ప్రజల వినతులపై భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

 

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఇబ్బందులు పడుతోన్న తమను ఆదుకోవాలని పలువురు దివ్యాంగులు అభ్యర్థించగా వారికి భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరి దగ్గరకెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి విన్నపాలు విన్నారు. ఇబ్బందులు పడుతోన్న తమను ఆదుకోవాలని పలువురు దివ్యాంగులు అభ్యర్థించగా వారికి భరోసా కల్పించారు. పలువురు నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు స్థానం కల్పించాలని కోరారు. అనంతరం పలువురు సీఎం చంద్రబాబుతో సెల్ఫీలు తీసుకున్నారు.

స్పా సెంటర్‌ ముసుగులో వ్య‌భిచారం...ఇద్దరు యువతుల అరెస్ట్

  స్పా సెంట‌ర్  ముసుగులో వ్య‌భిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారమందుకున్న బద్వేలు అర్బన్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి స్పా సెంటర్ పై దాడి చేసి ఇద్దరు యువతుల తోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని నెల్లూరు రోడ్ బైపాస్ సర్కిల్ వద్ద గత ఏడాదిగా స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు.  స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు బద్వేలు అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలసి అర్ధరాత్రి తర్వాత స్పాసెంట‌ర్‌పై దాడి చేసి, అక్కడవున్న ఇద్ద‌రు యువ‌తులుతోపాటు,ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగాపోలీసులు అదుపులోకి తీసుకున్న యువ‌తుల‌ను మ‌హిళా సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించి,కేసు న‌మోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి యువతులను బద్వేల్‌కు రప్పించి నాలుగు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మహాత్ముడి పేరుతో వచ్చిన ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలి : సీఎం రేవంత్

  జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా  మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడుల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకా”న్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని CWC  తీర్మానించింది. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

మహాత్ముడి పేరుతో వచ్చిన ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలి : సీఎం రేవంత్

  జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా  మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడుల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు.  పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకా”న్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని CWC  తీర్మానించింది. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

దేశంలో వన్ మ్యాన్ షో...ప్రధానిపై రాహుల్ ఫైర్

  కేంద్ర క్యాబినేట్‌లో నిర్ణయించకుండనే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలిగించారని కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం రాహుల్  మీడియాతో మాట్లాడుతు నేరుగా ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకోవడం పేదల హక్కులను కాలరాయడమేనన్నారు. మోదీ కోరుకుంటే అదే అమలవుతోందని అన్నారు. దేశంలో వన్ మ్యాన్ షో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాంటి నియంతత్వ చర్యలపై పోరాటానికి కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రధాని  ఒంటి చేత్తో రాష్ట్రాలతో పాటు పేదల బతుకులపై దాడి చేశారన్నారు. నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏక పక్షంగా తీసుకున్నారని తెలిపారు. వీబీ- జీ-రామ్ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని రాహుల్ తెలిపారు.  జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు  లభించాయన్నారు. అటువంటి గొప్ప పథకాన్ని రద్దు చేయడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడేమనని రాహుల్ పేర్కొన్నారు.వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు నిరసనగా జనవరి 5నుంచి ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకా  MGNREGA బచావ్ అభియాన్ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  MGNREGA స్థానంలో ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వీబీ-జీ-రామ్-జీ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పని కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్" (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి పార్లమెంటు లోని ఊభయ సభలు ఆమోదం తెలిపాయి. 

ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదు…శివాజీ వివరణ

  ఇటీవల విడుదలైన ‘దండోరా’ సినిమా ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో సినీ నటుడు శివాజీ స్పందించారు. నోటీసులు అందుకున్న శివాజీ ఈరోజు ఉదయం మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళా కమిషన్ విచారణ ముగిసిన అనంతరం కార్యాలయం నుండి బయటకు వచ్చిన శివాజీ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడిన వారి తరఫున మహిళా కమిషన్ ప్రశ్నలు అడిగిందని, వాటికి తాను సమాధానాలు ఇచ్చానని శివాజీ తెలిపారు. ఎవరినీ కించపరచాలని లేదా నొప్పించాలనే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు.  సమాజంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యం లో భావోద్వేగానికి లోనై మాట్లాడిన మాటల్లో తప్పులు దొర్లాయని అంగీకరించిన శివాజీ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసు కుంటున్నట్లు ప్రకటించారు. “భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రంగా కొనసాగుతోంది. ఎవరైనా హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవస్థలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ నేను అనవసరంగా సల హాలు ఇచ్చానని ఇప్పుడు అర్థమైంది.  ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను” అని చెప్పారు. మహిళా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, అవసరమైతే మళ్లీ కమిషన్ ముందు హాజరవుతానని శివాజీ తెలిపారు. “కమిషన్ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తాను. అనవసరమైన ఆరోపణలకు స్పందించను” అని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు. అయితే తనపై కుట్ర జరుగుతోందని శివాజీ ఆరోపించారు. తనతో కలిసి కెరీర్ ప్రారంభించిన కొందరికి తనపై కోపం ఉందని, తన వ్యాఖ్యల అనంతరం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొందరు జూమ్ మీటింగులు కూడా పెట్టుకున్నారని తెలిపారు. నాకు చాలా సన్నిహితులుగా భావించిన వారు కూడా ఇలా కుట్ర చేస్తారని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పడం మానుకోవాలని నాకు అర్థమైందని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడినట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని శివాజీ అన్నారు. నేను ఏం తప్పు చేశానని నాపై ఇంత కోపం? తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం సహజం. ఎవరు ఎలా దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత విషయం. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యా నించారు. తన సినిమాకి సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే ఇంతటి వివాదం చెలరేగిందని శివాజీ అన్నారు. నేను సినిమాల్లో లేకపోతే వ్యవసాయం చేసుకొని బతుకుతాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు నా ఆత్మాభిమానం మాత్రమే ముఖ్యమని స్పష్టం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై ఒక వైపు రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండగా... మరోవైపు ప్రతి ఒక్కరు మహిళా కమిషన్ తదుపరి చర్యలపై ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు.. 31న తుది నోటిఫికేషన్

  ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పుచేర్పులతో ముందుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా... దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా... వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.  నెల్లూరు జిల్లాలోకే తిరిగి 5 మండలాలు  గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు.  మరోవైపు, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్‌ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు...ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా యధావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్పుచేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు...కవిత షాకింగ్ కామెంట్స్

  బీఆర్‌ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేశారని ఆరొపించారు. దీంతో  అది బ్లాస్టింగ్ చేయడంతో 3, 5వ మోటర్లు పని చేయడం లేదు. హరీశ్ రావు నిర్వాకం వల్ల ఈ రోజు కేవలం 3 మోటర్లే పనిచేస్తున్నాయి అని అన్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ‘జాగృతి జనం బాటలో’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్‌, పంప్ హౌస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై మాట్లాడిన కవిత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నప్పటికీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు.తెలంగాణకు కృష్ణా నది నుంచి 550 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా, అందులో కనీసం 299 టీఎంసీలను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించామని, అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు, వ్యవస్థలు ఎక్కడా పూర్తిగా నిర్మించలేదని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అది నిజమేనని కవిత అన్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్‌వన్ జిల్లా అని, అక్కడ 25 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయని స్పష్టం చేశారు.  

పుష్ప–2 తొక్కిసలాట…ఛార్జిషీట్ దాఖలు

  సంధ్య  థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం  23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య  థియేటర్‌ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుష్ప–2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు ఆ బాలుడు కోలుకోలేదు... ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చుతూ అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా, పోలీసుల దర్యాప్తు లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిసినా కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. చార్జిషీట్‌లో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సభ్యులు, అలాగే 8 మంది బౌన్సర్లు నిందితుల జాబితాలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరతారని తెలిసినా సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా సంధ్య థియేటర్‌కు వెళ్లడం, భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించడమే నేరంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లు ఛార్జిషీట్‌లో వివరించారు. ఈ తొక్కిస లాట ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేక్షకుల నియం త్రణకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా సిబ్బందిని సముచితంగా నియమించకపోవడం, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను పాటించకపోవడం వంటి అంశాలు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ కారణంగా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్‌పైనా అభియోగాలు నమోదు చేశారు.ఈ దుర్ఘటనలో ఓ మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్‌కు వచ్చిన కుటుంబం ఇలా విషాదంలో మునగడం ప్రజల హృదయాలను కలిచి వేసింది. బాధిత కుటుం బానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పలు వర్గాలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించనుండగా, కేసు తదుపరి విచారణకు వెళ్లనుంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ఎలా కొనసాగుతాయన్న దానిపై సినీ పరిశ్రమతో పాటు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ జనసమూహాలు పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత.. కారణమేంటో తెలుసా?

 విజయవాడ దుర్గగుడికి  విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుర్గ గుడి విద్యుత్ బకాయిలు 3 కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకూ పేరుకుపోవడంతో  ఏపీసీపీడీసీఎల్‌  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.   2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ శాఖ తెలిపింది. ఈ  బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాన పునరుద్ధరించాల్సిందిగా కోరింది.  అలాగే  అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అలాగే విద్యుత్ శాఖ బకాయిల గురించి చెబుతున్నది వాస్తవం కాదని దుర్గగుడి దేవస్థానం పేర్కొంది.  తమ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంటూ, నెట్‌ మీటరింగ్‌ కోసం విద్యుత్‌ శాఖను పలుమార్లు కోరినప్పటికీ సాంకేతిక కారణాలంటూ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను  ఏపీసీపీడీసీఎల్‌  నమోదు చేయలేదని దేవస్థానం ఆరోపించింది.  

రకుల్ సోదరుడి డ్రగ్స్ వ్యవహారం: పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు కొరడా ఝళిపిస్తూ ఉండడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే  అతడు అరడజను సార్లు  డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడిం చారు. ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి నుంచి నటి రకుల్ ప్రీత్ సింగ్  సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ఆన్‌లైన్  ద్వారానే నగదు బదిలీ చేశాడన్న ఆధారాలు లభ్యమయ్యాయి. అతడి  బ్యాంక్ లావాదేవీల వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింఘానియా సోదరుల మొబైల్ ఫోన్లలోని వాట్స్అప్ చాట్లను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, అందులో అమర్ సింగ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ డిమాండ్, డెలివరీ సమయం, చెల్లిం పుల వివరాలకు సంబం ధించిన సందేశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు వాట్స్అప్ చాట్లు ప్రధాన ఆధారాలుగా మారాయి. డ్రగ్స్ కొనుగోళ్ల లో అమర్ సింగ్ ఒంటరిగా కాకుండా యష్, ధరమ్ తేజ్ అనే వ్యక్తులతో కలిసి పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా కలిసి డ్రగ్స్ వినియోగించినట్టు, అవసరమైనప్పుడు ఒకరికొకరు సమకూర్చుకున్నట్టు సమా చారం. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలు అమర్ సింగ్‌కు డ్రగ్స్ డెలివరీ చేస్తున్న సమయంలోనే నిఘా పెట్టి పట్టుకున్నట్టు  వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కేసు మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ సర ఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.అసలు సింఘానియా సోదరుల నుంచి అమర్ సింగ్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎందుకు కొనుగోలు చేస్తున్నాడనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తు న్నారు. డ్రగ్స్‌ను స్వయంగా వినియోగించడానికేనా? లేక ఇతరులకు సరఫరా చేస్తున్నాడా? అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. అమర్‌ సింగ్ కు డ్రగ్స్ పార్టీలను నిర్వహించే అలవాటు ఉందని ప్రాథమికంగా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ పార్టీలకు హాజరైన వారిపై కూడా విచారణ చేపట్టే అవకాశముందంటున్నారు.ఈ కేసు ద్వారా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.