మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయి.. అలీ
పంజాబ్ పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసినందుకు గాను పలువురు ప్రధాని మోడీ విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే శివసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఇద్రిస్ అలీ ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి తీవ్రవాదులతో లింక్‌లు ఉన్నాయని అందుకే పఠాన్‌కోట్ పై తీవ్రవాద దాడి జరిగిందనుకుంటున్నానని, ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన తర్వాత ఈ దాడి ఎందుకు జరిగిందని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని అతను అన్నాడు. అయితే అలీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతల సంగతేమో కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. తను వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దని హెచ్చరించింది. మొత్తానికి అలీకి తమ పార్టీ నేతల నుండి వ్యతిరేకత రావడం గమనార్హం.