Beware - These Daily Habits Harm Our Skin!

Our Skin is a perfect Reflection of Health – says an Expert! It is known that, there are some factors such as natural ageing that bring about changes in skin, but many a times it is our lifestyle and unhealthy habits that cause skin damage. Let us get to know a few of them.   Eating Lot Of Sugar Foods : Consuming sugary food causes insulin levels to spike leading to inflammation throughout the body. This results in sagging skin and wrinkles.   Getting Exposed To Sun Excessively : Our skin needs about 20 minutes exposure to sun daily to consume Vitamin D for a healthy skin. But excess exposure to sun can damage our skin leading to skin dryness, dark spots, premature ageing, pigmentation etc.   Taking Hot Shower Baths : Taking bath in luke warm water is always recommended. On the contrary, if we take bath in hot water it leads to skin dryness, itching or even skin peeling.   Excessive Exfoliation Of Skin : Exfoliation is a process of removing dead skin cells. Exfoliating is good for the skin only if it is done once or twice a week. But excessive exfoliation causes an imbalance in the moisture levels leading to premature ageing.   Smoking : Nicotine reduces blood flow to the skin, which means it does not get enough oxygen and nutrients. Smoking greatly speeds up skin aging.   Next time when you complain about skin related issues – just pause and think if you are following right lifestyle and a healthy diet!    -  Priya Ganapathi

Beauty and Health Tips - Direct From The Kitchen...

No kitchen is complete without that ‘dabba’ which has those lip smacking spices!   Apart from using them while cooking, did you know that they make fabulous beauty & health ingredients? No – then here are a few spices that help in enhancing beauty and staying healthy.   Turmeric : Turmeric is packed with antiseptic properties & thus when applied on skin gives positive impact. Besides this, turmeric is a great anti-oxidant and consuming turmeric with milk daily improves immunity.   Cumin Seeds : Cumin or Jeera not only adds tastes to food but research relieves that consuming jeera everyday promotes weight loss. In addition it improves digestion.   Cinnamon : Loaded with anti-oxicidents, regular consumption of cinnamon increases good cholesterol like HOL and also increases blood circulation in the body. Amazingly, it also has certain properties which fight cancer.   Black Pepper : Proudly known as king of all spices, Black pepper helps fight depression. From beauty perspective Black Pepper is very beneficial for preventing grey hair and is great for skin exfoliation.   Coriander Seeds : Coriander Seeds are full of antibacterial and antioxidant properties that help in reducing redness in eyes.   We tend to spend more, to maintain a healthy lifestyle – whereas all the health and beauty secrets are right in the kitchen. So next time, when you have any health or beauty related problem – peep into the kitchen!  - Teluguone Team

ఇష్టం లేనివారితో కలిసి జీవించాల్సి వస్తే!

  ప్రపంచంలో మనకి ఇష్టంలేని వారు చాలామంది ఉంటారు. వారిలో కొందరిని మనం తప్పించుకుని తిరగలేని పరిస్థితి. అది ఆఫీసులో అధికారి కావచ్చు, పక్కింటి సుబ్బారావు కావచ్చు. ఇలా మనసుకి నచ్చనివారితో కలిసి రోజుని గడపాలంటే కష్టమే! కానీ వారితో ఉన్నంత సేపూ ముళ్ల మీద కూర్చున్నట్లు ఇబ్బందిగా గడపడం వల్ల... మన మనసు చెడిపోతుంది, బంధమూ చిక్కుముడిగా మారిపోతుంది. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి!   పని గురించి :- ఏ పని మీదైతే మీరిద్దరూ కలిసి ఉన్నారో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత స్థాయి నుంచి కాస్త ఎదిగి మాట్లాడండి. అధికారితో అయితే సంస్థ లక్ష్యాల గురించి, పక్కింటి సుబ్బారావుతో అయితే స్ట్రీట్ లైట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫలితం మీకే కనిపిస్తుంది.   అహాన్ని బుజ్జగించండి :- వ్యక్తిగత అహాలే ఇద్దరు వ్యక్తులను దూరం చేస్తాయి. అవసరం అనుకున్నప్పుడు మన అహాన్ని తగ్గించుకుని అవతలి వ్యక్తికి కాస్త విలువ ఇచ్చినట్లు ప్రవర్తించడంలో తప్పు లేదు. ‘ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు!’, ‘మీ సలహా ఏమిటి!’... లాంటి మాటలతో వారికి విలువ ఇచ్చనట్లు అవుతుంది. వారు సాధించిన చిన్న చిన్న విజయాలను పొగిడితే అసలు తిరుగే ఉండదు.   మంచి మీద దృష్టి పెట్టండి :- రావణాసురుడు అంతటి వాడిలో సైతం ఏదో మంచి లక్షణం ఉంటుంది. ఇక సాధారణ మనుషులలో మంచి లక్షణాలకు కొదవేముంటుంది? వారు చిన్నప్పుడు కష్టపడి పైకి వచ్చి ఉండవచ్చు, కంప్యూటర్ మీద మంచి పట్టు ఉండవచ్చు, ఏదీ కాకపోతే కనీసం ఆహారపు అలవాట్లన్నా మంచిగా ఉండవచ్చు. ఇలా ఎదుటి మనిషిలో ఉండే మంచి లక్షణాల మీద దృష్టి పెడితే అతని మీద కోపం ఉపశమిస్తుంది.   పట్టించుకోవద్దు :- మనకి ఇష్టమైనవారి గురించి కాసేపు మాత్రమే ఆలోచిస్తాం. కానీ ద్వేషించే వ్యక్తుల గురించి నిరంతరం ఆలోచిస్తుంటాం. దాంతో మన సమయమూ, లక్ష్యమూ వృధా అయిపోతుంటాయి. అతని దృక్పథంలో లోపం ఉంది కనుక, వారినే జపిస్తూ ఉంటే మనం కూడా వారిలా మారిపోవడం ఖాయం. కాబట్టి అతనికంటే విలువైన మీ జీవితానికీ, వ్యక్తిత్వానికీ, లక్ష్యాలకీ ప్రధాన్యతని ఇచ్చే ప్రయత్నం చేయండి.   రెచ్చగొట్టవద్దు :- అహంకారం, ఆత్మన్యూనత వంటి లోపాలు ఉన్నవారిని రెచ్చగొడితే వారి ప్రవర్తన చాలా అనూహ్యంగా ఉంటుంది. అందుకని వివాదంతోనో, వాదనతోనో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ’ అని పెద్దలు ఊరికే అనలేదు కదా!   ఎందుకని ఇష్టం లేదు? :- చాలా సందర్భాలలో మనం ఎలాంటి బలమైన కారణం లేకుండానే అవతలి వ్యక్తి మీద అయిష్టత ఏర్పరుచుకుంటాం. కానీ కాసేపు మన విచక్షణకు పదునుపెట్టి, అతన్ని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మొదలైతే... చాలామంది మీద ద్వేషం నిష్కారణం అని తేలిపోతుంది.   చివరగా మరో చిన్న చిట్కా! మీరు ఎవరితో అయితే ఇష్టం లేకుండా గడపాల్సి వస్తోందో.... అంతకంటే దుర్మార్గులూ, నీచులూ... ఈ లోకంలో చాలామంది ఉన్నారని గ్రహిచండి. అలాంటివారు మీ జీవితంలో లేనందుకు సంతోషించండి. అప్పుడు మీ ముందు ఉన్నవారంతా పరమ సాధుజీవులుగా కనిపించక మానరు. - నిర్జర.  

ఫేస్బుక్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలా!

ఫేస్బుక్! ఒక పదేళ్ల క్రితం చాలామందికి పరిచయం లేని పదం. కానీ ఇప్పుడో! ఫేస్బుక్ అకౌంటు లేకపోతే అదో లోపంగా భావించే తరుణం. ఫేస్బుక్తో అటు లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. ఆ చర్చ సంగతి పక్కన పెడితే అడపాదడపా ఫేస్బుక్లో కనిపించే వీడియోలని చూసి, ఓ లైక్ పడేసి.... ‘అబ్బా! ఈ వీడియో మన సొంతం అయితే ఎంత బాగుండో,’ అనిపించక మానదు. దానికేం చేయాలో మీరే చూడండి.   మనమే అప్లోడ్ చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు- ఒకోసారి ఫేస్బుక్ అకౌంట్లో మనమే ఏదో వీడియో పోస్ట్ చేస్తాం. కానీ దాని తాలూకు కాపీ ఎక్కడో పోతుంది. అలాంటి సందర్భాలలో మన పాత పోస్టుల్లో ఉండే వీడియోని అతి సులభంగా తిరిగి పొందవచ్చు. దీనికి చేయాల్సిందల్లా... - ఫేస్బుక్లో మీ పేరు, ఫొటో ఉన్న ప్రొఫైల్ సెక్షన్ని క్లిక్ చేయండి. - అందులో ఫొటోస్ అన్న సెగ్మెంట్ కనిపిస్తుంది. - ఫొటోస్ని క్లిక్ చేయగానే మీరు పోస్ట్ చేసిన ఫొటోస్, మూవీస్, బుక్స్... అన్నింటితో పాటుగా వీడియోస్ అనే సెగ్మెంట్ కూడా కనిపిస్తుంది. - వీడియోస్ సెగ్మెంట్లో మీరు కాపీ చేసుకోవాలని అనుకున్న వీడియోని ఎంచుకొని ప్లే చేయండి. - వీడియో ప్లే అవుతున్న సమయంలో కింద ఆప్షన్స్ అన్న పదం కనిపిస్తుంది. - ఆప్షన్స్ని క్లిక్ చేయగానే ‘Download SD’ అన్న ఎంపిక కనిపిస్తుంది. - Download SDని క్లిక్ చేయగానే మరోసారి వీడియో ప్లే అవుతుంది. అలా ప్లే అయ్యే సమయంలో కింద మెనూ బార్లో ఉన్నా డౌన్లోడ్ ఐకాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. వీడియో మీ సిస్టమ్లో ఫైల్ సేవ్ అయిపోతుంది. స్నేహితులు అప్లోడ్ చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు-   ఇతరుల వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఫేస్బుక్ నేరుగా అవకాశం ఇవ్వదు. అయితే ఇందుకో సులువు ఉంది. అదేమిటంటే... - మీకు నచ్చిన వీడియో ప్లే అవుతుండగా దాని మీద రైట్ క్లిక్ చేయండి. వెంటనే show video URL అనే ఎంపిక కనిపిస్తుంది. - ఆ URL అడ్రెసుని అలాగే కాపీ చేసుకోండి. గూగుల్ క్రోమ్లో కొత్త విండోని ఓపెన్ చేసి ఆ అడ్రస్బార్లో మీరు కాపీ చేసిన URLని పేస్ట్ చేయండి. - అడ్రస్ బార్లో పేస్ట్ చేసిన URLకి చిన్న మార్పు చేయవలసి ఉంటుంది. అడ్రెస్లో ఉండే WWWని తీసివేసి ఆ స్థానంలో M అనే అక్షరాన్ని ఉంచండి. ఇది మొబైల్ యూజర్స్ కోసం కనిపించే ఫేస్బుక్ వెర్షన్. - ఇప్పుడు వీడియో ప్లే అవుతుండగా, దాని మీద రైట్ క్లిక్ చేయండి. వెంటనే save video as అనే ఎంపిక కనిపిస్తుంది. అంతే దాన్ని క్లిక్ చేయగానే సిస్టిమ్లో మీరు కోరుకున్న చోటుకి వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. - నిర్జర.  

ప్రేమికుడి తోడుంటే... ఎంతటి నొప్పినైనా ఓర్చుకోవచ్చు!

  ప్రేమలో మునిగిపోయినవారు లోకాన్నే మర్చిపోతారని అంటారు. ప్రేమతో ఎంతటి కష్టాన్నయినా జయించవచ్చని చెబుతారు. కానీ నొప్పితో విలవిల్లాడే మనిషికి ప్రేమ మందులా పనిచేస్తుందని నిరూపిస్తున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన గోల్డ్స్టీన్ అనే పరిశోధకుడి వచ్చిన ఆలోచన ఫలితంగానే ఈ పరిశోధన మొదలైంది. ఈ గోల్డ్స్టీన్ అనే ఆయన, తన భార్య ప్రసవిస్తుండగా పక్కనే ఉన్నాడట. ఆ సమయంలో నొప్పితో విలవిల్లాడిపోతున్న తన భార్యని ఎలా సంభాళించాలో ఆయనకి తోచలేదు. గట్టిగా ఆమె చేతిని పట్టుకుని, ఆమెకి తను తోడుగా ఉన్నానన్న ధైర్యాన్ని అందించాడు. ఆశ్చర్యం! అతని స్పర్శతో ఆమె నొప్పి చాలావరకు తగ్గిపోయింది. దాంతో ప్రేమికుడి స్పర్శకీ, నొప్పి తగ్గడానికీ మధ్య సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేయాలనుకున్నారు.   ఈ పరిశోధన కోసం 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న ఓ 22 మంది జంటలను ఎన్నుకొన్నారు. వారిలో ఆడవారికి చిన్నపాటి గుండెనొప్పి వచ్చేలా చేశారు. అలా గుండెల్లో నొప్పిగా ఉన్న సమయంలో మగవారు అక్కడ లేకుండానో, పక్కనే ఉండేలాగానో, చేతిలో చేయి వేసి పట్టుకునేలాగానో... మూడు రకాల సందర్భాలను సృష్టించారు. మొదటి రెండు సందర్భాలలోనూ నొప్పిలో పెద్దగా మార్పు రాలేదు. కానీ మూడో సందర్భంలో మాత్రం ఇద్దరి చేతులూ కలిసి ఉన్నప్పుడు... వారు ఊపిరి పీల్చుకునే తీరు (breathing rate), గుండె కొట్టుకునే వేగం (heart rate) ఒకేలా సాగాయట. దాంతో గుండెనొప్పి కూడా తగ్గిపోయిందట! అంతేకాదు! వారిద్దరి మధ్యా ఎంత ప్రేమ ఉంటే... నొప్పి తగ్గే ప్రభావం అంత ఎక్కువగా ఉన్నట్లు కూడా తేలింది. ఒకవేళ ప్రేమికుడు కనుక తన చేతిని తీసివేస్తే, నొప్పి తీవ్రత మళ్లీ పెరగడాన్ని కూడా గమనించారు.   మనిషి సంఘజీవి! తన ఎదురుగుండా ఉండేవారి ప్రవర్తన ఆధారంగా, అతని శరీరంలో తెలియకుండానే మార్పులు చోటు చేసుకుంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తుంటే, తెలియకుండానే వారి అడుగుల వేగం ఒకేతీరున మారిపోతుంది. ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే, వారి శరీర భంగిమ ఒకరినొకరు అనుకరిస్తూ కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు! అంతా కలిసి ఒక పాటని లయబద్ధంగా పాడుతూ ఉంటే... వారి గుండె, ఊపిరి వేగం ఒకే తీరుగా మారిపోతుందని ఎప్పుడోనే బయటపడింది. కానీ ప్రేమికుడి స్పర్శతో ఇద్దరి శరీరాలూ ఒకేతీరున స్పందిస్తూ, నొప్పి కూడా మాయమైపోతుందన్న కొత్త పరిశోధన ప్రేమికులకు ఒక వరంలా కనిపిస్తోంది. - నిర్జర.

వినాయకుడి రూపంలో విజయానికి రహస్యాలు!

  భారతీయుల ఇష్టదైవం గణపతి. వినాయకచవితి రోజున జరిగే హడావుడే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వినాయకుడు ఒక దేవత మాత్రమే కాదనీ... ఈ ప్రకృతిలోని శక్తికి ప్రతిరూపం అని నమ్మేవారూ లేకపోలేదు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా, గణేశుని ప్రతిరూపం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయంటారు పెద్దలు…   తల :– మనిషికి ఏనుగు తల అన్న మాటే చాలా చిత్రంగా కనిపిస్తుంది. కానీ పెద్ద తల గొప్ప బుద్ధిని సూచిస్తుందంటారు. పైగా ఏనుగుకి ఉండే జ్ఞాపకవక్తి చాలా అమోఘం కదా! జీవితంలో ముఖ్యమైన విషయాలు ఎన్నటికీ మర్చిపోకూడదన్న సూచన, శరీరంతో పాటుగా బుద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న హెచ్చరికా ఏనుగుతలలో కనిపిస్తాయి. వినాయకుడి బుద్ధి ప్రదాత అని ఊరికనే అనలేదు కదా!   చెవులు :– ఏనుగు చెవులు పెద్దవి. ప్రతి మాటనీ శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తాయవి. అవతలి మనిషి వాదన పూర్తిగా విన్న తర్వాతే, నిర్ణయం తీసుకోవాలని చెబుతాయి. ఈ కాలంలో అంతా తక్కువ విని ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలనే సూత్రాన్ని గుర్తుచేస్తాయి.   కళ్లు :– ఏనుగు కళ్లు చాలా సునిశితం అంటారు. ప్రతి విషయాన్ని పైపైన కాకుండా సూక్ష్మంగా పరిశీలించాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. పైగా ఏనుగు కళ్లకి వస్తువులు చాలా పెద్దవిగా కనిపిస్తాయట. ప్రమాదాన్నయినా, అవకాశాన్నయినా ముందుగానే పసిగట్టగల దూరదృష్టి పెంపొందించుకోవాలని ఇవి చెబుతున్నాయన్నమాట.   తొండం :– ఏనుగు తొండం నోటికి అడ్డంగా ఉంటుంది. చెట్లని పెళ్లగించడం దగ్గర నుంచి, ఆహారాన్ని అందుకోవడం వరకూ అన్ని పనులూ చేసేస్తుంది. అది చేస్తాం ఇది చేస్తాం అని నోటిమాటగా వాగ్దానాలు చేయడమే కాదు... ఆ మాటలని నిజం చేసుకోవాలనే సూచన అందిస్తుంది.   చేతులు :– రోజులు మారాయి. ఒకేసారి నాలుగు పనులు చేయందే జీవితం గడవడం లేదు. దీన్నే multi tasking అంటున్నాం. వినాయకుని నాలుగు చేతులూ ఈ మల్టీ టాస్కింగ్‌ని సూచిస్తాయి. పైగా ఒకో చేతిలో ఉండే వస్తువు ఒకో లక్షణానికి ప్రతీక. వినాయకునికి ఒక చేతిలో మోదకం అనే తినుబండారం కనిపిస్తుంది (ప్రపంచాన్ని ఆస్వాదించాలి), మరో చేతిలో గొడ్డలిలాంటి ఆయుధం ఉంటుంది (పోరాటానికి వెనుదీయకూడదు), ఇంకో చేతిలో కమలం ఉంటుంది (ప్రపంచంలో ఉంటూనే అతీతంగా ఉండటానికీ, జ్ఞానం కోసం ప్రయత్నించడానికీ, తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేయడానికీ కమలం చిహ్నం), నాలుగో చేయి అభయాన్ని అందిస్తూ ఉంటుంది (సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలి).   ఉదరం :– వినాయకుని ఉదరం సమృద్ధికి చిహ్నం. ఆహారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలనే సూచన. నిండైన పొట్ట ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహాలు ఇప్పుడు ఇంటింటా కనిపిస్తున్నాయి. నిజానికి లాఫింగ్‌ బుద్ధాని పోలిన వినాయకుడు మనకి ఉండనే ఉన్నాడు కదా!   ఎలుక :– ఎలుక చపలచిత్తంగా అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. మన ఇంద్రియాలూ అంతే! ఎటువైపు పడితే అటు పరుగులు పెడుతూనే ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలనే సూచనని మూషికవాహనుడు అందిస్తున్నాడు. మూషికాన్ని అహంకారానికి చిహ్నంగా పోల్చేవారూ లేకపోలేదు. దాని మీద కూర్చోవడం వల్ల, ఆ అహంకారాన్ని అణచివేయాలనే సూచన కూడా కనిపిస్తుంది.   ఆసనం :– చాలా సందర్భాలలో వినాయకుడు ఎడమ కాలు ముడుచుకుని, కుడి కాలుని కిందకి ఉంచి కనిపిస్తాడు. ప్రశాంతంగా ఉంటూనే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే త‌త్వానికి ఈ ఆసనాన్ని ప్ర‌తీక‌గా భావిస్తారు. మనిషికి కావల్సింది అదే కదా! స్థిరచిత్తంతో ఉండాలి. కానీ ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే అప్రమత్తత ఉండాలి.   ఇవండీ వినాయకుని రూపం వెనుక కనిపించే అర్థాలు. ఇవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఈ వాదనలన్నీ భక్తులు తమకు అనుగుణంగా ఏర్పరుచుకున్నవి కావచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో ఉపయోగపడేవే కదా! - నిర్జర.  

మీ జీవితాన్నే మార్చివేసే జుగాద్

  జీవితమంటే సమస్యల వలయం. పొద్దున లేచిన దగ్గర నుంచీ ఏదో ఒక సవాలు మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అది లీకవుతున్న పైప్ దగ్గర నుంచీ అద్దం విరిగిపోయిన కిటికీ వరకూ ఏదైనా కావచ్చు. డబ్బు ఉన్నప్పుడు, సమయం కుదిరినప్పుడు వాటి పని చూడచ్చులే అని మనం చూస్తూ ఊరుకోం కదా! ఆ పరిస్థితిలో మన బుర్రకి కాస్త పదును పెడతాం. చిటికెలో ఏదో ఒక ఉపాయంతో ఆ సమస్యకి చెక్ పెట్టేస్తాం. దీనినే ఇప్పుడు జుగాద్ అంటున్నారు.   ఎవ్వరూ ఊహించని రీతిలో ఉపాయం పన్ని సమస్య నుంచి తప్పించుకోవడం భారతీయులకి కొత్తేమీ కాదు. కాకపోతే ఓ దశాబ్ద కాలం నుంచీ ఇలాంటి సమయస్ఫూర్తికి ఓ పేరుతో పిలుస్తున్నారు. అదే జుగాద్! హిందీ, ఉర్దూ, పంజాబీలలో కనిపించే ఈ మాటకి చిట్కా లేకపోతే అడ్డదారి అని అర్థం చెప్పుకోవచ్చు. భారతీయులలో నరనరాన కనిపించే ఈ జుగాద్ లక్షణం ఇప్పుడు ప్రపంచాన్ని కూడా ఆకర్షిస్తోంది. అంతర్జీతీయ విశ్వవిద్యాలయాలు సైతం దీనిని ఒక మేనెజ్మెంట్ టెక్న్క్గానూ, జీవన నైపుణ్యం (life skill)గానూ గుర్తుస్తున్నాయి. ఈ జుగాద్ వెనుక మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు చాలానే ఉన్నాయన్నది నిపుణుల మాట. అవేమిటంటే.. .   అపాయంలో ఉపాయం – అపాయం ఎదురైందని నిస్సహాయంగా నిలబడిపోకుండా.... దాన్నుంచి అప్పటికప్పుడు ఎలా తప్పించుకోవాలి? అన్న స్ఫూర్తి జుగాద్ తరహా ఆలోచనా ధోరణితో ఏర్పడుతుంది.   సులువు – ఎంతో ఖర్చు పెట్టి, గంటల తరబడి చేసే పనిని... అప్పటికప్పుడు చటుక్కున పరిష్కరించడం ఎలా అన్నదే జుగాద్లోని ప్రథమ సూత్రం. చవక, నిరాడంబరత, సులువు... ఈ మూడే జుగాద్కి పునాదులు.     బిజినెస్ ట్రెండ్ – వ్యక్తిగత జీవితంలో జుగాద్తో మన రోజువారీ సమస్యలు తీరిపోవచ్చు. కానీ అదే సృజనని వ్యాపారంలో ఉపయోగిస్తే... అద్భుతమైన లాభాలు ఆర్జించే పరికరాలను తయారుచేయవచ్చు.   సంస్థ నిర్వహణ – ఇప్పుడు ప్రముఖ సంస్థలు కూడా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు జుగాద్ చిల్కాలను పాటిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులను రూపొందించే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శాఖలు కూడా ఇప్పుడు జుగాద్ తరహాలో ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాయి.   ఇతరుల గురించి ఆలోచన వద్దు – ఈ సమస్యని ఇలా పరిష్కరిస్తే చూసేవారు ఏమనుకుంటారు అనేదానికి జుగాద్ వ్యతిరేకం. ‘ సమస్య నాది. దానిని నా పద్ధతిలో పరిష్కరించుకుంటాను,’ అనే దృక్పధానికి జుగాద్ ఓ ప్రేరణ.     సృజనకు హద్దులు చెరిపేయండి – వ్యక్తిత్వ వికాసంలో ‘థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్’ అనే సూత్రం కనిపిస్తుంది. సమస్యకి దారులు మూసుకుపోయినా, లేకపోతే ఎప్పుడూ ఒకేతరహా పరిష్కరాలు కనిపిస్తున్నా... అందరూ ఆలోచించే దారి నుంచి వైదొలగి కాస్త భిన్నంగా ఆలోచించమని ఈ సూత్రం చెబుతుంది. ఆ సూత్రాన్ని ఆచరించేందుకు జుగాద్ దోహదపడుతుంది.   జుగాద్ తరహా ఆలోచన వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నమాట నిజమే! అలాగని ప్రతి సమస్యనీ అడ్డదారిలోనే పరిష్కరించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి దృక్పధానికీ ఓ హద్దు ఉన్నట్లు జుగాద్ని ఆచరించేందుకు కూడా - నిర్జర.  

వీడియో గేమ్స్‌తో లాభమా? నష్టమా?

  వీడియో గేమ్స్‌ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! వాటి జోలికి పోకుండా ఉండాలే కానీ... ఒక్కసారి కనుక అలవాటుపడితే ఏ వ్యసనానికీ తగ్గకుండా మనల్ని పట్టేసుకుంటాయి. ఒకప్పుడు వీడియోగేమ్స్ అంటే పెద్ద తతంగంలా ఉండేవి. ప్లే స్టేషన్లతోనో, కంప్యూటర్ల మీదో ఆడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమా అని ఎవరైనా ఎప్పుడైనా వీడియోగేమ్‌లోకి దూరిపోవచ్చు.   వీడియోగేమ్‌లను ఆడేతీరు సులువైన కొద్దీ వాడకందారులు కూడా ఎక్కువైపోతున్నారు. ప్రస్తుతానికి 35 ఏళ్ల సగటు వ్యక్తి కూడా వీడియోగేమ్స్‌ ఆడుతున్నట్లు ఓ పరిశోధనలో బయటపడింది. ఇంతకీ వీడియోగేమ్స్‌ వల్ల మన మెదడు మీద ఏదన్నా ప్రభావం ఉంటుందా అన్న సందేహం రావడం సహజమే! దీని మీద చాలా పరిశోధనలే వెలువడ్డాయి. కాకపోతే ఒకో పరిశోధనదీ ఒకో తీరు. వీడియోగేమ్స్‌తో మన ఏకాగ్రతలో అద్భుతమైన మార్పులు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలిస్తే... అవి ఒక వ్యసనంలా మారిపోయి జీవితాల్ని ఛిద్రం చేస్తాయని మరికొన్ని పరిశోధనలు తేల్చాయి. దీంతో జనం మరింత అయోమయానికి గురవతున్నారు.   ఇంతకీ వీడియోగేమ్స్‌తో మన మెదడు మీద కలిగే ప్రభావం ఏమిటంటూ కొందరు పరిశోధకులు తేల్చి పారేయాలనుకున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ ఈ రంగంలో జరిగిన 116 పరిశోధనల ఫలితాలను ఓ తాటికి తీసుకువచ్చారు. వాటిలో 22 ప్రయోగాలు ఏకంగా మెదడు మీద జరిగినవే!   వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల మన మెదడు పనితీరే మారిపోతుందని ఈ నివేదికలో స్పష్టం అయ్యింది. ఈ గేమ్స్‌ ఆడటం వల్ల మన ఏకాగ్రతలో స్పష్టమైన మార్పులు వస్తాయని తేలింది. ఏ విషయం మీద కావాలంటే ఆ విషయం మీద, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏకాగ్రతని నిలిపిఉంచే నైపుణ్యం వస్తుందట. వస్తువుల ఆకారాలని స్పష్టంగా గుర్తించగలిగే visuospatial skills కూడా మెరుగుపడతాయట. అసలు ఏకంగా మెదడులో ఉండే హిప్పోకేంపస్‌ అనే భాగం పెరగడాన్ని కూడా గమనించారు. జ్ఞాపకవక్తిని పదిలంగా ఉంచడంలో ఈ హిప్పోకేంపస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.   మరోవైపు వీడియోగేమ్స్ ఒక వ్యసనంలా మారిపోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టమైంది. తరచూ వీటిలో మునిగిపోవడం వల్ల ‘Internet gaming disorder’ అనే వ్యాధికి లోనవుతారట. నిరంతరం వీడియోగేమ్స్‌ ఆడకపోతే జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లుగా బాధపడటం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం, ఊహలలో తేలిపోవడం, ఒంటరిగా గడపడం.... లాంటి లక్షణాలన్నీ ఈ వ్యాధితో పాటుగా వస్తాయి.   వీడియోగేమ్స్‌తో అటు సానుకూల ప్రభావం, ఇటు ప్రతికూలత... రెండూ ఉంటాయని తేలిపోయింది. కాబట్టి, వాటికి మన జీవితంలో ఏమేరకు అవకాశం ఇవ్వాలన్నది ఇక మన ముందున్న నిర్ణయమ! - నిర్జర

అమెరికాను కుదిపేసిన ఓ లెక్కల టీచర్‌

  మన సంప్రదాయంలో గురువులకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పనే అక్కర్లేదు. గురువుని త్రిమూర్తులతో సమానంగా పూజిస్తాము. తల్లిదండ్రులతో సమానంగా భావిస్తాము. గురువుని ఆరాధించేందుకు మనకు పండుగలు ఉన్నాయి, సంప్రదాయాలూ ఉన్నాయి. వాటికి తోడుగా మన తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణయ్య జన్మదినాన్ని గురుపూజా దినోత్సవంగానూ జరుపుకొంటున్నాం. కానీ గురువు ఎక్కడైనా గురువే కదా! ప్రపంచంలోని ప్రతిభావంతులైన గురువులను తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. వారిలో ఒకరి పేరే జైమ్‌ ఎస్కలాంట్!   బొలీవియా టు అమెరికా: ఎస్కలాంట్ బొలీవియాకు చెందిన ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టాడు. ఆ నేపథ్యం వల్లనో ఏమో అతనికి చిన్నప్పటి నుంచే బోధన అంటే చాలా ఇష్టంగా ఉండేది. లెక్కల్లో తమ పూర్వీకులు గ్రీకులకు తీసిపోరన్నది ఎస్కలాంట్‌ నమ్మకం. ఆ నమ్మకంతోనే తను కూడా లెక్కల మీద మంచి పట్టుని సంపాదించాడు. తండ్రి తాగి తాగి చనిపోయినా, కుటుంబం పేదరికంలో కూరుకుపోయినా... ఎస్కలాంట్‌లోని ప్రతిభ మాత్రం చెక్కుచెదరలేదు. రకరకాల ఉద్యోగాలు చూస్తూనే బోధనలో పట్టాను సాధించాడు. 12 ఏళ్లపాటు తన మాతృదేశంలో లెక్కలూ, భౌతికశాస్త్రాలను బోధించి అమెరికాకు ప్రయాణమయ్యాడు.   ఓ వింత బడి: అమెరికాలో లెక్కల టీచర్ల అవసరం ఉందన్న ఆశతో ఎస్కలాంట్‌ ఆ దేశానికి చేరుకున్నాడు. అందుకు అవసరం అయ్యే ఇంగ్లిషు మీద పట్టు సాధించిన లాస్‌ ఏంజెల్స్‌లోని ఒక బడిలో ఉద్యోగానికి కుదురుకున్నాడు. ఆ బడి పేరు ‘గార్‌ఫీల్డ్‌ హైస్కూల్‌’. ఎస్కలాంట్ అక్కడ ఉద్యోగంలో చేరేనాటికి ఆ బడిలో పరిస్థితులు ఆధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడి విద్యార్థులు మంచి మార్కులు సాధించడం లేదన్న కారణంగా బడి గుర్తింపుని సైతం రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.   దేశంలోనే నెం.1 గార్‌ఫీల్డ్‌ హైస్కూలులో ప్రవేశించిన ఎస్కలాంట్‌ అక్కడి విద్యార్థులలో లెక్కల పట్ల తపనను రగిల్చాడు. లెక్కలు నేర్చుకుంటే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న నమ్మకాన్ని వారిలో కలిగించాడు. లెక్కల్లోనే అత్యంత క్లిష్టంగా భావించే ‘కేల్క్యులస్’లో వారికి తర్ఫీదుని ఇవ్వడం మొదలుపెట్టాడు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుడు కూడా కష్టపడితేనే తగిన ఫలితాలు వస్తాయన్నది ఎస్కలాంట్‌ నమ్మకం. అందుకే బడిలో అందరికంటే ముందుగా వచ్చి, అందరికంటే ఆలస్యంగా ఇంటికి చేరేవాడు. ఎలా చెబితే విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయో, ఎస్కలాంట్‌ దానికి అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించుకునేవారు. ఎస్కలాంట్‌ పనితీరు చూసిన అసూయ చెందిన బడి అధికారులు, ఆయనను ఎలాగైనా తరిమికొట్టాలని శతధా ప్రయత్నించేవారు.   అండగా నిలిచిన ప్రిన్స్‌పల్‌: అదే సమయంలో ‘హెన్రీ గ్రాడిలస్‌’ అనే ప్రిన్స్‌పల్‌ ఆ బడిలోకి అడుగుపెట్టారు. ఆయన ఎస్కలాంట్ పనితీరుని అర్థం చేసుకోవడంతో ఇక లెక్కల పాఠాలకు తిరుగులేకుండా పోయింది. 1988లో ఆయన విద్యార్థులలో ఏకంగా 18 మంది జాతీయ స్థాయి లెక్కల పరీక్షలలో ఉత్తీర్ణులు కావడంతో, ఎస్కలాంట్‌ పేరు మారుమోగిపోయింది. ఈ విషయం మీద అనుమానం కలిగిన అధికారులు ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష పెట్టినా అదే ఫలితం వచ్చింది. పైపెచ్చు, మరుసటి ఏడాది 30 మంది ఎస్కలాంట్‌ శిష్యులు అదే పరీక్షలో ఉత్తీర్ణులు కావడంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.   ఇంతింతై: ఏటికేడు ఎస్కలాంట్‌ బోధనలో రాటుదేలిన శిష్యులు దేశంలో సంచలనం సృష్టించడం మొదలుపెట్టారు. కేవలం గణిత పరీక్షలలో నెగ్గడమే కాదు, పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో చోటునీ సంపాదించుకునేవారు. 1988లో ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా ఎస్కలాంట్‌కు Presidential Medal for Excellence అందింది. అదే సంవత్సరం ఎస్కలాంట్ జీవితం ఆధారంగా ‘జే మాథ్యూస్‌’ అనే రచయిత Escalante: The Best Teacher in America అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఆధారంగా Stand and Deliver అనే చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది.   ఇదీ విజయరహస్యం! ఎస్కలాంట్‌ విజయరహస్యాల గురించి ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన పాఠాలను వినేందుకు రొనాల్డ్‌ రీగన్‌, అర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్ వంటి ప్రముఖులెందరో ఎస్కలాంట్ తరగతులలో కూర్చున్నారు. ఒకప్పుడు లెక్కలంటే భయపడి వాటికి దూరంగా ఉన్న పెద్దవారు సైతం ఆయన దగ్గర లెక్కలు నేర్చుకునేందుకు తిరిగివచ్చేవారు. కారణం! ఎస్కలాంట్ ఏదో తనకు వచ్చిన నాలుగు ముక్కలను చెప్పేస్తే బాధ్యత తీరిపోతుందని అనుకోలేదు. తను చెప్పిన విషయం విద్యార్థి మనసులో నాటుకోవాలనీ, అతనికి భవిష్యత్తులో ఉపయోగపడాలనీ కోరుకునేవాడు. అందుకోసం జోక్స్ వేస్తూ, నిజజీవితంలోని ఉదాహరణలు చూపిస్తూ, ఉత్తేజకరమైన సూక్తులను పేర్కొంటూ... విద్యార్థులకు ఎలాగైనా తను చెప్పే పాఠం అర్థం కావడమే పరమావధిగా బోధించేవాడు. అందుకే ఆరు సంవత్సరాల క్రితం ఎస్కలాంట్‌ క్యాన్సర్‌ బారినపడి చనిపోయినా, ఇప్పటికీ అమెరికా అతణ్ని మర్చిపోలేకపోతోంది. ఇలాంటి లెక్కల టీచర్ అందరికీ ఉంటే ఎంత బాగుండునో కదా!   - నిర్జర.

దేశంలో ఒకోచోట ఒకోలా... కృష్ణాష్టమి!

  శ్రీకృష్ణుడు దేవకి కడుపున పుట్టి ఉండవచ్చు, యశోద ఇంట పెరిగి ఉండవచ్చు, ద్వారకని పాలిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని ఉండవచ్చు. కానీ ఆయన ఏదో ఒక ఇంటికో, ప్రాంతానికో పరిమితం అయినవాడు కాదు. కోట్లమంది హిందువుల గుండెల నిండా కొలువైనవాడు. అందుకే భారతదేశం యావత్తు ఆయనని తమని తోచినరీతిలో ఆయన పుట్టినరోజుని జరుపుకొంటుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన సందర్భాలు ఇవిగో...   మహారాష్ట్ర కృష్ణాష్టమి వేడుకల గురించి ప్రస్తావన రాగానే మహారాష్ట్రే గుర్తుకువస్తుంది. అక్కడ జరిగే దహీహండీ (ఉట్టి) కార్యక్రమం అంత ప్రసిద్ధి మరి! అయితే ఇవి సాదాసీదాగా సాగవు. కృష్ణాష్టమికి కొన్ని వారాల ముందు నుంచే ప్రతి పేటలోని కుర్రాళ్లు, ఉట్టి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు. కృష్ణాష్టమి సమయానికి వీరంతా ఒక మండలిగా ఏర్పడి.. ఉట్టి కొట్టే పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్టుకి బహుమతులు కూడా భారీగానే అందుతాయి.   మణిపూర్ మణిపూర్‌ వాసులకు కృష్ణారాధన ఎక్కువే! దాంతో కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంఫాల్‌ వంటి చోట్ల ఉన్న కృష్ణుని ఆలయాలు కిటకిటలాడిపోతాయి. ఆ రాష్ట్రానికే ప్రత్యేకమైన మణిపురి నృత్యంలో శ్రీకృష్ణుని రాసలీలలను ప్రదర్శిస్తారు.   పశ్చిమబెంగాల్‌ పశ్చిమబెంగాల్‌, ఒడిషాలలో భక్తి ఉద్యమం తర్వాత కృష్ణ భక్తి పరాకాష్టకు చేరుకుంది. చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ప్రభుపాదుల వరకు ఆ భక్తిని ప్రచారం చేసినవారెందరితోనో బెంగాల్‌ పునీతమైంది. ఆ ప్రభావం కృష్ణాష్టమి రోజున తప్పక కనిపిస్తుంది. చైతన్యమహాప్రభు జన్మస్థానమైన ‘నవ్‌దీప్‌’ వంటి ప్రదేశాలలో జన్మాష్టమిని ఘనంగా చేసుకుంటారు. కృష్ణుడు రాత్రివేళ పుట్టాడు కాబట్టి, జన్మాష్టమి అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఆ మర్నాడు నవమి రోజుని కూడా వీరు పండుగలానే జరుపుకొంటారు.   తమిళనాడు తమిళనాడులో కృష్ణాష్టమి వేడుకలు మన తెలుగువారినే పోలి ఉంటాయి. ఇంటింటా తప్పనిసరిగా కృష్ణపాదాలను పోలిన ముగ్గులు వేస్తారు. చిన్న పిల్లలను బాలకృష్ణునిలా అలంకరిస్తారు. ఇంటింటా ఉపవాసాలు, భాగవత పఠనాలు సాగుతాయి. గీతగోవిందంలోని భావాలకు భరతనాట్యంలో అభినయం చేసే వేడుకలూ కనిపిస్తాయి.   కశ్మీర్ జమ్మూకశ్మీర్లో ‘పతంగ్‌బాజీ’ పేరుతో కృష్ణాష్టమి సందర్భంగా గాలిపటాలు ఎగరేస్తారు. కృష్ణుడు పుట్టినందుకు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ సంబరాలు సాగుతాయి. ఈ పతంగ్‌బాజీ వేడుకలు ఈనాటికి కావని చెబుతారు. ఎప్పుడో మహాభారత కాలం నుంచే కశ్మీర్‌వాసులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారట.   కృష్ణాష్టమి వేడుకలు కేవలం మన దేశంలోనే కాదు... ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ప్రాంతంలోనూ వేడుకగా సాగుతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలలో కృష్ణాష్టమి ఘనంగా జరుగుతుంది. - నిర్జర

స్నేహితులు కాస్తా శత్రువులుగా మారిపోతే!

  అన్ని బంధాలూ అన్నివేళలా సజావుగా ఉండవు. ఒకప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్న తీరున సాగిన స్నేహాలు, మనిషి కనపడితే మొహం చాటేదాకా వస్తాయి. మాటతూలడం వల్లనో, డబ్బు వ్యవహారాలు బెడిసికొట్టడం వల్లనో... కారణం ఏదైనా కావచ్చు- స్నేహమేరా జీవితం అని పాడుకున్నవారు కాస్తా శరణమా రణమా అంటూ యుద్ధమంత్రాలు వల్లిస్తారు. మరి ఇలాంటి పరిస్థితులని దాటేదెలా?   మాటలు ఆపవద్దు : పోయిన చనువు మళ్లీ తిరిగిరాకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ మాటలని మాత్రం ఆపే ప్రయత్నం చేయవద్దు. మర్యాద కోసమైనా బాగున్నారా? మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి కర్టెసీ సంభాషణలని కొనసాగించే ప్రయత్నం చేయండి. అది కూడా సాధ్యపడదంటారా! కనీసం ఎదురుపడినప్పుడు ఓ చిరునవ్వు నవ్వి చూడండి. లేకపోతే వారి ఉనికి జీవితాతం ఒక పుండులా సలుపుతూనే ఉంటుంది.   ఇతరుల జోక్యం వద్దు: సాధారణంగా ఏదన్నా బంధం చెడిపోయిన తర్వాత... జరిగినదాని గురించి కనిపించినవారందరికీ పూసగుచ్చినట్లు వివరించడం చాలామందికి అలవాటు. దానివల్ల మన మనసుకి సాంత్వన కలుగుతుందేమో కానీ, విషయం మరింత ప్రచారం అవుతుంది. మీరన్న మాటలు అవతలివారికి చేరి తీరతాయి. అది మరిన్న గొడవలకు, అపార్థాలకు దారితీయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు!   మనసుని మరల్చండి: ఆ బంధం కోల్పోవడం వల్ల మీకు తీరని నష్టమే జరిగి ఉండవచ్చు. కానీ జీవితం ముందుకు సాగాల్సిందే కదా! అందుకని గతం మీద కాకుండా వర్తమానం మీదా భవిష్యత్తు మీదా దృష్టి మరల్చే ప్రయత్నం చేయండి. లక్ష్యం మీద దృష్టి పెట్టడం, కొత్త స్నేహాలను అలవర్చుకోవడం, కొత్త అలవాట్లను అనుసరించడం... వంటి చర్యలతో వీగిపోయిన బంధం నుంచి మనసుని మరల్చే ప్రయత్నం చేయండి.   ఏం జరిగినట్లు: కేవలం అవతలి వ్యక్తి మూర్ఖత్వం వల్లనో, అహంకారం వల్లనో బంధం చెదిరిపోతే అది వేరే పరిస్థితి. కానీ చాలా సందర్భాలలో స్నేహం, శత్రుత్వంగా మారేందుకు ఇద్దరి బాధ్యతా ఉంటుంది. మీ వంతుగా ఏ పొరపాటు జరిగిందో విశ్లేషించుకోండి. అలాంటి విశ్లేషణ వల్ల ఒకోసారి మన వ్యక్తిత్వంలో ఉన్న తీవ్రమైన లోపాలు బయటపడవచ్చు. మున్ముందు అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు సాయపడవచ్చు.   ఏమీ జరగనట్లే ప్రవర్తించండి: అయిపోయిందేదో అయిపోయింది. ఆ గొడవని పెద్దది చేయడం, అవతలివారిని రెచ్చగొట్టడం... వంటి చర్యలు వద్దే వద్దు. అహం దెబ్బతిన్నదనో, గౌరవం మంటగలిసిందనో... మరిన్ని తప్పులకు దారితీయవద్దు. అవసరమైతే కొద్ది రోజుల సమయం తీసుకునైనా సరే ఆ గొడవ నుంచి పూర్తిగా బయటపడండి. - నిర్జర.    

ఒక్క పదం... శక్తి అపారం...

  థాంక్యూ... ఈ ఒక్క చిన్న మాటకి ఎంత శక్తి వుందో తెలుసా? మోడువారిన బంధం చిగురించేంత. ఒకరి సాయం పొందగానే కృతజ్ఞత తెలుపుతూ థాంక్స్ అంటాం. అయితే ఆ పదాన్ని ఇంటి బయట రోజుకి ఎన్నోసార్లు వాడే మనం మన ఇంట్లోవాళ్ళతో మాత్రం చాలా తక్కువ వాడతామట. అందులోనూ భార్యాభర్తల మధ్య ఆ పదం చాలా తక్కువగా దొర్లుతుందిట. ఒకరిమీద ఒకరికి వుండే అసంతృప్తితో ‘థాంక్స్’ చెప్పరనేది కూడా ఈ మధ్య నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.   థాంక్స్ అన్న పదం వినగానే ఎదుటి మనిషి మనసు తేలికపడటం, అందులోనుంచి సానుకూలం భావం ఏర్పడటం జరుగుతుంది. ఇద్దరిమధ్య బంధం బలపడటం మొదలవుతుంది అంటున్నారు అధ్యయనకర్తలు. చిన్నమాటే... కానీ దాని ప్రభావం మాత్రం ఎక్కువ. కాబట్టి వీలయినప్పుడల్లా ‘థాంక్స్’ అని మనస్పూర్తిగా చెప్పండి. ఎదుటి మనిషికి, మనసుకి దగ్గరవ్వండి. అన్నట్టు... ఓపిగ్గా చదివినందుకు మీక్కూడా థాంక్స్. -రమ

ఏది ముఖ్యం?

  అది ఓ పేరుపొందిన విశ్వవిద్యాలయం. అందులో సైకాలజీ తరగతి. తరగతిలో విద్యార్థులు అంతా కొత్త ప్రొఫెసర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూస్తూ చూస్తుండగా ఓ పెద్దాయన గదిలోకి వచ్చాడు. వచ్చినవాడు ఖాళీ చేతులతో రాలేదు. ఓ గాజు సీసా ఒకటి చేత్తో పట్టుకువచ్చాడు.   విద్యార్థులు అంతా ఆసక్తిగా చూస్తూ ఉండగా ఆ గాజు సీసా నిండుగా రాళ్లని నింపాడు. ‘ఈ గాజు సీసాలో ఇప్పుడు కాస్తన్నా ఖాళీ ఉందంటారా?’ అంటూ ఆ ప్రొఫెసర్ విద్యార్థుల వంక చూశాడు. ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది. ఆ గాజు సీసా మొత్తం రాళ్లతో నిండిపోయింది కదా!’ అని బదులిచ్చాడు ఓ విద్యార్థి. ‘చూద్దాం! మీ జవాబు ఎంతవరకూ నిజమవుతుందో!’ అంటూ కొన్ని గులకరాళ్లని తీసుకుని ఆ సీసాలోకి కుమ్మరించాడు. గాజు సీసాను కాస్త కదపగానే ఆ గులకరాళ్లన్నీ పెద్ద రాళ్లకి మధ్య ఉన్న సందుల్లోకి సర్దుకున్నాయి.   ‘చూశారా మీ జవాబు తప్పయింది! ఈసారి చెప్పండి. ఈ సీసాలో ఇంకా ఖాళీ ఉందంటారా?’ అని అడిగాడు కొంటెగా. ‘అబ్బే ఉన్న కాస్త ఖాళీనీ మీరు నింపేశారు కదా!’ అని బదులిచ్చారు విద్యార్థులు. కానీ వారి మనసులో ఏదో అనుమానం. ఈసారి కూడా ప్రొఫెసర్ ఏదో మాయ చేసేట్లే ఉన్నాడు అనుకున్నారు. విద్యార్థులు అనుకున్నట్లే ప్రొఫెసర్‌ కాస్త ఇసుకని తీసుకుని గాజు సీసాలోకి కుమ్మరించాడు. ఓ నాలుగు కుదుపులు కుదపగానే, ఇసుక కాస్తా సీసాలోని మూలమూలలకీ చేరిపోయింది. ‘మీ తెలివి బాగానే ఉంది. కానీ మీ ప్రయోగానికీ చదువుకీ ఏంటి సంబంధం?’ అంటూ విసుగ్గా అడిగాడు ఓ విద్యార్థి. ‘జీవితం గురించి తెలుసుకోవడమే అసలైన చదువు. మన జీవితం కూడా ఈ గాజు సీసాలాంటిదే! కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిత్వం… ఈ మూడూ మనం మొదట సీసాలో ఉంచి పెద్దరాళ్లు లాంటివి. డబ్బు, హోదా, సౌకర్యాలు… ఈ మూడూ మనం సీసాలో నింపిన గులకరాళ్లులాంటివి.   ఇక విలాసాలు, వినోదాలు, వివాదాలు వంటి చిల్లర విషయాలన్నీ ఇసుకలాంటివి.’ అన్నాడు చిరునవ్వుతో! ‘పోలికైతే బాగుంది. కానీ విషయం ఏంటి’ అన్నారు విద్యార్థులు మరింత చిరాగ్గా. ‘మరేం లేదు! మీరు కనుక మీ ఆరోగ్యానికీ, కుటుంబానికీ, వ్యక్తిత్వానికీ ప్రాధాన్యతని ఇస్తేనే డబ్బు, హోదా, సౌకర్యాలు ఉపయోగపడతాయి. ఆ తరువాత విలాసాల గురించి ఆలోచించవచ్చు. అలా కాకుండా ముందే ఆ గాజు సీసాను ఇసుకతో నింపేస్తే ఇక వేరే వేటికీ చోటు ఉండదు. మన జీవితమే చిల్లర విషయాలతో నిండిపోతుంది.’ అంటూ తన జీవిత పాఠాన్ని ముగించాడు. విద్యార్థులకి నోట మాట రాలేదు!

సిరిమల్లె పువ్వల్లే నవ్వు...

  "నవ్వు నాలుగు విధాలుగా చేటు" అనేది పాత సామెత. "నవ్వు అనేక విధాలుగా మేలు" అనేది నేడు నిరూపించబడ్డ సత్యం. అయితే ఆ నవ్వుకే మనం దూరమైపోతున్నాం రోజు రోజుకి. రెండు నెలల పసిపాపగా ఉన్నప్పుడు రోజుకి ౩౦౦ సార్లకి పైగా నవ్వుతాం మనం. కానీ పెరిగే కొద్దీ ఆ నవ్వుల సంఖ్య కొంచం కొంచం తగ్గి పెళ్ళి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలలో పడ్డాక రోజుకి ఒక్కసారి మనస్పూర్తిగా నవ్వటం కూడా కష్టంగా మారిపోతుంది. దీంతో మనకి మనమే నష్టం చేకూర్చుకున్న వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే నవ్వటం వల్ల శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. ఒకసారి మనసారా నవ్వితే కండరాలన్నీసడలి, మానసిక ఒత్తిడి శారీరక టెన్షన్ తగ్గుతాయి. ఒక్క నిమిషం మనసారా నవ్వినా చాలు దాని ప్రభావం సుమారు 45 నిమిషాలదాకా మన శరీరం పై నిలుస్తుందిట. మరిప్పుడు చెప్పండి. నవ్వు తప్పనిసరా కాదా?   ఓ చిన్న ప్రశ్న. మీరు బాగా నవ్వి  ఎన్నిరోజులయ్యింది? పోనీ, కాస్త నవ్వి  ఎన్నిరోజులయ్యింది. గుర్తుకు రావటం లేదు కదూ! మీరే కాదు. నన్ను ఆ ప్రశ్న అడిగినా నేనూ ఆలోచించాల్సిందే. ఎందుకంటే చాలు మనందరం మన మన బాధ్యతల నిర్వహణలో బిజీగా మారిపోయి ఆ నవ్వుని ఎక్కడో జారవిడుచుకున్నాం. అమూల్యమైన ఆ సంపద మన దగ్గరుంటే చాలు ప్రపంచంలో దేనినైనా స్వంతం చేసుకోగలం మనం. కానీ దానినే జారవిడుచుకుని, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా నిజమైన ఆనందం కలగటం లేదని వాపోతున్నాం. నిజానికి నవ్వుల్లో తేలిపోయే వ్యక్తి మనస్సు, శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతాయి. కష్టాలు, అసంతృప్తి వంటివి ఎదురయినప్పుడు కూడా స్థిరంగా ఉండగలం. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగి వుంటాం. ఇదంతా కేవలం నవ్వు వల్ల సాధ్యమయ్యే అద్భుతాలు. నవ్వును మరిచిపోయి జీవించటమే రోగాలకు మూలమంటున్నారు. మానసిక విశ్లేషకులు. ఎందుకంటే నవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి కలిగించే హర్మోన్లు తగ్గిపోతాయి. అలాగే నవ్వినప్పుడు ఆనందానికి కారణమయిన సహజసిద్ధమయిన రసాయనాలు, ఎండార్ఫిన్స్ చక్కగా విడుదల అవుతాయి. అప్పుడు శారీరం, మనస్సు తేలికయి సంతోషం కలుగుతుంది. అందుకే చూడండి కడుపారా నవ్వాకా అప్పటి వరకు ఉన్న బరువేదో దిగిపోయినట్టు అనిపిస్తుంది. సంతోషం ఉరకలు వేస్తుంది. అప్పటి వరకు మనల్ని చిరాకు పెట్టిన విషయాలు కూడా చిన్నవిగా తోస్తాయి. కోపం, విచారం దూరమవుతాయి. ఇదంతా కేవలం ఒక్క నవ్వు వల్లే సాధ్యం. మీకు తెలుసా... వ్యాయామం చేసినా, హాయిగా నవ్వినా కలిగే ప్రభావం,ప్రయోజనం ఒకటేనట. మనస్పూర్తిగా నవ్వినప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది. ముఖంలో, శరీరమంతటా కండరాలు బాగా కదులుతాయి. నాడీ స్పందనలు అధికమవుతాయి. రక్తప్రసరణ వేగవంతమవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగి కణజాలానికి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుందిట. శరీరం అంతా ఆ నవ్వు ప్రభావం ఉంటుంది. ఒకసారి నవ్వితే పదినిమిషాలు జాగింగ్ చేసిన దాంతో సమానం అని తేలింది ఓ పరిశోధనలో. ఈ నవ్వుపై పరిశోధనలు చేసిన మేరిలాండ్ యూనివర్సిటి పరిశోధకులు "నవ్వు ఉత్తమ ఔషధం అన్న మాట నిజమేనని అది గుండెను పదిలంగా ఉంచుతుందని" చెబుతున్నారు. "లాఫింగ్ థెరపి" అంటే "నవ్వు చికిత్స" తనని భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారి నుంచి కాపాడిందని చెప్పారు న్యూయార్క్ టైమ్స్ మాజీ సంపాదకులు నార్మన్ కుజిన్స్. కాబట్టి నవ్వు నాలుగు విధాల కాదు నాలుగు వేల రకాలుగా మంచిదని నమ్మితీరాలి. నవ్వటం మొదలుపెట్టాలి. మరి నవ్వటం మొదలు పెడతారు కదూ! నవ్వటం కష్టమనకండి. ఆ కష్టం కరగాలంటే నవ్వాలి మరి. సో మీ మనసుని, మెదడుని నవ్వుకి ట్యూన్ చేసేయ్యండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. సరేనా. మరి ఏదీ నా కోసం ఒక్క చిరునవ్వు? అదీ... అలా కంటిన్యూ అయిపోండి. -రమ ఇరగవరపు

Celebrate The Bond With Your Sibling !

  Raksha Bandhan is a festival that celebrates the bond between a man and his sister. The sacred thread tied on his wrist, compels him to protect his sister and be there for her, whenever she needs him. The festival celebrated on Shravan Purnima every year, has undergone a lot of change over many years. To start with, no one realized how and when the name Raksha Bandhan changed to Rakhi. Earlier there were many rituals associated with the festival. With time lot of them faded away owing to the ever changing circumstances.   Having said that we must acknowledge the fact that although the method of celebration may have changed, the essence of the festival still remains the same. Tying hand-made Rakhis was the original ritual. But today, beautiful designs have become easily available and you have a wide verity to choose from.   Same is the case with the gifts exchanged on Raksha Bandhan. The traditional gifts like a sari or jewelry are no longer given. These have been replaced by modern gifts like mobile phones, gift vouchers and other things.   The home-made sweets that used to be part of this festival are now replaced by chocolates and other desserts. It can also be observed that the celebration of this unique bond has now become virtual. Sisters send the rikhi online and receive a gift from their brothers in the same way. This shows how physical distances do not matter anymore. Though we observe so many changes in the celebration of Raksha Bandhan, brothers and sisters still eagerly wait for this day to express unconditional love for each other. - Kruti Beesam