నేటితో ఎన్నికల ప్రచారం సమాప్తం

  ఈరోజుతో సాయంత్రం 4గంటలకి సీమాంద్రాలో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. అందువల్ల అమూల్యమయిన ఈ చివరి కొద్ది గంటలలో వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలలో పర్యటించి ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవాలని అన్ని పార్టీల నేతలు తెల్లవారుజాము నుండే తమ ప్రచారం మొదలు పెట్టేసారు. మార్నింగ్ వాక్కి బయలుదేరినవారిని, కూరగాయలు కొనుకోనేందుకు బజారుకు బయలుదేరుతున్న వారి వెంటపడుతూ తమకే ఓటువేయాలని కొందరు అభ్యర్ధులు బ్రతిమాలడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. నవ్వితే నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనుకొంటూ అభ్యర్ధులు మాత్రం తమపని తాము చేసుకుపోతున్నారు.   ఇక ఈరోజే ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఇంతకాలం సీమాంధ్ర అంతటా ప్రచారంలో పాల్గొన్న ప్రధాన అభ్యర్ధులు అందరూ, తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న విజయమ్మ, హిందూపురం నుండి శాసనసభకు పోటీ చేస్తున్న బాలకృష్ణ తదితరులు ఈరోజు పూర్తిగా తమ నియోజకవర్గాలలో ప్రచారానికే పరిమితం కానున్నారు.   ఎల్లుండి అంటే మే 7న 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు జరుగబోయే ఎన్నికలలో మొత్తం 3, 67,62975 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 23 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయబడ్డాయి. అరకు, పాడేరు వంటి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలయిన 10 నియోజక వర్గాలలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మిగిలిన 165 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

పవన్ కల్యాణ్ పై ఈసీకి పిర్యాదు

  జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ముద్దురూ కలిసి గత ఐదేళ్ళుగా ఎంతో శ్రమించి ఓదార్పు యాత్రలు, దీక్షాలు, ధర్నాలు, ఉద్యమాలు చేసి ఇప్పుడు తమ ఆ కష్టాన్ని ఓట్లుగా మలుచుకొనేందుకు సిద్దపడుతుంటే, అకస్మాత్తుగా రాజకీయాలలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీకి మద్దతు తెలపడమే కాకుండా, వైకాపాను, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడం వారికి చాలా ఆగ్రహం కలిగించడం సహజమే. సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నేరుగా జగన్, రాజశేఖర్ రెడ్డిలపై చేస్తున్న పలు ఆరోపణలు, ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉండటంతో వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయన విమర్శలను వారు ముగ్గురు బలంగా త్రిప్పికొడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి మాత్రం బ్రేకులు వేయలేకపోయారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పలేకపోతున్నారు.   ఇటువంటి తరుణంలో ఆయన నిన్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైకాపా డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం టీడీపీ, బీజేపీ కూటమికి వేయాలంటూ’ అన్న మాటలను పట్టుకొని వైకాపా నేతలు ఆయనపై ఈసీకి పిర్యాదు చేసారు. పవన్ కళ్యాణ్ డబ్బు తీసుకోమని ఓటర్లను ప్రోత్సహించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, అందువల్ల వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈఓ దేవసేనకు వైకాపా నేతలు నిన్న విజ్ఞప్తి చేసారు.   పవన్ కళ్యాణ్ ఆవిధంగా ఓటర్లకు చెప్పడం తప్పే. కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్లకు డబ్బు, మద్యం, వెండిసామాను, చీరలు, క్రికెట్ కిట్స్ వంటివి స్వయంగా పంచి పెడుతూ వారిని ప్రలోభపెడుతూ, ఒక్క పవన్ కళ్యాణ్ ఓటర్లను ప్రలోభాపెడుతున్నాడని పిర్యాదు చేయడం ఇంట్లో మొగుడ్ని చావగొట్టి వీదికెక్కి లబోదిబోమని ఏడ్చినట్లుంది వైకాపా పని. అంతకంటే ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణకు వారు నిర్దిష్టంగా సమాధానం చెప్పుకొని ప్రజలను మెప్పించగలిగి ఉంటే బాగుండేది. కానీ అది సాధ్యం కాదని గ్రహించినందునే తమకు దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర విభజన గురించి నాకు ముందే తెలుసు: జేడీ శీలం

  రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానానికి కడదాకా అండగా నిలిచిన జేడీ శీలం సీమాంద్ర ప్రజల అభీష్టాన్ని మాత్రం ఎన్నడూ పట్టించుకోలేదు. కారణం కాంగ్రెస్ అధిష్టానం తనని పిలిచి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడమే. తనను ఓటేసి ఎన్నుకొన్న ప్రజల అభీష్టం కంటే మంత్రి పదవి, అదిచ్చిన కాంగ్రెస్ అధిష్టానమే తనకు ముఖ్యమని ఆయన ఋజువు చేసారు. నేటికీ ఆయన వంటి వారు కొంత మంది కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని ఉన్నారు. అటువంటి మరో కేంద్రమంత్రి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర విభజన వల్ల నష్టం జరుగుతుందని ప్రజలు అపోహ పడుతున్నారని, వారి అపోహలు దూరం చేసి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని అడిగేందుకే ప్రజల మధ్యకు వెళుతున్నామని” తెలిపారు.   జేడీ శీలం ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా మీడియా వాళ్ళు “రాష్ట్ర విభజన అంతా మీ చేతుల మీదుగానే జరిగిందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి?” అని జేడీ శీలాన్ని ప్రశ్నించినపుడు, “ఈ ఆరోపణలను నేను ఒక కాంప్లిమెంటుగా భావిస్తున్నాను. నిజానికి రాష్ట్ర విభజన జరుగబోతోందని నాకు చాలా ముందే తెలుసు. గత ఏడాది జూన్ 17నే నేను ఆ మాట తెలంగాణా నేతలకి చెప్పాను. కానీ అప్పుడు ఎవరూ నామాట నమ్మలేదు,” అని జవాబిచ్చారు.   ఆయన ఈరోజు బయటపెట్టిన ఈ రహస్యం బహుశః సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరికీ కూడా అప్పుడే తెలిసి ఉంటుందని భావించవచ్చును. కానీ అందరూ కూడా రాజీనామాల డ్రామాలు ఆడుతూ ఎలాగో రోజులు దొర్లించేయగలిగారు. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నంత కాలం హైదరాబాదు, డిల్లీలో పిల్లుల్లా దాకొన్న అటువంటి నేతలే నేడు మళ్ళీ నిసిగ్గుగా తమకు, తమ పార్టీకి ఓటేయమని అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు. సీమాంద్రా ప్రజలందరూ రాష్ట్ర విభజనకు బాధపడుతుంటే అది తనకు 'మంచి కాంప్లిమెంటు' ఒక మంత్రి గారు అంటుంటే, విభజన వల్ల నష్టం జరిగిందని ప్రజలు అపోహ పడుతుంటే వారికి జ్ఞానబిక్ష పెట్టేందుకే తాను తరలి వస్తున్నానని మరొక మంత్రిగారు శలవిస్తున్నారు. 

జగన్, రాజశేఖర్ వలననే తెలంగాణా డిమాండ్: పవన్ కళ్యాణ్

  ఈరోజు కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్డీయే అభ్యర్ధుల తరపున ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో విచ్చలవిడిగా జరిగిన అవినీతి, దోపిడీ, భూకబ్జాల కారణంగానే తెలంగాణా ప్రజలలో సీమాంద్రా పాలకుల పట్ల, ప్రజల పట్ల కూడా తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. వైయస్స్ హయాంలో జరిగిన దోపిడీ మరువక ముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించడంతో తెలంగాణా ప్రజలలో రాష్ట్రం నుండి విడిపోవాలనే కోరిక బలపడిందని ఆరోపించారు. నాయకుడు అనేవాడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మెలగాలని, కానీ రాజశేఖర్ రెడ్డి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి కోసం అవినీతికి గేట్లు తెరిచి, ప్రజలను దోచుకొన్నందునే తెలంగాణా ప్రజలలో సీమాంద్ర నేతల పాలన పట్ల, ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడి చివరికి రాష్ట్ర విభజనకు దారి తీసిందని, అందుకు జగన్, అతని తండ్రి రాజశేఖర్ రెడ్డే కారకులని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అదే చంద్రబాబు 9 సం.ల పాలనలో తెలంగాణా ప్రజలలో వేరు పడాలనే ఆలోచన కూడా కలగకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తుకు చేసారు. అధికారంలో లేనప్పుడే లక్షల కోట్ల ప్రజాధనం దోచుకొన్న జగన్మోహన్ రెడ్డి భూ, ధన, అధికార దాహానికి అంతే లేదా? అని ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణా ప్రజల దృష్టిలో సీమాంద్రా ప్రజలను దుష్టులు, దుర్మార్గులు అనే భావం ఏర్పడేలా చేసిన జగన్మోహన్ రెడ్డి, చివరికి కేసీఆర్ సీమాంధ్రులను నోటికి వచ్చినట్లు తిడుతుంటే వారి తరపున నిలబడి వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయారు. అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

