గడల శ్రీనివాసరావు రూటే సెపరేటు.. పార్టీ ఏదని కాదు.. పోటీ చేశానా లేదా అనేదే ముఖ్యం!

తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్రర్  డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్పిన అవసరం లేదు. బాధ్యత గలిగిన పదవిలో ఉండి ఆయన చేసిన విన్యాసాలు అందిరీ తెలిసినవే.  రాజకీయాల్లో ప్రవేశించి పాపులర్ అయిపోవాలన్న తహతహతో.. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గా తన హోదాను, బాధ్యతనూ మరికి ఫక్తు బీఆర్ఎస్ కార్యకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రముఖంగా వచ్చింది.  బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కొత్తగూడెం శాసనసభ సీటు ఆశించి ఆయన భంగపడ్డారన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గా ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌  కాళ్లు మొక్కి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక కరోనాకు మందులు, వ్యాక్సిన్ల అవసరం లేదనీ, ఏసుక్రీస్తును నమ్ముకుంటే చాలనీ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లె పెను సంచలనం సృష్టించాయి.  వివాదంగా మారింది.   వాస్తవానికి హెల్త్ డైరెక్టర్ గా ఆయన ఉన్నంత కాలం వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారా అన్నట్లుగా ఆయన వ్యవహార తీరు ఉండేది.    శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయనీ, కరోనా నుంచి విముక్తి చెందామనీ ఆయన చేసిన వ్యాఖ్యలు, అంతటితో ఊరుకోకుండా..    క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందంటూ చేసిన ఉద్బోధ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తి గత విశ్వాసం కావచ్చు. కానీ, ఆయన ఒక అధికారిగా ఉండి చేసిన వ్యాఖ్య అలాగే క్రైస్తవ మత ప్రచారానికి నడుంబిగించాలంటూ ఇచ్చిన పిలుపుపై పెద్ద ఎత్తున విమర్శలూ వచ్చాయి. అలాగే  అంతకు ముందు ఆయన బహిరంగంగా అప్పటి  ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా పతాక శీర్షికలకు ఎక్కారు. అలా కాళ్లు మొక్కడంపై వచ్చిన విమర్శలకు ఆయన కేసీఆర్ తన తండ్రిలాంటి వారు, ఆయన కాళ్లు మొక్కడం తప్పెలా అవుతుందంటూ సమర్ధించుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ముందు రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.  దీంతో   ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ అప్పట్లో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే అప్పట్లో ఆయన కొత్త గూడెం నుంచి ఎన్నికల బరిలో దిగాలన్న ఆకాంక్షతో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ తో అంటకాగి అప్రతిష్ట పాలయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు స్థాన భ్రంశం కలిగింది అది వేరే విషయం. అటువంటి డాక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు.. తాజాగా తనకు ఖమ్మం లేదా సికిందరాబాద్ లోక్ సభ స్థానం కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన పోటీ చేస్తానని చేసుకున్న దరఖాస్తు బీఆర్ఎస్ పార్టీకి కాదు. తన తండ్రి వంటి వారు అని చెప్పుకున్న కేసీఆర్ గద్దె దిగగానే గడల శ్రీనివాసరావుకు ఆయన చేదైపోయారు. అందుకే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు దగ్గరవ్వడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెఃస్ పార్టీకి తన దరఖాస్తును అనుచరుల ద్వారా పంపించారు. అయితే ఇక్కడా ఆయన ఆశలు నెరవేరే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ఖమ్మం లేదా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఆ రెండింటిలో ఖమ్మం ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ లో  చాలా చాలా గట్టి పోటీ ఉంది. ఆ స్థానం నుచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నాయకుడు వీహెచ్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి రేసులో ఉన్నారు. వారు ముగ్గురినీ కాదని కాంగ్రెస్ ఈయనకు టికెట్ ఇవ్వడం దాదాపు అసాధ్యం.  అయినా సర్వీసులో ఉంటూ  అప్పటి అధికార బీఆర్ఎస్ తో అంటకాగడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నశ్రీనివాసరావు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న ఆయన ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.  . తాను ప్రజాజీవితంలో ఉండాలని ఎల్లవేళలా కోరుకున్నానని, అందువల్ల ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించానని, కానీ గత ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు.  తనకు కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తాననీ లేకపోతే తిరిగి ఉద్యోగంలో చేరిపోతాననీ పాపం ఏ బేషజం లేకుండా చెప్పేసుకున్నారు. 

సుప్రీంలో కవిత పిటిషన్ వాయిదా 

జాతీయస్థాయిలో  ఇండియా  కూటమిని దెబ్బకొట్టడానికి బిజెపి, బిఆర్ఎస్  కల్సిపోయినట్లు వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితురాలైన కల్వకుంట్ల కవిత మీద తమ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేత ఒత్తిడి పెంచుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన బిఆర్ఎస్ తో జతకడితే మొదటికే మోసం వస్తుందని బిజెపి భావించినట్లుంది. కవితపై ఈడీ  సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల పై తను  దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సోమవారం విచారణ మొదలుకాగా.. ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే, గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు దేశం శాసనసభ్యుల వాకౌట్ 

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేమని డిసైడ్ అయినట్టుంది.  ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు. ప్రతపక్షాల గొంతునొ క్కేయాలని వైసీపీ  ప్రభుత్వం మొదటి నుంచే భావిస్తుంది. ప్రతిపక్షమే లేకుండా నియంత పాలన సాగించాలని ముఖ్యమంత్రి జగన్ భావనలా కనిపిస్తోంది. సోమవారం టిడిపి ఎమ్మెల్యేలు  అసెంబ్లీలో వాకౌట్ చేశారు.     వైసీపీ పని అయిపోయిందని హిందూపురంటిడిపి శాసనసభ్యులు బాలకృష్ణ ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. . ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పడంతో వివాదం రాజుకుంది. గవర్నర్ ప్రకటన టిడిపి నొచ్చుకుంది.గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని విమర్శించారు. వైసీపీ పాలన అంతా డొల్లా అని, సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందలేదని పేర్కొన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని, విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడం దారుణం అని, ఆయన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కేవలం రాజకీయ లబ్దికోసమే అని అన్నారు. మెగా డిఎస్సీ కాదు అది దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు.  అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. 

రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం!

రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం.. ఇదే కొటేష‌న్ తో సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగిస్తుంటే.. తెలంగాణ‌లో సీఎం రేవంత్ త‌న‌దైన శైలిలో అద్భుత‌ పాల‌న సాగిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్ల‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులు సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతుంట‌డం గ‌మ‌నార్హం.  ఇంత‌కీ.. రేవంత్‌, జ‌గ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ఎందుకు చ‌ర్చ జ‌రుగుతోంది?  రేవంత్ రెడ్డి చేసిన ప‌నేంటి.. జ‌గ‌న్ చేయ‌ని ప‌నేంటి?  అంటే..  ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు, సినిమా వాళ్ల‌కు  అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా హీరోలంటే ప్ర‌జ‌లు ఎంతో గౌర‌విస్తారు. హీరోల‌కు అభిమాన సంఘాల‌తోపాటు.. వారి పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు సైతం చేస్తుంటారు.   రాజ‌కీయ పార్టీల గెలుపోట‌ముల్లో సినీ హీరోల ప్ర‌భావం కూడా ఉంటుంది. ఇలాంటి ఘట‌న‌లు అనేకం ఉన్నాయి. అందుకే చంద్ర‌బాబు నుంచి వైఎస్ఆర్‌, కేసీఆర్‌, ప్ర‌స్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు సినిమా వాళ్ల‌ను ఎంతో గౌర‌వంగా చూసుకుంటూ వ‌చ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. చిరుతో పాటు మాజీ ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు కూడా ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు వ‌రించింది. మ‌రి కొంద‌రు తెలుగు వారికి ప‌ద్మ శ్రీ అవార్డులు ద‌క్కాయి. ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డులు ద‌క్కిన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. తాజాగా చిరు, వెంక‌య్య నాయుడుతో పాటు ప‌ద్మ శ్రీ అవార్డుల గ్ర‌హీత‌ల‌ను రేవంత్ స‌ర్కార్ స‌న్మానించింది. అంతేకాక‌, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌కు రూ. 25ల‌క్షలు, నెల‌నెలా రూ. 25వేల పెన్ష‌న్ సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల నుంచి రేవంత్ స‌ర్కార్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.  స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి, వెంక‌య్య నాయుడు సైతం రేవంత్ స‌ర్కార్ స్పందించిన తీరుప‌ట్ల ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రేవంత్ పాల‌న తీరును పొగిడారు. మ‌రో వైపు రాజ‌కీయాల‌కు అతీతంగా అవార్డు గ్ర‌హీత‌ల‌కు స‌న్మాన  కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ‌ ప‌రంగా నిర్వ‌హించ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో రేవంత్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. రేవంత్   సంస్కారానికి ఇది నిద‌ర్శ‌నం అంటూ సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అదే స‌మ‌యంలో ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ పై సోష‌ల్ మీడియాలో  రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం అంటూ కామెంట్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇక్క‌డ విశేషం ఏమిటంటే.. సోషల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులుకూడా మ‌ద్ద‌తు తెలుపుతుంన్నారు. ఇంత‌కీ.. జ‌గ‌న్ స‌ర్కార్ పై ఎందుకు అంత వ్య‌రేఖ‌త వ్య‌క్త‌మ‌వుతుందంటే.. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో పాల‌న సాగించిన అన్ని ప్ర‌భుత్వాలు సినిమా వాళ్ల‌పైన‌, వెంక‌య్య నాయుడు లాంటి పెద్ద‌వారిపై ఎంతో మ‌ర్యాద‌గా న‌డుచుకుంటూ వ‌చ్చాయి. కానీ, ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సినిమా వాళ్ల‌పై చిన్న‌చూపుతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న ఉంది. మ‌రోవైపు వెంక‌య్య నాయుడు లాంటి వారిపై వైసీపీ నేత‌లు బాహాటంగానే విమ‌ర్శ‌లుచేసి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు.  ముఖ్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సినిమా వాళ్లంటే చాలా చిన్న‌చూపు అనే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో, సినీ వ‌ర్గాల్లో ఉంది. గ‌తంలో టికెట్ల రేట్ల నుంచి మొద‌లు పెడితే ప్ర‌తి విష‌యంలో సినిమా వాళ్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఎంత‌టి పేరున్న సినిమా హీరోలైనా ప్ర‌భుత్వానికి ఏమైనా సూచ‌న చేద్దామ‌ని చూసినా సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేయించి బెంబేలెత్తించేశారు. అంత‌టితో ఆగ‌లేదు.. సినీ పెద్ద‌ల‌ని కాళ్ల బేరానికి ర‌ప్పించుకున్నారు జ‌గ‌న్‌. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారుసైతం జ‌గ‌న్ ముందు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేసుకోవాల్సి వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవితో చేతులు జోడించి మొక్కించుకొని వీడియో రిలీజ్ చేసి ఆనందం పొందారు. ఈ ఘ‌ట‌నతో జ‌గ‌న్ తీరుపై అప్పట్లో వైసీపీ శ్రేణుల్లోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. కానీ, ఎవ‌రూ బ‌హిరంగంగా ఇది త‌ప్పు అని చెప్పే సాహ‌సం చేయ‌లేదు. చిరంజీవిలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లో విఫ‌లం అయి ఉండొచ్చు. కానీ, ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా.. ఆయ‌న‌కున్న అభిమానం   చెక్కుచెద‌ర్లేదు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూసే సినిమా రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌న్  పురస్కారంతో గౌర‌వించింది. అవార్డులు ప్ర‌క‌టించింది.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి తెలుగు వారికి ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ అవార్డుల రావ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాక శిల్ప‌క‌ళా వేదిక‌గా చిరు, వెంక‌య్య‌నాయుడు, ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. మ‌రోవైపు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మాత్రం  అవార్డు గ్ర‌హీత‌ల‌కు క‌నీసం క‌లిసి అభినంద‌న‌లు కూడా తెలపలేదు.  దీనిని ఎత్తి చూపుతూనే సినీ, రాజకీయవర్గాల్లో జగన్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం అంటూ విస్తృతంగా ట్రోల్ అవుతోంది.  

రాజ్యసభ ఎన్నికల రూపంలో జగన్ కు ముందస్తు గండం!?

ఏపీ ముఖ్యమంత్రి మరో సారి అధికారంలోకి రావడం ఎలాగో తెలియక ఆందోళనలో ఉండి.. సిట్టింగుల మార్పు ప్రయోగంతో ఉన్న అవకాశాలను చేజార్చుకుంటూ బెంబేలెత్తుతుంటే.. మరో వైపు అసలు పోరుకు ముందు జరిగే రాజ్యసభ  ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టి గెలిచి జగన్ కు చావు దెబ్బ కొట్టాలన్న వ్యూహాలతో తెలుగుదేశం, జనసేన కూటమి కార్యాచరణ ప్రారంభించింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బాబలాలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలలోనూ వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. అయితే అలా గెలిచేస్తామన్న నమ్మకం మాత్రం అధికార వైసీపీలో ఇసుమంతైనా కనిపించడం లేదు.  జగన్ తీరుతో విసుగెత్తి కొందరు, అసంతృప్తితో మరి కొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేయగా, పార్టీలోనే ఉన్నవారిలో పలువురు జగన్ కు వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలే డంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుని జగన్ కు అసలు ఎన్నికల వేళ భారీ ఝలక్ ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందుకే రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థిని అంటూ నిలబెడితే గెలిచి తీరాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎన్నికలపై పార్టీ ఒక బృందాన్ని నియమించి అభ్యర్థి విజయంపై కసరత్తు మొదలెట్టేసింది. ఆ బృందం   ఇప్పటికే అధికార పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలతో టచ్ లో ఉందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలం ఎంత,  ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులలో ఎంత మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారు. వంటి అంశాలపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తాము తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పినట్లు తెలుస్తోంి.  మరికొందరు తెలుగుదేశంలోకి టచ్ లోకి వచ్చారు. ఇంకొందరు జనసేనతో టచ్ లోకి వెళ్లారు.  దీంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చేసింది. అయితే ఎవరిని పోటీలో నిలబెడుతుంది అన్న విషయంలో మాత్రం ఎలాంటి లీకులూ లేవు. అభ్యర్థి పేరును చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచాలని తెలుగుదేశం భావిస్తోంది.  ప్రస్తతం జగన్ రెడ్డి సీట్ల మార్పు కార్యక్రమంతో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యూహాత్మకంగా అవకాశం లేకపోయినా పంచుమర్తి అనూరాథను అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్న తెలుగుదేశం ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలలోనూ అంతే వ్యూహాత్మకంగా అభ్యర్థిని రంగంలోకి దింపేయాలని భావిస్తోందని చెబుతున్నారు. సిట్టింగుల మార్పు అంటూ జగన్ మార్పులతో ఆయన పార్టీపై దళిత నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఇప్పటి వరకూ చేసిన మార్పులలో అత్యథికంగా 28 దళితులే ఉన్నారు.  దీంతో వారంతా రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెడితే ఆయనకే మద్దతు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అలా నిలబెట్టే అభ్యర్థి దళితుడైతే ఇక సందేహానికి తావులేని విధంగా వారంతా  వారంతా తెలుగుదేశశం అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం రాజ్యసభ ఎన్నికలలో దళిత అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు జగన్ అండ్ కో లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవతున్నది. నియోజకవర్గాలలో సిట్టింగుల మార్పు కార్యక్రమానికి విరామం ప్రకటించి తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయాన్ని ఆరా తీయడంలో పడ్డారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల భయంతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల మార్పు విషయంలో కూడా పునరాలోచించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తం మీద అసలు ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల రూపంలో జగన్ కు పెనుగండం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రేపటి నుంచి  మరో మారు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి మరోమారు యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. వారిని ఓదార్చి ఆర్థికసాయం అందిస్తారు.  రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. రేపు (ఫిబ్రవరి 6న) మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగుతుంది. 8న తాటికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు. నిజం గెలవాలి యాత్రను  భువనేశ్వరి నారావారిపల్లె నుంచి  మొదలు పెట్టారు. అప్పట్లో ఆమె బస్సులో బయలుదేరారు ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో ప్రజలతో సహపంక్తి భోజనం చేసారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో ఆమె పాల్గొన్నారు.. ఆ తర్వాత తిరుపతి దామినేడులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చేందిన కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తిరుపతి జిల్లాలో రెండు రోజులపాటు ఈ పర్యటన సాగింది.  మొదటిసారి నిజం గెలవాలి యాత్ర బయలు దేరినప్పుడు  విఘ్నాలు లేకుండా జరిగేలా చూడాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారు నారా భువనేశ్వరి.  యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల యాత్ర అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు  భువనేశ్వరి బయలు దేరి  అక్కడ కులదేవతకు పూజలు చేసారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులను సందర్శించారు. 

