భార్యను కాపురానికి పంపడం లేదని మామను చంపిన అల్లుడు

  భర్త వేధింపులు భరించలేక  భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది... దీంతో ఆ భర్త ప్రతిరోజు అత్తగారింటికి వెళ్లి గొడవ పడుతూ చివరకు మామను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య (58) అనే వ్యక్తి తన కూతురు లక్ష్మిని గత కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ముగ్గురు కూతుర్లు ,ఒక కొడుకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు... రామకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు... ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించడం ఆ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చేస్తూ ఉండేవాడు. రామకృష్ణ తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వెంటనే భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త రామకృష్ణ అత్తవారింటికి వచ్చి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.  అల్లుడు రామకృష్ణ, భార్యను తిరిగి తమ కాపురానికి పంపడం లేదని అత్తమామలతో తరుచుగా గొడవ చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మామ చంద్రయ్యతో గొడవపడ్డాడు.. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.  కోపంతో రగిలిపోయిన అల్లుడు రామకృష్ణ కత్తితో ఒక్కసారిగా మామ చంద్రయ్యపై దాడి చేసి  కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా, వారిని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరించాడు.  మామను హత్య చేసిన అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు...  

బిల్లులందు పురుష బిల్లులు వేర‌యా!

  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ గురించి మ‌నం వినే  ఉంటాం. అలాంటిదిపుడు జాతీయ పురుష క‌మిష‌న్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 6న రాజ్య‌స‌భ‌లో ఒక బిల్లు ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే పురుషుల హ‌క్కుల సంర‌క్ష‌ణ‌, వారి సంక్షేమం వంటి విష‌యాల్లో ఈ బిల్లు  వారికి ఎంత‌గానో ఉప యోగ‌ప‌డుతుంది.  ఇంత‌కీ పురుషుల హ‌క్కులు అంటూ ఏవీ ఇప్ప‌టి వ‌ర‌కూ లేవు. మాన‌వ హ‌క్కులే పురుషుల హ‌క్కుల కింద‌కు వ‌స్తాయి. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కేటాయించేలాంటి  సీట్లు పురుషుల‌కంటూ ఉండ‌వు. ఇ ఇక రిజ‌ర్వేష‌న్ల‌లో ఓసీకంటూ ప్ర‌త్యేకించీ రిజ‌ర్వేష‌న్లుండ‌వు. ఎక‌నామిక‌ల్లీ బ్యాక్ వ‌ర్డ్ క్లాస్ ఎలాగో ఇది కూడా అలాంటిదేన‌ని చెప్పాల్సి వ‌స్తుంది.  అయితే,  ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్ర‌స్తుతం మూడు ర‌కాల‌ జండ‌ర్లు త‌యారై కూర్చున్నాయి. ఒక‌ప్పుడు ఆడ మ‌గ మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు థ‌ర్డ్ జండ‌ర్ ఒక‌టి త‌యారైంది. ఇక పురుషుడు అంటే ఎవ‌రు? అత‌డ్ని ఎలాంటి గుణ‌గ‌ణాల కొద్దీ డిసైడ్ చేస్తారు? అన్న‌ది కూడా చ‌ర్చ‌నీయంశ‌మే. ఈ విష‌యాల‌పై ఈ బిల్లు ద్వారా ఒక క్లారిటీ రావ‌ల్సి ఉంది. పురుషత్వం అంటే ఏమిటి? అన్న‌ది  కూడా ఒక‌ డిబేట‌బుల్ పాయింటే. ఇటీవ‌లి కాలంలో పుంస‌త్వ స్థాయిలు విప‌రీతంగా ప‌డిపోతూ వ‌స్తున్నాయ‌ని చెబుతున్నాయి కొన్ని గ‌ణాంకాలు.  దానికి తోడు రాన్రాను ఫిమేల్ డామినేష‌న్ పెరిగి మేల్ ఢ‌మాల్ అంటున్న ప‌రిస్థితి కూడా ఉంది. స‌హ‌జీవ‌నాలు పెరుగుతున్న ఈ కాలంలో, ఎల్జీబీటీ కి హై ప్ర‌యారిటీ ఇస్తోన్న ఈ సంద‌ర్భంలో.. పురుషుల హ‌క్కులు ప్ర‌శ్నార్ధ‌క‌మే. ప్ర‌స్తుత యువ‌త‌రం మాట అటుంచితే.. వీరి తండ్రుల త‌రంలో చాలా మంది భార్యా బాధితులున్నారు. వీరిపైన రివ‌ర్స్ లో గృహ‌హింస వంటి త‌ప్పుడు కేసులు పెడుతుంటారు. ఇలాంటి వాటిలో పురుష  క‌మిష‌న‌న్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందేమో చూడాలి. ఆపై గ‌త ఐదేళ్ల కాలంలో ఐదు రాష్ట్రాల్లో 785 మంది భ‌ర్త‌లు త‌మ త‌మ భార్య‌ల చేతిలో హ‌త‌మ‌య్యారు. అది కూడా వారి  వారి ప్రియుల సాయంతో ఆయా భార్యామ‌ణులు త‌మ  త‌మ భ‌ర్త‌ల‌ను చంపేసిన ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పురుష  క‌మిష‌న్ ఏదైనా పురుషుల‌కు  ర‌క్ష‌ణ క‌ల్పించ‌ గ‌ల‌దా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పురుషాధిక్య ప్ర‌పంచంగా పిలిచే ఈ స‌మాజంలో పురుషుల హ‌క్కుల‌కే ర‌క్ష‌ణ  లేకుండా పోవ‌డం కూడా తీవ్ర విషాద‌క‌రం. చ‌ర్చ‌నీయాంశం కూడా.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