కేసీఆర్ పోలవరాన్ని ఆపలేరు: జైరామ్

  రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ లక్షలాది సీమాంద్ర ప్రజలు రెండున్నర నెలల పాటు రోడ్ల మీదకు వచ్చి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తుంటే, డిల్లీ ఏసీ గదుల్లో కూర్చొని కులాసాగా నవ్వుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేసేసి చేతులు దులుపుకొన్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్, ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలను ఓదార్చే పనిలో తలమునకలయ్యి ఉన్నారు. తెలంగాణా ఇచ్చిన ఘనత తమదేనని తెలంగాణాలో ఉండగా బల్ల గుద్ది వాదించిన ఆయన, సీమాంద్రాలో అడుగుపెట్టగానే రాష్ట్ర విభజన నిర్ణయం (పాపం) కేవలం తమ ఒక్కరిదే కాదని, అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తరువాతనే విభజించామని చెపుతూ, అదొక పాపమన్నట్లు అందులో అందరికీ సమానంగా ఉదారంగా వాటాలు పంచిపెడుతున్నారు.   అయినప్పటికీ సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోరే తాము చాలా ఉదారంగా ఐటీఐ మొదలు ఐఐటీల వరకు అన్నీ సమకూర్చబోతున్నామని హామీ ఇస్తున్నారు. వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వగైరా వగైరాలు గత 60 ఏళ్ళల్లో చేయలేని అనేక అద్భుతాలు తమకి మళ్ళీ ఓటేసి గెలిపిస్తే జస్ట్ ఐదేళ్ళలో పూర్తి చేసేస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాకు ఇస్తున్న’వరం’ పోలవరం అని ప్రకటించారు. సీమాంద్రాకి పారే కృష్ణానది నీళ్ళని ఆపడం కేసీఆర్, తెలంగాణా ప్రభుత్వాల తరంకాదని, దాని మీట తమ చేతిలో ఉందని గంభీరంగా గర్జిస్తున్నారు. అయితే ఇంతా చెప్పిన తరువాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరి కొంచెం సమయం (?) పడుతుందని, ఎందుకంటే 50వేలమంది గిరిజనులకు పునరావాసం కల్పించవలసి ఉందని ముగించారు.

జగన్, కేసీఆర్ లతో జైరామ్ యుద్ధం దేనికి?

  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజల వద్దకు విభజనలో ప్రముఖ పాత్ర పోషించిన జైరామ్ రమేష్ ను ప్రచారానికి పంపడం ఆత్మహత్యతో సమానమని కాంగ్రెస్ తెలియదనుకోలేము. రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితుడు, మంచి ప్రజాకర్షణ గల చిరంజీవి వంటి వ్యక్తికే రాష్ట్ర ప్రజల నుండి తిరస్కారం ఎదురవుతుంటే, దగ్గరుండి రాష్ట్ర విభజన చేసిన జైరామ్ రమేష్ ని చూస్తే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో, దానివలన కాంగ్రెస్ పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఎవరయినా ఊహించవచ్చును.   కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఏరికోరి ఆయననే ఎందుకు పంపింది? కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఎందుకు అంతలా విరుచుకుపడుతున్నారు? బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడం తాను జీర్ణించుకోలేకపోతున్నాని, జగన్ తిరిగి జైలుకు వెళ్ళక తప్పదని ఆయన ఎందుకు పదేపదే చెపుతున్నారు? అని ప్రశ్నించుకొంటే, ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రజలతో ఆడుతున్న ‘మైండ్ గేమ్’ లేదా ‘డబుల్ గేమ్’ అని చెప్పుకోవచ్చు.   అదెలాగ అంటే, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో 17యంపీ సీట్లు సాధించుకొనేందుకే, సీమాంద్రాలో పార్టీని, తమ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టిందని కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలే చెప్పారు. సీమాంద్రాలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని కూడా వారే చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే తెలంగాణాలో తెరాస, సీమాంద్రాలో వైకాపా గెలవడం చాలా అవసరం. కాంగ్రెస్ తొలి ప్రాధాన్యత తను తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడమే కానీ ఆంధ్రా, తెలంగాణాలలో అధికారం చెప్పడం కాదు. ఈసారి ఎన్నికలలో గెలిచి కేంద్రంలో ఆహికారం హస్తగతం చేసుకోలేకపోతే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందని అందరికీ తెలుసు. అందుకే, దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తోంది. సీమాంద్రాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సిద్దం చేసిన వ్యూహం గురించి ఇప్పటికే ప్రజలందరికీ బాగా తెలుసు.   కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేఖత ఉందనే సంగతి ప్రజలకే కాదు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఆ వ్యతిరేఖతను మరింత పెంచుకోగలిగితేనే, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి బదిలీ అవుతాయి. అందుకు నోటి దురద ఉన్న జైరామ్ రమేష్ వంటి వ్యక్తికంటే అర్హుడు, సమర్ధుడు మరొకరు ఉండబోరు.   ఆయన తెలంగాణాలో మంచి ప్రజాధారణ ఉన్నకేసీఆర్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతూ పరోక్షంగా తెరాసకు ఏవిధంగా మేలు చేకూర్చేడో అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా సీమాంద్రాలో కూడా ప్రజాధారణ ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా అవాకులు చవాకులు వాగుతూ ప్రజల దృష్టిలో తాను, తన కాంగ్రెస్ పార్టీని విలన్లుగా మార్చి, జగన్మోహన్ రెడ్డిని హీరో చేసే పనిలోపడ్డారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటే, వారు ప్రత్యర్ధులు గనుక అది సహజమేనని ఎవరయినా భావిస్తారు. కానీ ఎన్నికల తరువాత తమ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోయే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను జైరామ్ రమేష్ వంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నేతే స్వయంగా తిట్టడం, విమర్శించడం కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న అతితెలివికి అద్దం పడుతోంది.   సాధారణంగా ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎవరయినా విమర్శిస్తే, అటువంటి వారిపట్ల వ్యతిరేఖత కనబరుస్తూ తమకు నచ్చిన వారివైపు మరింత బలంగా ఆకర్షితులవుతారు. గత ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి విషయంలో ఇది రుజువు అయ్యింది కూడా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా అటువంటి వ్యూహమే అమలు చేస్తోంది. అందుకే, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కూడా పక్కనబెట్టి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను ప్రత్యేకంగా పంపింది. ప్రస్తుతం ఆయన తనకు అప్పజెప్పిన పనిలో చాల వరకు సవ్యంగానే పూర్తి చేసారనే చెప్పవచ్చును. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహాన్ని ప్రజలు తమ ఓటు అనే వజ్రాయుధంతో చేధించుకొని బయటపడగలరో లేదో త్వరలోనే తేలుతుంది.

ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోడానికి రెడీ: రాహుల్

  ఎన్నికల చివరిదశకు చేరుకొంటున్న కొద్దీ రాన్రాను కాంగ్రెస్ పార్టీలో గెలుస్తామనే ఆశ, నమ్మకం సన్నగిల్లిపోతున్నట్లు కనిపిస్తోంది. మోడీ ప్రధాని కాకుండా అడ్డుకొనేందుకు అవసరమయితే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చేందుకు కూడా తాము సిద్దమని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన మొదటి సారిగా తన ఓటమిని అంగీకరిస్తూచేసిన ప్రకటనగా చెప్పుకోవచ్చును. కానీ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ యువరాజవారు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, తాము థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని ఎన్నడూ అనలేదని, అదంతా గాలివార్తలని కొట్టి పడేసారు. తాము ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని, ఒకవేళ గెలవకుంటే ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు కూడా సిద్దపడతాము తప్ప థర్డ్ ఫ్రంట్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఈయబోమని ప్రకటించారు.   మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా ఎందుకు మనసు మార్చుకోన్నారనే విషయం పక్కన బెడితే, ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు సిద్దమని ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ పూర్తిగా తన పరాజయం అంగీకరించినట్లయింది. ఈ మాటల ప్రభావం వలన త్వరలో జరుగబోయే మిగిలిన రెండు దశల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్న రాహుల్ గాంధీయే స్వయంగా ఇంకా ఎన్నికలు పూర్తికాక మునుపే తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు సిద్దమని చెపుతున్నపుడు, ప్రజలు కూడా అటువంటి ఓడిపోయే పార్టీకి ఓటు వేసి అమూల్యమయిన తమ ఓటును ఎందుకు వృధా చేసుకోవాలని భావించి, 300 సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ/ఎన్డీయే కూటమికే ఓట్లు వేసే అవకాశం ఉంది. రాజకీయ పరిణతి ఉన్న ఏ రాజకీయ నాయకుడు, పార్టీ కూడా ఇటువంటి కీలకమయిన తరుణంలో ఈవిధంగా మాట్లాడి తమకు పడబోయే ఓట్లను ప్రత్యర్ధుల ఖాతాలోకి మళ్ళించరు. కానీ విశాల హృదయం కల యువరాజవారు చాల ఉదారంగా తమ ప్రత్యర్ధ బీజేపీకి ఆ అవకాశం కల్పిస్తున్నారు.

సీమాంద్రాలో కూడా బాబు బీసీ మంత్రం పనిచేస్తుందా?

  ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా, కాంగ్రెస్, తెరాసల విజయవకాశాలకు గండికొట్టే స్థాయికి పార్టీని చేర్చారు. అయితే సీమాంద్రాలో తానే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నందున, ఆ మంత్రాన్ని యధాతధంగా జపించడం సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అవుతుంది గనుక దానిని కొద్దిగా మార్పు చేసి, సీమాంద్రాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించి ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికేనని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది.   సీమాంద్రాలో తెదేపా-బీజేపీ తరపున చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ సీమంద్రాలో జగన్ ప్రభావం కూడా చాలా బలంగా ఉంది. జగన్, షర్మిల చేస్తున్న ప్రచారానికి ప్రజలలో విశేష స్పందన కనబడుతోంది. వైకాపా నుండి తెదేపా చాలా గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో, హామీలు గుప్పించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మిగిలిన ఈ మూడు రోజుల్లో ప్రజలను ఎలాగయినా తమవైపు తిప్పుకోవాలని రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈరోజు ఈ సరికొత్త తాయిలం ప్రకటించి ఉండవచ్చును.   అయితే ఈ సరి కొత్త తాయిలం ప్రకటించడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చును. బీజేపీతో తెదేపా అంటుకట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తెదేపాకు కూడా మతతత్వ రంగు పులిమెందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. దానివలన తెదేపాకు ముస్లిం మరియు క్రీస్టియన్ ప్రజల ఓట్లు కొంతమేర నష్టపోయే అవకాశం కూడా ఉంది. బహుశః ఆ లోటుని భర్తీ చేసుకోనేందుకే చంద్రబాబు మళ్ళీ బీసీ మంత్రం పటిస్తున్నట్లున్నారు. అయితే అన్నిసమస్యలకు ‘సర్వరోగ నివారిణి’లా ఒకటే మంత్రం పనిచేస్తుందా? లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.

కాపులు, బీసీలకు చంద్రబాబు బంపర్ ఆఫర్

      తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బీసీకే ఇస్తామని చెప్పి, ఆర్.కృష్ణయ్య పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రలోని బీసీలు, కాపులకు ఒక బంపర్ ఆఫర్ని ప్రకటించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టిస్తామని, వాటిలో ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ద్వారా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బీసీలు, కాపులకు మరింత చేరువు అయ్యే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.

వెబ్‌సైట్లలో డిగ్గీ, అమృత ఫొటోలు తీసేయండి

      తన కంప్యూటర్, ఈ మెయిల్ హ్యాక్ అయ్యాయని, వాటిలో వున్న తన, దిగ్విజయ్ పర్సనల్ ఫొటోలు లీక్ అయ్యాయని, అమృతారాయ్ చేసిన ఫిర్యాదుకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఐపీసీ సెక్షన్ 66ఎ, ఐటీ యాక్షన్ సెక్షన్ 509 కింద కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మొదటగా వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్న దిగ్విజయ్ సింగ్, అమృత రాసలీలల ఫొటోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు వెబ్ సైట్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫొటోలను ఉపయోగించడం ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అలాగే అమృతా రాయ్ పేరు మీద నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు చలామణిలో వున్నాయని, వాటిని కూడా తొలగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

పవన్ కళ్యాణ్‌ని బెదిరిస్తున్నదెవరు?

      బీజేపీ, టీడీపీ కూటమికి ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల నుంచి తనకు వస్తున్న బెదిరింపుల గురించి పదేపదే ప్రస్తావిస్తు్న్నారు. నిన్నగాక మొన్న ఏమన్నారంటే, తనమీద తన ప్రత్యర్థులు దాడి చేయాలంటే వాళ్ళకి ఆయుధాలు కావాలి.. కానీ తాను తన అభిమానులతో కలసి నడిస్తే చాలని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ తనకు బెదిరింపులు వస్తున్నాయని, రాజకీయాల్లోకి రావడం వల్ల తనకు పైసా కూడా ఆదాయం లేకపోయినా 40 మంది శత్రువులని సంపాదించుకున్నానని చెప్పుకొస్తు్న్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్‌ని బెదిరిస్తున్నదెవరు? అసలు ఆ అవసరం ఎవరెవరికి వుండొచ్చు? జగన్‌ని, కేసీఆర్ని, కాంగ్రెస్ వాళ్ళని పవన్ ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా బెదిరిస్తూ వుంటే ఆ వివరాలు పవన్ కళ్యాణ్ పూర్తిగా వెల్లడిస్తే బాగుంటుంది. ఎవరు బెదిరిస్తున్నారు.. ఎలా బెదిరిస్తున్నారు. ఫోన్‌లోనా, వ్యక్తిగతంగా కలిసి బెదిరిస్తున్నారా? ఎప్పుడు బెదిరించారు.. ఇలాంటి వివరాలన్నీ క్లియర్‌గా చెబితే బాగుంటుంది. లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసమే చెబుతున్నట్టు జనం అనుమానించే ప్రమాదం వుంది.

అక్షయ తృతీయ రోజున భారీగా బంగారం చోరీ

      అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని, బోలెడంత డెవలప్‌ అవుతామని చాలామంది నమ్ముతారు. ఈ నమ్మకానికి కార్పొరేట్ బంగారు దుకాణాలు మరింత బలాన్ని చేకూరుస్తూ ప్రకటనలు ఇస్తూ వుంటాయి. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకుంటూ వుంటాయి. బంగారం కొనడానికి వచ్చినవారి జేబులు ఖాళీ చేస్తుంటాయి. అది వేరే విషయం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే కాదు.. కొట్టేసినా మేలు జరుగుతుందని మహారాష్ట్రలోని థానేలో కొంతమంది దొంగలు భావించినట్టున్నారు. అందుకే కరెక్ట్ గా అక్షయ తృతీయ రోజునే థానేలోని రాజరత్నా జ్యూయలర్స్ లో చోరీ చేసి ఎంచక్కా గ్రాము రెండు గ్రాములు కాదు.. ఏకంగా ఎనిమిదిన్నర కిలోల బంగారి దోచుకెళ్ళారు. ఈ దోచుకోవడం ఏ అర్ధరాత్రి పూటో కాదు.. పట్టపగలు. మధ్యాహ్నం వరకు చాలా కష్టపడి బంగారాన్ని అమ్మిన సదరు షాపువాళ్ళు షట్టర్‌కి తాళాలు వేసి అలా వెళ్ళారో లేదో దొంగలు ఇలా గోడకి కన్నం వేసి బంగారాన్ని దోచుకెళ్ళారు. షాపు వాళ్ళ దరిద్రం ఏంటంటే, దొంగల్ని పట్టుకోవడానికి ఉపయోగపడే సీసీ కెమెరా కూడా రెండు రోజులుగా పనిచేయడం లేదట.

సోనియా ముందు నోరుజారిన చిరంజీవి

      మాజీ మెగాస్టార్, త్వరలో మాజీ కేంద్రమంత్రి కాబోతున్న చిరంజీవి ఈ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఎక్కడైనా రాజకీయ పాఠాలు నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకులకు కలుగుతోంది. ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లో ఏ స్టెప్ వేసినా, ఏస్టేట్‌మెంట్ ఇచ్చినా అది తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటోంది. చిరంజీవి గారి పొరపాట్లు, గ్రహపాట్ల గురించి అలా వుంచితే, లేటెస్ట్ గా ఆయన ఎక్కడ ఏం మాట్లాడకూడదో అక్కడ అదే మాట్లాడారు. శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన సోనియాగాంధీ ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి వీరావేశంగా మాట్లాడారు. ఆ మాట, ఈ మాట మాట్లాడిన తర్వాత తన రాజకీయ అపరిపక్వతని బయట పెట్టుకునేలా చిరంజీవి మాట్లాడారు. సోనియాగాంధీ వేదిక మీద వుండగానే చిరంజీవి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని భారీ స్థాయిలో పొగడ్డం ప్రారంభించారు. ఏదో పీవీ పేరుని ప్రస్తావించి వదిలేయకుండా అయిదు నిమిషాలకు పైగానే పీవీని పొగిడారు. అసలు పీవీ అంటేనే సోనియాకి అస్సలు పడదన్న విషయం చిరంజీవి మరచిపోయారో, లేక పాపం ఆ విషయం ఆయనకి తెలియదోగానీ పీవీని తెగ పొగిడారు. సోనియాగాంధీని ఐదేళ్ళపాటు దేశ రాజకీయాల వైపు చూడకుండా కట్టడి చేసిన ఘనుడు పీవీ. సోనియాగాంధీకి తెలుగు రాదు కాబట్టి ఆమెకి అప్పటికి చిరంజీవి ఏం మాట్లాడారో సోనియాకి అర్థం అయి వుండకపోవచ్చు. ఎవరైనా ఆ తర్వాత సోనియాకి ఈ మేటర్ గురించి చెబితే మాత్రం ఏమైనా జరగొచ్చు.

గత నెలలో బెస్ట్ షార్ట్ ఫిలిం కనిపించలేదు

      యువ దర్శకులు, నటీనటులకు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ‘తెలుగువన్’ గత కొంతకాలంగా ప్రతి నెలా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘తెలుగువన్’ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. మంచి క్వాలిటీతో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి బహుమతులు అందుకున్నారు. ‘తెలుగువన్’ ద్వారా వారి ప్రతిభ ప్రజలకు, సినిమా పరిశ్రమకు చేరువైంది. గత నెలలో.. అంటే మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ‘తెలుగువన్’ ఇచ్చే బెస్ట్ ప్రైజ్ కోసం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ‘తెలుగువన్’ పరిశీలనకు వచ్చాయి. అయితే మాకు అందిన షార్ట్ ఫిలిమ్స్ లో బహుమతికి అర్హమైన షార్ట్ ఫిలిం ఒక్కటి కూడా కనిపించకపోవడం మాకు ఆశ్చర్యాన్ని, ఆవేదనని కలిగించింది. మాకు అందిన షార్ట్ ఫిలిమ్స్ రాశి బాగుంది. కానీ వాసి తగ్గింది. అందుకే ఈ నెల షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఏ షార్ట్ ఫిలిమ్‌కీ బహుమతిని ఇవ్వలేకపోతున్నాం. అయితే ఉత్తమ షార్ట్ పిలిమ్స్ కోసం ‘తెలుగువన్’ విండోస్ ఎప్పుడూ తెరిచే వుంటాయి. ఈ నెలలో మాకు మంచి షార్ట్ ఫిలిమ్స్ అందుతాయని ఆశిస్తున్నాం. ఆశావాదంతో ఆహ్వానిస్తున్నాం.

దిగ్విజయ్‌ రాసలీలపై మరదలి మండిపాటు

        సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం నడుపుతూ, వీరి ఫొటోలు బయట పడగానే పెళ్ళి మార్గంలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. దిగ్విజయ్ గానీ, అమృత గానీ తమ గుట్టు బయటపడినందుకు ఎంతమాత్రం సిగ్గుపడటం లేదు. తమని విమర్శిస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ సిగ్గులేని తనానికి పరాకాష్టగా కనిపిస్తున్నారని జనం అనుకుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ తన ఘనకార్యాన్ని చాలా గొప్ప విషయంలా చెప్పుకుంటున్నాడు. నరేంద్రమోడీ తన పెళ్ళి విషయం దాచిపెట్టాడట. తాను మాత్రం తన అక్రమ సంబంధం విషయాన్ని దాచిపెట్టకుండా, తన లవర్ని పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించాడట. కాబట్టి తానే మోడీకంటే మంచోడట. ఇలాంటి వితండవాదంతో సిగ్గు ఎగ్గు వదిలేసిన దిగ్విజయ్ సింగ్‌ని సొంత బంధువులే తిట్టిపోస్తున్నారు.   దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ భార్య  రుబినా శర్మ సింగ్ మాత్రం డిగ్గీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. లక్ష్మణ్ సింగ్ మొదటి భార్య చనిపోయినప్పుడు ఆయన రుబినా శర్మని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట. అప్పుడు దిగ్విజయ్ లక్ష్మణ్ సింగ్ రెండో వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడట. అన్నని ఎదిరించి మరీ లక్ష్మణ్ సింగ్ పెళ్ళి చేసుకుంటే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న దిగ్విజయ్ తమ్ముణ్ణిమానసికంగా వేధించాడట.  ఆ ఫ్లాష్ బ్యాక్‌ని రుబినా ఇప్పుడు గుర్తు చేస్తోంది. తమ్ముడి రెండో పెళ్ళిని వ్యతిరేకించిన దిగ్విజయ్ తను మాత్రం అక్రమ సంబంధం పెట్టుకుని, అది బయటపడేసరికి పెళ్ళి పాట పాడుతూ వుండటం న్యాయమా అని రుబినా ప్రశ్నిస్తోంది.  