 కావలి తెలుగు దేశం ఇన్ చార్జిగా కావ్య కృష్ణారెడ్డి పేరు  ఖరారు 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు  దూకుడు పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించాయి. ఖరారైన అభ్యర్థుల పేర్లను అన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.  అధికార వైసీపీ ఇప్పటికే పలు జాబితాలను విడుదల చేసింది. . ఇక జనసేనతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన విపక్ష టీడీపీ.. కావలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కావ్య కృష్ణా రెడ్డి  పేరు ఖరారు చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కావలి నియోజకవర్గానికి కావ్య కృష్ణా రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. కావ్య ఇంటివద్ద టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కావలిలో కావ్య కృష్ణారెడ్డికి  మంచి పట్టు ఉంది.  టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో కావలి స్థానం నుంచి టిడిపి పోటీ చేయవచ్చన్నవార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి – జనసేన కలిసి బరిలోకి దిగుతుండడం తో సీట్ల సర్దుబాటు కాస్త ఆలస్యం అవుతుంది. ఇరు పార్టీల నేతలతో మాట్లాడి , అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చెరో రెండు , రెండు స్థానాలను ప్రకటించడం జరిగింది.నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ బలంగా ఉంది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కావలి నియోజకవర్గం పేరు ఖరారు కావడంతో వైసీపీ శ్రేణుల్లో భయం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కావలి స్థానాన్ని వైసీపీ కోల్పోవల్సి  వస్తుందని ఫ్యాన్ పార్టీ డిసైడ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. . కావలిలో ఫ్యాన్ పార్టీకి  అభ్యర్థులు కొరవడటంతో  టిడిపి గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది. 

రేవంత్ దూకుడు.. కేసీఆర్‌, జ‌గ‌న్ కుట్ర‌లు బ‌హిర్గ‌తం!

తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ  పేద‌లు, మ‌ధ్య‌త‌రగ‌తి వ‌ర్గాల‌ సంక్షేమ‌మే ధ్యేయంగా దూసుకెళ్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో పాల‌న సాగిస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లుపై దృష్టి సారించారు. ఆరు గ్యారెంటీ ప‌థ‌కాల‌ను రేవంత్ స‌ర్కార్ ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తోంది. కొత్త‌గా అధికారంలోకి ప్ర‌భుత్వానికి ఏ ప్ర‌తిప‌క్ష పార్టీఅయిన క‌నీసం నాలుగైదు నెల‌లు స‌మ‌యం ఇస్తుంది. ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం కుదురుకొని ఒక్కో ప‌థ‌కాన్ని అమ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది. కానీ, తెలంగాణ‌లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ మాత్రం అధికారం కోల్పోయిన మ‌రుస‌టి రోజునుంచే కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు దాడి మొద‌లు పెట్టింద‌న్న విమర్శ.. రాజకీయవర్గాలలోనే కాకుండా  ప్ర‌జ‌ల నుంచి కూడా గట్టిగా వినిపిస్తోంది.  విద్యుత్ స‌ర‌ఫ‌రా విష‌యంపై బీఆర్ ఎస్ నేత‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. వాటిని తిప్పికొడుతూ రేవంత్ స‌ర్కార్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా  అందిస్తోంది.  ఫ‌లితంగా విద్యుత్ విష‌యంలో బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది.  మ‌రో రెండుమూడు నెల‌ల్లో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో మొత్తం 17 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌తంలో అధికారంలోఉన్న బీఆర్ ఎస్ పార్టీ తొమ్మిది ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో విజ‌యం సాధించాయి. ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో క‌నీసం 12 నుంచి 15 స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాల‌కు ప‌దునుపెడుతోంది. ఆచి తూచి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తోంది.  ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, రేవంత్ స‌ర్కార్ నిర్ణయాల‌తో ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం పెరిగింది. రేవంత్ స‌ర్కార్ పై ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో బీఆర్ ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంకు వ‌స్తున్న మ‌ద్ద‌తును దెబ్బ‌కొట్టేందుకు బీఆర్ ఎస్ అదిష్టానం అనేక  ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీ వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో మ‌రింత జోష్ నింపుతున్నారు.    తాజాగా బీఆర్ ఎస్ నేత‌లు కృష్ణా జ‌లాల నీటివాటాల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. కృష్ణా న‌దిపై ఉన్న ఉమ్మ‌డి ప్రాజెక్టుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేబీఆర్ ఎంబీకి అప్ప‌గించింద‌ని బీఆర్ ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌రిపాల‌న చేత‌కాద‌ని అన‌డానికి ఇదిఒక ఉదాహ‌ర‌ణ అంటూ ప‌లువురు నేత‌లు పేర్కొన్నారు. బీఆర్ ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్రెస్ మీట్ పెట్టిమ‌రీ సీఎం కేసీఆర్ వ‌ల్ల‌నే నేడు ఈ ప‌రిస్థితి వ‌చ్చిదంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కృష్ణా, గోదావ‌రిపై ఉన్న‌ప్రాజెక్టుల‌ను కేంద్రానికి స్వాధీనం చేయాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలోనే ఉంద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం త‌న‌ను అడిగే విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌తి అంశం రాసింద‌ని కేసీఆర్ చెప్పార‌ని, బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను కాంగ్రెస్ పై వేయాల‌ని చూస్తున్నారంటూ బీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న వాద‌న‌ల‌కు రేవంత్‌ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.  కృష్ణా న‌దిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాల‌నే దానిపై కేంద్రం క‌మిటీ వేసింది.. ఏపీకి 512, తెలంగాణ‌కు 299 టీఎంసీలు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. దీనికి అప్ప‌టి సీఎం కేసీఆర్‌, అధికారులు అంగీక‌రించి సంత‌కాలు చేశార‌ని రేవంత్ బ‌హిర్గ‌తం చేశారు. కేసీఆర్‌, హ‌రీశ్ రావు నీటి పారుద‌ల శాఖ మంత్రులుగా ఉన్న‌ప్పుడే ప్రాజెక్టుల‌ను కేంద్రానికి అప్ప‌గించారు.. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేంద్రానికి ప్రాజెక్టుల‌ను అప్ప‌గిస్తోంద‌ని అబ‌ద్దాలు చెబుతున్నార‌ని రేవంత్ చెప్పారు. రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ద్వారా రోజుకు 8  టీఎంసీలు త‌ర‌లించ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక వేశారు.. అందుకు కేసీఆర్ అనుమ‌తిచ్చారు.. 5మే 2022న ఈ మేర‌కు జీవో ఇచ్చారని రేవంత్ చెప్పారు. జ‌గ‌న్‌, కేసీఆర్ ఏకాంత చ‌ర్చ‌ల్లో ఏం కుట్ర చేశారో? ఎత్తిపోత‌ల ద్వారా జ‌గ‌న్ రోజుకు 8 టీంఎసీల నీటిని తీసుకెళ్తుంటే.. కేసీఆర్ కేవలం రెండు టీఎంసీల కోసం రూ.ల‌క్ష‌కోట్లు ఖ‌ర్చు పెట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించే ప్ర‌య‌త్నం చేశారంటూ రేవంత్‌, ఉత్త‌మ్ లు అన్నారు. మొత్తానికి లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కృష్ణా న‌దీ జ‌లాల విష‌యంలో దుమ్మెత్తిపోయాల‌ని చూసిన బీఆర్ ఎస్ నేత‌ల ఆశ‌ల‌పై రేవంత్ స్ట్రాంగ్ కౌంట‌ర్ తో నీళ్లుచ‌ల్లిన‌ట్ల‌యింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ న‌యా ప్లాన్‌.. లోక్‌స‌భ పోరులో బీఆర్ ఎస్‌కు చుక్క‌లే!