  ఫోన్ ట్యాపింట్ ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావు ఇప్ప‌టి  వ‌ర‌కూ సుప్రీం ద్వారా  పొందుతోన్న తాత్కాలిక ర‌క్ష‌ణ  నుంచి బ‌య‌ట‌కొచ్చి ఏసీబీ వెంక‌టగిరి ముందు లొంగిపోమ‌ని ఆదేశించింది సుప్రీం  కోర్టు. దీంతో ప్ర‌భాక‌ర్ రావుకు ఇదొక షాకింగా మారింది. అలాగ‌ని ప్ర‌భాక‌ర్ రావును ఫిజిక‌ల్ గా టార్చ‌ర్ చేయొద్ద‌నీ.. థ‌ర్డ్ డిగ్రీ అస‌లే ప్ర‌యోగించ‌వ‌ద్ద‌ని  పేర్కొంది  సుప్రీం కోర్టు. ఇంత‌కీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏమిటి?  దీని  పూర్వాప‌రాలు ఎలాంటివి? అన్న‌దొక చ‌ర్చ‌గా మారింది. ఆ విష‌యాలేంటో చూస్తే.. మార్చి 2024లో పంజాగుట్ట స్టేషన్‌లో ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదు న‌మోద‌య్యింది. కేసు నమోదు నాటికి అమెరికాలో ఉన్నారు ప్రధాన నిందితుడైన‌ ప్రభాకర్‌రావును దేశానికి రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు పోలీసులు. విచారణకు రావాలంటూ ఆయనకు నోటీసులు  కూడా పంపించారు పోలీసులు. ఆరోగ్యం బాగోలేదని, ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక వస్తానంటూ సమాచారమిచ్చిన ప్రభాకర్‌రావు.. పోలీసులు ఇచ్చిన గడువు ముగిసినా హైదరాబాద్‌కు రాలేదు. దీంతో ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించారు పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్‌రావు 2025, మే 29న మూడు రోజుల్లో భారత్‌కు వచ్చి విచారణకు సహరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.  తాత్కాలిక పాస్‌పోర్ట్‌పై హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాకర్‌రావు. 2025 జూన్ 9, న జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు ప్రభాకర్‌రావు. జూన్‌లో మొత్తం 6 సార్లు విచారణకు హాజర‌య్యారు ప్రభాకర్‌రావు. జూన్ 11, 15, 17, 19, 20 తేదీల్లో ప్రభాకర్‌రావు విచారణ జ‌రిగింది. విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించ లేదాయ‌న. పోలీసులకే రివర్స్‌లో వార్నింగ్ ఇచ్చారు ట్యాపింగ్ కేసులోని ప్ర‌ధాన నిందితుడు ప్రభాకర్‌రావు. అన్ని రోజులు మీవే ఉండవనీ, మావి కూడా వస్తాయంటూ ప్రభాకర్‌రావు వార్నింగ్ పాస్  చేశారు.  ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇంతవరకూ జరిగిందేంటి? అని చూస్తే.. ఇంతవరకూ 270 మంది స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆరుగురు ప్రధాన నిందితులుగా గుర్తించారు. A1గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావు కాగా, A2గా ఇంటెలిజెన్స్ మాజీ DSP డి.ప్రణీత్‌రావు, A3గా ఇంటెలిజెన్స్ మాజీ ASP N.భుజంగరావు, A4గా ఇంటెలిజెన్స్ మాజీ ASP M.తిరుపతన్న A5గా టాస్క్‌ఫోర్స్ మాజీ DCP T.రాధాకిషన్‌రావుగా ఉన్నారు. ఇక A6గా ఐన్యూస్ ఛానల్ ఎండీ A.శ్రవణ్‌రావు, కేసులో అరెస్ట్‌ అయిన వారందరికీ బెయిల్ రాగా.. ప్రభాకర్‌రావుపై 68 పేజీల ఛార్జ్‌షీట్ వేసింది సిట్.   ఫోన్ ట్యాపింగ్‌లో వాంగ్మూలం ఇచ్చినవాళ్లు ఎవ‌ర‌ని చూస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్‌, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, TRMES చైర్మన్ ఫయీమొద్దీన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డీ గద్వాల్ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ కవిత పీఏ, డ్రైవర్‌, పనిమనిషి చక్రధర్‌గౌడ్ వంటి వారున్నారు.  విచారణకు హాజరైన వాళ్లు ఎవ‌రో చూస్తే.. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు మాజీ సీఎం కేసీఆర్ OSD రాజశేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉన్నారు. ప్రభాకర్‌రావును ఎలాంటి ప్రశ్నలు అడ‌గ‌నున్నారో చూస్తే.. - ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ఏ రాజకీయ నేతలు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారు?, రెండు ఐఫోన్లను అమెరికాలోనే ఎందుకు దాచిపెట్టి వచ్చారు?   హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయమని చెప్పిందెవరు?, ఎందుకు చెప్పారు?, SIB నుంచి మాయం అయిన హార్డ్‌డిస్క్‌లు ఎక్కడికి వెళ్లాయి?, రూల్ 419/419A ప్రకారం సంఘవిద్రోహ శక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉండగా.. రాజకీయ నేతల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేశారు?  ఫోన్ ట్యాపింగ్‌పై రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రశ్నలు వేసే అవకాశం క‌నిపిస్తోంది. ఫైన‌ల్ గా రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్స్‌కు హోం సెక్రటరీ, GAD ప్రిన్స్‌పల్ సెక్రటరీ, DGP అనుమతి ఇచ్చారా? అని ప్ర‌భాక‌ర్ రావును విచార‌ణాధికారులు అడిగేలా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే అస‌లు ప్ర‌భాక‌ర్ రావుకు ఈ క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే ఆయ‌న విచార‌ణ‌కు అస్స‌లు స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. దానికి  తోడు ఆయ‌న ఐ క్లౌడ్ పాస్ వ‌ర్డ్ చెప్ప‌కుండా డేటా మొత్తం డిలీట్ చేసిన‌ట్టుగానూ తెలుస్తోంది. దీంతో సుప్రీం కోర్టు మీరు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు కాబ‌ట్టి  అరెస్టు ముప్పు కొని తెచ్చుకున్నార‌ని వ్యాఖ్యానించింది.

లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్

  నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను ప్రయోగించారు. అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి, ముగ్గురినీ నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన అరుణ  అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలకు పాల్పడిన కేసు కూడా ఆమెపై ఉంది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలు ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో కోవూరు పోలీసులు ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచారు.అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.  ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు..అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్. జయప్రకాశ్‌, షేక్‌ షాహుల్‌ హమీద్‌లపైనా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.  

స‌రికొత్త సనాత‌న సార‌ధి.... సాయిరెడ్డి!?

  విజ‌య‌సాయి రెడ్డి హిందుత్వ వైపు అడుగులు వేస్తున్నారా? ఎందుకీ మాట అనాల్సి వ‌స్తోంది? జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  సాయిరెడ్డి స‌నాత‌న‌త్వం అని ఒక‌టి వెలుగు చూస్తోందా? ఇలా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంద‌ని చూస్తే ముచ్చ‌ట‌గా మూడు కామెంట్ల‌లో ఆయ‌న  ప్ర‌య‌త్నం, ప్ర‌యాణం, ప‌ద ప్ర‌యోగం ఏంటో చూడొచ్చు.. అందులో భాగంగా స్టెప్ వ‌న్.. ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న వైసీపీ  నుంచి అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి  పేరు ప‌దే ప‌దే చెప్పారు.  తాను రాజ‌కీయ స‌న్యాసం  త‌ర్వాత వ్య‌వ‌సాయం  చేస్తాన‌ని  చెప్పుకొచ్చారు. వీలుంటే  మీడియా సంస్థ పెడ‌తానేమోగానీ రాజ‌కీయాల్లోకి రాను. రాలేను. రాబోను.. అంటూ కుండ  బ‌ద్ధ‌లు కొట్టారు. క‌ట్ చేస్తే మ‌రో కీల‌క‌మైన కామెంట్ ఏం చేశారో చూస్తే.. సిక్కోలు గ‌డ్డ మీద నుంచి తాను ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని.. బీజేపీలో చేర‌బోతున్న మాట అవాస్త‌వ‌మ‌నీ.. అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అదే స‌మ‌యంలో ఆయ‌న అవ‌స‌ర‌మైతే పార్టీ పెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌న‌ని అన్నారు.  ఈ టైంలో ఆయ‌న చివ‌రాఖ‌రిగా అన్న మాట‌లేంట‌ని చూస్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న‌కు రెండు ద‌శ‌కాల‌కు పైగా  సాన్నిహిత్య‌ముంద‌ని ఒక చిన్న‌హింట్ ఇచ్చారు. సేనాని ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో మ‌నంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రిగిన‌ మురుగ‌న్ మానాడుకు హాజ‌ర‌య్యారు.  నిన్న మొన్న  త‌మిళ కార్తీక దీపోత్స‌వం వ్య‌వ‌హారంలో తీర్పునిచ్చిన స్వామినాథ‌న్ అనే ఒకానొక జ‌డ్జిపై ఇండి కూట‌మి ఎంపీలు అవిశ్వాసం పెట్టే  య‌త్నం జ‌రిగింది. ఇలాంటి విష‌యాల్లో హిందుత్వ వాదుల వైపు పోరాడ్డానికి స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్యావ‌శ్య‌కంగా సెల‌విచ్చారు సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.  రీసెంట్ గా విజ‌య‌సాయి రెడ్డి  హిందుత్వ ప్రోగా అన్న మాట‌ల విష‌యానికి వ‌స్తే.. హిందూ దేవాలయాలపై ఒక‌ ట్వీట్ చేశారు. దీని సారాంశ‌మేంటో చూస్తే.. హైంద‌వ‌ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.. దేవాలయాలపై ప్రభుత్వ  నియంత్రణ- ఆర్టికల్ 14కు విరుద్ధమని అన్నారు.  ఇతర మతాలకు చెందిన ప్రార్ధ‌నాలయాలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయనీ.. అన్ని మతాలకు సమానత్వం కల్పించాలనీ కోరారు స‌రికొత్త స‌నాత‌న సార‌ధి సాయిరెడ్డి. రాజ్యంగ బద్ధంగా మతాల మధ్య సమానత్వం ఉండాలనీ.. ప్రస్తుత విధానాలను కేంద్రం పున:పరిశీలించాలనీ డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. హోంమంత్రి అమిత్ షా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలని కూడా కోరారాయన. వీట‌న్నిటిని బ‌ట్టీ.. సాయిరెడ్డి పోక‌డ చూస్తుంటే హిందుత్వ‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీజేపీలో చేర‌డ‌మా?  లేక స‌నాత‌నాన్ని భుజానికెత్తుకుని తిరుగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేర‌డ‌మా రెండిట్లో ఏదో ఒక‌టి జ‌రగ‌డం ఖాయంగా తెలుస్తోందంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. ఎనీహౌ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ఫ‌ర్ యువ‌ర్ లేటెస్ట్ స‌నాత‌న సార‌ధ్యం అని మ‌నం కూడా ఓ శుభాకాంక్ష‌లు చెప్పి ఉంచుదాం. ఎప్ప‌టికైనా ప‌నికొస్తుందేమో చూద్దాం.

