లిక్కర్ కేసులో కవితకు 10 రోజుల రిమాండ్ 

లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులో భారత రాష్ట్ర సమితి నేత , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కస్టడీకి డిల్లీ కోర్టు శనివారం అప్పగించింది. ఈ కేసులో శుక్రవారం కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే  అనంతరం కోర్టులో కవితను ఈడీ హాజరుపర్చింది. విచారణ నిమిత్తం కవితను 10రోజుల రిమాండ్‌‌కు అప్పగించాలని ఈడీ కోరింది. దీంతో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎంకె.నాగ్‌పాల్ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అరెస్టుకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలను సమర్పించారు. ఇదిలా ఉండగా ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం కవిత మాత్రం 10 రోజుల కస్టడీలో ఉండడం చర్చనీయాంశమైంది. 

వైసీపీ కోసమే పని చేస్తా.. కాపుల కోసం కాదు.. ముద్రగడ

స్వయం ప్రకటిత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్ పార్టీ గూటికి చేరారు. శుక్రవారం (మార్చి 15) వైసీపీ కండువా  కప్పుకున్న ముద్రగడ పద్మనాభం శనివారం (మార్చి 16) మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా   కాపు జాతి ఉద్ధరణకు అవతరించిన నాయకుడంటూ జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో రాజకీయ అజ్ణాని అంటూ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించేశారు. పవన్ కల్యాణ్ ను మార్చుదామనీ తాను ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వాపోయారు కూడా. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జనసేన గూటికి చేరడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరువాత  కూడా జగన్ ఆయనను లైట్ గా తీసుకోవడంతో అలిగే.. వైసీపీ తన మనస్తత్వానికి సరిపడదంటూ ప్రకటించి తాను జగన్ పంచన చేరడం లేదని స్పష్టత ఇచ్చిన వారం రోజులకే ముద్రగడ తన స్టాండ్ మార్చుకున్న సంగతి తెలిసిందే.  పవన్ కల్యాణ్ సినిమాలలోనే హీరో కానీ తాను రాజకీయాలలో హీరోనంటూ తనకు తానే భుజకీర్తులు తగిలించేసుకున్న ముద్రగడ పవన్ కల్యాణ్ తనను జనసేనలోకి ఆహ్వానించినప్పటికీ ఆయన చాలా తక్కువ స్థానాలకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కారణంగా తాను పార్టీలో చేరడానికి నిరాకరించానని చెప్పుకున్నారు. పొత్తులో భాగంగా కనీసం రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని పవన్ డిమాండ్ చేసి ఉండాల్సిందని కూడా అన్నారు. అయితే ఆయన ద్వంద్వ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతన్నాయి.  పవన్ కల్యాణ్ ముద్రగడ డిమాండ్ చేసిన విధంగా ఆయనకు రెండు స్థానాలు కేటాయించడానికి నిరాకరించారనీ, ఆ కారణంగానే ముద్రగడ జనసేనలో చేరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను తాను కాపు నాయకుడిగా చెప్పుకునే ముద్రగడ ఇప్పడు తన కొత్త బాస్ జగన్ ను మెప్పించేందుకు పవన్ వై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి కాపు రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా పూర్వపక్షం చేసిన జగన్ పక్షాన నిలబడి ముద్రగడ ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో కాపు సామాజిక వర్గం అర్ధం చేసుకోవాలని జనసేన వర్గాలు అంటున్నాయి. జగన్ పంచన చేరిన మీరు కాపు రిజర్వేషన్లు అమలు చేయాలన్న షరతేమైనా విధించారా అన్న ప్రశ్నకు ముద్రగడ తను బేషరతుగా వైసీపీలో చేరానని ముక్తాయించారు. తాను తన కులం కోసం కాదు తన వర్గం కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నానని ముద్రగడ కుండబద్దలు కొట్టేశారు. తన రాజకీయ జీవితంలో కేవలం 5 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారనీ, తానీ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు బీసీలు, దళితులే కారణమని చెప్పుకొచ్చారు.   ఇక జగన్ ఆదేశిస్తే  ఎక్కడ నుంచైనా పోటీకి సిద్ధమేనని ముద్రగడ చెప్పినా.. తాజాగా విడుదలైన వైసీపీ అభ్యర్థుల జాబితాలో ముద్రగడ పేరు కనిపించలేదు. అంటే ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం తన ఐడెంటిటీని సైతం వదులుకుని పని చేయడానికి సిద్ధపడిపోయినట్లు స్పష్టంగా అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు టికెట్ దక్కలేదని అలిగి బయటకు రాలేని విధంగా వైసీపీలో ఆయన ఇరుక్కుపోయారనీ, ఇంత కాలం ఆయన రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన అలక అస్త్రం ఇక ఆయనకు ఉపయోగపడదని చెబుతున్నారు.  

మే 13న ఎపిలో పోలింగ్ ... జూన్ 4న  కౌంటింగ్ 

 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది. మే 13న నాలుగో దశ పోలింగ్ ఉంది. ఎపిలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి.  ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 16 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. 18 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 13 న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల సమయంలో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ సారి ఆరు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా, 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, ఆ ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించింది. మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారింది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఈ రోజు వైసీపీ తమ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితా ప్రకటన చేసింది.

ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య  దేశమైన భారత్ లో 18వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్  విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో మే 13నే జరగనున్నాయి.   ఇక సార్వత్రిక ఎన్నికల తొలి దశ కు  మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుందని అన్నారు. ఏప్రిల్ 19న పోలింగ్ జరుతుందని తెలిపారు. ఇక రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల , ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. అలాగే మూడో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 12న మే 7న పోలింగ్  జరుగుతుంది. నాలుగో దశకు  ఏప్రిల్ 18న నోటిఫికేషన్  మే 13న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ దశలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు, తెలంగాణ లోక్ సభ ఎన్నికలు పూర్తి అవుతాయి.  అదే విధంగా ఐదో దశ పోలింగ్  మే 20న, ఆరో దశ మే 25న, ఏదో దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెళ్లడి జూన్ 4న. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇక పోలే దేశంలో 96 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 49కోట్ల 70లక్షలు పురుష,  47 కోట్ల పదిలక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా కోటీ 85లక్షల మంది యువత ఈ ఎన్నికలలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరు కాకుండా 48 వేల ట్రాన్స్ జండర్లు, 88లక్షల 40 వేల మంది దివ్యాంగులూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

 బిఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా 

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటుచేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ప్రవీణ్ రాజీనామా చేశారు. లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రవీణ్ కుమార్ బిఎస్ పికి రాజీనామా చేశారు. కవిత అరెస్ట్ అయిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు. కేసీఆర్ తో ప్రవీణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజులు కూడా గడవకుండానే ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరుగా. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బద్ద శత్రువులు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో బిఆర్ఎస్ ఓడిపోయింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలువరించడాానికి బిఆర్ ఎస్, బిఎస్ పిలు ఎన్నికల పొత్తు పెట్టుకున్నాయి. పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్- బీఎస్పీ పొత్తులో భాగంగా సీట్ల షేరింగ్‌పై క్లారిటీ వచ్చింది. ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని ప్రవీణ్ కుమార్ భావించినట్లు తెలుస్తోంది. వెంటనే బిఎస్ పికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరనున్నట్టు సమాచారం. 

అక్కుం బుక్కుం అలీ.. మళ్లీ ఖాళీ?

కమెడియన్ ఆలీ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ ఉండరు. ఒక్కో సినిమాలో ఒక్కో   విలక్షణ మ్యానరిజమ్ తో  హాస్యం పండించడంలో అలీ తనకు తానే సాటి. చిన్న తనం నుంచీ  సినీమాలే లోకంగా ఎదుగుతూ పెరిగాడు కనుక ఆయన సీనీ ఎంట్రీ ఇచ్చి 50వత్సరాలు దాటిపోయింది.  ఇక ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగలడన్న గుర్తింపూ పొందాడు. సినీమాలలో తిరుగులేని కమేడియన్ గా వెలుగొందుతూనే టీవీ రియాల్టీ షోలలోనూ ప్రేక్షకులను అలరిస్తూ అలీ దండిగా సంపాదించడమే కాదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరివాడుగా ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న ఆలీకి ఎప్పుడు ఎలా కుట్టిందో తెలియదు కానీ రాజకీయం కుట్టింది. దాంతో ఆయనకు సినిమా పాత్రలు ఇరుకైపోయాయి. పొలిటికల్ ఎంట్రీ కోసం అదీ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్న తపనతో అన్ని పార్టీలనూ చుట్టేసి, లెక్కలన్నీ వేసుకుని చివరకు వైసీపీ గూటికి చేరారు. ఇందుకోసం ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆత్మీయుడిగా, అనుంగు స్నేహితుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ తోనూ వైరం తెచ్చుకున్నాడు. రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహమే అని అలీ సుద్దులు చెప్పొచ్చు కానీ అలీ పవన్ కల్యాణ్ ల మధ్య ఇప్పుడు సత్సంబంధాలు లేవనీ రాజకీయ, సినీ పరిశ్రమలలో దాదాపు అందరికీ స్పష్టంగానే తెలుసు.   గత  అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీ కోసం స్వల్ప వ్యవధిలో మూడు పార్టీల గడపలు (తెలుగుదేశం, జనసేన, వైసీపీ) ఎక్కి దిగారు. చివరాఖరుకు వైసీపీ తీర్థం పుచ్చుకుని సెటిల్ అయ్యారు. అయితే ఆ ఎన్నికలలో అలీకి పోటీకి అవకాశం రాలేదు. రాలేదు పో.. ఓ కీలక నామినేటెడ్ పదవి,  వక్ఫ్ బోర్డు చైర్మన్ , లేదా రాజ్యసభ హామీతో గత ఐదేళ్లుగా చకోరపక్షిలా ఎదురు చూస్తూ వైసీపీలోనే కాలం గడిపేశారు. ఏదో కంటి తుడుపు చర్యగా ఓ నామ్ కేవాస్తే సలహాదారు పదవి దక్కినా అలీ కోరుకున్నట్లుగా రాజ్యసభ కానీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి కానీ దక్కలేదు. అసంతృప్తిని చిరునవ్వు మాటున దాచేసుకుని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం కల్పిస్తామన్న జగన్ హామీని, వాగ్దానాన్ని పట్టుకు వేళాడారు. అయితే జగన్ యథా ప్రకారం షిక్కటి షిరునవ్వుతో సారీ అని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో వైపీపీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను జగన్ శనివారం (మార్చి 16) ప్రకటించారు. ఆ జాబితాలో  అలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అంటే సేమ్ ఓల్డ్ స్టోరీ. అలీకి జగన్ మరో సారి హాత్ ఇచ్చారు.   నమ్ముకున్నోళ్లని జగన్ కచ్చితంగా నట్టేట ముంచుతారని గతంలో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ విషయంలో   రుజువైంది. ఆయనొక్కరి విషయంలోనే కాదు.. మోహన్ బాబు.. విషయంలో కూడా.  ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో జగన్ నమ్ముకుని రెంటికీ చెడ్డ రేవడలా మిగిలిన వారి జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే అలీ ఈజ్ డిఫరెంట్.. అని  ఆయన తనకు తాను  భావించారు. కనీసం ఇప్పటికైనా అలీకి వాస్తవం అను బొమ్మ కనబడి తత్వం బోధపడి ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చి ఈ సారి రాజ్యసభ గ్యారంటీ అన్న హామీ ఇస్తే చాలు అక్కు బక్కుం అదే పదివేలు నాయకా అంటూ రెట్టించిన ఉత్సాహతో అలీ వైసీపీ తరఫున ప్రచారంలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాల్లో కమేడియన్ గా రాణించిన అలీ.. రాజకీయాల్లో మాత్రం నవ్వుల పాలయ్యాడని నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. 

