Social Media - A Boon but How?

Whenever there is a significant technological advancement, it generates debate over the change - whether it’s “good” or “bad.” One such sensitive topic is that of social media. Internet-based, social media tools like email, Facebook, and YouTube have revolutionized the way human beings get information and communicates or interacts with one another. In a short span of time, social media has had some very positive effects in terms of empowering and connecting people. At the same time, they have provided new platforms for some decidedly unhealthy and destructive behaviors.     One of the biggest advantage of social media is that it nurtures relationships. Improving communication and strengthening human connection is the reason social media emerged. Facebook, Twitter, Instagram, Snapchat, chat groups, LinkedIn, and countless other social networking sites help people build relationships and making new friends. Regardless of where a person lives, it’s possible to find others who share the same interests and concerns. Social Media offers certain advantages like: 1. Anonymity - Many people find it easier to share problems and feelings openly when there’s minimal risk of identification or “real-life” consequences. 2. 24/7 availability - The internet never sleeps, and with the prevalence of cell phones, you don’t even need to be home at your computer to access the resources you need. In the event of a crisis, this can truly be life-saving. 3. No geographic limitations - Location can be an obstacle for participating in traditional support groups that require physical attendance. Online groups pull members from all over and can host larger numbers of people, adding to the pool of knowledge and experience.     The internet and social media boost productivity. These tools offer more information— including real-time news—than a library full of encyclopedias, and the information’s accessible at any time of day or night. Studies have linked internet/social media use with greater success in academics as well as improved job performance and employment prospects. Social media gives small business owners the power to be more competitive with larger companies. By simply creating and maintaining a Linkedln account they can reach a wider audience, share press releases and other company news, connect with job seekers, and more.   Ultimately, whether social media is “good” or “bad”/“healthy” or “unhealthy”, is directly related to how they are used. Key to enjoying the benefits while avoiding the problems is to use these powerful tools sensibly, constructively, and in moderation. Like food, which we truly can’t live without, the right choices in the right amounts keep people healthy and satisfied, while poor choices and excess consumption can lead to significant, potentially life-threatening health conditions.  

Dark Chocolates తినడం లేదా !!!

మీరు నా లాంటి వారయితే chocolates తినడానికి ఇష్టపడతారు. కానీ ఏ చాక్లెట్. అవును నేను dark chocolate  గురించి మాట్లాడుతున్నాను.  Dark chocolates గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. 1. Dark Chocolatesలో Fiber, Iron, Magnesium, Copper, Manganese ఇంకా చాలా రకాలైన Minerals ఉంటాయట.  2. Dark Chocolateలోని Flavonols చర్మాన్ని సంరక్షించడంతోపాటు Sun Damage నుండి కాపాడతాయట. 3. దీనిలోని Caffeine And Theobromine, Brain Functioning ని Improve చేయటంలో ఎంతో దోహద పడతాయని అధ్యయనాలు చెపుతున్నాయి. 4. Dark Chocolatesలో చాలా రకాలైన Antioxidants ఉంటాయట. ఇవి మిగిలిన Foods లో కంటే దీనిలో ఎక్కువగా లభిస్తాయని చెబుతున్నారు.   5. ఎవరైతే Dark Chocolates తీసుకుంటారో వారిలో గుండె జబ్బులు వచ్చే లక్షణాలు తక్కువ గా వుంటాయని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. So,  మరి ఇంకా ఆలస్యం దేనికి మనం కూడా మన Daily Life లో Dark Chocolate ని ఒక భాగం చేసేద్దాం రండి !!    

