు ఆకర్షించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సెటిలయిన రాజులను తమ వైపు తిప్పుకునే భాగంలో.. విభజన తరువాత సీమాంధ్రులు ఇక్కడ ఉంటే మా ప్రభుత్వానికి మద్దతివ్వండి.. ఏపీలో ఉంటే అక్కడ టీడీపీకి మద్దతు ఇవ్వండి అని ఓ కొత్త ప్ర‌తిపాద‌న ముందుకు తీసుకొచ్చారంట. అంతేకాదు కేటీఆర్ ప్రతిపాదనకు కొంతమంది  పెద్దలు సరే అన్నట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా అన్ని స్థాయిల్లో ఉన్న `రాజు`లను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లే బాధ్యత కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీసుకున్నారు. ఇక గ్రేట‌ర్లో ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో వారిని గులాబి గూటికి చేర్చేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారు. మొత్తానికి కేసీఆర్.. చంద్రబాబు సన్నిహితంగా ఉంటున్న వేళ కేటీఆర్ కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడం శుభపరిణామమే.

తెలుగు విద్యార్ధులు తమిళంలో రాయాల్సిందే..

తమిళనాడు ప్రభుత్వం నిర్భంధ తమిళ చట్టంలో భాగంగా తెలుగు విద్యార్ధులు తప్పనిసరిగా తమిళంలోనే పరీక్షలు రాయాలని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమిళరాష్ట్రంలో ఉన్న తెలుగు సంఘాలు కోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కూడా తెలుగు విద్యార్థులకు తెలుగులోనే పరీక్షలు రాయించాలని ఆదేశించింది కూడా. అయితే తమిళనాడు మాత్రం ఇప్పుడు అవన్నీ తోసి పుచ్చి.. పలు పాఠశాలల విద్యార్థులకు తమిళంలోనే పరీక్షలు రాయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.సబిత పేరుతో రాష్ట్రంలోని పలు పాఠశాలలకు లేఖలు కూడా పంపిచారు. ఆ లేఖల్లో సదరు విద్యార్థులు ఖచ్చితంగా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిందేనని సబిత స్పష్టం చేశారు. మరి ఈ లేఖలకు తెలుగుసంఘాలు ఎలా స్పందిస్తాయో..

దాడి చేసింది మేమే..

పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి ఉగ్రవాదులు.. భద్రతా దళాల మధ్య కాల్పులు జరగుతూనే ఉన్నాయి. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇప్పుడు పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రదాడి చేసింది తామేనంటూ.. పాకిస్థాన్ ప్రేరేపిత యూనైటెడ్ జిహాద్ కౌన్సిల్(యూజేసీ) ప్రకటించుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హైవే స్కాడ్‌తో అనుబంధం ఉన్న ఐక్య జిహాది మండలి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగినట్లు పేర్కొంది. మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.  

పాక్ కు భారత్ హెచ్చరికలు..

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇండియా పాక్ పై ఇక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేరథ్యంలోనే పాక్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో లష్కరే తోయిబా.. జోషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని.. తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారట. ఈ మేరకు పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారట. అంతేకాదు అవసరమైత్ భారతదేశ వాయుసేన సహకారాన్ని తీసుకొని ఉగ్రవాదులపై దాడులు చేయాలని సూచించారట. ఈ ఆదేశాలను పాక్ కనుక పట్టించుకోకపోతే భారత్-పాక్ మధ్య చర్చలు నిలిచిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. మరి భారత్ ఆదేశాలకు పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. పన్నులే ఆదాయం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ఏర్పాటుచేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా చేస్తామని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదేనని..భవిష్యత్తులో కరెంటు కోతలుండవని, వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు రూ. 24 వేల కోట్లతో రైతుల రుణమాఫీ చేశాం.. డ్వాక్రా మహిళలకు రూ 10 వేల చొప్పున రుణాలిచ్చామని తెలిపారు. విభజన తరువాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం.. రాజధాని లేదు.. హైదరాబాద్  10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయినా కానీ..అనేక సమస్యలు ఉన్నాయి.. అందుకే విజయవాడ నుండి పాలన చేస్తున్నామన్నారు. సరైన ఆదాయ వనరులు, నిధులులేని ఏపీకి ప్రజలు కట్టే పన్నులే ఆదాయమని, అటువంటిది పన్నులు చెల్లించడంలో అలక్ష్యం వహిస్తే ఎలాగని.. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ప్రజలు పన్ను కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.