పౌరసత్వం  సవరణ చట్టంకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన ఓవైసీ

పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఓవైసీ  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరణ చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని పేర్కొన్నారు.  పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఏఏని ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్), ఎన్ఆర్ సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)తో కలిపి చూడాలని పేర్కొన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్ కు వలస వచ్చే హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇవ్వడానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.  కానీ, భవిష్యత్తులో మీరు ఎన్పీఆర్, ఎన్ఆర్ సీ తీసుకువస్తే 17 కోట్ల మంది ముస్లింల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. వారికి ఓ సొంత దేశం అంటూ లేకుండా చేయాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు ఎన్నికల్లో సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని ఓడిస్తారని ఒవైసీ పేర్కొన్నారు. ఓ ప్రాంతం ఆధారంగా చట్టాలు చేయలేరని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని అన్నారు.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల...25 లోకసభ, 175 అభ్యర్థులు ఖరారు

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే రోజే వైసీపీ అధినేత అసెంబ్లీ, లోకసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వైసీపీ జాబితాలో పాత అభ్యర్థులే ఎక్కువ ఉండటం గమనార్హం. ఓడిపోయే అభ్యర్థులను మార్చలేదన్న వాదన వినిపిస్తోంది.  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 50 శాతం మంది అభ్యర్థలును బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని చెప్పారు.  ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మేం సిద్ధం అంటూ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడో ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వకర్తలను ప్రకటించి జోరు మీదుంది. సరిగ్గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజునే 175 అసెంబ్లీ స్థానాలు 25 లోక్ సభ సీట్లకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇంతకు ముందు విడతల వారీగా ప్రకటించిన సమన్వయకర్తల జాబితాలో ఎలాంటి మార్పులు లేకుండా లేదంటే స్వల్ప మార్పులతో తుది జాబితాను ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 2019 తరహాలోనే ఈసారి కూడా ధర్మన ప్రసాదరావు, ఎంపీ నందిగామ సురేశ్ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేశ్, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రకటిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గానూ.. సగం నియోజకవర్గాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పోటీ చేసే అవకాశం కల్పించినట్లు ధర్మాన ప్రసాద రావు తెలిపారు. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 చోట బీసీలు పోటీ చేస్తున్నారని.. 11 లోక్ సభ స్థానాల్లో బీసీలను బరిలోకి దింపినట్లు ధర్మాన ప్రకటించారు. సామాజిక మార్పు దిశగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన ఉందన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లాంటి పదవుల్లో ఉన్న14 మందికి ఈసారి అసెంబ్లీ సీట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది గ్రాడ్యుయేట్లలు, 88 శాతం మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదివిన వారు ఉన్నారని ధర్మాన తెలిపారు. 2023 డిసెంబర్ 11న వైఎస్సార్సీపీ తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళగిరి, గాజువాక సహా 11 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్సీపీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 32 మంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ మధ్యాహ్నం 12 గంటలో సమయంలో కడప విమనాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లారు. 12 గంటల 40 నిమిషాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడే అభ్యర్థుల జాబితాను ఉంచి ప్రార్థనలు నిర్వహించారురు. సరిగ్గా 12 గంటల 58 నిమిషాలకు అభ్యర్థులను ప్రకటన మొదలైంది. లోక్ సభ అభ్యర్థుల జాబితా.. 1. శ్రీకాకుళం - పేరాడ తిలక్ 2. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్ 3. విశాఖపట్నం - బొత్స ఝాన్సీ 4. అనకాపల్లి - 5. అరకు - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ 6. రాజమండ్రి - గూడూరి శ్రీనివాస రావు 7. కాకినాడ - చలమలశెట్టి సునీల్ 8. అమలాపురం - రాపాక వరప్రసాద్ 9. ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ 10. నర్సాపురం - గూడూరి ఉమాబాల 11. మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్ రావు 12. విజయవాడ - కేశినేని నాని 13. గుంటూరు - కిలారు వెంకట రోశయ్య 14. నరసరావుపేట - పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ 15. బాపట్ల - నందిగామ సురేష్ బాబు 16. ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 17. నెల్లూరు - వేణుంబాక విజయసాయి రెడ్డి 18. తిరుపతి - మద్దిల గురుమూర్తి 19. చిత్తూరు - ఎన్.రెడ్డప్ప 20. రాజంపేట - పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి 21. కడప - వైఎస్ అవినాశ్ రెడ్డి 22. కర్నూలు - బీవై రామయ్య 23. నంద్యాల - పోచ బ్రహ్మానంద రెడ్డి 24. అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ 25. హిందూపురం - జోలదొరశి శాంత జిల్లాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా.. కడప జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైదుకూరు - శెట్టిపల్లి రఘురాం రెడ్డి కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బద్వేలు - గొంతోటి వెంకటసుబ్బయ్య కడప - అంజద్ బాషా సాహెబ్ బేపరి పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి కోడూరు - కోరుముట్ల శ్రీనివాస్ రాయచోటి - గడికోట శ్రీకాంత్ రెడ్డి చిత్తూరు కుప్పం - కె. నగిరి - ఆర్కే రోజా చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు - మెట్టపల్లి చంద్ర పూతలపట్టు - మూతిరేవుల సునీల్ కుమార్ గంగాధర్ నెల్లూరు (ఎస్సీ) - కల్లత్తూర్ కృపాలక్ష్మీ పలమనేరు - ఎన్. వెంకటయ్య గౌడ పీలేరు - చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె - నిస్సార్ అహ్మద్ తంబాళపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పుంగనూరు - పి. రామచంద్రారెడ్డి తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి సత్యవేడు (ఎస్సీ) - నూకతోటి రాజేశ్ అనంతపురం తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామిరెడ్డి కళ్యాణదుర్గం - తలారి రంగయ్య రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి సింగనమల (ఎస్సీ) - ఎం.వీరాంజనేయులు గుంతకల్లు - యల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి ఉరవకొండ - వై. విశ్వేశ్వర రెడ్డి హిందూపురం - కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెనుకొండ - కెవి ఉషా శ్రీచరణ్ ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్ప కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్ పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కర్నూలు ఆదోని - వై. సాయిప్రసాద్ రెడ్డి కర్నూలు - ఏఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్) ఎమ్మిగనూరు - బుట్టా రేణుక పత్తికొండ - కె. శ్రీదేవి ఆలూరు - బూసినె విరూపాక్షి మంత్రాలయం - వై. బాలనాగి రెడ్డి కొడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీశ్ నంద్యాల - శిల్పా రవిచంద్రారెడ్డి ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి పాణ్యం - కాటసాని రామ భూపాల్ రెడ్డి డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్స నందికొట్కూరు (ఎస్సీ) - డాక్టర్ సుధీర్ దారా నెల్లూరు కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్ అహ్మద్ ఉదయగిరి - చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి కోవూరు - నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడడి ఆత్మకూరు - మేకపాటి * వెంకటగిరి - గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళీధర్ సర్వేపల్లి - కాకాని గోవర్థన్ రెడ్డి సూళ్లూరుపేట (ఎస్సీ) - సంజీవయ్య కిలివేటి ప్రకాశం చీరాల - కరణం వెంకటేశ్ పర్చూరు - ఎడం బాలాజీ సంతనూతలపాడు - మేరుగు నాగార్జున అద్దంకి - పాణెం చిన హనిమి రెడ్డి కందుకూరు - బుర్రా మధుసూదన్ యాదవ్ కొండేపి - ఆదిమూలపు సురేష్ ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురం - అన్నా రాంబాబు కనిగిరి - దాడెడ్ల నారాయణ యాదవ్ యర్రగొండపాలెం - తాటపర్తి చంద్రశేఖర్ గిద్దలూరు - కొండూరు. నాగార్జున రెడ్డి గుంటూరు వేమూరు - వరికూటి అశోక్ బాబు బాపట్ల - కోన రఘపతి మంగళగిరి - మురుగుడు లావణ్య పొన్నూరు - అంబటి మురళి తాడికొండ - మేకతోటి సుచరిత గుంటూరు వెస్ట్ - విడదల రజినీ తెనాలి - అన్నాబత్తుని శివకుమార్ ప్రత్తిపాడు - మేకతోటి సుచరిత గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా పెద్దకూరపాడు - నంబూరి శంకర్ రావు చిలకలూరిపేట - కావేటి శివ నాగ మనోహర్ నాయుడు సత్తెనపల్లి - అంబటి రాంబాబు వినుకొండ - బోల్ల బ్రహ్మనాయుడు నరసరావుపేట - గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురజాల - కాసు మహేశ్ రెడ్డి రేపల్లె - డాక్టర్ ఈవూరు గణేశ్ కృష్ణా నూజివీడు - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కైకలూరు -దూలం నాగేశ్వరరావు గన్నవరం - వల్లభనేని వంశీ పెనమలూరు - జోగి రమేశ్ పెడన - ఉప్పల రమేశ్ మచిలీపట్నం - పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి (కిట్టు) అవనిగడ్డ - సింహాద్రి రమేశ్ బాబు పామర్రు - కైలి అనిల్ కుమార్ గుడివాడ - కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) విజయవాడ ఈస్ట్ - దేవినేని అవినాశ్ నందిగామ - మొండితోక జగన్మోహన్ రెడ్డి జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు మైలవరం - నర్నాల తిరుపతి యాదవ్ విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్ తిరువూరు - నల్లగట్ల స్వామిదాస్ పశ్చిమగోదావరి దెందులూరు - కొటారు అబ్బాయ్ చౌదరి ఏలూరు - అల్లా కాలి కృష్ణ శ్రీనివాస్(నాని) చింతలపూడి(ఎస్సీ )- కంభం విజయరాజు ఉంగటూరు - పుప్పాల శ్రీనివాసరావు పోలవరం(ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మీ ఉండి - పీవీఎల్ నరసింహరాజు తణుకు - కారుమూరి వెంకటనాగేశ్వరరావు పాలకొల్లు - చవటపల్లి సత్యనారాయణ మూర్తి(డా.బాబు)* భీమవరం - గ్రంధి శ్రీనివాస్ ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ నరసాపురం - ముదునూరి నాగరాజు వర ప్రసాద్ రాజు నిడదవోలు - జీఎస్ నాయుడు కొవ్వూరు(ఎస్సీ) - తలారి వెంకట్రావు గోపాలపురం(ఎస్సీ) - తానేటి వనిత తూర్పుగోదావరి మండపేట - తోట త్రిమూర్తులు రామచంద్రాపురం - పిల్లి సూర్య ప్రకాశ్ గన్నవరం(ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్ కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం(ఎస్సీ) - విశ్వరూప్ పినిపే ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ రాజోలు(ఎస్సీ) - గొల్లపల్లి సూర్యారావు రంపచోడవరం(ఎస్టీ) - నాగులపల్లి ధనలక్ష్మి కాకినాడ సిటీ - ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్దాపురం - దావులూరి దొరబాబు కాకినాడ రూరల్ - కురసాల కన్నబాబు ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు పిఠాపురం - వంగ గీత జగ్గంపేట - తోట నరసింహం తుని - రామలింగేశ్వరరావు దాడిశెట్టి రాజమహేంద్రవరం సిటీ - మార్గాని భరత్ రాజానగరం - జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనపర్తి - డా.సత్తి సూర్యనారాయణరెడ్డి విశాఖపట్నం పెందుర్తి - అదీప్ రాజ్ యలమంచిలి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) నర్సీపట్నం - పెట్ల ఉమాశంకర్ గణేశ్ చోడవరం - ధర్మశ్రీ కరణం మాడుగుల - బూడి ముత్యాల నాయుడు పాయకరావుపేట(ఎస్సీ) - కంబాల జోగులు పాడేరు(ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు అరకు లోయ(ఎస్టీ) - రేగం మత్స్యలింగం విశాఖ ఈస్ట్ - ఎంవీవీ సత్యనారాయణ విశాఖ వెస్ట్ - ఆడారి ఆనంద్ విశాఖ సౌత్ - వాసుపల్లి గణేశ్ విశాఖ నార్త్ - కేకే రాజు గాజువాక - గుడివాడ అమర్‌నాథ్ భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్) అనకాపల్లి - మలసాల భరత్ కుమార్ విజయనగరం పార్వతీపురం - అలజంగి జోగారావు సాలూరు - పీడిక రాజన్న దొర కురుపాం - పాముల పుష్పశ్రీ వాణి ఎస్ కోట - కదుబండి శ్రీనివాస రావు విజయనగరం - కోలగంట్ల వీరభద్రస్వామి నెల్లిమర్ల - బడుకొండ అప్పలనాయుడు బొబ్బిలి - శంబంగి చిన్నప్పలనాయుడు చీపురపల్లి - బొత్స సత్యన్నారాయణ గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య శ్రీకాకుళం పాలకొండ - విశ్వసరాయి కళావతి శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్ టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్ ఆముదాలవలస - తమ్మినేని సీతారాం పాతపట్నం - రెడ్డి శాంతి పలాస - సీదిరి అప్పలరాజు ఇచ్చాపురం -పిరియా విజయ రాజాం - తాలె రాజేశ్ ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్

కవిత అరెస్టుతో తెలంగాణకు ఏం సంబంధం!?

బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ముఖ్యంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత వారి బలహీనతలే కాదు, తప్పిదాలూ జనంలో బాగా ఎక్స్ పోజ్ అయిపోయాయి. అధికారంలో ఉండగా వెటకారం పాళ్లు ఎక్కువగా కలిపి వారు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వారికే బూమరాంగ్ అవుతూ జనంలో వారిని నవ్వుల పాలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రగతిలోని ప్రతి అడుగులోనూ తన ముద్ర వేసిన చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో సహజంగానే హైదరాబాద్ ప్రగతికి చంద్రబాబు వేసిన బాటల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది ఆవేదనతో ఆగ్రహంతో బయటకు వచ్చి ఆందోళన బాట పట్టారు.  అయితే రాజకీయ కారణాలతో నో, లేక చంద్రబాబు అభివృద్ధి ముద్రలను చెరిపివేసి తన పేరు లిఖించుకోవాలన్న తాపత్రేయం లేదా దురాశతోనో నాడు ఆ ఆందోళనలను అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఎగతాళి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఆందోళనలేంటని చిరాకు పడ్డారు. కావాలంటే ఏపీ వెళ్లి ఆందోళనలు చేసుకోండి, ఇక్కడ మాత్రం అంగీకరించం అంటూ రుసరుసలాడారు.  సరే అప్పట్లో కేసీఆర్ అతికి ఆ ఎన్నికలలోనే ప్రజలు తమ ఆగ్రహశక్తి ఎంతటిదో చూపించారు. అది వేరే సంగతి. కానీ నాడు ఆయన అహంకారంతోనో, అతిశయంతోనే చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే గట్టిగా.. ఇంకా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా తగిలాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన సొంత సోదరి,  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిపైనే ఇప్పుడు కాంగ్రెస్ సెటైర్లు గుప్పిస్తోంది. నెటిజన్లు ఓ రేంజ్ లో కేటీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి తెలంగాణతో సంబంధం ఏమిటి? ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా కావాలంటే ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేసుకోండి, తెలంగాణలో మాత్రం వద్దు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబును ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఉటంకించారు.  ఇక నెటిజనులు కూడా ఓ రేంజ్ లో కేటీఆర్ ను తమ కామెంట్లతో ఓ ఆటాడుకుంటున్నారు. కవిత అరెస్టును నిరసిస్తు ఆయన ఈడీ ఆధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో క్లిప్పింగ్ ను వైరల్ చేస్తూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేసినప్పుడూ, ధర్నాలూ, ఆందోళనలను అణచివేసినప్పుడూ మీకు కోర్టులు గుర్తురాలేదా సార్!.. అంటూ ఫన్నీ ఎమోజీలతో అంతర్జాలాన్ని షేక్ చేసేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగిన ఐటీ ఉద్యోగులపై ప్రదర్శించిన జులుంను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 

బిజెపి ప్రచార గీతం విడుదల

లోక సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే భారతీయ జనతా పార్టీ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ప్రచారగీతాన్ని విడుదల చేయకపోవడం గమనార్హం  లోక్ సభ ఎన్నికలకు మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్తూ.. మేమంతా మోదీ కుటుంబమే అంటూ వారు పాడడం వీడియోలో కనిపిస్తుంది. ఇటీవల ఇండియా కూటమి బీహార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. మోదీకి కుటుంబమే లేదు, ఇక కుటుంబ సమస్యలు ఏం తెలుస్తాయంటూ విమర్శించారు.  దీనిపై మోదీ ఘాటుగా స్పందిస్తూ.. దేశంలోని 150 కోట్ల మంది జనం తన కుటుంబమేనని చెప్పారు. ఈ విమర్శను అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ‘మోదీ కా పరివార్’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అంతా తమ సోషల్ మీడియా ఖాతాలలో మే మోదీ కా పరివార్ అంటూ డీపీలు పెట్టుకున్నారు. తాజాగా ఇదే విమర్శను బీజేపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు తామంతా మోదీ కుటుంబమేనని చెబుతున్నట్లు ప్రచార గీతాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది.

పార్టీ పేరు మార్పుతోనే పతనం ప్రారంభమైందా?