హిమదాస్‌ గురించి చదివితే మీ జీవితం మారిపోతుంది

  హిమదాస్‌. నిన్నమొన్నటి వరకు ఆ పిల్ల ఎవరికీ తెలియదు. ఇప్పుడూ... ఆపేరు వినని వాళ్లు చాలా రేర్‌గా కనిపిస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు హీనాది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ అంతర్జాతీయస్థాయి పరుగుపోటీల్లో బంగారుపతకం సాధించలేదు. పీటీ ఉష, అశ్వనీ నాచప్పలాంటి వాళ్లు కూడా సాధించలేనిది ఈ హీనా ఎలా గెల్చుకుందో తెలుసుకోవాలంటే... ఆమె జీవితాన్ని ఓసారి చూడాల్సిందే! హిమదాస్‌ది అసోంలో శివసాగర్‌ అనే పల్లెటూరు. అక్కడ హిమ వాళ్ల నాన్న చిన్న రైతు. తన పిల్ల ఏదో కాస్త చదువుకుంటే చాలనుకునే మనస్తత్వం. హిమకి మాత్రం అటు చదువు, ఇటు వ్యవసాయం కంటే ఆటల మీదే శ్రద్ధ ఉండేది. ఎంత శ్రద్ధ అంటే మగపిల్లలతో కలిసి పొలాల పక్కనే ఉండే బురదలో తెగ ఫుట్‌బాల్‌ ఆడేది. ఆటలో పడితే ప్రపంచాన్నే మర్చిపోయేది. అలాంటి సమయంలో ఓ లోకల్‌ కోచ్‌ హీనాని చూశాడు. తను ఫుట్‌బాల్లో కంటే రన్నింగ్‌లో మరింత బాగా రాణించగలదనుకున్నాడు. వెంటనే హీనాని ఒప్పంచి రన్నింగ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వసాగాడు.   హిమ క్రమంగా రన్నింగ్‌లో రాటుదేలింది. జిల్లా స్థాయిలో మెడల్స్ తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఆ సమయంలోనే నిపాన్‌ అనే కోచ్‌ దృష్టి హిమ మీద పడింది. చవక బూట్లు వేసుకుని కూడా, హిమ గోల్డ్‌ మెడల్స్‌ సాధించడం చూసి ఆశ్చర్యం వేసింది. తను ఇంతకుముందు ఎప్పుడూ చూడని టాలెంట్‌ హిమలో ఉందని నిపాన్‌ గ్రహించాడు. వెంటనే హీనాకి ప్రభుత్వ కోచింగ్‌ ఇప్పించాలని అనుకున్నాడు.   గవర్నమెంట్‌ కోచింగ్‌ తీసుకోవాలంటే అసోం రాజధాని గువాహతికి పంపించాలి. అది హిమ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల, అందులోనూ ఆరుగురు పిల్లల్లో అందరికంటే చిన్నది. అందుకే హిమని అంతదూరం పంపడానికి వాళ్ల మనసు ఒప్పలేదు. కానీ హీనాని వాళ్లు గువాహతికి పంపేదాకా నిపాన్‌ ఊరుకోలేదు. తీరా గువాహతికి వెళ్లాక అక్కడ అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక కోచింగ్‌ లేదని తెలిసింది. అయినా హిమ వెనక్కి రాలేదు. ఆమె ప్రతిభ చూసిన అధికారులు కూడా హిమని అకాడెమీలోకి తీసుకోక తప్పలేదు. ఓ రెండేళ్లు తిరిగేసరికి... ఇదిగో ఇలా చరిత్రి సృష్టించింది. ఫిన్లాండ్‌లో జరిగిన ‘world championships’లో గోల్డ్‌ మెడల్‌ కొట్టింది.   హిమ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని తెలిసి దేశం ఆశ్చర్యపోయింది. కానీ ఆమె సంపాదిస్తుందని ఆమె కోచ్‌ నిపాన్‌కు ఎప్పుడూ తెలుసు. ‘చాలా కొద్దిమందిలోనే టాలెంట్‌ ఉంటుంది. అలాంటి వాళ్లలో హీనా ఒకరు. అందుకే ఆమెను ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోవద్దని చెబుతూ ఉంటాను,’ అంటాడు నిపాన్‌. మనకి నచ్చిన రంగం ఏదైనా సరే... దాని మీదే effort పెడితే ఎప్పటికైనా విజయం తప్పదని హీనా నిరూపిస్తోంది. దేని మీదైనా మనకి విపరీతమైన dedication ఉంటే, పరిస్థితులన్నీ కలిసి వస్తాయని హీనా కథతో తెలుస్తోంది. - Nirjara  

కొత్త భాషతో కొత్త జీవితం

  చాలామంది ఏదో ఒక్క భాష మీద పట్టు ఉంటే చాలుకదా అనుకుంటారు. మరికొందరు అవసరం కదా అనుకుని ఇంగ్లీష్ వంటి మరో భాషని నేర్చుకుంటారు. కానీ భాష అంటే కేవలం ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు కదా! అది ఒక కొత్త ప్రపంచానికి ప్రతీక. భాష వెనుక ఏకంగా ఒక సంస్కృతే దాగి ఉంటుంది. అంతేకాదు! కొత్త భాషలని నేర్చుకోవడం వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని... ఆత్మవిశ్వాసం: ఒకటికి మించిన భాషలు నేర్చుకున్నవారిలో తాము ఇతరులకంటే ఏమాత్రం తీసిపోమన్న విశ్వాసం ఉంటుంది. భాష అనేది జ్ఞానానికి సూచన కాబట్టి, తాము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల సమర్థులం అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా తాము నేర్చుకున్న భాష అవసరమయ్యే పరిస్థితులలో, తమ సహచరులకంటే వారే దూకుడుగా ఉండగలుగుతారు. మెదడు పనితీరు: ఎక్కువ భాషలను నేర్చుకున్నవారి మెదడులో రకరకాల సానుకూల చర్యలు జరుగుతూ ఉంటాయి. అల్జీమర్స్, మతిమరపు వంటి వ్యాధులు ఇలాంటివారికి దూరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అంతేనా! వీరిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందనీ, మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందనీ తేలింది. అటు వినికిడి కూడా మెరుగుపడుతుందట! అదనపు అర్హత: కొత్త భాష అనేది ఎప్పుడూ ఒక అదనపు అర్హతే! కొత్త భాషతో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉపాధి పరిధి విస్తరిస్తుంది. ఉదాహరణకు హిందీ వచ్చినవాడు, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ప్రాథమిక అర్హతను సాధిస్తాడు. అంతేకాదు! యాజమాన్య సంస్థలు ఎప్పుడూ కూడా ఒకటికి మించి భాషలు వచ్చినవారికి అదనపు ప్రాధాన్యతని ఇస్తాయి. భిన్నమైన పనులు: పరుగులెత్తే ఈ జీవితంలో ఒకేసారి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. దీనినే మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకటి మించిన భాషలను నేర్చుకునేవారు వెంటవెంటనే వేర్వేరు పనులను చేయగలుగుతారనిన పరిశోధనలు నిరూపించాయి. పైగా వీరు కొత్త పరిస్థితులలో కూడా సులువుగా ఇమిడిపోగలుగుతారంట. అప్పటికప్పుడు అవసరమయ్యే నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారట. విశాల దృక్పథం: కొత్త భాషని నేర్చుకున్న మనిషి కొత్త ప్రాంతాలలో తిరగగలుగుతాడు. ఆ భాషలో ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. భిన్నమైన సంస్కృతినీ, జీవన విధానాన్నీ చూసి తన అభిప్రాయాలను మెరుగుపరుచుకుంటాడు. ఎక్కువ భాషలు నేర్చుకున్న వారు ప్రయాణాలు చేయడానికీ, ప్రపంచాన్ని అన్వేషించడానికీ ఉత్సాహం చూపుతారు. ఒక భాష తెలిసినవారికి మరో భాషని నేర్చుకోవడం మరింత సులువుగా మారుతుంది. మెదడు అప్పటికే భాషకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు నమోదై ఉంటారు కాబట్టి, మరో భాషని నేర్చుకునేందుకు అది అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరింకేం... 30 రోజుల్లో ఏదో ఒక భాషను నేర్చుకునేందుకు సిద్ధపడితే పోలా!