ర‌జ‌నీకాంత్‌కి చంద్ర‌బాబు....అంటే ఎందుకంత ఇష్టం!?

  ఏ ట్రిబ్యూట్ టు త‌లైవ అంటూ షారుక్ ఖాన్ త‌న చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగి డ్యాన్స్ పెట్టాడంటే.. ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన షారుక్ కి బాలీవుడ్ బాద్షా వంటి బిరుదులున్నాయి. అంటే ఆయ‌న మార్కెట్ ర‌జ‌నీ మార్కెట్ క‌న్నా ఎంతో పెద్ద‌ది. ఆయ‌న నెట్ వ‌ర్క్, నెట్ వ‌ర్త్ ఎంత లార్జ్ అయినా స‌రే ర‌జ‌నీకాంత్ కి ఎంత విలువ ఇచ్చారో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క‌.  ఇది ఎప్పుడో పాత‌కాలం ముచ్చ‌టే కాద‌న‌డం లేదు. కానీ ర‌జ‌నీకి బాబా సినిమా  కాలం నాటి నుంచే దేశ విదేశీ అభిమాన భ‌క్తులున్నారు. తొలి ద‌క్షిణాది  పాన్ వ‌ర‌ల్డ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంతంటే  అతిశ‌యోక్తి కాదేమో. అంత‌గా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన ఫ్యాన్ మెయిల్ ప్ర‌పంచ‌మంతా ప‌రిచేశారు. ఇక త‌మిళులు అధికంగా  ఉండే మ‌లేసియా, సింగ‌పూర్ లో ఆయ‌న అభిమాన‌గ‌ణం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. న‌ట‌న ప‌రంగా  క‌మ‌ల్ హాస‌న్  ని కొట్టే వాడు లేక పోయినా.. ఆయ‌నంత అందం, అభిన‌యం లేక పోయినా త‌న‌దైన స్టైల్లో ర‌జ‌నీ మాస్ ప్రేక్ష‌క జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డం  పీహెచ్డీ  చేయ‌ద‌గ్గ‌ర స‌బ్జెక్ట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ర‌జ‌నీకాంత్ జాలి, ద‌య‌.. దాన గుణాల గురించి చెబితే ఒక నాన్ డీటైల్డ్ బుక్ లో పెట్ట ద‌గ్గ‌ అతి పెద్ద పాఠ‌మే అవుతుంది. త‌నను తొలినాళ్ల‌లో ఆద‌రించిన వారెవ‌రినీ ఆయ‌న మ‌ర‌చి పోలేదంటారు.  తాను వేషాల కోసం వెతుక్కుంటున్న రోజుల్లో పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితుల్లో కాసింత ఎక్కువ ప్ర‌సాదం పెట్టిన పూజారి  ర‌జ‌నీకి ఇంకా గుర్తే. త‌న  డ్రైవ‌ర్ ఇంటికి చాటుగా వెళ్లి వారికి కొత్త ఇల్లు కొనిచ్చిన ర‌జ‌నీ దాతృత్వం కూడా చాలా చాలా పెద్ద‌ది. ర‌జ‌నీకి ఎదురుప‌డ్డ ఎవ‌రైనా స‌రే, ల‌బ్ధి  పొందాల్సిందేనంటారు. అంత‌గా ఆయ‌న ఫీల‌వుతార‌ని  చెబుతారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఆయ‌న ఎప్పుడైనా హైదరాబాద్ వ‌స్తే మోహ‌న్ బాబు గెస్ట్ హౌసుల్లో దిగుతుంటారు. రాత్రి పూట సిట్టింగ్ కి ఏర్పాట్లు చేసే ఆఫీసు బాయ్ కి కూడా ఆయ‌న 500లో, వ‌య్యో చేతిలో పెడ‌తారట‌. ఈ విష‌యం ఆ ఆఫీస్ బాయ్ గ‌ర్వంగా  చెప్పుకుంటాడు. ఇక సింప్లిసిటీ విష‌యంలో ర‌జ‌నీ త‌ర్వాతే  ఎవ‌రైనా. ఒక సాదా సీదాగా కృష్ణానగ‌ర్, ఇంద్ర‌న‌గ‌ర్ గ‌డ్డ మీద సాయం కాలం వేడి  వేడి పునుగుల‌ను తిన్న ఉదంతాలున్నాయి. ఒక  సాధార‌ణ ప్ర‌యాణికుడిలా..  హిమాల‌యాల‌కు వెళ్ల‌డం వంటి వార్త‌ల‌ను త‌ర‌చూ వింటూనే ఉంటాం. ఆయ‌న మొన్నా మ‌ధ్య శ్రీశైలం వెళ్లి అక్క‌డ ద‌ర్శ‌నం ముగిశాక‌.. రోడ్డుపై కూర్చుని ఉంటే, ఒక మ‌హిళా భక్తురాలు ప‌ది రూపాయ‌ల‌ను దానం చేసింద‌న్న వార్త గుప్పు మంది. దీన్నిబ్ట‌టీ ఆయ‌న ఎంత  సింపుల్ గా  క‌నిపిస్తారో చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ  పోతే ర‌జ‌నీకాంత్ గురించిన విశేషాలు కోకొల్ల‌లు. దాదాసాహేబ్ తో పాటు ప‌లు ప‌ద్మ అవార్డుల‌తో పాటు ఇంకా ఎన్నో ఘ‌న‌కీర్తులు సాధించిన ర‌జ‌నీకాంత్ మార్కెట్ స్టామినా ఎంత స్ట్రాంగ్ అంటే రీసెంట్ గా ఆయ‌న జైల‌ర్ అనే మూవీ రూ.500 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించింది. సూప‌ర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ సూప‌ర్ స్టార్ అన్న పేరు సాధించారు.  