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ జోరు కొనసాగిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లుచేస్తూ రేవంత్ స‌ర్కార్ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందుతోంది.  ముఖ్యంగా  కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారెంటీల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ విడత‌ల వారిగా అమ‌లు చేస్తోంది. మ‌రోవైపు రైతు బంధు, రుణ‌మాఫీపై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఇప్ప‌టికే ముప్పావుశాతం రైతుల‌కు రైతు బంధు నిధుల‌ను ప్ర‌భుత్వం జ‌మ చేసింది.  రుణ‌మాఫీ అమ‌లుపై దృష్టిపెట్టింది.. లోక్‌స‌భ ఎన్నిక‌ల  కోడ్ వ‌చ్చేలోపు రుణ‌మాఫీని అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ స‌ర్కార్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి రేవంత్ స‌ర్కార్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి పేద బ‌డుగు వ‌ర్గాల్లో మంచి పేరును సంపాదించుకుందనే చెప్పాలి. మ‌రో వైపు తెలంగాణ ఉద్య‌మ కారుల‌పై రేవంత్ దృష్టి సారించారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించి బీఆర్ ఎస్ ప‌దేళ్ల కాలంలో ఆద‌ర‌ణ‌కు నోచుకోని వారికి  కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ప్రాధాన్య‌త ద‌క్కేలా దృష్టిసారించారు.  ఎమ్మెల్సీ కోటాలో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం పేరును ప్ర‌తిపాదించ‌డం ద్వారా తెలంగాణ ఉద్య‌మకారుల్లో రేవంత్ స‌ర్కార్ పై మ‌రింత న‌మ్మ‌కం ఏర్ప‌డింది. అంతేకాక‌.  తాజాగా, ప్ర‌తీయేడాది సినీ క‌ళాకారుల‌కు అందించే నంది అవార్డుల పేరును మార్పు చేస్తూ గ‌ద్ద‌ర్ అవార్డులుగా నామ‌క‌రం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా. తెలంగాణ‌లోని గ‌ద్ద‌ర్ అభిమానుల‌కు ఓ తీపిక‌బురు చెప్పారు. తెలంగాణ‌లో గ‌ద్ద‌ర్‌కు అభిమాన ఘ‌నం ఎక్కువే.  సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణ‌యంతో గ‌ద్ద‌ర్ ను అభిమానించే వారు రేవంత్ స‌ర్కార్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అంతేకాక,  రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా ప్ర‌భుత్వం ప‌థ‌కాలు అందించ‌డంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్ర‌త్యేక దృష్టిసారించారు. ఫ‌లితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నిక‌ల నాటితో పోలిస్తే ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింద‌ని   స‌ర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. రేవంత్ స‌ర్కార్ తాజా నిర్ణ‌యాల‌న్నీ వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేలా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టార్గెట్‌  లోక్‌స‌భ ఎన్నిక‌లు. తెలంగాణ‌లో 17 లోక్ స‌భ స్థానాల్లో క‌నీసం 12 నుంచి 15 వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల విజ‌య‌మే ల‌క్ష్యంగా రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం న‌యా ప్లాన్ కు తెర‌లేపింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి సాధ్య‌మైనంత మందిని బీఆర్ ఎస్ లోని మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తులు, ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను కాంగ్రెస్ లోకి తీసుకు రావడమే ఆ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల‌ను అవిశ్వాసాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంటున్నది.  అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా ఆద‌ర‌ణ ఉండి, బీఆర్ ఎస్ పార్టీలో ఆద‌ర‌ణ నోచుకోని నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానం.. వారిని పార్టీలోకి తీసుకొచ్చేలా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.  కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగా మంత్రి పొంగులేటితో పాటు ప‌లువురు మంత్రులు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు రంగంలోకి దిగారు. బీఆర్ ఎస్ లో అసంతృప్తిగా ఉంటూ ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నేత‌ల‌ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేష‌న్ ఘ‌న్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య త్వ‌ర‌లో కాంగ్రెస్   తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 10న ఆయ‌న  కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు స‌మాచారం.  మ‌రోవైపు మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే జ‌న‌గాల పెద్దిరెడ్డి సైతం త్వ‌ర‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు స‌మాచారం. ఇలా ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో న‌లుగురైదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. వారిని కాంగ్రెస్ లోకి తీసుకురావ‌డం ద్వారా రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీకి గ‌ట్టి షాకిచ్చేలా కాంగ్రెస్  వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. మొత్తానికి 17 పార్ల‌మెంట్ స్థానాల్లో 12 నుంచి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేలా కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఆ వ్యూహాలు ఫలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 ఐఏఎస్ అక్రమాలపై రేవంత్ గురి 

ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం రెరా బాలక‌ృష్ణుడు అస్సలు నోరు విప్పడం లేదట…    కరెంటు కొనుగోళ్ల లో బోలెడు అక్రమాల‌కు పాల్ప‌డిన‌ కరెంటు ప్రభాకరరావు ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టే ఇక… సింగరేణి బాగోతాలన్నింటికీ బాధ్యుడైన సింగరేణి శ్రీధర్ తప్పించుకున్నట్టే.   వేలాది మంది నిరుద్యోగులను నిలువునా మోసగించిన టీఎస్పీఎస్సీ జనార్దన్‌రెడ్డి తప్పించుకున్నట్టే. హెటెరో పార్థసారథి వంటి వేల కోట్ల మేతగాళ్లు ఎందరో వున్నారు.  మెల్లిమెల్లిగా కాళేశ్వరం, ధరణి వంటి అన్ని బాగోతాల అధికారులు, ఇంజినీర్లూ తప్పించుకుంటారు.  సోమేష్ అండ్ కో బీహార్ బ్యాచ్‌ను రక్షించడానికి ఎన్ని మార్గాలు లేవంటూ తెలంగాణా జ‌నం చెప్పుకుంటున్నారు. ఈ నయా నయీంల వేట రేవంత్ వల్ల కూడా కావ‌డం లేదు. వీళ్లు నయీంకన్నా ఏం తక్కువ..? తను చేయాల్సిందేదో స్ట్రెయిట్‌గా చేశాడు… కానీ వీళ్లు..?... ప్రభుత్వమే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారితే. వసూళ్ల దందాకు దిగితే. సామాన్యుడి సంగతి దేవుడెరుగు. కార్పొరేట్ మాఫియాని,  ఐఏఎస్ అధికారుల్ని త‌న గుప్ప‌ట్లో పెట్టుకొని దొర పాల‌న సాగింది. అధికార పార్టీ పెద్దలు కూడా ఈ మేతగాళ్ల బాగోతాల్లో భాగస్వాములు కాబట్టి వీళ్ల అక్రమాలు అలా నడుస్తూ పోయాయి… రిటైరవుతారు, అవే పోస్టులో లేదా సలహాదారుల పాత్రల్లో అలాగే అధికారాలతో కొనసాగారు. సగటు ఉద్యోగులకు కనీసం ఏసీబీ భయం… విజిలెన్స్ భయం, కటకటాల భయం…  వీళ్లకు సీబీఐ భయం కూడా లేదు…  దానికి అంత సిబ్బందీ లేదు…  వీళ్లపై నిఘాలు వేసి ఎప్పటికప్పుడు అక్రమార్కులను ఏరేయాల్సిన డీవోపీటీ మన వ్యవస్థలో అది పెద్ద ఫెయిల్యూర్… దానంత మోస్ట్ హోప్‌లెస్ విభాగం మరొకటి లేదు. నిజానికి ఐఏఎస్ ఎంపికే పెద్ద లోపభూయిష్టం…  వాళ్లకు శిక్షణ కూడా అంతే…  వీళ్లేమో కొంత మంది కొలువులో చేరింది మొదలు సొసైటీని కుళ్లబొడుస్తుంటారు…  నిజానికి మన భారతీయ సమాజానికి అసలు సిసలు శత్రువులు కొంత మంది సివిల్ సర్వీసు అధికారులే…  బోలెడు ఉదాహరణలు…  ఇక అధికార పార్టీ మద్దతు కూడా తోడైతే… ఇంకేముంది..?   1. కరెంటు ప్రభాకరరావు ఏం చేశారో చూడండి. కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ 3 ప్రాజెక్టులకు రూ.45,730 కోట్ల అంచనా వ్యయంతో గతంలో టెండర్లు పిలిచారని.. ఇందులో 30 శాతం కమీషన్‌ రూపంలో అవినీతి చోటుచేసుకుంది.  ఏటా రూ.16 వేల కోట్లతో వ్యవసాయానికి కరెంటు కొన్నట్లు చూపించి రూ.8 వేల కోట్లు దోచుకుంటున్నారు. తెలంగాణ లో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. విద్యుత్ డిస్కం సంస్థలు రూ.62,461కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయన్నారు. 2023 అక్టోబర్ నాటికి విద్యుత్ సంస్థలకు మొత్తం రూ. 81,516కోట్లు అప్పులు.  2. ఇక  సింగరేణి శ్రీధర్  మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. కేంద్రం వద్దన్నా తొమ్మిదేండ్ల పాటు ఆయన సింగరేణి సీఎండిగా కొనసాగారు.  శ్రీధర్ పదవీ కాలంలో సింగరేణిలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సంస్థకు చెందిన రూ. వేల కోట్ల డీఎంఎఫ్ టీ నిధులను దారి మళ్లించారనే విమర్శలు వచ్చాయి.  పోస్టులను అమ్ముకున్నారు. ప్రతి మెడిక‌ల్ బోర్డు మీటింగ్‌లో కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. బొగ్గు బ్లాక్‌ల వేలంలో సైతం ఆయ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యవహరించారు. కోట్లాది రూపాయల కుంభకోణాలు జ‌రిగినా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యాడు.   3. టీఎస్పీఎస్సీ జనార్దన్‌రెడ్డి అక్ర‌మాల గురించి పేప‌ర్ లీకేజ్‌ల‌తో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడి త‌న ఆస్థులు పెంచుకున్నాడు. 4. క‌రోనా స‌మ‌యంలో కూడా అమానుషంగా వ్య‌వ‌హ‌రించి రెమిడిసివిర్ ఇంజెక్షన్  లక్ష రూపాయ‌ల‌కు అమ్మారు.  పార్థసారథి ఫార్మా స్కాం పై ప్ర‌తిప‌క్షాలు శాప‌నార్థాలు పెట్టాయి. అయితే అప్ప‌ట్టి సి.ఎం. కేసీఆర్‌ పార్థసారథికి రాజ్యసభ టికెట్ ఇచ్చి త‌ల‌మీద పెట్టుకున్నారు. 5. క‌ళాశ్వ‌రంలో కాంట్రాక్ట‌ర్లు, మెగా రెడ్డి, ధ‌ర‌ణిలో బీహార్ బ్యాచ్ అధికారులు ద‌ర్జాగా తిరుగుతున్నారు. తొమ్మిందేండ్ల కాలంలో జరిగిన అవినీతి కుంభకోణాల పై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.  రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో తెలంగాణ‌కు రూ. 16 వేల కోట్ల మిగులు బ‌డ్జెట్ ఉండేది. ఇవాళ రాష్ట్ర అప్పు 5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది.  

భారతరత్న ఇవ్వడం పట్ల  అద్వాణి ఆనంద భాష్పాలు 

బిజెపి అగ్రనేత , రాజకీయ కురు వృద్దుడు ఎల్ కె అద్వాణి కంట తడి పెట్టారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.  బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ అద్వాణికి  భారతరత్న ఇవ్వలేకపోయింది. రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో అద్వాణికి ఈ పురస్కారం ఇవ్వడం బిజెపి శ్రేణులలో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. తనకు దక్కిన ఈ అరుదైన పురస్కారానికి అద్వాణి ఆనందబాష్పాలు రాల్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపనకు స్వయంగా రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు  వచ్చి ఆహ్వనించినప్పటికీ విపరీతమైన చలికారణంగా అద్వాణి రాలేకపోయారు.బీజేపీ అగ్రనేత అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు భారత ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల  ఈ సందర్భంగా అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యంత వినయంతో, కృతజ్ఞతతో భారతరత్న పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన ఆదర్శాలు, అనుసరించిన సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదని... తన జీవిత ప్రయాణంలో తన సామర్థ్యానికి తగినట్టుగా చేసిన సేవలకు, పాటించిన ఆదర్శాలకు దక్కిన గౌరవమని చెప్పారు.  తనకు భారతరత్నను ప్రకటించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అద్వానీ అన్నారు. తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తనకు భౌతికంగా దూరమైన తన భార్య కమల తనకు బలమని చెప్పారు. 14 ఏళ్ల వయసులో ఆరెస్సెస్ లో చేరినప్పటి నుంచి... దేశం కోసం తన జీవితం తనకు అప్పగించిన ప్రతి పనిని స్వలాభాన్ని చూసుకోకుండా, శక్తివంచన లేకుండా నిర్వహించానని తెలిపారు.  తనకు భారతరత్న వచ్చిన సందర్భంగా... ఎవరితోనైతే పని చేయడాన్ని తాను గౌరవంగా భావించానో ఆ ఇద్దరినీ సగౌరవంగా తలుచుకుంటున్నానని... వారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి అని అద్వానీ చెప్పారు. బీజేపీ శ్రేణులకు, స్వయంసేవకులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.  మరోవైపు, అద్వానీకి భారతరత్న ప్రకటించిన తర్వాత ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అద్వానీకి ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ స్వీటు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. భారతరత్న వరించిన విషయం తెలిసిన తర్వాత అద్వానీ కంటతడి పెట్టుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

రేవంత్ రెడ్డిని కల్సిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి 

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరూ ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. తాజాగా బిఆర్ఎస్ అగ్రనేత కెకె కుమార్తె గద్వాల విజయలక్ష్మి శనివారం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021న జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా... తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్. ఆమె బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేత కుమార్తె కావడంతో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పెద్ద పీట వేశారు.  అమెరికన్ సిటిజన్‌షిప్ కలిగిన విజయలక్ష్మి... అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కెసీఆర్ ఇటీవల పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కూడా కలుసుకోకూడదని హుకుం జారీ చేసిన గంటల వ్యవధిలో కెకె కుమార్తె రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ఎక్స్ హ్యాండిల్ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. హెలికాప్టర్‌లో కూర్చున్న రేవంత్ రెడ్డి పది రూపాయల రియల్ ఫ్రూట్ తాగుతూ ఉన్నారు. ఈ ఫొటోను క్లిక్ మనిపించి షేర్ చేశారు. "పదవి అనేది హోదా కాదు.. బాధ్యత అని రేవంత్ రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కుటుంబం విశ్వసనీయత కోల్పోయిన జగన్.. బాబుపై నెపం నెట్టి ఏం ప్రయోజనం!