కేసీఆర్ కుమార్తె అరెస్టు బీఆర్ఎస్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. కవిత అరెస్టునకు వ్యతిరేకంగా జనంలో ఎటువంటి స్పందనా కనిపించకపోవడం, ఆ పార్టీ నాయకత్వాన్నే కాదు, పార్టీ శ్రేణులను కూడా కలవరపరుస్తోంది. అన్నిటికీ మించి  తెలంగాణ సమాజం కవిత అరెస్టును ఒక సాధారణ విషయంగానే పరిగణించడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికే ఆమె అరెస్టు ఆలస్యమైందన్న భావన వ్యక్తం కావడంతో ఆమె అవినీతికి పాల్పడిందన్న విషయాన్ని జనం నమ్ముతున్నారా అన్న అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం, ధరణి.. ఇలా బీఆర్ఎస్ సర్కార్ పై వెల్లువెత్తిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు ఔట్ కమ్ ఆ పార్టీ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చినా జనం ఇలానే ఔను అవినీతి జరిగే ఉంటుందంటూ లైట్ గా తీసుకుంటారా? అన్న భయం బీఆర్ఎస్ నాయకత్వంలో బలంగా వ్యక్తం అవుతోంది.   ఈ పరిస్థితి అసలే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ అండ్ కోను మరింత ఒత్తిడికి లోను చేస్తుందనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి క్యాడర్ లో పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీల్లోకి సర్దుకుంటున్న పరిస్థితుల్లో  పార్టీ క్యాడర్ లో పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకూ చేసిన తప్పిదాలంటూ పలు అంశాలపై విస్తృత చర్చ మెదలైంది.  ఇప్పటికే రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సర్వేలన్నీ ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. దీంతో పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు అన్న పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. గతంలో పార్టీ అధినాయకత్వం దర్శనం కోసం ప్రగతి భవన్ గేట్ల ముందు పడిగాపులు కాసిన నాయకులు.. ఇప్పుడు అధినాయకత్వం ఒకసారి కలవండి అని బతిమలాడుతున్నా రావడానికి సుముఖత చూపడం లేదు. ఇటువంటి తరుణంలో కవిత అరెస్టు ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని మరింతగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల కోసం గెలుపు వ్యూహాలు రచించడం కంటే.. తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేయడమే కేసీఆర్ కు ప్రథమ ప్రాధాన్యతగా మారనుందనడంలో సందేహం లేదు.   దీంతో బీఆర్ఎస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. ఆ చర్చలో   కేసీఆర్ చేసిన తప్పులు ఇవీ అంటూ కొన్ని ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. వాటిలో మరీ ప్రధానంగా పార్టీ పేరు మార్పు అంశంపై పార్టీ క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచీ పార్టీకి ప్రజలతో సంబంధం తెగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తన సొంత రాజకీయ ఆకాంక్షల కోసం పార్టీ భవిష్యత్ ను ఫణంగా పెట్టారన్న ఆగ్రహం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది . జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు కేసీఆర్ కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ప్రజలలో తనకు గుర్తింపు తెచ్చిన, కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన అమ్మలాంటి పార్టీ పేరును మార్చేశారనీ, ఆ నిర్ణయమే కేసీఆర్ ను అధికారం నుంచి కింద పడేసిందని అంటున్నారు.  కేసీఆర్‌  పార్టీ పేరును మార్చడమే ఆయన పతనానికీ, పార్టీ ఇబ్బందులకూ కారణమైందని చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన తరువాత పార్టీ పరాజయం పాలు కావడం ఎంత మాత్రం యాధృచ్ఛికం కాదని జనం అంటున్నారు. తెరాస పేరు మారగానే అప్పటి వరకూ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం, పార్టీకీ, ప్రజలకు ఉన్న అనుబంధం తెగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే అభిప్రాయంతో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తరువాత ఒకరిగా కారు దిగిపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోగలుగుతుందా? మనుగడ సాగించ గలుగుతుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా  మార్చాలన్న డిమాండ్ పార్టీ క్యాడర్ నుంచి బలంగా వస్తోంది.   మొత్తం మీద కనుసైగతో  పార్టీని శాసించిన కేసీఆర్ ఇప్పుుడు క్యాడర్ కన్నెర్రకు గురి కావలసిన పరిస్థితికి వచ్చారంటే అది స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బిఆర్ఎస్ కు మరో షాక్ ... కెటీఆర్ పై కేసు నమోదు 

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు... ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత వెంట కెటీఆర్ , హరీష్ రావు ఉన్నారు. కుటుంబసభ్యులంతా నిన్నటి నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ్ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు కంప్లైట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈడీ అధికారులు. మరోవైపు కవిత అరెస్ట్ చేసిన సమయంలో ఈడీ అధికారిణి భానుప్రియ మీనా తో పాటు మరికొందరు అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ విధులకు అడ్డుతగిలారనే ఈడీ అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. బీజేపీనే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. మరోవైపు కవిత అరెస్ట్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది

ఎన్నిక‌ల వేళ క‌విత అరెస్ట్.. లాభం ఎవరికి?

దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శ‌నివారం (మార్చి 16) మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు ఈసీ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌నుంది.  తెలంగాణ‌లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌రంలోకి ఇప్ప‌టికే దూకేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌నుసైతం ప్ర‌క‌టించాయి. తెలంగాణ స‌మాజం మొత్తం ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోయింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్ లోని క‌విత నివాసంలో జాయింట్ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు సోదాలు నిర్వ‌హించారు. సోదాల అనంత‌రం ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి త‌ర‌లించారు. అరెస్టుకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ 14పేజీల మెమో ఇచ్చారు. ఈడీ అధికారులు అరెస్టుచేసి తీసుకెళ్తున్న స‌మ‌యంలో  క‌విత బీఆర్ఎస్ శ్రేణుల‌కు అభివాదం చేస్తూ, ఉత్సాహంగా క‌నిపించారు. అయితే, ఎన్నిక‌ల వేళ క‌విత అరెస్టు ఏ పార్టీకి లాభం మేలుచేస్తుంద‌న్న ప్ర‌శ్న‌ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.  తెలంగాణ రాజ‌కీయాల్లో క‌విత అరెస్టు సంచ‌ల‌నంగా మారింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఆమె అరెస్టు అధికార‌ కాంగ్రెస్ పార్టీకి  ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో  2022 ఫిబ్ర‌వ‌రి 21న క‌విత‌కు నోటీసులు ఇవ్వ‌గా.. అదే నెల 26న వ్య‌క్తిగ‌తంగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని క‌విత‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసులు ఇచ్చిన నాలుగు వారాల‌కు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ప‌లు ద‌ఫాలుగా క‌విత‌ను అధికారులు విచారించి కీల‌క స‌మాచారాన్ని సేక‌రించారు. అయితే, గ‌తంలోనే క‌వితను అరెస్టు చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తెలంగాణ‌లోని బీజేపీ నేత‌లు సైతం క‌విత అరెస్టు ఖాయ‌మ‌ని గ‌త ఎన్నిక‌ల ముందు విస్తృత ప్ర‌చారం చేశారు. కానీ, క‌విత అరెస్టు జ‌ర‌గ‌లేదు. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎన్నిక‌ల‌కు ముందు క‌విత అరెస్టు ఖాయ‌మ‌ని బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డి లాంటి నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. కానీ, క‌విత అరెస్టు కాక‌పోవ‌టంతో బీఆర్ ఎస్‌, బీజేపీ ఒక్క‌టేన‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి బలంగా వెళ్లి  బీజేపీ నష్టపోయింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టే అని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కాంగ్రెస్ పార్టీ విజ‌యవంతం అయింది. కాంగ్రెస్ నేత‌ల మాట‌లను ప్ర‌జ‌లు న‌మ్మ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉంది. బీజేపీ నేత‌లు అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు క‌విత‌ అరెస్టు ఖాయ‌మ‌ని ప‌దేప‌దే చెప్పారు. కానీ, ఎన్నిక‌ల నాటికి క‌విత‌ అరెస్టు కాక‌పోవ‌టంతో బీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు సిఫ్ట్ అయింద‌ని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే క‌విత‌ను అరెస్టు చేసి ఉంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక  ఓటు బీజేపీవైపు మ‌ళ్లీ ఆ పార్టీ  లబ్ధి పొంది ఉండేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు ఫ‌లితాల అనంత‌రం విశ్లేషించారు. అయితే  లోక్‌స‌భ ఎన్నికల ప్ర‌చారంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్క‌టేన‌ని కాంగ్రెస్ విస్తృత ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌జ‌లు సైతం కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక పార్ల‌మెంట్ స్థానాల‌ను క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి.  మ‌రోవైపు బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూక‌డుతున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు క‌లిసి క‌విత అరెస్టును తెర‌పైకి తెచ్చాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.  కవిత అరెస్టు కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో భాగమని విమర్శిస్తున్నారు.  కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముందు లిక్క‌ర్ స్కాంలో క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తార‌ని, ఫ‌లితంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్ర‌జ‌ల్లో ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్నాయ‌ని  ఆరోపించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆయన ఆరోపించినట్లుగానే  ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌కు ముందురోజు క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసింది.  క‌విత అరెస్టు ద్వారా.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ల‌బ్ధిపొందాలని చూస్తోందని అంటున్నారు.  ఇన్నాళ్లు బీఆర్ఎస్, బీజేపీ ఒక‌టేన‌ని కాంగ్రెస్ ప్ర‌చారం చేసుకుంటూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌విత అరెస్టుతో.. గ‌తంలో కాంగ్రెస్‌వైపు వెళ్లిన‌ బీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు బ్యాంకు ప్ర‌స్తుతం బీజేపీవైపు మళ్లుతుందన్నది కమలనాథుల భావనగా చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీఆర్ఎస్ కు సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఇచ్చేందుకు కూడా కవిత అరెస్టు అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించిందనీ అంటున్నారు.   క‌విత అరెస్టు అయిన కొద్దిసేప‌టికే ఆ పార్టీనేత‌ హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో క‌విత అరెస్టుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని బీఆర్ఎస్ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల వేళ సానుభూతి పొంద‌డం ద్వారా  మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాల‌ని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నది. ఇలా కాంగ్రెస్ ను దెబ్బకొట్టడం కోసం ఇరు పార్టీలూ అంటే బీజేపీ, బీఆర్ఎస్ లు కవిత అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. మరి  బీఆర్ ఎస్‌, బీజేపీ వ్యూహానికి కాంగ్రెస్ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే.

 లిక్కర్ స్కాం కేసులో  కేజ్రీవాల్ కు ఊరట 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన ఎనిమిది సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో, ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆయన కోర్టు నుంచి నేరుగా నివాసానికి బయల్దేరారు. కోర్టు బెయిల్ ఇవ్వడం కేజ్రీవాల్ కు పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరటగా భావించవచ్చు. అయితే, ఆ సమన్లను దాటవేస్తున్న కేజ్రీవాల్.. రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని ఆరోపణలు చేస్తున్నారు. కాగా, ఢిల్లీ మధ్యం కేసులో ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ సూచించారు. అంతేకాదు, కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ సి ఎం కెసీఆర్ కుమార్తె కవితను నిన్ననే ఈ కేసులో అరెస్ట్ చేశారు. 

కనీస సానుభూతి కూడా దక్కించుకోలేకపోయిన వర్మ

పిఠాపురం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆ తరువాత చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా పార్టీ శ్రేణులలోనే కాదు, సామాన్య ప్రజానీకంగా  కూడా కనీస సానుభూతికి నోచుకోక ఒంటరిగా మిగిలిపోయారు.  పిఠాపురం నియోజకవర్గం నుంచి  తాను పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్  ఇలా ప్రకటించారో లేదో.. వర్మ అలా తెలుగుదేశం అధిష్ఠానంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. పార్టీ జెండాలు దగ్ధం చేశారు. జనసేన అధినేతపైనా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై అనుచిత విమర్శలకు తెగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. దీంతో అప్పటి వరకూ వర్మ మీద ఉన్న అంతో ఇంతో సానుభూతి కానరాకుండా పోయింది.   టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో ఆయన, ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసంపై స్థానికులలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే.. వర్మపై పాపం ఇంత కాలం పార్టీ కోసం కష్టపడినా పోత్తులో భాగంగా టికెట్ దక్కకుండా పోయిందే అన్న సానుభూతి వ్యక్తమైంది. అయితే వర్మ ఆయన అనుచరులు నియోజకవర్గంలో సృష్టించిన విధ్వంసం, పవన్ కల్యాణ్, చంద్రబాబులను ఉద్దేశించి ప్రయోగించిన అనుచిత భాషతో ఆ సానుభూతి ఒక్కసారిగా ఆవిరైపోయింది. దీంతో ఆయన అంత కాలం నియోజకవర్గంలో కష్టించి సంపాదించుకున్న సానుకూతల, సదభిప్రాయం ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ఇప్పుడు పార్టీ శ్రేణులే కాదు, ఆయన వెంట నడిచేందుకు అనుచరులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఒక వేళ ఇండిపెండెంట్ గా పిఠాపురం నుంచి పోటీకి దిగినా ఆయన తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లుకానీ, కాపుల ఓట్లు కానీ పడే అవకాశం ఇసుమంతైనా లేవంటున్నారు. అయితే గియితే ఆయనకు వైసీపీ సానుభూతి పరుల ఓట్లు పడే అవకాశం మాత్రమే మిగిలిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేయనున్నారన్న ప్రకటన వెలువడిన వెంటనే చంద్రబాబు వర్మకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరారు. అయితే అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇలా ఉండగా ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ తహతహలాడుతోంది. వర్మను పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానాలు పంపుతోంది. మొత్తం మీద వర్మ చేజేతులా నియోజకవర్గంలో తన పట్ల ప్రజలలో ఉన్న సదభిప్రాయాన్ని పోగొట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కవిత అరెస్టు.. మీడియాకు ముఖం చాటేసిన కేసీఆర్, కేటీఆర్

బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు.. కీలక సమయాల్లో మౌనం వహించడం పార్టీ క్యాడర్ లోనూ, నాయకుల్లోనూ కూడా వారిపై నమ్మకాన్నే కాదు, పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న విశ్వాసాన్నీ కూడా దెబ్బతీస్తున్నాయి. తాజాగా కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శుక్రవారం (మార్చి 15)అరెస్టు చేసి హస్తిన తరలించింది. ఆ సందర్భంగా కవిత నివాసం వద్ద ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగి హడావుడి చేసిన కేటీఆర్.. ఆ తరువాత మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. కవిత నివాసంలో ఈడీ సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. అక్కడ నుంచి నేరుగా కవిత నివాసానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. తరువాత చిక్కుల్లో పడతారంటూ హెచ్చరించారు. అయితే అవి ఉడుత ఊపులుగానే ఉన్నాయి. ఈడీ అధికారులు వాటిని ఖాతరు చేయలేదు. వారు అనుకున్నది అనుకున్నట్లు చేసేశారు. కవితను అదుపులోనికి తీసుకుని హస్తినకు తరలించారు. ఆ సందర్భంగా పంచనామా రిపోర్టులో కేటీఆర్ తీరుపై కూడా వ్యాఖ్యలు చేశారు. సరే కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆమె నివాసం ముందు కొంత హడావుడి చేశాయి.  ఈ తతంగం అంతా అయిపోయిన తరవాత శనివారం(మార్చి 16) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని హరీష్ రావు మీడియా ఎదుట వెల్లడించారు. ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ కనిపించలేదు. అంతే కాదు.. కవిత అరెస్టును ఖండిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారే తప్ప బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే ఆయన కూడా మీడియాకు ముఖం చాటేశారు. తన కుమార్తె అరెస్టును ఖండిస్తూ మీడియా ఎదుటకు రావడానికి ఆయన సుముఖత చూపలేదు. దీంతో కేసీఆర్, కేటీఆర్ కాడె వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికీ మించి కవిత అరెస్టునకు నిరసనగా ఆమె నివాసం ఎదుట బీఆర్ఎస్ నేతల ఆందోళన వినా రాష్ట్రంలో మరెక్కడా నిరసనలు కనిపించలేదు. జనం ఈ అరెస్టుపై పెద్దగా స్పందించినట్లు కనిపించదు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించాల్సిన కేసీఆర్, కేటీఆర్ కనీసం మీడియాకు కూడా ముఖం చూపించకపోవడంపై పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేడే

18వ లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం(మార్చి 16) మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఈ మేరకు ఈసీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం ఈసీ స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే నిర్వహించాలని ఈసీ నిర్ణయిస్తే ఈ రోజు సార్వత్రిక ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకూ షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా జమ్మూ కాశ్మీర్  అసెంబ్లీ ఎన్నికలు వేరుగా నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన క్షణం నుంచీ దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలు మే లోగా పూర్తి కావాల్సి ఉంది. గత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  2019 మార్చి 10న విడుదలైన సంగతి తెలిసిందే.  అలాగే 2019 సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి. అయితే 2024 ఎన్నికలకు  కేంద్ర ఎన్నికల సంఘం గత ఎన్నికల కంటే పది రోజులు ఆలస్యంగా షెడ్యూల్ పూర్తి చేసింది. దీంతో ఈ సారి ఎన్నిదశలలో ఎన్నికలు నిర్వహిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.     

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన  తిరుమలలో   శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని  మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం,   వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ బ్రేక్‌ వేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. దానిలో భాగంగా.. ప్రతి రోజు సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా  రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వారి పరివారంతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. అందులోనూ.. ప్రజాప్రతినిధులు వారి అనుచరవర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటాయి. ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు స్లాట్స్ జారీ చేస్తుంటారు. ఇటు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా వీఐపీ దర్శనాల కోటా ఉంటుంది. అయితే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం (మార్చి 16) సాయంత్రం 3 గంటలకు వెలువడుతుంది.  ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి  వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది. ఆ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే సమాచారం అందించింది.  సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే   బ్రేక్ దర్శనం కల్పిస్తారు