75 ఏళ్ల వ‌య‌సులోనూ ఇంకా మార్కెట్ రారాజుగా వెలుగొందే ర‌జ‌నీకాంత్ రాజ‌కీయంగా అడుగులు వేయాల‌ని భావించారు. కానీ, ఆయ‌న త‌మిళ‌నాడు లోక‌ల్ కాదు. ఎక్క‌డో మ‌హారాష్ట్ర‌లో పుట్టి క‌ర్ణాట‌క‌లో పెరిగిన వాడు కావ‌డం వ‌ల్ల‌... ఆయ‌న‌కు త‌మిళ‌నాట రాజ‌కీయం చేయ‌డానికి త‌గిన ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. ర‌జ‌నీకాంత్ అంటే చ‌ప్పున గుర్తుకు వ‌చ్చేది ఒక‌టి ఉంది. అదే  కండ‌క్ట‌ర్ టు సూప‌ర్ స్టార్ గా ఆయ‌న ఎదుగుద‌ల దాని ప‌రిణామ క్ర‌మం. అంతే కాదు.. తొలినాళ్ల‌లో నెగిట‌వ్ కేరెక్ట‌ర్స్ కెరీర్ స్టార్ట్ చేసి ఆపై ఒకానొక‌ సూప‌ర్ స్టార్ గా ఎద‌గ‌డం ఎలా.. అన్న‌ది. ఈ విష‌యంలో ఆయ‌నొక  రూట్ మ్యాప్ వేసి  సినీ గైడ్ గా అవ‌త‌రించారన‌డం అబ‌ద్దం కాదేమో. ఈ పంథాలో తెలుగులో చిరంజీవితో పాటు మ‌రెంద‌రో త‌మిళ, మ‌లయాళ, క‌న్న‌డ‌ హీరోలు సైతం ఫాలో అయ్యారంటే అతిశ‌యం కాదు.  ఇక‌ 1995లో విడుద‌లైన ర‌జ‌నీకాంత్- బాషా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే అది తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ, క‌న్న‌డ అన్న భాషా బేదాల్లేకుండా ఇర‌గ‌దీసేసింది. ఆ త‌ర్వాత బాషాలాంటి ప్యాట్ర‌న్  తో వ‌చ్చిన సినిమాల ప‌రంప‌ర  కూడా లెక్క‌లేన‌న్ని.  ఇదొక స‌క్సెస్ ఫుల్ సినీ ఫార్ములాగానూ చెలామ‌ణి అయ్యిందంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఇంపాక్ట్ ఆఫ్ ర‌జ‌నీకాంత్ ఆన్ సౌత్ సినిమా ప‌వ‌రేంటో. తెలుగు రాజ‌కీయాల‌తో కూడా ర‌జ‌నీకాంత్ కి ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఇటీవ‌ల  ఆయ‌న ఏపీలో జ‌రిగిన‌ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి  ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యారు. బేసిగ్గా ర‌జ‌నీకాంత్ తాను రాజ‌కీయాల్లో రాణించ‌లేక పోయినా.. చంద్ర‌బాబు, ఆయ‌న మార్క్ పాలిటిక్స్ అంటే ఎంతో విలువ‌నిచ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారు. గ‌తంలో చంద్ర‌బాబు సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా  ఉండ‌టం కూడా ర‌జ‌నీతో ప‌రిచ‌యానికి ఒక కార‌ణంగా  చెబుతారు కొంద‌రు.  దానికి తోడు ఒకానొక రోజుల్లో సీఈఓ ఆఫ్ ద స్టేట్ గా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు అతీతంగా సాధించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి సైతం ర‌జ‌నీకీ బాగా  ఇష్టం. అందుకే ఆయ‌న బాబును ఎంత‌గానో అభిమానిస్తారు. త‌న‌కు కోట్లాది మంది అభిమానులున్నా.. తాను మాత్రం బాబుకు పెద్ద ఫ్యాన్ అంటూ బాహ‌టంగానే ప్ర‌క‌టిస్తారు ర‌జ‌నీకాంత్.  త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ర‌జ‌నీ  ప్ర‌భావం ఎంత అంటే  సాక్షాత్ ప్ర‌ధాని  మోడీయే పంచ క‌ట్టుకుని ర‌జ‌నీని వ‌చ్చి క‌లిశారంటే దటీజ్ మేజిక్ ఆఫ్ సూప‌ర్ స్టార్.  అలాంటి ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం నార్త్ లో బిగ్ బీ అమితాబ్ ఎలా నాన్ స్టాప్ సినీ మార‌థాన్ చేస్తున్నారో.. సౌత్ లో అక్కినేని త‌ర్వాత అంత‌టి మూవీ  మార‌థాన్ చేస్తున్న వ‌న్ అండ్ ఓన్లీ ర‌జ‌నీకాంత్. హ్యాపీ బ‌ర్త్ డే ర‌జ‌నీ సార్!   

