రాజధాని ఫైల్స్.. ఏపీలో రాజకీయ ప్రకంపనలేనా?..

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'రాజధాని ఫైల్స్'. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. 'రాజధాని ఫైల్స్' చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లోగోలో పొలం దున్నే నాగలి ఉండటం ఆకట్టుకుంది. అలాగే పోస్టర్ కూడా ఎంతో క్రియేటివిటీగా ఉంది. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక యువ నాయకుడు.. వేలాది రైతు కుటుంబాలకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో మరో రాజకీయ నాయకుడు రూపం ఉన్నట్లుగా గమనించవచ్చు. అలాగే పోస్టర్ మీద "ఒకే ఒక్కడి అహం.. వేలాది రైతులకి కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారం." అని రాసుంది. వాస్తవ సంఘటనలకు సహజమైన భావోద్వేగాలను జోడించి ప్రేక్షుకుల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రోజా సీన్ సితారేనా?

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి  రోజా.. ఆశలపై  వైసీపీఅధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నీళ్లు పోసేశారా?  రానున్న ఎన్నికల్లో నగరి సీటు  ఆమెకు కేటాయించేందుకు పార్టీ అధినేత సుముఖంగా లేరా అంటే వైసీపీ వర్గాల నుంచే కాదు, రాజకీయ సర్కిల్స్ నుంచి కూడా ఔననే సమాధానమే వస్తున్నది.  మరోవైపు ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి ఆర్కే రోజాను రంగంలోకి దింపేందుకు ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోందంటూ ఓ ప్రచారం సాగినా.. అదేమీ లేదని  తేలిపోయింది. దీంతో రోజాను ముచ్చటగా మూడో సారి  కూడా నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం జోరందుకున్నట్లే జోరందుకుని జావగారిపోయింది.    గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా  విజయం సాధించిన  రోజా.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు కేబినెట్ లో బెర్త్ లభించడంతో ఆమె తీరు, వైఖరి పూర్తిగా మారిపోయాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. అంతే కాకుండా  ఆమె పార్టీ క్యాడర్ ను, జిల్లా నేతలను కూడా పట్టించుకోకుండా, వారిని ఇసుమంతైనా లెక్క చేయకుండా వ్యవహరిస్తుండటంతో  పార్టీ వర్గాల నుంచే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.  దీంతో వారంతా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు.   దీంతో నియోజకవర్గంలో రోజా వ్యతిరేకులకు కీలక నామినేటెడ్ పదవులు దక్కేలా  మంత్రి పెద్దిరెడ్డి జగన్ వద్ద చక్రం తిప్పారు.  దీంతో ఎమ్మెల్యే, మంత్రి అయి ఉండి కూడా రోజాకు నియోజకవర్గంలో పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లేకుండా పోయింది. పైపెచ్చు ఆమెకు ఎవరితోనూ సఖ్యత లేకపోవడంతో  ఆమె నియోజకవర్గంలో ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు మళ్లీ టికెట్  ఇచ్చినా విజయం సాధించే అవకాశాలు లేవన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణుల్లోనే గట్టిగా వినిపిస్తోంది.   అదే సమయంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవడం, జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రి పెద్దిరెడ్డి నడుంబిగించారు. తన వర్గానికి చెందిన వారిని నగరి నుంచి బరిలో దింపేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలతో నగరి సీటు గెలవాలంటే రోజాకు టికెట్ ఇవ్వవద్దని గట్టిగా చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.   నగరి నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు కోసం ఆర్కే రోజా.. తన వంతు ప్రయత్నాలు చేపట్టినప్పటికీ,   ఆమెకు నియోజకవర్గంలో ప్రతి కూల పవనాలు వీస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఆమెను మరో నియోజకవర్గం నుంచి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి ఆమె పేరు ప్రతిపాదించినా, కారణాలేమిటో తెలియదు కానీ, వెంటనే ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.  దీంతో రానున్న ఎన్నికల్లో ఆర్కే రోజాకు అటులోక్ సభ టికెట్ కానీ ఎమ్మెల్యే సీటు కాని దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె సేవలను పార్టీ విజయం కోసం వాడుకోవాలనీ, పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే  మాత్రం పడ్డ కష్టాన్ని ప్రతిఫలంగా రోజాకు ఏదో ఒక కీలక  నామినేటేడ్ పోస్ట్ జగనన్న కట్ట బెట్టే అవకాశం ఉందనే   చర్చ పార్టీలో, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

వల్లభనేని వంశి.. హిట్ వికెట్టా.. క్లీన్ బౌల్డా?