ఆనందానికి, ఆలోచనకూ మధ్య సంబంధం?

      ఏకాగ్రత ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు అని అందరికి తెలిసిందే. అయితే మన లక్ష్య సాధనకే కాదు ఆనందంగా ఉండడానికి కూడా ఏకాగ్రత దోహదపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఆశ్యర్యంగా అనిపించినా ఇది నిజం! ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ మధ్య ఆనందానికి, ఆలోచనకూ మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవడానికి అమెరికాలో ఒక అధ్యయనం నిర్వహించారట. దీనిలో భాగంగా 83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వయసుల వారిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. వాటి ఆధారంగా అధ్యయన కర్తలు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేచే వారు అంత ఆనందంగా ఉంటారని తేల్చారు.   83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వివిధ వయసుల వారిని ఏయే సమయాలలో ఎలా ఆలోచిస్తున్నారు, ఏమాలోచిస్తున్నారు అప్పుడు వారి అనుభూతి వంటి, ఏ పని చేస్తున్నపుడు ఏ దృక్పధం తో వున్నారు వంటి అంశాల పై ప్రశ్నించి వాటిని విశ్లేషించి, పరిశీలించారు. వీరిలో చాలా మంది పనిచేస్తున్న T.V  చూస్తున్నా, తింటున్నా చివరికి షాపింగ్ చేస్తున్నా ఇతర విషయాల  గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు గుర్తించారు. ఫలితంగా ఆ సమయంలో న్యాయంగా పొందల్సినంత ఆనందాన్ని వారు  పొందలేక పోతున్నారని గుర్తించారు పరిశోధకులు. నిజానికి మనం మనకే తెలియకుండానే నిరంతరం ఆలోచనల్లో మునిగి వుంటాం. అవి సంతోషానిచ్చే ఆలోచనలు అయినపుడు అప్పటి  మన అనుభవంతో సంబంధం లేకుండా మన మనసు సంతోషం గా వుంటుంది. అదే Negative  ఆలోచనలు మన మనసులో సుడులు తిరుగుతుంటే ఆనందానిచ్చే  విషయాలకి మన ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వుండదు. ఏది ఏమైనా మనసు  లగ్నం చేయందే ఏపని పూర్తి ఆనందాన్ని అందించదు అని ఖచ్చితంగా చెబుతున్నారు అధ్యయకర్తలు....   .......రమ

తక్కువ ఖర్చులో ఇంటిని అందంగా మార్చుకోవడం ఎలా?