జూబ్లీహిల్స్ పీఎస్‌లో లొంగిపోయిన ప్రభాకర్ రావు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.  కోర్టు ఆయనపై ఉన్న ముందస్తు బెయిల్‌ను సడలిస్తూ వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆయన సిట్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రభాకర్‌రావు తన సెల్‌ఫోన్ పాస్‌వర్డ్‌లు ఇవ్వడానికి నిరాకరించినట్లు సిట్ తన పిటిషన్ లో పేర్కొంది. అదేవిధంగా, సెన్సిటివ్ సమాచారం ఉన్న దశాబ్దాల డేటాను ధ్వంసం చేయించినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది.ఇంకా ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న ముఖ్యమైన వివరాలను కూడా ప్రభాకర్ రావు దాచి పెడుతున్నారని కస్టోడియల్ విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అందచేత ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ రద్దుచేసి కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పిటిషన్ లో పేర్కొంది.  ఈ మేరకు సుప్రీంకోర్టు సిట్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపి... ముందస్తు బెయిల్ ను సడలిస్తూ... వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు నేటి నుంచి వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు.  కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రభాకర్‌రావును జాయింట్ సీపీ తఫ్సర్ ఇక్బాల్ నేతృత్వంలోని సిట్ ప్రశ్నిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని రూల్ నెంబర్ 419, 419A ఉల్లంఘిస్తూ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అనుమతి లేకుండా ట్యాప్ చేసినట్లు గుర్తించారని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా మొత్తం 26 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో 7 కొత్త హార్డ్‌డిస్క్‌లను రీప్లేస్ చేసిన అంశంపై కూడా లోతుగా విచారిస్తోంది.ధ్వంసం చేసిన డిస్క్‌లను ఎక్కడ దాచి పెట్టారనే కీలక ప్రశ్నకు సమాధానం కోసం సిట్ కస్టడీ విచారణను అత్యంత వేగవంతం చేసింది.     

సిమెంట్ బస్తాలు కూలి కార్మికులకు తీవ్ర గాయాలు

  సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ సిమెంట్ గోడౌన్‌లో గురువారం రాత్రి సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాల లాట్ ఒక్కసారిగా కూలిపడడంతో అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని బొల్లారంలోని ఫస్ట్ ఛాయిస్ పరిశ్రమకు చెందిన సిమెంట్ నిల్వ గోడౌన్‌లో కార్మికులు రోజువారీగా సిమెంట్ మరియు అనుబంధ పదార్థాల బస్తాలను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తున్నారు.  ఇదే సమయంలో సిమెంట్ తయారీలో వినియోగించే లెడ్ క్రీమ్ బస్తాలు పెద్ద ఎత్తున ఒకేసారి కుప్పకూలి కార్మికులపై పడ్డాయి.ఈ ఘటనలో కార్మికులు అక్కడికక్కడే అమాంతం నేల మీద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.సహచరులు వెంటనే గాయపడిన వారిని బొల్లారంలోని PBR హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు తొమ్మిది మందిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బొల్లారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. గోడౌన్‌లో జరిగిన ఈ ప్రమాదానికి  భద్రతా ప్రమాణాలు పాటించాయా లేక నిర్లక్ష్యం కారణమా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్

  విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి లోకేశ్  ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో కార్యాలయం ఏర్పాటైంది. వెయ్యి సీటింగ్‌ కెపాసిటీతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ‘కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించాం. అందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఐటీ క్యాంపస్‌ను సంస్థ మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనుంది. తద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది.   

ట్యూషన్ టీచర్ దారుణం... ఏడేళ్ల బాలుడిపై అట్లకాడతో దాడి

  పిల్లల్లో కొంతమంది చదువులో ముందుంటారు. మరి కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ట్యూషన్ పెట్టించి తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు కూడా తమ చిన్నారి బాలుడిని ట్యూషన్ కి పంపించారు. కానీ ట్యూషన్ టీచర్ ఆ బాలుడు పై చేసిన దారుణం . ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణమైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఓ ట్యూషన్ టీచర్ చదవడం లేదనే పేరుతో ఏడేళ్ల చిన్నారిపై అమానుషంగా దాడి చేసిన ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో భయభ్రాంతులకు గురిచేసింది.. ఓయూ కాలనీకి చెందిన  వల్లు తేజ నందన్ రెగ్యులర్‌గా ట్యూషన్‌కు వెళ్లేవాడు. అయితే చదువుపై దృష్టి పెట్టడం లేదన్న కారణంతో ట్యూషన్ టీచర్ శ్రీ మానస ఆగ్రహం చెంది చిన్నారిపై తీవ్ర హింసకు పాల్పడినట్టు తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. చిన్నారి తేజ నందన్ చేతులు, కాళ్లు, ముఖం తదితర భాగాలపై మొత్తం ఎనిమిది చోట్ల అట్లకాడతో కాల్చినట్టు బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి శరీరంపై గాయాలు చూసిన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు .ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం బాలుని ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, కాళ్లపై గాయాల కారణంగా నడవడంలో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. చిన్నారిపై అట్లకాడతో దాడి చేసిన టీచర్ శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, మహారాష్ట్రలోని లాతూర్‌లో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అలంకరించిన శివరాజ్ పాటిల్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ  ప్రభుత్వాల్లో రక్షణ, వాణిజ్యం, శాస్త్ర సాంకేతికత, పౌర విమానయానం వంటి పలు కీలక శాఖలకు మంత్రిగా సేవలందించారు.  2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ పాటిల్, 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా ఆయన సేవలందించారు. శివరాజ్ పాటిల్ మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సైతం తీరని లోటు అని రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. 

దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీ భగ్నం..!

  మోయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్ హౌస్‌లో గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగిన బర్త్‌డే పార్టీపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. దాడుల సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయనతో ఉన్న మాధురి, అలాగే పలువురు వ్యక్తులు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ప్రాంగణంలో అనుమతి లేని మద్యం బాటిళ్లు స్వాధీనం చేసినట్లు అధికారులు తెలిపారు. 2024లో వ్యక్తిగత సమస్యల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి కలసి నివసిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 12 మాధురి పుట్టినరోజు కావడంతో ఈ వేడుక కోసం ఫామ్ హౌస్‌ను బుక్ చేసినట్లు తెలిసింది. పార్టీ ప్రదేశంలో మద్యం మాత్రమే కాకుండా ఇతర మత్తు పదార్థాలు కూడా ఉన్నాయనే సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులతో కలిసి ఎస్ఓటీ బృందం సంయుక్త దాడి జరిపి, జరుగుతున్న హంగామాను నిలిపివేశారు. దాడుల అనంతరం స్వాధీనం చేసిన వస్తువులు, అక్కడ ఉన్న వారి వివరాలు ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పార్టీ నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఉందో, అనుమతి లేకుండా ఎలా వేడుక జరగిందో అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహించి పార్టీలో దొరికిన వస్తువులపై సీరియస్  SOT పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేశారు...ఈ పార్టీ లో మద్యం తో పాటు మత్తు పదార్థాలు కూడా ఉన్నట్లు సమాచారం... దువ్వాడ శ్రీనివాస్, మాధురి తో పాటు పలువురు నాయకులు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మద్యం సేవిస్తూ... డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో దువ్వాడ శ్రీనివాస్ కనిపించగానే ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం పోలీసులు మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గోన వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పార్టీ నిర్వాహకుడు పార్థసారథి, అలాగే ఫామ్‌హౌస్ యజమాని సుభాష్ పై ఎక్సైజ్ యాక్ట్ 223, 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా, ఈ పార్టీలో దువ్వాడ మాధురి, శ్రీనివాస్ సహా మొత్తం 29 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.రైడ్ సమయంలో 10 మద్యం బాటిళ్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన అనుమతులు లేకుండా మద్యం పార్టీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  

అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం...9 మంది మృతి

  అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో యాత్రికుల ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది.  దీంతో 9 మంది మృతి చెందగా పలువురికి గాయలపాలయ్యారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.  భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల బస్సు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఘటన గురించి తెలియగానే ఆయన అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించామని, వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.  ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.  

పలు అభివృద్ధి పనులకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

  సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో  44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను మంత్రి పార్థసారథి తెలిపారు. అమృత్ 2 లో భాగంగా 2026 మార్చి 31 కల్లా పెండింగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిందని.. అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు.  ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో E 3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించామన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‍లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.532 కోట్లతో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు కల్పించింది.  

ఈ నెల 26న రంగానాడు... పవన్, జగన్‌లపై కాపు నేతల్లో అసంతృప్తి

  వంగవీటి రంగా ఆశయ సాధనను కొనసాగించి, బడుగు బలహీన వర్గాలకు గొంతుకయ్యే లక్ష్యంతో రాధా -రంగా మిత్రమండలి, సుదీర్ఘ విరామానంతరం ‘రంగానాడు’ పేరిట భారీ బలప్రదర్శనతో బహిరంగసభకు సన్నద్ధమవటం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 26న రంగా వర్ధంతి నాడు విశాఖ తీరంలో జరగనున్న సభకు లక్షమందికి పైగా హాజరవుతారన్నది నిర్వహకుల అంచనా. ఆ మేరకు టీడీపీ-జనసేన-వైసీపీకి చెందిన కాపు-మున్నూరు కాపులతోపాటు.. మందకృష్ణమాదిగ, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావును కూడా ఆహ్వానించారు.  విశాఖ జిల్లాలోని కాపులు, విజయనగరం-శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని తూర్పు కాపులు.. సమీపంలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులతో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా, రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషించాలన్నది రంగానాడు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది కాపులకు సంబంధించిన సభ కాదు. రంగా అభిమానులది. రంగాకు అన్ని కులాల్లోనూ అభిమానులున్నారు. ఇది కులసభ కాదు. అందుకే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, బీసీ నాయకుడు, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావు హాజరవుతున్నారు. రంగా 38వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏవిధంగా కొనసాగించాలన్నదే ఈ సభ అజెండా.  ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతామని రాయలసేన కన్వీనర్ పోరుమామిళ్ల ఈశ్వర్ రాయల్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కాపుల్లో నెలకొన్న గందరగోళం, కాపు సంఘాల అసంతృప్తి పరిశీలిస్తే.. విశాఖ సభ కాపుల బలప్రదర్శనగానే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి రాకముందు తాము పెట్టుకున్న ఆశలు, అంచనాలు తల్లకిందులయ్యాయని.. తమ కులానికి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, కాపు సంఘాలు ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ మాకేదో చేస్తారని, మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారని ఆశించి జనసేన- ఆ పార్టీ మద్దతునిచ్చిన టీడీపీకి ఓట్లు వేశాం. మాకు ఇష్టం లేకపోయినా పవన్‌ను చూసి, జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీకి ఓట్లు వేశాం. కానీ అసలు పవన్ కాపు సంఘాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు. కాపు సంఘాలను దగ్గరకే రానీయడం లేదు. గతంలో మనకు టీడీపీలో ప్రాధాన్యం ఉండేది. చంద్రబాబు మనల్ని బాగా చూసుకున్నారని కాపు నేతలు అంటున్నారు. ఇప్పుడు కూటమిలో పవన్ ఉన్నందున ఆ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మనం వెళ్లి టీడీపీ కాపు ఎమ్మెల్యేలకు సమస్యలు చెబితే.. పార్టీ మమ్మల్నే పట్టించుకోవడం లేదు. ఇక మేం మీకేం చేయగలం? పరిస్థితులు అప్పటిలా లేవు. మీరు వెళ్లి పవన్‌ను కలవండి అని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పవన్ తమతో ఉన్నందున మిగిలిన కాపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధోరణిలో టీడీపీ ఉంది.  దీనితో మనం రెంటికీ చెడ్డ రేవడి అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చూస్తే జగన్ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో మీరే ఆలోచించి చెప్పండి అంటూ వనభోజనాల్లో కాపు సంఘ నేతలు, తమ కులస్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా విశాఖలో ఈనెల 27న జరగనున్న కాపునాడులో.. ఈ అసంతృప్తి ప్రతిబించబోతోందని, కాపు నేతలు జోస్యం చెబుతున్నారు.  

