తెలంగాణ మావోయిస్టుల దుశ్చర్య.. వాహనానికి నిప్పు

  తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అటు ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఇటు తెలంగాణలోని వరంగల్ జిల్లాలోనూ మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూపోతున్నారు. తాజాగా తెలంగాణలో మావోయిస్టులు మరో దుశ్చర్యానికి పాల్పడ్డారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిధిలో నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాతం అటవీ శాఖ కార్యాలయంపై దాడి చేసి ఆ శాఖ వాహనానికి నిప్పు పెట్టారు. అంతేకాదు ఈ చర్యకు పాల్పడింది తామేనని కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరిట మావోయిస్టులు అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు.

విజయ్ మాల్యా.. నాన్ బెయిలబుల్ వారెంట్లపై విచారణ..

  విజయ్ మాల్యాపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఎంచక్కా లండన్ వెళ్లిన విజయ్ మాల్యాకు చిన్న చిన్నగా ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు హాజరుకావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకావాలని ఆదేశించినా.. హాజరుకాకుండా పదే పదే గడువు కావాలని కోరడంతో ఈడీ మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో కేంద్రం కూడా వెంటనే స్పందించి నాలుగు వారాల పాటు మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. అంతేకాకుండా వారంలోగా ఈ సస్పెన్షన్ పై మాల్యా స్పందించకుంటే పాస్ పోర్టును పూర్తిగా రద్దు చేస్తామని కూడా ఆ శాఖ హెచ్చరించింది. దీంతో ఈడీ మరో అడుగు ముందుకేసి తమ నోటీసులకు స్పందించని మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.

విశాఖపట్నమే కావాలంటున్న ధోనీ అండ్ కో..!

  మహారాష్ట్రలో కరువు కారణంగా, అక్కడి ఐపిఎల్ మ్యాచ్ లను ఆడకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మహారాష్ట్రలో హోమ్ గ్రౌండ్స్ ఉన్న ముంబై, పుణే జట్లకు ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగు వెన్యూలను ఆప్షన్లుగా ఇచ్చింది. రాయ్ పూర్, జైపూర్, విశాఖపట్నం, కాన్పూర్ లలో ఒకటి ఎంచుకోమని రెండు టీం లకు కౌన్సిల్ ఆప్షన్స్ ఇచ్చింది. విశాఖపట్నం ధోనికి చాలా ఇష్టమైన గ్రౌండ్. అందుకే మరో మాట లేకుండా వెంటనే విశాఖపట్నానికి ధోనీ టీం పుణే ఓటేసింది. ముంబై మాత్రం తమకు మరికొంత సమయం కావాలని తెలిపింది. ఎక్కువశాతం పుణే హోం మ్యాచ్ లన్నీ వైజాగ్ లో జరగడానికే ఆస్కారం ఉంది. దీంతో ఇన్నాళ్లూ ఐపిఎల్ ను అప్పుడప్పుడు మాత్రమే చూసే భాగ్యం కలిగిన వైజాగ్ వాసులు, ఇక నుంచీ ఐపిఎల్ సందడిని ఆస్వాదించచ్చన్నమాట. మరోవైపు ముంబైలో జరగనున్న ఐపిఎల్ ఫైనల్ ను బెంగళూరుకు షిఫ్ట్ చేసే ఆలోచన ఐపిఎల్ కౌన్సిల్ చేస్తోంది. కౌన్సిల్ ఆమోదిస్తేనే ఇవన్నీ సాధ్యపడే అవకాశం ఉంది.

సరి-బేసి విధానం.. 5 గంటల్లోనే 500 వాహనాలకు ఫైన్..

  ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి-బేసి పద్దతిని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండి సరి-బేసి విధానం మలి దశను అమలుపరిచారు. అయితే అలా అమలుపరిచారో లేదో ఐదు గంటల వ్యవధిలో 500 పైగా వాహనాలకు జరిమానా కట్టవలసి వచ్చింది. నిబంధనల ప్రకారం.. ఈరోజు బేసి సంఖ్య ఉన్న కార్లు మాత్రమే వీధుల్లోకి రావాల్సి ఉంది. కానీ సరి సంఖ్య ఉన్న వాహనాలు కూడా రోడ్లపైకి వచ్చాయి. దీంతో తొలి ఐదు గంటల వ్యవధిలో 500కు పైగా వాహనాలు సరిసంఖ్య నంబరు గల వాహనాలు రోడ్లపైకి రావడంతో వీటిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఒక్కో కారుకు రూ. 2 వేల జరిమానా విధించామని, దీన్ని చెల్లించేందుకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చామని తెలిపారు.

మహారాష్ట్ర సీఎంకి ప్రత్యూష బెనర్జీ తల్లి లేఖ..

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన కూతురి ఆత్మహత్యకు రాహుల్ రాజ్ సింగే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రత్యూష తల్లి సోమా బెనర్జీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కి లేఖ రాశారు. తన కూతురి ఆత్మహత్యకు రాహుల్ రాజ్ సింగే కారణమని.. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు అతని వల్ల ఇంకా చాలా మంది అమ్మాయిలు మోసపోయారని.. తమను, సాక్షులను బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు.. రాష్ట్ర హోంమంత్రి, ముంబయి పోలీస్‌ కమిషనర్‌లకు కూడా ఆమె లేఖ రాశారు.

మోడీ రావడం చాలా పెద్ద రిలీఫ్.. ఊమెన్ చాందీ

  కేరళ కొల్లం పుట్టంగల్ దేవి ఆలయంలో బాణసంచా పేలి వందమందికి పైగా ప్రాణాలు పోయి.. వందల మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన రోజే ఘటనా స్థలికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి పరామర్సించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ప్రధాని రాకపై ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్పందించి మోడీని ప్రశంసించారు. ఘటన జరిగిన రోజునే మోడీ రావడం తమకు ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. అప్పటికే సహాయక చర్యల్లో అలసిపోయిన పోలీసులకు వీవీఐపీల బాధ్యత మరింత భారమైందని.. అందుకు మోడీ ఒకరోజు ఆలస్యంగా వస్తే బావుంటుందని అన్నారని.. కానీ మోడీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఘటన జరిగిన రోజే రావడం గొప్ప విషయమని.. జాతీయ స్థాయి నాయకుడు కేరళకు రావడం చాలా పెద్ద రిలీఫ్ అని.. జరిగిన ఘటనపై మోడీ స్పందించిన తీరు గొప్పదని అన్నారు. 

మోడీ ముందు కేజ్రీ పెట్టిన డిమాండ్లు ఇవే..!

ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కేజ్రీవాల్ విమర్శించడం..కేజ్రీవాల్ ఏం చేసినా మోడీ ప్రశ్నించడం ఇది రోజూ జరిగేదే. ఇలా రోజూ విమర్శల పర్వాన్ని కొనసాగించలేక విసుగుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధాని ముందు బంపర్ ఆఫర్ పెట్టారు. తాను సూచించిన ఐదు డిమాండ్లకు ప్రధాని ఓకే అంటే దేశంతో పాటు తాను సెల్యూట్ చేస్తానన్నారు.  కేజ్రీవాల్ డిమాండ్లు ఇవే:- 1 ట్విటర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారిని ఫాలో అవకండి. 2. రోహిత్ వేముల మృతికి కారణమైన కేంద్రమంత్రులను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి.  3. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఎన్నికల్లో నెగ్గి  ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి.           దొడ్డి  దారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం మానాలి. 4. ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని అంగీకరించండి. 5. భారత్ మాతాకీ జై అనని వారిపై దాడులు చేయడం మానండి. దాడులు చేసినవారిని జైలులో పెట్టండి. ప్రజల ఆహారపు          విషయాలలో జోక్యం చేసుకోకండి.  

ఇండియాను పట్టుకున్న దుష్టగ్రహం ఎవరో తెలుసా?

తనదైన స్టైల్లో ఎప్పుడూ విమర్శలు చేసే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గోన్న ఆయన ప్రధానిపై అంతెత్తున లేచారు. ఇండియాను ఇప్పుడో దుష్ట గ్రహం పట్టుకుందని దాని పేరే నరేంద్రమోడీ అన్నారు. మోడీ ప్రమాణం స్వీకారం చేశాక దేశంలో నీటి కష్టాలు పెరిగాయని, తీవ్ర కరువు వర్షాభావం దేశాన్ని పట్టి పీడించడం ప్రారంభమైందన్నారు. అక్కడితో ఆగకుండా గురువులు, బాబాల ఆస్తులపై విచారణ జరిపించాలని లాలూ డిమాండ్ చేశారు. ఈ వార్తలు స్థానికంగా సంచలన సృష్టించాయి.  

కన్నతల్లిదండ్రులే కూతురికి విషమిచ్చి..

బెంగుళూరులో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులు, సోదురుడే కూతురికి విషమిచ్చి చంపేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నాన్జన్ గూడలో గురుమల్లప్ప(64), మంజుల(48) కు ఒక కూతురు మధు కుమారి, కొడుకు గురుప్రసాద్. అయితే 21 ఏళ్ల మధు కుమారి జయరాం అనే దళిత యువకుడిని ప్రేమించింది. అయితే ఇది ఏమాత్రం ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు మధు కుమారిని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే మామిడి పండ్లరసంలో పురుగుల మందు కలిపి ఆమెకు ఇచ్చారు. దీన్ని తాగిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. మధు మృతికి కారణమైన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కన్నయ్య కుమార్ ను చంపేస్తాం.. బస్సులో తుపాకీ, ఒకలేఖ

  జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ రోజు రోజుకి ఎంత పాపులర్ అవుతున్నాడో.. అదే విధంగా ఆయనకు సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయి. అంతకు ముందు పెద్దగా ఎవరికి తెలియని కన్నయ్య కుమార్ జెఎన్యూ ఘటన తరువాత మాత్రం దేశవ్యాప్తంగా నోటెట్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయనకు తెలత్తుతున్న సమస్యలకు గాను కేంద్రం ఆయనకు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మరో ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ నుంచి జేఎన్యూ మధ్య నడిచే బస్సులో పోలీసులు ఓ అనుమానాస్పద బ్యాగును గుర్తించారు. దీనిని తెరచి చూసిన పోలీసులు అందులో తుపాకీ, ఒకలేఖను గుర్తించారు. ఆ లేఖలో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ను హత్యచేస్తామని పేర్కొనడంతో కలకలం రేగుతోంది. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

బ్రిటిష్ యువరాజుకి మోడీ షేక్ హ్యాండ్... ప్రింట్ పడింది..

  మనం సాధారణంగా పలకరింపుగా షెక్ హ్యాండ్ ఇస్తుంటా. అయితే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏదో లైట్ గా ఇస్తే.. కొంత మంది మాత్రం చాలా గట్టిగా పట్టుకొని ఇస్తారు. కానీ ఇక్కడ మన ప్రధాని మోడీ ఇచ్చిన షేక్ హ్యాండ్ కి చేయి మీద ఏంకగా ప్రింటే పడిపోయింది. ఇంతకీ మోడీ ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.. ఎవరికి ప్రింట్ పడిందనేగా డౌట్.. అసలుసంగతేంటంటే.. మోడీ.. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ దంపతులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ పలకరింపుగా విలియమ్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మోడీ ఇచ్చిన షేక్ హ్యాండ్ కి ఆయన చేయి పట్టుకున్నంత మేర యువరాజు చేయి పాలిపోయినట్లై ప్రింట్ లా పడింది. మొత్తానికి మోడీ గారి షేక్ హ్యాండ్ పవర్ ఎంటో అందరికీ తెలిసింది.

భూమాకి చిక్కులు.. తిట్టినందుకు దళితుల రాస్తారోకో..

భూమా నాగిరెడ్డికి ఒకదాని తరువాత ఒకటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే భూమాకు, శిల్పా కు మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శిల్పా అనుచరుడిపై దాడి జరగగా దానికి భూమానే కారణమంటూ ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో వ్యవహారంలో భూమాకి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు దళితులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక దళితులు భూమాని కలిసి తమకు అంబేద్కర్ భవన్ ను కట్టించాలని కోరగా ఆయన మండిపడ్డారంట. తినడానికి తిండిలేని వారికి అంబేద్కర్ భవన్ అంత అవసరమా? అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంట. దీంతో దళితులు భూమా నాగిరెడ్డి తమ పట్ల అవహేళనగా మాట్లాడాడని ఆరోపిస్తూ, కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కర్నూలు - గుంటూరు రహదారిపై పాములపాడు వద్ద రోడ్లను దిగ్బంధించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

కన్హయ్య కుమార్‌కు వీఐపీ సెక్యూరిటీ..!

ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ ఆ వివాదం తరువాత రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. అతను ఎక్కడికి వెళ్లినా సరే జనం తరలివస్తున్నారు. దాంతో పాటే ఆయన్ని అడ్డుకోవడానికి పలు వర్గాలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ర్యాలీ నిర్వహించారు.   ఈ ర్యాలీలో పాల్గోన్న వారిని ఉద్దేశిస్తూ వారిద్దరూ ప్రసంగిస్తుండగా వారిపై చెప్పులు, బూట్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు నాగపూర్‌లో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న కన్హయ్యకుమార్ వాహనశ్రేణిని భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లేదంటే అక్కడ భారీ ఘర్షణ చోటు చేసుకునేది. వరుస సంఘటనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కన్హయ్య కుమార్‌కు వీఐపీ సెక్యూరిటి కల్పించాలని నిర్ణయించింది. ఆయనతో పాటు ఉమర్ ఖలీద్‌ల ఇంటి వద్ద వారు పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది.

రెండో పెళ్లిపై రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీ సరదా తీరుస్తా

  సెలబ్రిటీలు కానీ.. రాజకీయ నేతలు కానీ..ముఖ్యంగా క్రీడాకారాలు ఈమధ్యన విలేకరులకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రష్య అధ్యక్షుడు పుతిన్ కూడా చేరిపోయాడు. ఇటీవల పుతిన్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అలినా కాబేవాతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. ఓ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను మీరు రెండో పెళ్లి చేసుకున్నారా? అని దీనిపై అడగగా మొదట తడబడినా.. ఆతరువాత మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తన ప్రైవేటు జీవితం కన్నా, రష్యా అధ్యక్షుడిగా పనితీరునే ప్రజలు గమనిస్తున్నారని, అయితే, ఏదో ఒకరోజు మీ ప్రశ్నకు సమాధానం చెప్పి మీ సరదా తీరుస్తానని అన్నారట. దీంతో విలేకరులకు దిమ్మతిరిగినంత పనైందట.