వల్లభనేని వంశి ఏపీ రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత విపక్షంలో ఉండలేక అధికార పార్టీ పంచన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వంశీ ఆ తరువాత గురువుకే పంగనామాలు పెట్టిన చందంగా జగన్ పంచన చేరి తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో మాస్టర్ డిగ్రీ సంపాదించినట్లుగా చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మరీ ముఖ్యంగా రాజకీయాలలో  అయితే  మరీను. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అలాగే తయారైంది.  బలమైన క్యాడర్, సమర్థ నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు గన్నవరంఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత పార్టీదేముంది? అంతా తన ప్రతిభేనని అనుకున్నారు. ఔను అచ్చం విజయవాడ ఎంపీ కేశినేని నానిలాగే.. అయితే నాని నిన్నమొన్నటి వరకూ గెలిచిన పార్టీలోనే ఉంటూ, పార్టీ విధానలను లెక్కచేయకుండా వ్యవహరించారు. చివరకు తెలుగుదేశం పార్టీయే మీ సేవలింక చాలని మర్యాదగా పక్కన పెట్టేసింది. అప్పుడు ఆయన రాజీనామా చేసి తానే బయటకు వచ్చేశానని గప్పాలు కొట్టుకుంటున్నారనుకోండి అది వేరే విషయం. వల్లభనేని వంశీ మాత్రం రెండో సారి విజయం సాధించగానే, తన ప్రయోజనాలు అధికార పార్టీతో అంటకాగితేనే  భద్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో జగన్ పంచన చేరిపోయారు. రాజకీయాలలో పార్టీలు మారడం సహజం. అందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అయితే అలా పార్టీ మారిన వారు చెప్పే, చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నాయని భావిస్తే జనం పార్టీ మారినా ఆదరిస్తారు. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకే  ప్లేటు ఫిరాయించి తాను గెలిచిన పార్టీపైనే బురద జల్లుతున్నారని జనం భావిస్తే మాత్రం ఆ పార్టీ మారిన వ్యక్తికి ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనని దేశ వ్యాప్తంగా జరిగిన పలు జంపింగు నుతలను చూస్తే ఇట్టే అవగతమౌతుంది.  మరీ ముఖ్యంగా తెలుగుదేశం వంటి కేడర్ ఆధారిత పార్టీలో అయితే పార్టీని కాదని పక్కకుపోయిన నేతల పరిస్థితి శంకర గిరి మాన్యాలే దిక్కు అన్నట్లుగా తయారౌతుంది. ఎన్టీఆర్ హయాం నుంచీ ఇది పదే పదే రుజువైంది. నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కోసం అమ్మలాంటి పార్టీని కాదని జంప్ చేసిన పలువురు ఆ తరువాత రాజకీయాలలో  అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో.  ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్ఖితి కూడా అలాగే తయారయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ ఎప్పుడైతే పార్టీని కాదని వైసీపీ పంచన చేరారో ఆ రోజు నుంచే ఆయన రాజకీయ పతనం ఆరంభమైందని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.  వంశీ విజయానికి కారణమైన తెలుగుదేశం, ఆ పార్టీ కార్యకర్తలూ ఎటూ వంశీకి దూరమయ్యారు. అలాగే.. ఆయన కోరి చేరిన వైసీపీలో కూడా ఆయన ఒంటరిగానే మిగలాల్సి వచ్చింది.  వైసీపీ గన్నవరం క్యాడర్ ఎవరూ వంశీని దగ్గరకు రానీయలేదు. యువకుడు, ఉత్సాహవంతుడు అన్న భావనతో గత ఎన్నికలలో వంశీవైపు మొగ్గు చూపిన న్యూట్రల్స్ కూడా ఇప్పుడు ఆయనను దగ్గరకే రానీయడం లేదు.  ఇక వైసీపీ అధిష్ఠానం కూడా వంశీని వదుల్చుకోవడమే బెటర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందుకు నిదర్శనమే రెండు సార్లు సొంత ఇమేజ్ తో గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను అంటూ చెప్పుకునే వంశీకి వైసీపీ ఈ సారి మొండి చేయి చూపాలన్న నిర్ణయానికి వచ్చేశింది.  దీంతో వంశీయే గత్యంతరం లేని పరిస్థితిలో పోటీ చేయను అంటూ ప్రకటించేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన ఆ ప్రకటన చేసినా చేయకపోయినా గన్నవరం నుంచి వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చేది లేదన్నది ఖాయమైపోయింది. దీంతో గత కొంత కాలంగా వంశీ దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి. కనిపించడు, వినిపించడు అని వైసీపీ నేతలే ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.  అసలు విషయం ఏమిటంటే గన్నవరం నుంచి పోటీకి జగన్ అసలు వంశీ పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. గత రెండు నెలలుగా వల్లభనేని వంశీ అసలు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. తెలుగుదేశం అగ్రనాయకత్వంపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకు మిత్రులుగా ఉన్న వారు కూడా దూరం అయ్యిరని అంటున్నారు. ఇప్పుడు గన్నవరంలో వంశీ ఏకాకిగా మారిపోయారని, ఆయనను కలిసే వారు కానీ, పలకరించేవారు కానీ లేరని అంటున్నారు. అన్నిటికీ మించి వంశీ తనకు ఆప్తమిత్రుడిగా చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వంశీని పట్టించుకోవడం లేదని అంటున్నారు.  

షర్మిల భద్రత కుదింపు.. జగన్ సర్కార్ తీరుపై సర్వత్రా అనుమానాలు!