సుప్రీం ఆదేశాల మేరకు సరెండర్ అయిన పిన్నెల్లి బ్రదర్స్

  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో గురువారం ఉదయం (ఈ నెల11న) మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు.  తెలంగాణలోని బంధవుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరినీ బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

15 ఏళ్ల తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సచిన్

  భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ రంగంలో ఆయన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలవబడుతున్న సచిన్ టెండుల్కర్ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన ఎంట్రీకి సాయపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్‌ నిలబెట్టుకున్నానని సచిన్ తెలిపారు.  భారత్ తరఫున 1989 నవంబరులో సచిన్‌ టెండుల్కర్‌ పాకిస్థాన్ తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎంట్రీ కంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున సచిన్‌ సెంచరీ బాదారు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టారు. మ్యాచ్ లో సెంచరీ చేయకుండా ఉంటే.. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం ఆలస్యంగా జరిగేది. అయితే గురుశరణ్ సింగ్ త్యాగం కారణంగా సచిన్.. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం త్వరగా జరిగింది. ఈ విషయాన్ని సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవలే స్వయంగా వెల్లడించారు. 1989 ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్‌ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్‌ సింగ్‌ విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సచిన్‌ శతకం బాదే వరకు ఎంతో సహకారం అందించాడు. చివరకు సచిన్ శతకం చేసి.. సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. ఆ సందర్భంలో గురుశరణ్‌ సింగ్‌ త్యాగానికి ప్రతిగా.. సచిన్‌ అతడికి ఓ మాట ఇచ్చాడు.  దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. "రిటైర్‌ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్‌ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను. గురుశరణ్.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావు. అలా నువ్వు రిటైర్‌ అయ్యి బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ కోసం ప్లేయర్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతానని చెప్పాను. పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నాను. అతడి కోసం బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ ఆడాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నారు.

40 ఏళ్ల స‌మ‌స్య‌కు హైడ్రా ప‌రిష్కారం

  హైద‌రాబాద్‌ నగరంలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ ప్రాంతంలోని మ‌ణెమ్మ గ‌ల్లీ నివాసితులు హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్ ని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 40 ఏళ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారంటూ శాలువ‌ను క‌ప్పి అభినందించారు.  డ్రైనేజీ పైపులైన్లు త‌మ స్థ‌లంలోంచి వెళ్లాయ‌ని 50 ఏళ్ల క్రితం అక్క‌డివారు అడ్డుకున్నారు. అప్ప‌టి నుంచి వివాదం కొన‌సాగ‌డం.. భూగ‌ర్భ డ్రైనేజీ పైపులైన్లు దెబ్బ‌తిన‌డంతో మురుగు, వ‌ర‌ద నీరు నిలిచిపోయి ఇబ్బందులు ప‌డ్డామ‌ని.. పైపులైన్ల పైన వేసి దారి కూడా బంద్ అవ్వ‌డంతో న‌ర‌కం చూశామ‌ని కాలనీ వాసులు వాపోయారు. హైడ్రా రాక‌తో ఈ ఇబ్బందుల‌న్నీ తొల‌గాయ‌ని ఈ సంద‌ర్భంగా ప‌లువురు తెలిపారు.  గ‌త ఏడాది ఆగ‌స్టు 28న హైడ్రా క‌మీష‌న‌ర్ నేరుగా ప‌రిశీలించి స‌మ‌స్య‌ను తెలుసుకుని.. అదే నెల 30వ తేదీన ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కోర్టు వివాదాల‌తో ర‌హ‌దారి, భూగ‌ర్భ డ్రైనేజీ నిర్మాణం ఆల‌స్య‌మైంద‌న్నారు. చివ‌రికి కోర్టు తీర్పుతో ఇటీవ‌ల ప‌నులు పూర్త‌య్యాయ‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. మరోవైపు మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్ స‌ర్వే నంబ‌రు 191లో 10 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ రూ. 750 కోట్లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఇక్క‌డ ప్ర‌భుత్వ భూమి క‌బ్జా జ‌రుగుతుంద‌ని స్థానికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి విచారించింది.   ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకుంది.  హైడ్రా క‌మిష‌న‌ర్   ఆదేశాల మేర‌కు శాశ్వ‌త నివాసాల జోలికి వెళ్ల‌కుండా.. మిగ‌తా షెడ్డుల‌ను, ప్ర‌హ‌రీల‌ను తొల‌గించి.. 10 ఎక‌రాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు లు ఏర్పాటు చేసింది .  

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  మంత్రి కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారిస్తూ, కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ, 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని కోర్టు పేర్కొన్నాది. గతంలో  అక్కినేని  నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా   తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని  అని, రేవ్ పార్టీలు నడుపారని విమర్శించారు.  టాలీవుడ్ నటులు నాగ చైతన్య-సమంతా రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు.