భారతీ రెడ్డి @ 400 కేజీ గోల్డ్?
posted on Nov 20, 2025 @ 11:18AM
భారతీరెడ్డి 400 కిలోల బంగారం కొన్నారంటూ ఆరోపణించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అయితే ఇందులో వాస్తవమెంత? అవాస్తవమెంత? అన్న విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, మరో కుంభకోణం ఏదైనా సరే జగన్ అండ్ కో.. బ్లాక్ మనీ వైట్ చేయడానికి మూడు నాలుగు మార్గాలను ఎంపిక చేసుకుంటే వాటిలో గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ ఒకటి. ఈ విషయం రాజ్ కేసిరెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చింది.
జ్యువెలరీ షాప్స్, రియల్ ఎస్టేట్, యాడ్ ఏజెన్సీస్, ఆపై దేశ విదేశాల్లో కంపెనీల స్థాపన వంటి దారుల గుండా వీరు తమ తమ బ్లాక్ మనీ వైట్ చేసేందుకు శాయశక్తులా కృషిచేసినట్టు రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. అయితే ఈ మొత్తం బినామీల ద్వారా జగన్ కి చేరేలా పకడ్బందీ వ్యూహం ప్రకారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం మద్యం సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్ మెంట్ కు రెడీ అవుతోంది. ప్రభుత్వ అనుమతితో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించనుంది.
ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం, ఇతర స్కాముల ద్వారా కూడబెట్టిన ఆస్తిపాస్తులు డబ్బు దస్కం జగన్ కి చేరేలా, ఆపై బంగారం వంటివి భారతీరెడ్డికి చేరేలా వైసీపీలోని అక్రమార్కులంతా కలిసి స్కెచ్ వేశారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒకప్పుడు తన భర్తను తాను ఈ రాజకీయాలే వద్దని చెప్పానని భారతీరెడ్డి పలు సందర్బాలలో చెప్పారు. ఇక్కడుంటే జైల్లో పెడతారు కాబట్టి మనం ఎక్కడైనా విదేశాలకు వెళ్లి హాయిగా ఉందామని సూచించాననీ చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఆయన వినలేదని భారతీరెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. జగన్ కూడా ఆయన తండ్రిలా పేద ప్రజల దేవుడిగా మారాలని భావించారనీ, ఈ విషయాన్ని ఆయన తనతో చెప్పారనీ కూడా గతంలో భారతీ రెడ్డి చెప్పారు. అటువంటి భారతీ రెడ్డి తాజాగా బంగారం మొత్తం నిల్వలు తన పరం చేసుకున్నట్టుగా ఆదినారాయణరెడ్డి వంటి వారు మరి చూడాలి ఈ బంగారాన్ని ఎలా రికవరీ చేస్తారో పోలీసులు. చెవిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసినట్టు వీటిని కూడా చేస్తారేమో చూడాలి మరి.