ప్రియుడి కోసం భర్తను అంతమొందించిన భార్య
posted on Aug 29, 2025 @ 8:58PM
తన భర్త నిద్రలో చనిపోయాడంటూ ఓ భార్య 100 డయల్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్య చేకితులయ్యారు.
అనుమానాస్పద మృతి కేసునమోదు చేసుకొని విచారించగా పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలడంతో.. పోలీసులు ఎంక్వ యిరీ చేయడం మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి... దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే....
జెల్లెల్ల శేఖర్ (40), చిట్టి (33) దంపతులు వీరు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ రోడ్ నెంబర్ సెవెన్‌లో నివాసం ఉంటున్నాడు. శేఖర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడ ప్పుడు రెండు మూడు రోజులు లేదంటే వారం రోజులు బయటికి వెళ్తూ ఉంటాడు. అయితే డ్రైవింగ్ వృత్తిపై భర్త బయటికి వెళ్లిన సమయంలో చిట్టి కి హరీష్‌తో పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే భార్య ప్రవర్తన పై అనుమానం కలిగి భర్త శేఖర్ పలుమార్లు తన భార్య చిట్టిని హెచ్చరించాడు.
కానీ చిట్టి ప్రవర్తన లో మార్పు రాలేదు ప్రియుడిని విడిచి ఉండలేక పోయింది. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ఫ్లాన్ వేసింది. పథకం ప్రకారమే చిట్టి తన ప్రియుడు హరీష్ తో కలిసి నిద్రపోతున్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్రలో చనిపో యాడంటూ లబో దిబో మొత్తు కుంటూ 100 కి ఫోన్ చేసింది... తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా చిట్టి ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.