2019 ఎన్నికల సమయంలో అందరి వాడుగా ఉన్న జగన్.. అధికారం చేజిక్కించుకుని ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో అంటే 2024 ఎన్నికల సమయానికి వచ్చే సరికి కేవలం జగన్ గా మిగిలిపోయారు. అవును వైఎస్ కుటుంబం ఆయనకు దూరం అయిపోయింది. సొంత తల్లి, చెల్లే కాదు.. ఆయన బంధుగణం కూడా దాదాపుగా జగన్ కు దూరమైపోయింది. సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, సొంత పిన్ని కూడా ఆయనకు దూరమయ్యారు. వీరందరి అండతోనే జగన్  గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకోగలిగారు. నాడు కుటుంబంలో అందరి వాడుగా ఉన్న జగన్ ఇప్పుడు ఒంటరివాడుగా, అంటే ఏకాకిగా మిగిలిపోయారు. తన సుందర ముదనష్ట పాలనతో ప్రజలకు దూరమైన జగన్ తన అహంకారంతో కుటుంబాన్నీ దూరం చేసుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు సోదహరణంగా విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన వాళ్లే తనకు దూరం కావడానికీ, తనకు వ్యతిరేకంగా గళమెత్తడానికి కారణం తాను ఎంత మాత్రం కాదని చెప్పుకుంటున్నారు. తన పార్టీకి చెందిన సామాజిక మాధ్యమంలో, తన సొంత మీడియాలో అందుకు అనుగుణంగా కథనాలు వండి వారుస్తున్నారు.    గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు.   రాజన్న రాజ్యం తీసుకు రావడం కోసం.. తన కుమారుడుకి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ అంత వరకూ ఎన్నడూ రాజకీయాలలో ప్రవేశం లేని ఆయన తల్లి విజయమ్మ ప్రజల్లోకి వెళ్లీ మరీ విజ్జప్తి చేశారు. అలాగే  జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ  షర్మిల పాదయాత్రే కాదు.. బై బై బాబు అంటూ బస్సు యాత్ర కూడా చేశారు. బయటకు వచ్చి ప్రచారం చేయకపోయినా వైఎస్ వివేకా కుమార్తె కూడా జగన్ పక్కనే నిలబడ్డారు. తన సోదరుడు జగన్ సీఎం అయితేనే తన తండ్రి వివేకా హంతకులకు శిక్షపడుతుందని విశ్వసించారు. అంతే కాకుండా నాటి ఎన్నికలలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా జగన్ విజయం కోసం వ్యూహాలు రచించారు. ఎత్తుగడలు వేశారు. అయితే ఇప్పుడు ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు తన విజయానికి తోడ్పడిన వీరెవరూ జగన్ తో లేరు.   అలాగే నాడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తి విజయం సాధించేందుకు దోహదపడిన వివేహా హత్య కేసు, విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి కేసులు ఇప్పుడు రివర్స్ లో ఆయనకే ఎదురు తిరిగాయి. రెండు కేసుల్లోనూ కూడా జగన్ సీఎంగా వ్యవహరిస్తున్న తీరు ఆయన మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది.  ఆ రెండు కేసుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యానికి జగన్ తీరే కారణమని జనం కూడా నమ్ముతున్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాని అంటున్నారు.  అన్నిటి కంటే ముఖ్యంగా వివేకా హత్య విషయంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని నిర్ద్వంద్వంగా తేలిపోవడమే కాకుండా, తీవ్ర ఆరోపణలకు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం కూడా జగన్ పై అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ కారణాల వల్లే జగన్ సొంత కుటుంబీకులకు కూడా కాని వాడుగా మారిపోయారు.  ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టి సొంత అన్న దుర్మార్గాలపై గళం ఎత్తారు. అలాగే మరో సోదరి, సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత.. కడప గడ్డపై అన్న నిలబెట్టే లోక్ సభ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా రంగంలోకి దిగడం దాదాపు ఖరారైంది. అలాగే పిస్ని వైఎస్ సౌభాగ్యమ్మ కూడా ప్రచార రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ తాను ఒంటరి కావడానికి కారణం విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణమని చాటడం ద్వారా.. తమ ఫ్యామిలీలో ఏకాకిని అయిపోయానని స్వయంగా చెప్పుకుంటున్నారు. జగన్ తల్లీ, చెల్లీ, పిన్నీ, సోదరి ఇలా అందరూ ఆయనను వదిలేసి వెళ్లిపోయారు, వాళ్లు అందరూ చంద్రబాబ చెప్పినట్లు చేస్తున్నారు. ఆయన ఆడమన్నట్లు ఆడుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వండి వారుస్తున్న కథనాలు ఇప్పటికే పాతాళానికి చేరిన జగన్ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. 

నువ్వు అప్పులు తీర్చి.. అప్పుడు ప్రజల్లోకి రా...

కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు... టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు మొన్నటి వరకు కొడాలి నాని మొరిగేవాడు.. ఇప్పుడు కేశినేని నాని కుక్కలా మొరుగుతున్నాడు చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని వాగుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీ దారుల్లో ముందు  వరులో ఉంటాడు కేశినేని నాని సత్యహరిశ్చంద్రుడిలా పెద్ది రెడ్డి మాట్లాడుతున్నాడు ఇలాంటి నీచ, నికృష్ట సీఎం ను నా జీవితంలో చూడలేదని కేశినేని నాని అన్నాడు పెద్ది రెడ్డి అన్నట్లు చంద్రబాబు గురించి నాని చెప్పింది నిజమైతే.. జగన్ గురించి అదే నాని మాట్లాడింది కూడా నిజమని అంగీకరిస్తారా కేశినేని నాని పరమ వెధవ.. ఒక్కటి కూడా నిజం చెప్పడు వసంత కృష్ణప్రసాద్ కు రాజకీయ చరిత్ర ఉంది.. ఆయన తండ్రి హోంమంత్రిగా చేశారు కేశినేని నాని వంటి అబద్దాల కోరు రాకతో.. వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చారు వసంత గతంలోనే చంద్రబాబును విమర్శించను అని బహిరంగంగా చెప్పాడు కేశినేని నాని తో తిరిగితే.. తనకు ఓటమి తప్పదనే వసంత వైసీపీని  వీడాడు దున్నపోతులా బలిసి, లావు చూసి బలం అనుకుంటున్నాడు.. కేశినేని నాని నీ వెనుక పట్టుమని పది మంది వెళ్లేలదు.. చంద్రబాబును విమర్శిస్తావా విజయవాడ పశ్చిమ విషయంలో  రాజీనామా చేస్తానని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేశాడు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న సమయంలో నాని ఒక్క సమావేశం కూడా పెట్టలేదు కేశినేని నాని, వెల్లంపల్లి లు  మధ్య లోపాయికారి ఒప్పందాలు గతంలోనే ఉన్నాయి అందుకే టీడీపీలో ఉంటూ నాని కోవర్టు రాజకీయాలు చేశాడు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇప్పిస్తామని చెప్పి.. ఇద్దరు దగ్గర కేశినేని నాని డబ్బులు తీసుకున్నాడు కేశినేని నానీని రోడ్డు మీదకు వదలాలంటే... ముందు అతని అప్పులు తీర్చాలి జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతున్నాం.. ముందు నాని అప్పులు తీర్చి.. అప్పుడు సీటు ఇవ్వాలి చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం వీడి నోటి వెంట ఒక్క మాట కూడా నిజం రాదు క్యారెక్టర్ లెస్ ఫెలో కేశినేని నాని 2019 లో నాని దగ్గర డబ్బులు లేకపోయినా.. పిలిచి మరీ ఎంపీ సీటు చంద్రబాబు ఇచ్చారు  ఇప్పుడు సిగ్గు లేకుండా డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని వాగుతున్నాడు నిన్న మైలవరం ఇన్ ఛార్జిగా వచ్చిన వ్యక్తి నుంచి కూడా నాని డబ్బులు వసూలు చేస్తాడు.. జాగ్రత్తగా ఉండండి పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నాని ఎంతమందికి సాయం చేశాడో చెప్పాలి నాని మైలవరం ఇన్ ఛార్జిగా ఇప్పుడు అక్కడ కూడా అందినకాడికి దోచుకోవడం ఖాయం జగన్ కు ఉన్న మెంటాలిటీకీ.. కేశినేని నాని బలం ఎంతో అర్దమైపోయి ఉంటుంది నాని పార్టీ మారాక నీ బలం ఎంతో చూపించలేకపోయాడు.. అసలు లేని బలాన్ని ఎలా చూపిస్తాడు నాకు తెలిసి వైసీపీలో అతనికి రేపు టిక్కెట్ కూడా ఉండదు కేశినేని నాని వల్ల వైసీపీ కి అదనపు బరువే తప్ప.. బలం కాదు కేశినేని చిన్ని టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే.. నాని ఓర్వలేకపోయాడు చివరకు సోదరుడు, అతని కుటుంబం పై స్టిక్కర్ కేసు పెట్టిన మూర్కుడు కేశినేని నాని  కేశినేని నాని వెనుక అతని తల్లి, చెల్లి కూడా లేరు గద్దె రామ్మోహన్ రెండు సార్లు నా వల్లే గెలిచాడని నాని చెప్పుకుంటున్నాడు గద్దె రామ్మోహన్  ఇండిపెండెంట్ గా, టీడీపీలో  రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది విజయవాడ నగర అద్యక్షుడిగా గద్దె రామ్మెహన్ ఆరేళ్లు వరుసగా పని చేసిన చరిత్ర అతనిది గద్దె నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు 17వేలు మెజారిటీ వస్తే, కేశినేని నానికి 12వేలు మెజారిటీ వచ్చింది కేశినేని నానికి ముని శాపం ఉంది.. వాడు మాట్లాడే ప్రతి మాట అబద్దమే ఆ అబద్దాలను నమ్మి ప్రచారం చేయవద్దని మీడియాను కూడా కోరుతున్నాం కేశినేని నాని నిందలు వేస్తే.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన పెద్దిరెడ్డి సమర్ధించడం వింతగా ఉంది గనుల వ్యాపారం చేసే పెద్దిరెడ్డికి అదేశాఖ ఇచ్చి దోచుకోమని జగన్ అనుమతి ఇచ్చాడు ఇలాంటోళ్లంతా కలిసి నాని వంటి కుక్కతో మొరిగిస్తున్నారు చంద్రబాబు నాతో ఎందుకు మాట్లాడిస్తారు.. నేను ఆయనకు వీర విధేయుడిని మా అధినేతను తిడితే.. నా లాంటోడు చూస్తూ ఊరుకుంటాడా.. తగిన బుద్ది చెబుతాం కేశినేని నాని ముందు నువ్వు అప్పులు తీర్చి.. అప్పుడు ప్రజల్లోకి రా

ఈడీ విచారణకు హాజరుకాని  అర్వింద్ కేజ్రీవాల్  

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఈ రోజు (జనవరి 3) కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు. విచారణకు రమ్మంటూ ఈడీ పంపిన నోటీసులను ఆయన లెక్కచేయలేదు. ఈడీ నోటీసులు అందుకోవడం ఆయనకు ఇది ఐదో సారి.. అయినా కేజ్రీవాల్ స్పందించలేదు. అయితే, ఈడీ నోటీసులు అక్రమమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపిస్తోంది. పార్టీ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాబోదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ మాఫియాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించేందుకు పిలిచింది. ఈ కేసులో ఇలాగే విచారణకు పిలిచిన ఆప్ మంత్రులు, డిప్యూటీ సీఎం సిసోడియాలను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అదే తరహాలో కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. మరోసారి నోటీసులు పంపినా పట్టించుకోలేదు. ఈ నెల 3న విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల ఈడీ నోటీసులు పంపించగా.. తమ అధినేతకు నోటీసులు పంపడం ఇల్లీగల్ అంటూ ఆప్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఐదుసార్లు ఈడీ నోటీసులు పంపిచినప్పటికీ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇదే కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత ను కేంద్రదర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఉపేక్షిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

రూటు మార్చిన రేవంత్..లోక్ సభ ఎన్నికల్లో కాంగి‘రేస్’ఖాయం!