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ప్రాణాలకు హాని ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తన సొంత అన్న జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో  విమర్శలు గుప్పిస్తున్న షర్మిలకు ప్రాణహాని ఉందన్న అనుమానాలను ఇప్పటికే తెలుగుదేశం నాయకులు వ్యక్తం చేశారు. తనను విమర్శించే వారిపై జగన్ వ్యవహరించే తీరును ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అందుక దళిత వైద్యుడిపై పిచ్చివాడన్న ముద్ర వేసిన సంఘటన నుంచీ, జగన్ విధానాలపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలపై కేసులు, వేధింపులు, దాడుల వరకూ పలు ఉదాహరణలను చూపుతున్నారు.  అంతెందుకు గత ఎన్నికలలో తన విజయం కోసం కాళ్లరిగేలా తిరిగి, ప్రచారం చేసిన సొంత సోదరి షర్మిలను తాను అధికారంలోకి  రాగానే రాష్ట్రం నుంచి తరిమేయడమే కాకుండా, పొరుగు రాష్ట్రంలో  సొంత పార్టీ పెట్టుకున్నా, ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టి, కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి అన్నపైనే విమర్శల బాణాలు కురిపిస్తున్న తరుణంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే జగన్ సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించేసింది. ఇప్పటి వరకూ ఫోర్ ప్లస్ ఫోర్ గా ఉన్న ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ కు కుదించేయడం..ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అయితే తక్షణం ఆమెకు భద్రత పెంచాలని డిమాండ్ చేసింది.   ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే భద్రతను కుదించారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, జగన్ సర్కార్ విధానాలను, వ్యవహార శైలిని తప్పుపడుతున్న వారిపై జరిగిన దాడులను ఉదాహరణలుగా చూపుతూ, ఇప్పుడు షర్మిల జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ, సవాళ్లు విసురుతూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్న షర్మిలపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  షర్మిల కూడా నేరుగా అన్న జగన్ అవకతవకలను, అరాచక పాలనను విమర్శిస్తూ, విపక్షాల కంటే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ శ్రేణుల నుంచి ఆమెకు బెదరింపులు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆమె వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెడుతోంది. అలాగే మంత్రులు, వైసీసీ నేతలూ  కూడా  షర్మిలపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.  అసలు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఏపీలోకి వచ్చిన రోజే పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని నానా హంగామా చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో ఏపీలో  పోలీసు వ్యవస్థ అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయిందనీ, విపక్ష నేతలపై దాడులకు పాల్పడిన వైసీపీ వారిపై కాకుండా దాడికి గురైన బాధితులపైనే కేసులు నమోదు చేస్తు భయభ్రాంతలకు గురి చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శిస్తున్నారు.   మొత్తం మీద షర్మిల జగన్ సర్కార్ పై విమర్శల దాడి జోరు పెంచుతున్న సమయంలోనే ఆమెకు భద్రత కుదించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు కుదించిన భద్రతను వెంటనే పునరుద్ధరించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ ఆందోళనలక సిద్ధమౌతోంది. 

పులివెందులలో జగన్ కు పొంచి ఉన్న ఓటమి? సొంత సోదరే ప్రత్యర్థి

రాయలసీమలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని నిర్ధారణ అయిపోయింది. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిల, బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత నుంచి ఆయనకు ఓటమి భయం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవడం కోసమే షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిందన్న భావన రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యేది. ఆమె జగన్ సర్కార్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కూడా కాంగ్రెస్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమేననీ, ఆమె లక్ష్యం రాజ్యసభకు వెళ్లడమనీ విశ్లేషణలు చేశారు. అయితే ఆమె నేరుగా అన్న జగన్ తో  తలపడి తాడో పేడో తెల్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ఇప్పుడు తేటతెల్లమైపోయింది.  కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ఆమె అన్నతో ఆయన సొంత నియోజకవర్గం నుంచే ప్రత్యర్థిగా నిలబడేందుకు రెడీ అయిపోయారని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజన్న బిడ్డగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారస్వాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. సొంత అన్న నుంచి తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకునేందుకే షర్మిల ఈ స్థాయిలో పులివెందుల బరిలో షర్మిల కన్ షర్మ్?.. కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత ఆయనతో తలపడేందుకు ఆమె సిద్ధమయ్యారని చెబుతున్నారు.  మరో వైపు షర్మిల బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కూడా తన తండ్రి హంతకులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూ.. తన న్యాయపోరాటంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న జగన్ పై రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డిపై నిలబడి తలపడేందుకు రెడీ అయిపోయారు. అంటే జగన్ సొంత సోదరి పులివెందుల నుంచి అసెంబ్లీకి, బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కడప లోక్ సభ నియోజకవర్గం నుంచీ రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారనీ, తద్వారా సొంత జిల్లాలో జగన్ కు తేరుకోలేని, గుక్కతిప్పుకునే అవకాశం లేని దెబ్బ కొట్టాలని షర్మిల, సునీత భావిస్తున్నారని అంటున్నారు. ఈ పేపథ్యంలోనే ఇటీవల ఇరువురూ ఇడుపుల పాయలో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సునీత కడప లోక్ సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలనీ, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల సొంత అన్న జగన్ కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయంచినట్లు వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన వారు చెబుతేన్నారు. అదే జరిగితే ఆ ప్రభావం ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదనీ, జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల, సునీతలు జగన్ కు వ్యతిరేకంగా కడప జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగితే.. గత ఎన్నికలలో వైఎస్ వివేకా హత్య అంశం వైసీపీ విజయానికి ఎంతగా దోహదపడిందో.. అంతకు రెట్టింపు రానున్న ఎన్నికలలో  ఆ పార్టీ పరాజయానికి  చేరువ చేస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికలలో వైఎస్ వివేకా హత్యను అడ్డుపెట్టుకుని జనం సానుభూతిని సంపాదించుకుని విజయం సాధించిన జగన్ కు ఇప్పుడు అదే వివేకా హత్య కేసు యాంటీ సెంటిమెంట్ గా మారి పుట్టి ముంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఇప్పటికే  ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన అనంతరం తల్లి, చెల్లిని  దూరం పెట్టడంతో జగన్  తీరు ప్రజలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గత ఎన్నికలలో తన విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన సొంత చెల్లి, తల్లిని జగన్ దూరం పెట్టడాన్ని ఏరు దాటి తెప్పతగలిసినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దీంతో పులివెందులలో షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా, జగన్ ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు షర్మిలను దూరంపెట్టడానికి, పార్టీ నుంచి బయటకు పంపేయడానికి సరైన కారణాలు చెప్పి మరీ వివరణ ఇచ్చు కోవాల్సి ఉంటుంది. అదలా ఉంచితే... తన తండ్రి హంతకులకు  చట్ట ప్రకారం శిక్ష పడాలన్న లక్ష్యంతో అలుపెరుగని సునీత న్యాయపోరాటానికి ప్రజా మద్దతు గట్టిగా ఉంది. వైఎస్ వివాకా హత్య విషయంలో  గత ఎన్నికలకు ముందు ఒకలా, విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో డాక్టర్ సునీత పట్ల ప్రజలలో సానుభూతి వ్యక్తం అవుతోంది.  అదే జగన్ పార్టీకి కడప జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలేందుకు కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేశినేని చిన్ని ఆధ్వర్యంలో హోమం, యాగం

విజయవాడ గురునానక్ కాలనీ అన్న క్యాంటీన్ ప్రాంగణంలో తెలుగుదేశం  నాయకుడు  కేశినేని చిన్ని  ఆధ్వర్యంలో శ్రీ చక్ర ఆరాధన, సుదర్శన శతక హోమం, నారసింహ హోమం, ఆయుత చండీ యాగాలు నిర్వహించగా అందులో ఆఖరి ఘట్టం ఈరోజు పూర్ణాహుతి హోమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశంనాయకులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి  దేవినేని ఉమా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, నందిగామ నియోజకవర్గ మాజీ  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్, గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ (అన్న), జంపాల సీతారామయ్య, నవనీతం సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, మైనార్టీ నాయకులు  ఎంఎస్ బేగ్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, ఉమ్మడి చంటి నాయకులు బొప్పన బావ కుమార్, మహమ్మద్ ఫతావుల్లా, షేక్ ఆషా, సొంగ సంజయ్ వర్మ, రేపాకుల శ్రీనివాస్, దివి ఉమామహేశ్వరరావు, చలసాని రమణ మరియు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే.. బీజేపీ

అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఎలా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిందో.. ఆ అధికారం నుంచి వైదొలగిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. అధికారులను చెప్పు చేతల్లో ఉంచుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలు, అడ్డగోలు కబ్జాలతో చెలరేగిపోతే... కేసీఆర్ సర్కార్ కు సన్నిహితంగా మెలిగిన అధికారులు కూడా అందిన కాడకి దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిలోనే వ్యవహరించారని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంలోబయటపడుతున్న భూ కొనుగోలు దందా తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ చర్యలు తీసుకోవడానికి ముందు వెనుకలాడుతోందంటూ విరుచుకుపడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిస్తుంటే.. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలోనే   గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరుమీద పాతిక  ఎకరాలు రిజిస్ట్రేషన్  ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేసు నమోదు చేసే విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో చెప్పాలని బీజేపీ నాయకుడు రఘునందనరావు రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు.  అలాగే ఎన్నికల ముదు అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామంటూ పదేపదే చెప్పిన రేవంత్ అధికారం చేపట్టి రెండు నెలలు అయినా ధరణిలో సవరణలు అంటూ ఎందుకు మాటమారుస్తున్నారని విమర్శిస్తున్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారుగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి.. సర్వీస్ లో ఉండగా  ధరణిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదని నిలదీస్తున్నారు.  పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదని రఘునందనరావు ప్రశ్నించారు. మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత కూడా బీజేపీతో అంటకాగుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు విమర్శలూ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రివర్స్ లో బీజేపీ తాను రెండు పార్టీలకూ వ్యతిరేకమనీ, ఆ రెండు పార్టీలే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనీ ఎదురు విమర్శలకు దిగుతోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు  బీజేపీ బలపడేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ప్రచారం చేసి లబ్ధిం పొదాలని చూస్తోంది.  అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఎలా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిందో.. ఆ అధికారం నుంచి వైదొలగిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. అధికారులను చెప్పు చేతల్లో ఉంచుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలు, అడ్డగోలు కబ్జాలతో చెలరేగిపోతే... కేసీఆర్ సర్కార్ కు సన్నిహితంగా మెలిగిన అధికారులు కూడా అందిన కాడకి దోచుకోవడం, దాచుకోవడం అన్న రీతిలోనే వ్యవహరించారని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంలోబయటపడుతున్న భూ కొనుగోలు దందా తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ చర్యలు తీసుకోవడానికి ముందు వెనుకలాడుతోందంటూ విరుచుకుపడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిస్తుంటే.. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలోనే   గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ భార్య పేరుమీద పాతిక  ఎకరాలు రిజిస్ట్రేషన్  ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేసు నమోదు చేసే విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారో చెప్పాలని బీజేపీ నాయకుడు రఘునందనరావు రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు.  అలాగే ఎన్నికల ముదు అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామంటూ పదేపదే చెప్పిన రేవంత్ అధికారం చేపట్టి రెండు నెలలు అయినా ధరణిలో సవరణలు అంటూ ఎందుకు మాటమారుస్తున్నారని విమర్శిస్తున్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారుగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి.. సర్వీస్ లో ఉండగా  ధరణిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదని నిలదీస్తున్నారు.  పేరుతో అక్రమాస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు చేపట్టడం లేదని రఘునందనరావు ప్రశ్నించారు. మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత కూడా బీజేపీతో అంటకాగుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు విమర్శలూ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రివర్స్ లో బీజేపీ తాను రెండు పార్టీలకూ వ్యతిరేకమనీ, ఆ రెండు పార్టీలే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనీ ఎదురు విమర్శలకు దిగుతోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు  బీజేపీ బలపడేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ప్రచారం చేసి లబ్ధిం పొదాలని చూస్తోంది.  

ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం  దాఖలైంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని నాగోల్‌కు చెందిన హరీందర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.అయితే ఈ పిటిషన్‌లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ తాను ఇబ్బంది ఎదుర్కొని పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలే లబ్దిదారులు. దీంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. నిల్చునే ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ప్రజా ప్రయోజన వాజ్యంలో పేర్కొన్నారు. 

రేవంత్ రెడ్డి జోక్యంతో తెరచుకున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకోవడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తెరచుకుంది. స్టాల్ను  తొలగించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడైతే ఆమె వ్యాపారం చేసుకుందో ఇకపైనా అదే స్థలంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కొనసాగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. అక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందనే కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా పాప్యులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ.. అదే పాప్యులారిటీ కారణంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల నిర్ణయాన్ని తప్పుబడుతూ, కుమారి ఆంటీకి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు ప్రభుత్వపరంగా సాయం అందించేందుకే ప్రయత్నిస్తాం తప్ప వారి ఉపాధిని దెబ్బతీసే పనులు తమ ప్రభుత్వం చేయదన్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎప్పటిలాగే అదే చోట కొనసాగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసివేతతో ఎపి పాలిటిక్స్ ప్రభావితం కావడం ఒకటి రెండు రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి సర్కారును ప్రభావితం అయినట్లు నిన్న ట్రోల్ అయ్యాయి. 

గన్నవరం వైసిపి అభ్యర్థి దుట్టా సీతా రామలక్ష్మి ?

గన్నవరం టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్లభనేని వంశీకి ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే  టికెట్  ఇవ్వకపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతుంది. మరో వైపు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన డాక్టర్ దుట్టా రాంచందర్ రావు కూతురు సీతా మహలక్ష్మికి టికెట్ ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత దుట్టా రాంచందర్ రావ్ ఆయన తనయుడైన వైఎస్ జగన్ కు దగ్గరయ్యారు. కానీ ఇటీవలి కాలంలో దుట్టా రాంచందర్ రావు వైసీపీపై అలక వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుట్టాను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. దీనికి దుట్టా కూడ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నెగెటివ్ సర్వే రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుట్టా సీతరామలక్ష్మి కి టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సీతా రామలక్ష్మి తన తండ్రి మాదిరిగా డాక్టర్ వృత్తిలో ఉన్నారు. దుట్టా రాంచందర్ ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన కూతురునే పోటీ చేయించాలని జగన్ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. దుట్టా రాంచందర్ గతంలో రెండు పర్యాయాలు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనను ఎదుర్కోవడానికి వైసీపీ వేసిన గాలమని పరిశీలకులు భావిస్తున్నారు. దుత్తా వారసురాలికి టికెట్ ఇచ్చి గన్నవరం స్థానాన్ని కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. 

తగ్గినట్టే తగ్గి తిరగబడ్డ బాలినేని!?

పొమ్మని చెప్పలేక జగన్.. పొగపెట్టినా పోలేక బాలినేని, ధిక్కరించినా చర్య తీసుకోలేక జగన్.. అవమానించినా వదిలేసి వెళ్లలేక బాలినేని.. ఇలా గత కొంత కాలంగా జగన్ బాలినేని మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. మొత్తంగా బాలినేని వ్యవహారం వైసీపీకి చిక్కులు తెచ్చిపెట్టడమే కాకుండా, ప్రకాశం జిల్లాలో పార్టీ పుట్టి ముంచడం తథ్యమన్న భావన కూడా కలిగిస్తోంది. తాజాగా బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ విషయంలో రాజీపడిన జగన్.. జిల్లాలో తాను చెప్పిన వారందరికీ టికెట్లు ఇచ్చి తీరాలి, మరీ ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంటకు టికెట్ ఇవ్వాలన్న బాలినేని డిమాండ్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని జగన్ తేల్చేశారు. అదే విషయం బాలినేనికి చెప్పి బుజ్జగించి రమ్మంటూ పార్టీలోకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను పంపారు.  ఎవరి విషయంలోనూ లేనట్టుగా బాలినేని విషయంలోనే జగన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు వెనుకలాడటానికి కారణం.. బాలినేని అలకపాన్పు ఎక్కిన ప్రతిసారీ బతిమలాటలు, బుజ్జగింపులు చేయడానికి కారణం బాలినేని పార్టీ వీడితే ఒంగోలులో వైసీసీ అడ్రస్ గల్లంతౌతుందన్న భయమే కారణమని పరిశీలకులు అంటారు. అయితే  గత సోమవారం(జనవరి 29)  సీఎంవోకు వచ్చిన బాలినేని నిమిషాల వ్యవధిలోనే..   కనీసం కారు కూడా దిగకుండానే వెనుదిరగడంతో ఆయన ఇక తెగేదాకా లాగేందుకు సిద్ధపడిపోయారని తేటతెల్లమైపోయింది. అప్పటి వరకూ అలకబూనితే బుజ్జగించి సముదాయించవచ్చన్న ఉద్దేశంతో ఉన్న జగన్ ఇక బాలినేని పార్టీతో తెగతెంపులు చేసేసుకుంటారన్న అనుమానంతో  సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను రంగంలోకి దింపి మరో సారి బుజ్జగింపు డ్రామాకు తెరతీశారు. అయితే ఈ సారి మాత్రం బాలినేని బుజ్జగింపులకు, సముదాయింపులకు లొంగలేదని తెలుస్తోంది. సజ్జల, విజయసాయిరెడ్డి దాదాపు గంట సేపు బాలినేనితో జరిపిన చర్చలు సఫలం కాలేదని అంటున్నారు.  మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో బాలినేని మెట్టు దిగలేదనీ, పట్టు వీడలేదని తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదన్న జగన్ మాటను సజ్జల, విజయసాయిలు బాలినేనికి తేల్చి చెప్పారట. ఒక వేళ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కాకపోతే, ఆయన కుమారుడు మాగుంట భార్గవ కు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని చేసిన ప్రతిపాదన కూడా జగన్ కు ఆమోదయోగ్యం కాదని తేలడంతో సజ్జల, విజయసాయిల రాయబారం విఫలమైంది. దీంతో వారు బాలినేని నివాసం నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. అలాగే సజ్జల, విజయసాయిలతో భేటీ అనంతరం బాలినేని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ భేటీ తరువాత ఇక బాలినేని తగ్గే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదే సమయంలో వైసీపీ ఒంగోలు పార్లమెంటు స్థానం తప్ప.. అంటూ బాలినేనికి మరిన్ని ఆప్షన్లు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద బాలినేని తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా తిరగబడటంతో వైసీపీ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 ప్రత్యేక హోదా కోసం  జెడి లక్ష్మినారాయణ ఒక రోజు దీక్ష

‘ప్రత్యేక హోదా సాధన సమితి’ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం టూటౌన్ ఏరియాలోని గాంధీ విగ్రహం వద్ద జైభారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఓ గొప్ప అవకాశం వచ్చిందని జేడీ లక్ష్మీనారాయణ బుధవారం పేర్కొన్నారు.పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని రాజకీయ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని, ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్ తో పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని ఎంపీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘వోట్ ఆన్ బడ్జెట్’ను అడ్డుకోవడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని  ఆయన  అన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రతిపాదించగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇవ్వాలని కోరిందని గుర్తుచేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.

ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆమె కుండబద్దలు కొట్టారు.  తాము వైసీపీలో లేమని, గతంలో జగన్ పార్టీలో ఉన్నామనీ, అయితే ఇప్పుడు ఆ పాపాన్ని ఇలా ఆయనకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేయడం ద్వారా కడిగేసుకుంటామని చెప్పారు.  కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతున్నాయి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదీ కూడా.. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన కొండా సురేఖ మళ్లీ ఆ రాజన్న కుమార్తె వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత .ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం కోసం ప్రచారం చేస్తానంటూ  ప్రకటించడంతో ఏపీ కాంగ్రెస్ క్యాడర్ లో నయా జోష్ ను నింపింది.    అదీకాక.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత... కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి.. వైఎస్ కుమారుడు జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు.  అప్పట్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   వరంగల్ జిల్లాలోని మానుకోటలో ఓదార్పు యాత్రకు  జగన్ వెళ్లిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులు ఆ యాత్రను అడ్డుకున్న సందర్భంలో  కొండా సురేఖ.. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన నాడు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి వదితమే. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  మరోవైపు వైఎస్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ వేదికగా రాజకీయాలు చేయడం.. మరో వైపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి బలంగా చెప్పకో లేక పోవడం.. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రాణాలకు సైతం తెగించి.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడంతో.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.ఆ సమయంలో కారు పార్టీలో చేరిన   కొండా సురేఖ దంపతులు.. ఆ తర్వాత ఆ పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించకుండా స్తబ్దుగా ఉండిపోయారు. ఇంతలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో కొండా దంపతులు మళ్లీ.. హస్తం గూటికి చేరారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... కేసీఆర్ పాలన వైఖరిపై నిప్పులు చెరగడమే కాకుండా... కేసీఆర్ తెలంగాణ తెచ్చినా..ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాందీ అంటూనే.. ఆమె రుణం తీర్చుకునే తరుణం వచ్చిందంటూ ప్రజల మధ్యకు రేవంత్ రెడ్డి దూసుకెళ్లడం.. దాంతో తెలంగాణ ఓటర్లు.. హస్తం పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దేయడంతో.. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆయన కేబినెట్‌లో మంత్రిగా కొండా సురేఖ కొలువు తీరింది. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని.. పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలలో తాను కాంగ్రెస్ విజయం కోసం ప్రచారం చేస్తానంటూ కొండా సురేఖ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వీల్ చైర్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం.. సెంటిమెంట్ పండుతుందా?

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి రానున్నారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేయనున్నారు. అదేమీ విశేషం కాదు. కానీ  ఆయన అసెంబ్లీకి వీల్ చైర్లో వస్తారన్న వార్తే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  సార్వత్రిక ఎన్నికల  సమయం ముంచుకొస్తున్న తరుణంలో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవ్వక తప్పని పరిస్థితి.  దీంతొ ఆయన వీల్ చైర్లో అయినా ప్రజల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయారు.  సరే ఒక పొలిటీషియన్ గా, విపక్ష నేతగా ఆయన ప్రజలలోకి రావడం పెద్ద విశేషమేమీ కాదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత  కేసీఆర్ కనీస రాజకీయ మర్యాద కూడా పాటించకుండా.. ఎవరికీ చెప్పాపెట్టకుండా.. ఒక రహస్యోద్యమంలా ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు షిప్ట్ అయిపోయారు. కనీసం ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేయలేదు. తొమ్మిదేళ్ల పాటు తనకు అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ణతలు తెలుపుకోలేదు. హుందాగా ఓటమిని అంగీకరించలేదు. అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ జనం ముందుకు వీల్ చైర్ లో రావడానికి రెడీ అయిపోయారు. ఎన్నికల ప్రచారం కూడా వీల్ చైర్ లోనే చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలా అయితేనే సెంటిమెంట్, సానుభూతి వెల్లువెత్తి పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది ఆయన వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటరు కాంగ్రెస్ కు పట్టం కట్టిన తరువాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ   బాత్ రూమ్‌లో జారీ పడి గాయపడి,   కాలికి   శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.   రేవంత్ సర్కార్ కొలువుదీరిన ఈ రెండు నెలలుగా ఆయన పొలిటికల్ గా ఏ మాత్రం యాక్టివ్ గా లేరు. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ రెండు నెలలలో బీఆర్ఎస్ పార్టీ   అటు అసెబ్లీలో కానీ కానీ ఎన్నికల సమీపిస్తున్న వేళ.. సుడిగాలి పర్యటనలు చేయాల్సి ఉంది. అందునా.. ప్రత్యర్థి పార్టీ అధినేత, సీఎం రేవంత్ రెడ్డి మాంచీ దూకుడు మీద ఉన్నారు. అలాంటి వారి వేగానికి ముక్కుతాడు వేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారని.. అందులోభాగంగానే వీల్ చైర్‌లో ఆయన.. తన ఎన్నికల ప్రచార పర్వానికి తెర తీయనున్నారని తెలుస్తోంది.  సింపతినే ఆస్త్రంగా చేసుకొని ఎన్నికలకు వెళ్లితే.. అనుకూలంగా ఫలితాల రాబట్టడంలో తిరుగుండదని... అందుకే వీల్ చైర్ మాంత్రాన్ని ఈ సారి కేసీఆర్ అండ్ కో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక.. గత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ అధినేత, సీఎం మమతా దీదీ.. వీల్ చైర్‌లో ప్రచారం చేసి.. సీఎం చైర్ అందుకొందని.. అలాగే రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్.. అదే విధంగా వ్యవహరించి.. 17 లోక్ సభ స్థానాల్లో కొన్ని స్థానాలనైనా కైవసం చేసుకొనేందుకు కేసీఆర్ పక్కాగా స్కెచ్ వేశారనే ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్ని లోక్ సభ స్థానాలు గంపగుత్తగా గెలుచుకొనేందుకు పథక రచనకు శ్రీకారం చుట్టారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది.  అలాగే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే.. పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు.. పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని.. అలాంటి వేళ.. వారి మధ్యే ఉంటూ.. వారితో నిత్యం వారిలో ఒకడిగా ఉండేందుకు కేసీఆర్ స్కెచ్ వేశారనే ఓ చర్చ సైతం నడుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు నోటిపికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు చేయి జారకుండా.. కేసీఆర్ అండ్ కో  పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.  అదీకాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగా.. ఒక్క రోజు కూడా ఆయన సెక్రటేరియట్‌కు రాలేదనీ.. కానీ ఓటమి తర్వాత.. ఆయన తన పంథాను మార్చుకొన్నారని సమాచారం. ఏదీ ఏమైనా... అధికారంలో వస్తే.. పదవి పదిలం అనుకున్నారే కానీ.. ఆ పదవి కట్టబెట్టిన ప్రజల సాధక బాధకాలు పట్టించుకోలేదని.. దీంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌ పార్టీని ఓటర్లు సర్వీసింగ్ సెంటర్‌కు పంపారని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది.

ఎన్ ఆర్ ఐ యశ్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ 

ఎన్ఆర్‌ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరుపై వైసీపీ ప్రభుత్వం  జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులను  హైకోర్టు రద్దు చేసింది.  దీనిపై ఈరోజు  హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటికే సీఐడీ అధికారులు యాష్‌కు 41A క్రింద నోటీసులు జారీ చేశారని కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.తల్లికి అస్వస్థత ఉండటంతో యశ్ గత నెలలో ఇండియా వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎపి పోలీసులు మాటు వేసి అరెస్ట్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టిడిపి నేత యశ్ ను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఫిభ్రవరి నాలుగో తేదీన యశ్ అమెరికా వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. 

తృటిలో తప్పిన ప్రమాదం...నారా భువనేశ్వరి సేఫ్ 

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి తృటిలో ప్రమాదం తప్పింది.  మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. విషయాన్ని తెలుసుకున్న పైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు గాల్లో ఎగిరిన తరువాత తిరిగి వీల్ బయటకు రావడంతో సేఫ్‌ ల్యాండింగ్ చేశారు పైలట్. ఈ విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు అధికారులు, ప్యాసింజర్లు ప్రయాణించారు. పైలట్ అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ఇరువురి ప్రమాణ స్వీకారానికీ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది. గవర్నర కోటాలో ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ లను రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  వీరిరువురి నియామకానికీ గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  అయితే వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.   దీంతో వీరిరువురూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  

ముద్రగడకు గవర్నర్ గిరి.. రాజ్యసభకు చిరు.. జగన్ తో బీజేపీ క్విడ్ ప్రోకో గేమ్!

ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రావాలన్నది నానుడి. ఏపీలో బీజేపీ అదే పని చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి బలం శూన్యం. కనీసం ఒక్కశాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఆ విషయాన్ని హుందాగా అంగీకరించడానికి ఆ పార్టీకి అహం అడ్డువస్తోంది. పరాన్న జీవిలా పక్క వాళ్ల ను బలహీనపరిచి తాను బలపడాలన్న కుయుక్తులకు తెర తీస్తోంది. ఏపీలో అత్యంత బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే.  ప్రస్తుతం అధికారంలో ఉన్నా.. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించినా జగన్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఎదురీదుతోంది. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే అసంతృప్తి ఆ పార్టీని దావాలనంలా దహించేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ  ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత వైసీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.  వైనాట్ 175 అన్న ధీమా నుంచి ఓడిపోయినా బాధపడను అని జగన్ స్వయంగా అంటున్నారంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అవగతమౌతుంది. ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గత ఎన్నికలలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని అత్యంత శక్తిమంతంగా వచ్చే ఎన్నికలకు రెడీ అయ్యింది. ఆ పార్టీకి జనసేనతో పొత్తు అదనపు బలంగా మారింది.  దీంతో ఏపీలో   బీజేపీకి అసలు స్పేస్  లేని పరిస్థితి.  అయితే  కేంద్రంలో అధికారంలో ఉండటం.. తన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందన్న భయం, ఎన్నికల వేళ మోడీ సర్కార్ అండ ఉంటే మేలన్న భావం వెరసి తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని భావిస్తున్నాయి.  కానీ బీజేపీ మాత్రం ఏపీలో విష రాజకీయాలకు తెరలేపింది. తెలుగుదేశం, జనసేన మధ్య కుదిరిన పొత్తును విచ్ఛిన్నం చేయడం,  లేక ఆ కూటమికి బలమైన వర్గాన్ని దూరం చేసి అధికారంలో ఉన్న జగన్ పార్టీకి మేలు చేసి అందుకు ప్రతిఫలంగా రాజకీయ లబ్ధి పొందడం అనే  వ్యూహంతో  పావులు కదుపుతోంది.  ఒక వైపు జనసేనతో మిత్రత్వం నెరపుతూనే మరో వైపు తెరవెనుక ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసి తన రహస్య మిత్రుడికి మేలు   చేసే ప్రయత్నాలను కొనసాగిస్తోంది.  తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఏపీ సీఎం జగన్, ఆయన పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తరుణంలో జగన్ కు ప్రయోజనం చేకూరేలా ఆ కూటమికి బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసే కుట్రకు బీజేపీ తెరలేపినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత సోదరుడు చిరంజీవికి యూపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేయడం, అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడకు గవర్నర్ పదవిని ఆఫర్ చేయడం ఈ వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి బీజేపీ, తెలుగు దేశం పార్టీ   ఎప్పటి నుంచో  మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయాయో అన్ని సార్లూ   కలిశాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృ మిత్ర  సంబంధాలు, తారు మారైన సందర్భాలు రాజకీయ చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు,అప్పట్లో, ఉభయ పార్టీ  నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సమయంలోనే  అటల్జీ, అద్వానీ  వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో  తెలుగుదేశం పార్టీని  విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రుడిగా పేర్కొన్నారు.  గౌరవించారు.  తెలుగుదేశం పార్టీ  కూడా బీజేపీకి అటువంటి మర్యాద గౌరవాన్నే ఇచ్చింది.  అలాగే, రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి.  రాష్ట్ర విభజన తర్వాత, ఉభయ పార్టీలు కలిసి పోటీ  చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలలో భాగస్వాములయ్యాయి.  అయితే, ఇదంతా గతం.  అటల్జీ, అద్వానీల నాటి  బీజేపీ వలే మిత్రధర్మం పాటించాలన్న ఉద్దేశం ఇప్పుడు మోడీ హయాంలోని బీజేపీకి ఇసుమంతైనా లేదు. అందుకే   ఒక్క తెలుగు దేశం పార్టీ మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు గౌరవం ఇవ్వకపోవడమే కాదు,  అవకాశం చిక్కితే వాటి అడ్రస్  గల్లంతు చేసేందుకు వెనకాడేది లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే  విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న తెలుగుదేశం సహా అనేక భాగస్వామ్య పక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. ఇప్పటికీ కేంద్రంలో ఉన్నది పేరుకు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమే అయినా, మోదీ మంత్రివర్గంలో  మిత్ర పక్షాలకు పెద్దగా వాయిస్  లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మిత్ర పక్షాల మంత్రులకు అంతకంటే  ప్రాధాన్యత లేదు. నిజానికి మోడీ,  షాలను మినహాయిస్తే బీజేపీ మంత్రులలో కూడా ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత ఉన్న దాఖలాలు కనిపించవు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ  నోటా తో పోటీ పడింది. పోటీ చేసిన స్థానాలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేదు.  అయితే   కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది.   ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మరోమారు తన మిత్రుడు జగన్ కు మేలు చేసి ఆ తరువాత రాజకీయ లబ్ధి పొందే  కుట్రలకు తెరలేపింది. అందులో భాగమే  ముద్రగడకు గవర్నర్ పదవి, చిరంజీవికి రాజ్యసభ ఆఫర్లు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపేందుకు రెడీ అయ్యింది. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ వ్యూహాలు ఏ మేరకు ఫలించాయి. అన్నది తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఏపీలో జగన్ సర్కార్ కు.. కేంద్రంలోని మోడీ సర్కార్ కు మధ్య క్విడ్ ప్రొకో సంబంధం ఉందని అంటున్నారు.