  మీ ఇంటి అందాన్ని పెంచడం కోసం మరియు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం ఖరీదైన వస్తువులను అలంకరణ కోసం వాడల్సినవసరం లేదు. మీరు ముందుగా మీ ఇంటికి ఎలాంటి అలంకరణ ఉంటే బాగుంటుందో ప్లాన్ చేసుకోండి. ఏయే వస్తువు ఎక్కడెక్కడ బాగుంటాయో ఒక ప్రణాళికను సిద్దం చేసుకోండి. బాగా హడావిడి పడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో సింపుల్ గా చేసే ఇంటి డెకరేషనే చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుంది. లైటనింగ్, ఫర్నీచర్, వాల్ డెక్కర్, ఫ్లోర్ డేకరింగ్ మరియు ఇంటీరియర్ డిజైన్స్ ఇలా ప్రతి ఒక్కదాని మీద దృష్టి పెట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఇల్లు మరింత అట్రాక్షన్ గా తయారు చేసుకోవచ్చు. బాగా ఖరీదైన వస్తువులను పెట్టి డబ్బులను వృధా చేసే బదులుగా సింపుల్ గా ఉండే తక్కువ ఖర్చు గల వస్తువులతోనే మీ ఇంటిని ఆకర్షనీయంగా తయారు చేసుకోవచ్చు. మరి వాటి కోసం ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా!    పెయింటింగ్స్:- మీ ఇంటిని అలంకరించడంలో పెయింటింగ్స్ కన్నా మంచి అలంకరణలు మరొకటి లేదు. మీ ఇంటి కోసం తక్కువ ఖర్చులోనే ఎక్కువ ఆకర్షనీయంగా కనిపించేది తీసుకోవాలి. అదే విధంగా మీ ఇంటికి ఆ రంగు ఎలా ఉంటుందో ఆలోచించాలి.   కుషన్స్:- మీ గదిని మరింత రిచ్ గా మరియు లక్సరీగా కనబడేలా చేయాలనుకుంటే మీ సోఫా లేదా బెడ్ మీదకు కొన్ని కుషన్స్ లేదా డెరేటివ్ పిల్లోస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇంటి అలంకరణలో తక్కువ బడ్జెట్ లో కుషన్లు లేదా పిల్లోలను ఎంపిక చేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. రకరకాల కొత్త కొత్త డిజైన్ లలో దొరికే తక్కువ ఖరీదు వాటిని ఎంపిక చేసుకొని, మీ ఇంటి సోఫా లేదా బెడ్ మీద వాడుకోవడం వల్ల మీ ఇంటికి మరింత అందం వస్తుంది.     కర్టెన్లు మరియు మ్యాట్స్:- మీ ఇంట్లోని గదులకు మ్యాచ్ అయ్యే విధంగా కర్టెన్ ల కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. సింపుల్ కలర్ లో ఉండే ఆకర్షనీయమైన కర్టెన్ లను ఎంపిక చేసుకోవడం వల్ల మీ ఇంటికి అందం రెట్టింపవుతుంది. మీ ఇంటి అలంకరణలో తక్షణ మార్పును తీసుకురావడంలో కర్టెన్లు మరియు మ్యాట్స్ ఎంపిక చేసుకోవడం చాలా సులభ పద్దతి.     ఇండోర్ ప్లాంట్స్:- అదే విధంగా కొన్ని అందమైన ఇండోర్ మొక్కలను మీ గదిలో ఉంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్ ఇల్లు మరింత అందంగా కనబడేలా చేస్తాయి.

SUCCESS SECRET TELUSA ?

  GELUPU evariki istam vundadu cheppandi ..manam chese prati pani lo gelupu kosame praytinstam. kaani aa gelupu kondari ki maatrame dakkutundi. adi choosi manam valla ki luck vundi antaam. luck evariki vuntundo telusa right way lo aa aalochinche vallaki, aa aalochanaki taggattu prayatnam chese valla ki , kasta pade vallaki. kastapadutunnaa phalitam emi ledu antaru chaala mandi. enduku phalitam ledu ?manam physics lo force ..gurinchi chaduvu kunnam  kada. danini apply chese vidanam batti oka vastuvuni move cheyatam lo differece vastundi . alage mana kastam right direction lo vundo ledo okasari check chesukovali. ela check chesukovatam ? 1. mundu mee lakshyam ento oka paper meeda raayandi. lakshyam vishayam lo meeku enta clarity vundo telustundi.  2. danini sadinchataniki emi cheyalo raayandi.  3. emi cheyalo telisaaka ela cheyalo aalochinchandi. 4. long term, short term goals set chesukondi.ante ee roju emi cheyali anna clarity vundali. next week emi cheyabotunnaru, entha varaku mee journey chestaru anna picture mee kalla mundu clear gaa vundali. 5. try and error policy telusu kada. ante oka prayatnam chesinappudu adi meeru anukunna phalitanni evvaka pothe enko method apply cheyali. manam velle dari manalni korukunna gamyaniki cherchadu ani telusukunna ventane , enko right way kanukkovatam lone manam sagam gelichinattu. wrong direction lo velutoo kooda telusukoleka pothe .otami vaddanna mana eduta nilabadutundi. anduke eppati kappudu mana lakshayam,praytnam balance avutunnayo ledo check chesukuntoo vundali. 6. ika mukhyamayina vishyam ..mimmalni down chese aalochanaluni tarimikottadam. chala sarlu mana otamiki maname kaaranam avutaamu. ee negative thoughts tho. geliche variki , odevari ki madhya kanipinche theda ade. vallu oka plan prakaram veltaru, gelustaama leda ? anna thought kooda raaneeyaru. ade odipoye varu valla krushi meeda kante gelavmemo anna bhayam meeda ekkuva focus chestaru. google map ni nammi drive chesetappudu prati nimisham ee dari correct enaa ani bayapadam kada. ? mari mana plan meeda , mana krushi meeda manaki nammakam leka pothe ela ? 7. mimmalni mee lakshyam nunchi divert chese amsalu chalaa eduravutaayi. vaati ni nirdakshinyam gaa toosipadeyyandi. endukante balaheenata ee roopam lo vunna adi balaheenate. mimmalni mee otami vaipu nadipinche prati okkati meeku satruve. mundu aa list raasukondi. mimmalni divert chese amsalu ento. vatini ela daatalo ani burra pagilela aalochinchakandi. just vaatini vaddu anukondi. thats it. enta simple gaa vaatini vadilinchuko galugutaro choosthe meeke aascharyam kalugutundi.  8. jeevitham manadi. mana jeevithaniki write maname. odinaa gelichina poorthigaa manade responsibility. situations ni, manushulani, avakasalani tappu pattaddu. anduku sakshyam gaa mana ki endaro gelupu veerulu kanipistaaru. kallu vippi okkasari chuttoo choodandi. All the best. GO GET IT. THE ONLY THING THAT OVERCOMES HARD LUCK IS HARD WORK. - Rama    

చేతివాటానికి చురుకుదనానికి సంబంధమేంటి...?

    ఒక వ్యక్తి చేతివాటానికి, ఆ వ్యక్తి చురుకుదనానికి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా? కానీ సంబంధం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కుడిచేతివాటం కంటే ఎడమచేతివాటం వాళ్ళు వేగంగా ఆలోచిస్తారని, సంక్లిష్ట పరిస్థితుల్లో తొందరగా నిర్ణయాలు తీసుకుంటారనీ చెబుతున్నారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో భాగంగా..100 మంది కుడి, ఎడమ చేతివాటం ఉన్న వాళ్ళను ఎంపిక చేసుకొని, ప్రతీ వ్యక్తికి ఎదురుగా ఒక బోర్డుమీద రెండు వైపులా వేరు వేరు అక్షరాలను రాసి వాటిని జత చేయమని చెప్పారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు మన కుడి, ఎడమ భాగాలు రెండిటినీ ఒకేసారీ ఉపయోగించుకుంటుంది. కొన్ని పరికరాల ద్వారా ప్రతీ వ్యక్తి అక్షరాలు జత చేయటానికి తీసుకుంటున్న సమయం, ఆ సందర్భంలో ఆ వ్యక్తి మెదడులో కలిగే మార్పులను శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఫలితాల్లో ఎడమ చేతి వాటం వాళ్ళు కుడి చేతి వాటం వాళ్ళకంటే 43 మిల్లి సెకండ్లు ముందుగానే లక్ష్యాలను సాధించారని తెలిసింది. ఈ పరిశోధన గురించి నిక్ అనే శాస్త్రవేత్త తెలియజేస్తూ.. ఎడమచేతివాటం వాళ్ళ మెదడులోని ఎడమ, కుడి భాగాల మధ్య సమాచారం చాలా సులువుగా సమన్వయం చేసుకోనగలుగుతున్నారు. దీనివల్లే ఒకే సమయంలో ఎక్కువ లక్ష్యాలను వేగంగా చేరుకునే సామర్ధ్యం వారికి ఉంటుందని తెలిసింది" అని అన్నారు. - రమ

మన ఆనందం మన చేతుల్లోనే...

  ఆనందంగా ఉండటానికి, వయసుకి సంబంధం ఏముంటుంది చెప్పండి. చిన్నతనంలో హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేస్తే, ఆ తరువాత చదువు, మార్కులు అంటూ పరిగెడుతుంది జీవితం. చదువులు అయిపోయాయి అమ్మయ్య అనుకునేలోపు ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంసార బాధ్యతలు... ఆ భవసాగరాన్ని ఈదే ప్రయత్నంలో ప్రత్యేకంగా ‘ఆనందం’ కోసం ఆలోచించడానికి సమయం లేకపోయినా ఆ బాధ్యతలు, బంధాలు ఆనందాన్ని పంచుతాయి కాబట్టి అక్కడా ఆనందం వుంటుంది. ఇక్కడ వరకు బాగానే వుంది. ఆ తర్వాతే.... అంటే పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాలని వారు జీవించడం మొదలుపెట్టాకే ఈ ‘ఆనందం’ అన్న పదానికి అర్థాన్ని వెతుక్కోవటంలో పడతారు ఆడవారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మగవారు, ఆడవారు ఆనందంగా ఉండటం  అనేది వయసునుబట్టి మారుతుందిట. అంటే, ఉదాహరణకి మధ్య వయస్సులో కంటే మగవారు వయసు గడుస్తున్నకొద్దీ జీవితం పట్ల సంతృప్తిగా, ఆనందంగా వుంటారుట. అదే ఆడవారి విషయానికి వస్తే టీనేజ్‌లో అలాగే మధ్య వయస్సులో వీరు ఎక్కువ ఆనందంగా జీవితాన్ని గడుపుతారని వీరి విశ్లేషణ. అంటే వయస్సు పెరిగినకొద్దీ మగవారు జీవితం పట్ల ఎక్కువ సంతృప్తిని కలిగి వుంటే, అదే సమయంలో ఆడవారు అసంతృప్తిలో వుంటారుట. ఎందుకని? ఈ ప్రశ్నకి సమాధానం కోసం కేంబ్రిడ్జి పరిశోధకులు గట్టి ప్రయత్నమే చేశారు. పురుషులు, మహిళల్లో ఆనందం, ఆశయాలు, కోరికలపై జరిగిన అనేక అధ్యయనాలు, సర్వేలను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలో బయటపడిన అంశాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయిట. తలమునకలయ్యే బాధ్యతలు ఆడవారికి ఎక్కువ సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తే, అవే బాధ్యతలు మగవారిని అసంతృప్తికి గురిచేస్తాయిట. అందుకే మధ్య వయస్సులో పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఆడవారిని ఆనందంగా ఉంచితే, ఆ వయసులో ఇవన్నీ మగవారిని ఒత్తిడికి గురిచేస్తాయిట. కాబట్టే వారు ఆ వయసులోకంటే ఆ తర్వాతి దశ అంటే 50ల వయసులో ఆనందంగా వుంటారుట. పిల్లల బాధ్యత తీరిపోయిన క్షణం నుంచి ఆడవారిలో ఆనందంగా ఉండే సమయం కూడా తగ్గిపోవడం మొదలవుతుందిట. కారణం వారు పిల్లలతోనే తమ ఉనికి, ఆనందాన్ని చూసుకోవడమేనట. ఈ వయసులో వారిని ఒంటరితనం చుట్టుముట్టి అప్పటి వరకు గడచిన జీవితం పట్ల కూడా అసంతృప్తిగా ఉండటం గమనించారు పరిశోధకులు. ఎన్నో అధ్యయనాలు, సర్వేలు పరిశీలించిన వీరు వయస్సుతో, కుటుంబ బాధ్యతలతో, ఆర్థిక అంశాలతో ఖచ్చితంగా ఆనందం ముడిపడి వుంటుందని చెబుతున్నారు. జీవితమంతా ఆనందంగా గడపగలిగినప్పుడే అందం, ఆనందం కూడా. నా ఆనందం ఈ విషయంపై ఆధారపడి వుంటుంది అని గిరిగీసుకుంటే అసంతృప్తి మనల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా ఆడవారు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో, భర్తతో, పిల్లలతో ఇలా ఎవరో ఒకరితో తమ ఆనందాన్ని ముడిపెట్టడం వల్ల ఎక్కువశాతం అసంతృప్తితో జీవితాన్ని నింపేస్తారు అంటున్నారు పరిశోధకులు. మరి పరిష్కారం ఏమిటని అంటే, మనకంటూ ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకోవటమే అంటున్నారు. ఎవరున్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా వున్నా ఈ ప్రపంచం మాత్రం మనతో నడుస్తుంది. ఆ ప్రపంచం ఎలా వుండాలనేది వారివారి ఇష్టాలపై ఆధారపడి వుంటుందని అంటున్నారు వారు. -రమ ఇరగవరపు

ఇలా చేస్తే ..అన్ని కలిసొస్తాయి

    కొందరిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఆనందంగా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏదీ కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఏంటి వాళ్ళ సీక్రెట్ ? అంటే జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బ్లాకేమన్ ఏం చెబుతున్నారో తెలుసా? పాజిటివ్ మైండ్ సెట్... తో జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనని చూడటం. ఆఒక్క అలవాటే వారిని అందరి నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది, అంతే కాదు అలాంటి వారికే అన్ని కలిసివస్తాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతిదానిలో ఒక అవకాశం కనిపిస్తుంది అంటున్నారు ఆయన. మరి అలాంటి మ్యాజిక్ మన జీవితాలలో కూడా జరగాలంటే? ఆయన చెబుతున్న ఈక్రింది వాటిని ఫాలో అవ్వటమే.   లోపలినుంచి మొదలు కావలి... మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతంగా, ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువ వుంటుంది. అంటే ఆందోళనగా వున్నప్పుడు అప్పటికప్పుడు మనసుని ప్రశాంతం కమ్మని చెబితే మాట వినదు. మొదటి నుంచి దానికి ఆప్రశాంతతని  అలవాటు చేయాలి. దానికోసం రోజూ ధ్యానం, మెడిటేషన్ వంటి ఆరోగ్యకర అలవాట్లని చేసుకోవాలి. ఒక్క అరగంట అయినా చాలు. ఆరోజులో మనకి ఎదురయ్యే ఎన్నో సంఘటనలని ఆందోళన పడకుండా దాటగలుగుతాము. ఆందోళన లేనప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది. సమస్యలకి పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. అలా ఆడుతూ పాడుతూ వాటిని దాటుతుంటే అందరు వీళ్ళకి అన్ని కలిసివస్తాయి అంటారు. అది కేవలం మీరు ప్రశాంతంగా వుండటం వల్లే సాధ్యమవుతుంది.   ఓ చిన్న మంత్రం...  ఇది కూడా గడిచిపోతుంది... ఇదే మంత్రం చాలా మందిని ఎన్నో గడ్డు సమయాలని దాటేలా చేసింది. చేస్తోంది. చాలాసార్లు కాలం పరీక్ష పెడుతుంది. ఒకదాని వెనుక ఒకటి మన సహనాన్ని పరీక్షిస్తాయి. అప్పుడే నిటారుగా నిలబడాలి. ఎదురైన గాలికెరటం మనలని దాటి పోయేదాకా ఎదురు చూడాలి. అది దాటిపోతుందని, మంచి రోజులు ఎదురవుతాయని నమ్మాలి. జీవిత చక్రంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో తెలిసి కూడా క్రుంగిపోవటంలో అర్ధం లేదుకదా ?   నీకు నీవే శత్రువు కావద్దు... ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు...నేనింతే... అనుకుంటూ నిందించుకోవటం మానేయాలి. ఎదుట వుండే శత్రువుతో పోరాడటం సులువు, కాని మన లోపలి శత్రువుతో పోరాడలేము, గెలవలేము. పొరపాట్లు చేయటం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దు కోవాలో ఆలోచించాలి. అంతే సగం బాధ తీరిపోతుంది. చాలాసార్ల జరిగిన విషయాన్నే తలుచుకుని, తలుచుకుని బాధ పడుతుంటారు. దానివల్ల ఆత్మ విశ్వాసం తగ్గటం తప్ప వేరే లాభం ఏమి ఉండదు.   చుట్టువైఫైలా వుండాలి...  మంచి ఆలోచనలతో, ఉత్సాహంగా వుండే స్నేహితులని చుట్టూ ఉంచు కుంటే చాలు. చాలావరకు సమస్యలు ఎదురే కావు.. మన స్వభావం మూలంగా మనం కొనితెచ్చుకునే సమస్యలు ఎన్నో వుంటాయి. అవి మన స్నేహితుల వల్ల మన దగ్గరకి రాకుండా వుంటాయి. ఎప్పడు మంచి ఆలోచనలు కలిగి వుండటం ఒక్కటి చాలు ఎన్నో విజయాలు పొందటానికి.   ప్రతి చిన్న విజయం విలువైనదే... ప్రతి రోజు చిన్నదో, పెద్దదో ఒక విజయాన్ని అయితే సెలెబ్రేట్ చేసుకోవాలి. నచ్చిన పని చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం, నుంచి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం వరకు అన్ని విలువైనవే. ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్శాహం కలుగుతుంటుంది. దానితో తృప్తి కలుగుతుంది. -రమ

బంధువుల సాక్షిగా... బంధాలు గట్టిగా...

  ఒకరి కోసం ఒకరుగా జీవించాలి అని పెళ్ళిలో పెద్దలు దీవిస్తారు. ఆ దీవెనలు ఫలించాలి అంటే భార్యాభర్తలు వాళ్ళ బంధాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఆ బంధం ప్రాముఖ్యతని గుర్తించాలి. అప్పుడే అందులోని ఒడుదుడుకులకి సర్దుకోవటం ఎంత అవసరమో తెలుస్తుంది. ఈ రోజు ఒక వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించటం అంటే ఏంటో చూద్దాం. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు... కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే కాదు అక్కడ ముడిపడేది. రెండు కుటుంబాలు కలుస్తాయి. ఆ రెండు కుటుంబాల అనుబంధం ఆ ఇద్దరు వ్యక్తుల బంధం మీద ఆధారపడి వుంటుంది. ఈ విషయాన్ని గ్రహిస్తే, ఎదుటి వ్యక్తి కుటుంబాన్ని తనదిగా భావించి, వారితో సత్సంబంధాలు కలిగి వుండటం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. నిజానికి చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలకి ఈ ఒక్క విషయమే కారణం అంటే ఆశ్చర్యంగా అనిపించినా నిజమదే. "మా అమ్మానాన్న అంటే అస్సలు ప్రేమ లేదు తనకి ", "కొంచం కూడా పట్టించుకోడు " ఇలాంటి ఆరోపణలు వింటూనే ఉంటారుగా? అటు అమ్మాయిది అదే ఆరోపణ, ఇటు అబ్బాయిది అదే ఆరోపణ. వాళ్ళ గురించి కాకుండా , వాళ్ళ వాళ్ళ గురించి ఇద్దరూ గొడవలు పడతారు. ఇక అక్కడ నుంచి ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పెరిగి బంధంలో అనుబంధం లేకుండా పోతుంది . అందుకే ప్రతి కొత్త జంట గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటే. కేవలం ఒక భార్య మాత్రమే కాదు... తనతో పాటు ఇంకా ఎన్నో కొత్త బంధాలు కూడా ఏర్పడతాయి. అత్త, మామ, బావమరిది, మరదలు, ఇంకా, ఇంకా ఎందరో కొత్తగా తన జీవితంలోకి వస్తారు.  వాళ్ళందరితో ఒక మాట, ఒక పలకరింపు, ఒక చిన్న చిరునవ్వు... అవి వారిని, వారితోపాటు చిన్ననాటి నుంచి వారి ప్రేమని పొందిన మీ శ్రీమతిని కూడా ఆనందపరుస్తాయి. ఇదే సూత్రం భార్యకీ వర్తిస్తుంది. ఒక కోడలిగా, వదినగా, తోటి కోడలిగా... ఇలా తన పాత్ర ఎన్నో విధాలుగా ఆ కుటుంబంలో ఎంతో ముఖ్యమైనది. ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్రలో ఒదిగిపోతూ, వారందరితో అనుబంధాన్ని పెంచుకుంటూ వెళుతుంటే, భర్తతో తన అనుబంధం గట్టిపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.  ఇది కష్టమైనది కాదు, కష్టమని అనుకుని చాలామంది ఎదుటి వారి తాలుకా వారికి దూరంగా వుంటారు. ఆ దూరం అపోహలని పెంచుతుంది. ఆ అపోహలు ఇద్దరి మనసులలో కోపాన్ని, అసహనాన్ని పెంచుతాయి. నెమ్మదిగా నిప్పు రాజుకుంటుంది. అది దావాగ్నిలా కావటానికి అప్పుడప్పుడు ఏవేవో పరిస్థితులు కూడా తోడవుతాయి. ఇక అంతే. ఇద్దరు వ్యక్తులు కాదు అక్కడ కలసి ఉందేది. వారిద్దరి మధ్య ఎందరో నిలుస్తారు. సో ఇదంతా జరగకుండా వుండాలంటే  ఏం చేయాలో ఇందాకే చెప్పుకున్నాం కదా.... వీలు చూసుకుని పలకరింపులు, కలుసుకోవటాలు...  ఇక్కడ ఒక్క విషయం మర్చిపోవద్దు. చిన్నతనం నుంచి పెరిగిన తోబుట్టువులతోనే అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్థలు సహజం. అలాంటిది... వేరే కుటుంబం, పద్ధతులు, మనస్తత్వాలు... అలాంటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగటం సహజం. వాటిని చూసి, చూడనట్టు వదిలేయటమే మంచిది. ఎందుకంటే ఆ చిన్న సంఘటన కన్నా జీవితం చాలా పెద్దది. వారితో బంధం ఎంతో ముఖ్య మైనది. ఈ ఒక్క సూత్రం తెలిస్తే చాలు... పెళ్ళిలో పెద్దలు దీవించినట్టు ఒకరి కోసం ఒకరుగా జీవించటం కష్టమేంకాదు. -రమ

తండ్రికి కూతురంటేనే ఇష్టం. ఎందుకంటే...

  తండ్రికి కూతురి మీదా, తల్లికి కొడుకు మీదా ఎక్కువ ప్రేమ ఉంటుందని ఓ నమ్మకం. అదంతా ఒట్టి ట్రాష్‌ అని కొట్టి పారేసేవాళ్లూ లేకపోలేదు. అసలు ఈ నమ్మకంలో నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు అమెరికన్‌ సైకాలజిస్టులు. దానికోసం ఓ పరిశోధన చేశారు. అ పరిశోధన ఏమిటో, అందులో తేలిన నిజాలు ఏమిటో మీరే చూడండి! ఈ పరిశోధన కోసం ఓ 52 కుటుంబాలని ఎంచుకున్నారు. అందులో కొన్ని ఫ్యామిలీలలో ఆడపిల్లలు ఉంటే, మరికొన్ని కుటుంబాలలో మగపిల్లలు ఉన్నారు. ఈ కుటుంబాలలోని పెద్దలకి ఓ చిన్న రికార్డర్‌ని ఇచ్చారు. ఆ రికార్డరుని బెల్టుకి తగిలించుకోమని చెప్పారు. ఆ రికార్డరు ప్రతి తొమ్మిది నిమిషాలకి ఓసారి ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. ఓ యాభై సెకన్ల పాటు చుట్టూ ఉన్న శబ్దాలను రికార్డు చేస్తుంది. ఇలా రికార్డయిన శబ్దాలని ఎనలైజ్ చేసిన పరిశోధకుల మతి పోయినంత పనయ్యింది. తండ్రులు ఆడపిల్లలతో మాట్లాడే విధానానికీ, మగపిల్లలతో మాట్లాడే విధానానికీ చాలా తేడా కనిపించింది. మగపిల్లలతో వాళ్లు చాలా రఫ్‌గా మాట్లాడారట. అంతేకాదు! వాటిలో సాధించాలి, ప్రయత్నించాలి, ముందుండాలి లాంటి సక్సెస్‌కి సంబంధించిన పదాలే కనిపించాయి. ఆడపిల్లల విషయంలో అలా కాదు! ఎక్కువ, తక్కువ, అందరూ.... ఇలా అనాలసిస్‌కి సంబంధించిన శబ్దాలే వినిపించాయి. కేవలం మాట్లాడే పదాలే కాదు వారి ప్రవర్తన అంతా డిఫరెంట్‌గా కనిపించింది. ఆడపిల్లల దగ్గర తండ్రులు పాటలు పాడటానికైనా, తమ బాధని పంచుకోవడానికైనా సిగ్గుపడలేదు. అలాగే ఆడపిల్లలు ఏడ్చిన వెంటనే వాళ్లని దగ్గరకి తీసుకునేందుకు కూడా తండ్రులు సిద్ధంగా ఉన్నారు. మన బ్రెయిన్‌ పనిచేసే తీరులోనే ఈ తేడా ఉందని అంటున్నారు పరిశోధకులు. మన జెనెటిక్స్‌లో భాగంగా ఆడపిల్లలతో ఒకలా, మగపిల్లలతో ఒకలాగా ప్రవర్తించేలా ఒక సిస్టం ఏర్పడిపోయిందట. ఆడపిల్లల స్వభావాన్ని బట్టి, సొసైటీలో వాళ్లతో ప్రవర్తించాల్సిన తీరుని బట్టి, మనకి తెలియకుండానే ఇలాంటి పద్ధతులు ఏర్పడ్డాయన్నమాట. అందుకే ఆడపిల్లలతో సున్నితంగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తే... మగపిల్లలతో రఫ్‌ అండ్‌ టఫ్‌గా ప్రవర్తిస్తున్నారట తండ్రులు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మగపిల్లలతో మరీ మోటుగా ప్రవర్తిచవద్దని సూచిస్తున్నారు. -Niranjan