ఏపీకి బుల్లెట్ ట్రైన్ : సీఎం చంద్రబాబు
posted on Aug 29, 2025 @ 3:02PM
అమరావతి మీదగా ఆంధ్రప్రదేశ్‌కి బుల్లెట్ రైలు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి గంటకు ఫ్లైట్ ఉండేలా ఎయిర్ ఫోర్టులు తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాదిని కలిపే మార్గాలన్నీ ఏపీ నుంచే వెళ్తుంటాయి. అమరావతి- చెన్త్నె- బెంగళూరు నగరాల మధ్య బుల్లె రైళ్లు రానున్నాయి సీఎం తెలిపారు.ఇందుకోసం హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది.
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్‌డీఏ గుండా వెళ్తుంది.