ఇంటర్ సెకండియర్ ఫలితాలు: కృష్ణా జిల్లా టాప్

      ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11:30నిమిషాలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ అహ్మద్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 82శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాలలో బాలికలే పై చేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 69.52 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 61.87. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు ఈ నేల 9 అలాగే రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్ కూడా తొమ్మిది లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కుదుటపడని రోజా ఆరోగ్యం

      ఈ ఎన్నికలలో సినీ నటి రోజా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్న విషయం, శుక్రవారం నాడు ఎండలో తిరుగుతూ ప్రచారం చేస్తూ వడదెబ్బకి గురైన విషయం తెలిసిందే. అయితే నిన్నంతా చికిత్స చేసినప్పటికీ వడదెబ్బ నుంచి రోజా కోలుకోనట్టు తెలిసింది. ఈసారి అయినా గెలుస్తానా లేదా అనే భయంతో రోజా ఎండని కూడా లెక్క చేయకుండా టూమచ్‌గా ప్రచారం చేయడంతో సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయిన రోజాని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శ్రమపడి రోజాని స్పృహలోకి తెచ్చారు. వడదెబ్బ కారణంగా రోజా బాగా బలహీనమైపోయారని, ఇంకో రెండు మూడు రోజులైనా ఆస్పత్రిలో వుండక తప్పదని వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజా ప్రచారంలో వెనుకబడిపోతానని, అంచేత బయటకి వెళ్ళి ప్రచారం చేస్తానని పట్టుబట్టగా, ట్రీట్‌మెంట్ పూర్తి కాకుండా బయటకి వెళ్ళి ప్రచారం చేస్తే అంతే సంగతులని వైద్యులు హెచ్చరించడంతో రోజా ఆస్పత్రిలోనే వుండటానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

      ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ విడుదల చేశారు. ఈ సంవత్సరం మొత్తం 65.57 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.  వీళ్ళలో బాలుర శాతం 61.87 . బాలికల ఉత్తీర్ణత శాతం 69.52. గత ఏడాది కన్న ఈ ఏడాది స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.    ఎస్ఎంఎస్ ద్వారా ... 1. BSNL users Inter <space><Roll No. > to  53346. 2.All users IPE2<space> <Hall Ticket No> to 54242 for General results; IPEV2 <space><Hall Ticket No> to 54242 for Vocational results. 3. All users<Hall Ticket>to 57272; 4. All users IPEG2<space> <Hall Ticket No> to 5676750 for General results; and IPEV2 <space><Hall Ticket No> to 5676750 for Vocational results; 5.  All users AP12<Hall Ticket No> to 58888; 6. Airtel users AP12<Hall Ticket No>to 52070; 7. All users APJI <space> <Hall Ticket No> to 56767999 To know results from the websites: * http://examresults.ap.nic.in * http://results.cgg.gov.in * www.apit.ap.gov.in * www.results.educationandhra.com * www.resumedropbox.com, * www.indiaresults.com * www.vidyavision.com * www.ExamResults.net * www. nettlinxresults.net * www.manabadi.com * www.manabadi.co.in * www.results.manabadi.co.in * www.schools9.com * www.exametc.com * http://results.webdunia.com * www.bharatstudent.com * www.kabconsultants.com * www.educationgateway.com * www.AndhraEducation.net * www.results.andhraeducation.net * www.educationandhra.com * www.betechs.com * www.koshercomm.in * www.resultsindia.in * www.educationplus.co * www.PsddOrFail.in * www.asmalldream.org * www.manachaduvu.com * www.vidyavision.co.in * www.vnssolutions.in * www.iitjeeforum.com 

సోనియా సభపై వెంకయ్య ఎద్దేవా

      దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే రోజు దగ్గరపడి౦దని, అందుకే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు మోడీపై విచారణకు ఆదేశాలు జారీ చేసే అధికారం హోంమంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్రలో సోనియా సభ జనం లేక వెల వెల బోయిందని, బీజేపీ సవాళ్లకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విమర్శలకు దిగుతుందని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. గుంటూరు ఎన్నికల సభకు వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ ఖాళీ కుర్చీలకు తన సందేశం ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆ ఖాళీ కుర్చీలను చూసి సోనియాగాంధీకి కూడా దేశంలో తమ పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధమయ్యేవుంటుందని అన్నారు.