రేవంత్ రెడ్డి.. ఈ పేరు విన‌గానే తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు ట‌క్కున గుర్తుకొచ్చేది దూకుడు స్వ‌భావం.. రాజ‌కీయాల్లో దూకుడుగా ముందుకెళ్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం రేవంత్ రెడ్డికి వెన్న‌తో పెట్టిన విద్య.. పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి బీఆర్ ఎస్ పార్టీపై దూకుడుగా రాజ‌కీయాలు చేస్తూ రేవంత్ ముఖ్య‌మంత్రి స్థాయికి ఎదిగారు.   కాంగ్రెస్ హైక‌మాండ్‌ను మెప్పించి,  తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదం పొంది సీఎం పీఠాన్ని అదిరోహించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. రేవంత్ సీఎం అయ్యాక కొంచెం దూకుడు త‌గ్గించిన‌ట్లు క‌నిపించింది..  ఇదేమ‌ని రేవంత్ రెడ్డిని ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో అడిగితే.. సీఎం ప‌ద‌వి అనేది హూందాతో కూడుకున్న‌ది.. ఆవేశ ప‌డ‌కుండా.. నెమ్మ‌దిగా ఉంటూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రిస్తూ వారి మెప్పును పొందేలా ముందుకు సాగాల‌ని  చెప్పారు.. కానీ, రేవంత్ సీఎం అయిన త‌రువాత ప్ర‌త్య‌ర్థులు కాస్త హుషారైయ్యారు. రేవంత్ ఇక దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌రు,  మ‌నం ఏమ‌న్నా ప‌డుతూ.. త‌ల‌దించుకుంటూ పోత‌రులే అనుకున్నారేమో.. ప్ర‌భుత్వాన్ని ఆరు నెల‌ల్లో ప‌డ‌గ‌ొడతాం.. ఎంపీ ఎన్నిక‌లు అయిన త‌రువాత మ‌ళ్లీ బీఆర్ ఎస్ దే అధికారం అంటూ కొంద‌రు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. చేస్తున్నారు. ప్ర‌తిగా కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్ రాక‌పోవ‌టంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆందోళ‌న నెల‌కొంది.  ప్ర‌తిపక్ష పార్టీ అయిన  బీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ నేత‌లు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌పోయే స‌రికి కాంగ్రెస్ శ్రేణులు నిరాశ‌కు గుర‌వుతున్నాయి. నిజంగానే ఆరు నెల‌లు , ఏడాదిలో ప్ర‌భుత్వం కూలిపోతుందేమో.. ఎందుకొచ్చింది గొడ‌వ‌.. బీఆర్ ఎస్ నేత‌ల జోలికి వెళ్ల‌కుండా మ‌న‌ప‌ని మ‌నం చేసుకుందాం అనుకునే స్థాయికి ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేత‌లు వెళ్లిపోయారు.  కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని గ‌మ‌నించిన  సీఎం రేవంత్ రెడ్డి.  త‌న అస‌లైన దూకుడు స్వ‌భావాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. సీఎం ప‌ద‌వి అనేది హూందాత‌నంతో కూడుకున్న‌దే.. కానీ, ఆ ప‌ద‌వే మ‌నల్ని న‌మ్ముకున్న వాళ్ల‌ను నిరుత్సాహ ప‌రిచేలా  ఉండటంతో ఆయన జూలు విదిల్చారు.  అస‌లే  కార్య‌క‌ర్త‌లంటే ప్రాణ‌మిచ్చే రేవంత్ రెడ్డి.. వాళ్లు నిరాశ‌లో ఉంటే ఊరుకుంటారా? సీఎంగా హుందాగా ఉంటూనే పీసీపీ అధ్యక్షుడిగా.. తమ మాటల పదునూ చూపుతున్నారు. అలా చూపడానికి   ఇంద్ర‌వెల్లి గ‌డ్డ‌ ను వేదికగా చేసుకున్నారు.   మూడు నెల‌ల్లో .. ఆరె నెల‌ల్లో కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిత‌డు అంటున్న‌రు.. నీ అయ్య‌.. ఎవ‌డ్రా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేది.. వేలాది మంది యువ‌కులు ఉన్న‌ారు.. మీరంద‌రూ చూస్తూ ఊరుకుంటారా యువ‌కులారా? ఎవ‌రైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాం అని మాట్లాడితే.. మీ ఊళ్లో యాప‌చెట్టుకు కోదండం వేసి కొట్టండి.. ఇది ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల‌కోసం ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వం.. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచేశారు. ల‌క్ష‌కోట్లు పెట్టి క‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు కూలిపోయిన‌ట్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని కేసీఆర్‌ అనుకుంటున్న‌ారు.. నీ  అయ్య‌.. నువ్వు దోపిడీకి పాల్ప‌డ్డం  వల్లే కాళేశ్వ‌రం గాలొస్తే కొట్టుకుపోయింది.. ఈ ప్ర‌భుత్వం గాలి కాదుక‌దా.. మీ ఖాందాన్ మొత్తం వ‌చ్చినా బోర్ల‌బొక్క‌లేసి తొక్కుతాం.. ఆర్నెళ్ల‌కో.. ఏడాదికో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని అంటే ప‌ళ్లు రాల‌గొడ‌తాం అంటూ.. బీఆర్ఎస్ కు గట్టి రిటార్డ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇన్నాళ్లు కొంత నిరాశ‌తో ఉన్నకాంగ్రెస్ శ్రేణులు రేవంత్ తన సహజ దూకుడు ప్రదర్శించడంతో హురారయ్యారు.   రేవంత్   ఉండ‌గా.. ఎవ‌డొస్త‌డు మ‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు అన్న‌ట్లుగా రేవంత్ ప్రసంగం‌.. కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపింది.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి మూడు నెల‌లు.. ఆరు నెల‌లు.. మ‌హాఅంటే సంవ‌త్స‌రంలో కూలిపోవ‌టం ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేస్తున్న బీఆర్ ఎస్ నేత‌ల‌కు ఇంద్ర‌వెల్లిలో రేవంత్ ప్రసంగం ఒక  స్ట్రాంగ్ హెచ్చరిక చేసింది. ఇంద్ర‌వెల్లిలో రేవంత్ మాట్లాడిన మాట‌ల‌తో కాంగ్రెస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.. మ‌రింత ఉత్సాహంతో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అర్హుల‌కు చేర‌వేస్తాం.. ఎవ‌డు అడ్డొచ్చినా.. ఎవ‌రెన్ని ప్ర‌చారాలు చేసుకున్నా వెన‌క్కు త‌గ్గం అనేలా.. రేవంత్ స్పీచ్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నిపింది.ఈ ఉత్సాహంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో విజయం కోసం రేసు గుర్రాల్లా దౌడు తీస్తాం అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు

శిల్ప కళా వేదికలో పద్మ విజేతలకు  రేపు సన్మానం 

పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. రేపు శిల్పకళా వేదికలో ఆదివారం ( ఫిబ్రవరి 4) సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పద్మవిభూషణ్   కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించారు.  ఈ కార్యక్రమానికి రావాలంటూ వెంకయ్యనాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో, చిరంజీవిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి, పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.  వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్‌లాల్, శిల్పకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం వీరిరువురికి పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 

వైసీపీలో మార్పులు చేర్పులు  నేపథ్యంలో మైలవరం టికెట్ తనకు దక్కకపోవచ్చని  వైసీపీ ఎమ్మెల్యే కృ ష్ణ ప్రసాద్ డిసైడ్ అయిపోయారు.ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  మైలవరం టికెట్ అడ్డుకోవడానికి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన  బాహాటంగానే విమర్శలు చేశారు. . దీంతో గత నెల కృష్ణ ప్రసాద్ కు రాజమహేంద్రవరం ప్యాలెస్ నుంచి ఫోన్ రావడంతో  ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలిసారు. వీరిరువురి సయోధ్యకు జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు  తాను పోటీ చేయబోనని కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో  వైసీపీ ప్రకటించిన జాబితాలో మైలవరం  పేరు లేకపోవడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కృష్ణ ప్రసాద్ ను జోగి రమేష్ ఇబ్బందులు గురి చేస్తున్నట్లు సమాచారం.ఆయన  టీడీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తరువాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి జగన్    గన్  నిర్వహిస్తున్న     సిద్ధం సభకు తాను హాజరుకాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.  తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.  మాజీమంత్రి, కృష్ణా జిల్లా  వైసీపీ అధ్యక్షులు కొలుసు పార్థ సారథి వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. మైలవరం నియోజకవర్గం కూ డా కృష్ణా జిల్లాలో ఉంది. పార్థ సారథి ప్రోద్బలంతో కృష్ణ ప్రసాద్ టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ  జడ్పీటీసీ తిరుపతి రావు యాదవ్‌ను ఇంచార్జ్‌గా ప్రకటించింది. ఇదిలా ఉంటే, నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వైసీపీని వీడటం ఖాయమని తేలిపోవడంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.  టిడిపిలోకి వలసలు పెరగడంతో వైసీపీ ఇల్లు ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

బిఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్ బై 

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.  వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తాటికొండ రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు వీర విధేయుడైన తాటికొండ రాజయ్య తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ లో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని టిఆర్ఎస్ తొలి ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కెసీఆర్ తొలి ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం రాజయ్యకు వరించింది. కెసీఆర్ కేబినెట్ లో వైద్యశాఖా మంత్రిగా పని చేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తర్వాతి కాలంలో సర్పంచ్ నవ్య రాజయ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురి చేశారని ఆరోపణలు చేశారు. మీడియాలో రాజయ్యపై నెగెటివ్ ప్రచారం జరగడంతో  బిఆర్ఎస్ పక్కన పెట్టింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి ప్రోద్బలంతోనే సర్పంచ్ నవ్య ఆరోపణలు చేస్తూ వచ్చినట్లు రాజయ్య వివరణ ఇచ్చారు.  గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం... రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే సీఎంను కలిశామని వీరు చెపుతున్నప్పటికీ... వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది.