రాత్రివేళ త్వరగా తింటే ఎంత లాభమో!

  ప్రపంచం మారిపోయి ఉండవచ్చు. మనం జీవించే విధానమూ మారిపోయి ఉండవచ్చు. కానీ పెద్దలు చెప్పిన మంచి మాటలకి మాత్రం ఎప్పటికీ రోజులు చెల్లిపోవు. అందుకు ఉదాహరణగా రాత్రిపూట ఆహారం గురించి పెద్దలు చెప్పే మాటల గురించే చెప్పుకోవచ్చు. ‘రాత్రివేళ మనం తినే ఆహారం పడుకునే సమయానికల్లా అరిగిపోయేలా ఉండాల’న్నది పెద్దల మాట. అంటే కనీసం రాత్రి ఎనిమిదింటికల్లా తినేయాలన్నమాట. ఇదెంత ఆరోగ్యకరమో ఒక పరిశోధన రుజువుచేస్తోంది చూడండి!   పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు... ఆలస్యంగా ఆహారం తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి వారికి వేర్వేరు అలవాట్లను సూచించారు. మొదటి బృందంలో ఉన్నవాళ్లు ఉదయం ఎనిమిదిగంటల నుంచి రాత్రి ఏడుగంటల లోపు ఆహారం తీసుకోవాలని సూచించారు. రెండో బృందంలోని వారిని మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆహారం తీసుకోవచ్చని చెప్పారు. నిద్రపోయే సమయాలు మాత్రం, అభ్యర్థులందరికీ ఒకేలా ఉండేలా జాగ్రతత్తతీసుకున్నారు.   ఒక ఎనిమిదివారాలపాటు సాగిన ఈ పరిశోధనతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆహారం తినే సమయాన్ని బట్టి మన శరీరంలోని జీవక్రియలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించారు. ఆలస్యంగా తిన్నప్పుడు ఆహారంలోని కొవ్వు, శరీరానికి ఎక్కువగా అందుతున్నట్లు తేలింది. శరీరం పీల్చుకునే ఆక్సిజన్కంటే వదులుతున్న కార్బన్డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. శరీరంలోని ఈ ఆక్సిజన్, కార్బన్డైఆక్సైడ్ల మధ్య నిష్పత్తిని Respiratory quotient అంటారట. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, శరీరం హానికారక పదార్థాలనే ఎక్కువగా స్వీకరిస్తోందని అర్థం.   ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని భిన్నంగా స్వీకరిస్తోందని అర్థమైపోయింది. దీని వల్ల శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి, గుండె పనితీరు, కొవ్వు శాతం, గ్లూకోజు నిల్వలు... అన్నింటి మీదా ప్రతికూల ప్రభావం ఉన్నట్లు గమనించారు. అంతేకాదు! పగటివేళ ఆహారానికి అలవాటుపడితే, మనలో ఆకలిని కలిగించే ghrelin అనే హార్మోను కూడా పగటివేళే చురుగ్గా పనిచేస్తోందని తేలింది. అలాగే పొట్ట నిండుగా ఉండే భావనని కలిగించి, చిరుతిళ్లకు దూరంగా ఉంచే leptin అనే హార్మోను అదుపులో కనిపించింది.   ఒక్కమాటలో చెప్పాలంటే- రాత్రి ఆలస్యం కాకుండానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అధికబరువు వంటి సమస్యల నుంచి కూడా త్వరగా దూరం కావచ్చునని అంటున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంలో చాలా మార్పులు స్పష్టంగా వచ్చితీరతాయని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. - నిర్జర  

20 Daily Habits to make you Rich

      Whenever we see the rich and famous we always wondered what is that they do to become rich. In a radio interview, best-selling author Tom Corley talked about the differences between the habits of the rich vs. those of the not so rich. Here’s a list of things the rich do to which makes them what they are!   1. 80% of wealthy are focused on accomplishing some single goal. 2. 67% of wealthy write down their goals. 3. 81% of wealthy maintain a to-do list. 4. 86% of wealthy believe in life-long educational self-improvement 5. 86% of wealthy simply love to read 6. 88% of wealthy read 30 minutes or more each day for education or career reasons 7. 63% of wealthy listen to audio books during commute to work 8. 63% of wealthy parents make their children read 2 or more non-fiction books a month 9. Only 33% of wealthy watch more than 1 hour of TV every day 10. Only 6% of wealthy watch reality TV 11. 84% of wealthy believe good habits create opportunity luck 12. 76% of wealthy believe bad habits create detrimental luck 13. 70% of wealthy eat less than 300 junk food calories per day. 14. Only 23% of wealthy gamble. 15. 44% of wealthy wake up 3 hours before work starts 16. 74% of wealthy teach good daily success habits to their children 17. 70% of wealthy parents make their children volunteer 10 hours or more a month 18. 80% of wealthy make ‘Happy Birthday” calls 19. 79% of wealthy network 5 hours or more each month 20. 76% of wealthy exercise aerobically 4 days a week. Rich Habits – The Daily Success Habits of Wealthy Individuals by Tom Corley

Sleep for a Healthy Lifestyle

      Studies tell is that it is critical for adults to seek treatment for a sleep illness and aim for 7 to 9 hours of sleep each night in order to maintain a healthy lifestyle. Three new studies show just how critical it is for adults to seek treatment for a sleep illness and aim for seven to nine hours of sleep each night in order to maintain a healthy lifestyle.   One study of 2,240 adults is the first to examine the link between obstructive sleep apnea (OSA) and mortality in Asians. Results show that all-cause mortality risk was 2.5 times higher and cardiovascular mortality risk was more than 4 times higher among people with severe OSA. The results are consistent with previous studies in the U.S. and other countries. Another study of 2,673 patients in Australia found that untreated OSA is associated with an increased risk of motor vehicle crashes in very sleepy men as well as near-misses in men and women. Participants with untreated OSA reported crashes at a rate three times higher than the general community. That last study examined the relationship between sleep duration and self-rated health in Korean adults. Results show that short sleep duration of 5 hours or less per day and long sleep duration of 9 hours or more per day was associated with poor self-rated health. The results add weight to recent data emphasizing the importance of adequate sleep in physical and mental health. All three of the studies are in the Oct. 15 issue of the Journal of Clinical Sleep Medicine, which is published by the American Academy of Sleep Medicine. The AASM reports that at least 12 to 18 million adults in the U.S. have untreated obstructive sleep apnea, which involves the repetitive collapse of the upper airway during sleep. OSA is a serious sleep illness that is associated with an increased risk of high blood pressure, heart disease, diabetes, depression and stroke. The most effective treatment option for OSA is CPAP therapy, which helps keep the airway open by providing a stream of air through a mask that is worn during sleep.   So most of us adults need about seven to eight hours of nightly sleep to feel alert and well rested.

మనిషి విలువ ఎంత

ఓ కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది. ఆ సందేహం అతన్ని నిలవలనీయలేదు, కూర్చోనీయలేదు. ‘మనిషి విలువ ఏమిటి?’ అన్నదే అతని సందేహం. తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే ఉంటుందనిపించింది ఆ కుర్రవాడికి. వెంటనే తాతయ్య దగ్గరకి పరుగుపరుగున వెళ్లాడు. ‘తాతయ్యా! తాతయ్యా! మనిషి విలువ, మనిషి విలువ అంటూ ఉంటారు కదా! అసలు మనిషి విలువ ఏమిటి?’ అని అడిగాడు.   కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు. ‘ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరకి వెళ్లి, ఈ రాయి విలువ ఏమిటో ఒకొక్కరినీ అడిగి చూడు. కానీ పొరపాటున అమ్మవద్దు,’ అన్నారు.   ఎర్రగా తళతళా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలోకి బయల్దేరాడు. ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది. దుకాణంలోకి వెళ్లి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘దీన్ని తీసుకుని మీరేం ఇవ్వగలరు,’ అని అడిగాడు. పండ్ల దుకాణదారుడు ఆ రాయిని ఎగాదిగా చూసి ‘ఓ ఐదు డజన్ల యాపిల్స్ ఇస్తాను,’ అని గొప్పగా చెప్పాడు.   ఆ తరువాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు?’ అని అడిగాడు. దానికి ఆ దుకాణదారుడు ‘నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధం,’ అని చెప్పాడు.   తన రాయికి పండ్లు, కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు. దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లాడు. దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకుడు డంగైపోయాడు. ‘ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం,’ అనేశాడు. నగలవర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసిపారేయదగింది కాదనిపించింది అతనికి. దాంతో వాళ్లనీ వీళ్లనీ అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు.   రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. ఓ ముఖమల్ వస్త్రం తీసుకుని బల్ల మీద పరిచి, కుర్రవాడి చేతిలోని రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు. ‘ఇది మామూలు రాయి కాదు. ఇది ఓ గొప్ప పగడం. నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని నేను కొనలేను,’ అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు.   రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటనకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకుని అదెక్కడ చేజారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరుగుతీశాడు. తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు.   ‘ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా! నీకు ఎదురుపడిన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. నువ్వు ఆ అమూల్యమైన పగడంలాంటి వాడివి. కానీ నీకు జీవితంలో ఎదురుపడేవారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం. వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి, విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు. జీవితంలో వాళ్లు విలువైనవి అనుకునేవాటికీ నీకూ పొంతన లేకపోవచ్చు. నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్లకి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపారివంటివాడు నీకు ఎదురుపడతాడు. నీ విలువని అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు. కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం. అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి. అలాగే ఉండేందుకు ప్రయత్నించు. నీ మీద నువ్వు గౌరవం ఉంచుకో! పండ్ల వ్యాపారీ, కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చవకగా అమ్ముడుపోవద్దు,’ అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మనిషి విలువ అమూల్యం అన్నమాట!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

క్లాస్‌రూంలో నేర్చుకోని పాఠం

  అది అమెరికాలో జాన్ హాప్‌కిన్స్‌ అనే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కి ఓ ఆలోచన వచ్చింది. ‘తన కళ్ల ముందు ఉన్న స్టూడెంట్స్ అంతా మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే కదా! వాళ్లు ఎప్పటికైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు కదా! మరి బస్తీలో పెరిగే పిల్లల సంగతి ఏంటి?’ అన్న ఆలోచన ప్రొఫెసర్ మనసుని కదిలించేసింది. వెంటనే ఆయన కొంతమంది స్టూడెంట్స్‌ని పిలిచాడు. ‘ఈ ఊరి చివర ఓ స్లమ్‌ ఏరియా ఉంది కదా! మీరంతా అక్కడికి వెళ్లండి. అక్కడ పిల్లల మనస్తత్వాన్నీ, వాళ్ల నేపథ్యాన్నీ గమనించండి. వాళ్లు పెద్దయ్యాక ఏమవుతారో ఊహించండి?’ అంటూ ఓ ప్రాజెక్ట్‌ వర్క్‌ అప్పగించాడు. ప్రొఫెసర్ చెప్పినట్లుగానే విద్యార్థులు ఊరి చివర ఉన్న స్లమ్‌ ఏరియాకు వెళ్లారు. అక్కడ పిల్లలని ఓ రోజంతా పరిశీలించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు రెండువందల మంది పిల్లలను గమనించారు. చివరికి వాళ్లలో కనీసం 90 శాతం మంది పిల్లలైనా, పెద్దయ్యాక ఎందుకూ పనికిరాకుండాపోతారని అంచనా వేశారు. వాళ్లలో చాలామంది ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లితీరతారని ఊహించారు. తమ ప్రాజెక్టుని ప్రొఫెసరుకి అందించారు.   ఇదంతా జరిగి సుమారు 25 సంవత్సరాలు గడిచింది. ఈసారి ప్రొఫెసరుగారికి మరో ఆలోచన వచ్చింది. తాను ఒకప్పుడు చేయించిన ప్రాజెక్టు ఎంతవరకు నిజమైందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఇప్పుడు చదువుతున్న కొంతమందికి పాత పేపర్లు అప్పగించి, అప్పటి పిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో పరిశీలించి రమ్మని చెప్పాడు.   ప్రొషెసరుగారు అప్పగించిన కాగితాలు తీసుకుని విద్యార్థులు బయల్దేరారు. ఆనాటి రెండు వందల మంది పిల్లల్లో ఓ 180 మంది ఆచూకీ కనిపెట్టగలిగారు. వాళ్లంతా రకరకాల వృత్తులలో ఉన్నారని తేలింది. ఆశ్చర్యంగా వాళ్లలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లినట్లు బయటపడింది. ఒకప్పుడు అల్లరిచిల్లరగా తిరిగిన పిల్లలలో అంత మార్పు ఎలా వచ్చిందో విద్యార్థులకి అర్థం కాలేదు. చివరికి అక్కడ పనిచేసిన ఓ టీచర్ కారణంగా వాళ్లంతా బుద్ధిమంతుల్లా మారిపోయారని బయటపడింది.   అంతమందిలో మార్పు తీసుకువచ్చిన టీచర్‌ గురించి విద్యార్థులలో ఆసక్తి పెరిగిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటారో కనుక్కుని విద్యార్థులంతా బయల్దేరారు. ఆ టీచర్‌ని కలవగానే, తాము స్లమ్‌ ఏరియాలో చూసిన అద్భుతాన్ని ఆవిడతో చెప్పుకొచ్చారు. ‘మీరు ఇంతమందిలో మార్పు ఎలా తీసుకువచ్చారు,’ అంటూ ఆ టీచర్ని అడిగారు.   విద్యార్థుల ప్రశ్నకి టీచర్‌ ఏమాత్రం తడుముకోలేదు. ‘నేను వాళ్లని ప్రేమించాను. వాళ్లు తప్పకుండా మారతారని నమ్మకం ఉంచాను. ఒక టీచర్‌గా నా బాధ్యతని నిర్వహించాను. వాళ్లు భవిష్యత్తులో నేరగాళ్లు అవుతారనే అనుమానమే నాకు ఉండేది కాదు,’ అంటూ చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. ఆ టీచర్‌ సమాధానం విద్యార్థులందరికీ ఓ కొత్త పాఠాన్ని నేర్పింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

సాటి మనిషిని గుర్తించండి

  సమాజంలో తనకంటూ ఓ గొప్ప స్థానం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్థానం సంగతి అలా ఉంచితే... కనీసం తను ఒకడు ఉన్నాడని అవతలివారు గుర్తించాలని అనుకుంటారు. ఈ గుర్తింపు కూడా పొందలేకపోతే మనిషి ఏమైపోతాడు? అలాంటివారితో ఎలా ప్రవర్తించాలి? అన్న అనుమానాలు వచ్చాయి పరిశోధకులకి. ఫలితంగా ఓ ప్రయోగం చేసి చూశారు. ఆ ప్రయోగం ఏమిటో! అది నేర్పే పాఠాలేమిటో చూడండి!   ఈ పరిశోధన కోసం సైకాలజిస్టులు, అభ్యర్థులతో ఒక ఆటని ఆడించారు. ఇందులో ఒకరికి ఒకరు బంతిని అందిస్తూ ఉండాలి. ఈ ఆటలో కొందరికి బంతి అస్సలు అందలేదు. ఇలాంటి సందర్భాలలో కావాలని తమని విస్మరిస్తున్నారన్న భావన మనకి కలగడం సహజం. ఇది ఆత్మన్యూనత, అభద్రతాభావం లాంటి తీవ్రమైన మనస్తత్వానికి దారితీస్తుందని తేల్చారు.   తన ఉనికిని గుర్తించకపోవడం వల్ల మనిషి అహం దెబ్బతింటుదనీ... అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందనీ తేలిపోయింది. కానీ ఇలాంటి సందర్భాలను నివారించడం ఎలా అన్న దిశగా కూడా ప్రయత్నం చేశారు. తనని తిట్టినా, తిరస్కరించినా కూడా మనిషికి ఎలాగొలా తనని గుర్తించారులే అన్న తృప్తి కలుగుతుందట. ఏదో సినిమాలో చెప్పినట్లు- ‘కుదిరితే క్షమించు, లేదా శిక్షించు, కానీ మేం ఉన్నామని గుర్తించు’ అంటూ మనిషి తపించిపోతాడట.   మన చుట్టూ ఉండే ప్రతిఒక్కరి అహంకారాన్నీ మనం తృప్తి పరచలేకపోవచ్చు. కానీ వాళ్లూ మన రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తించడం చాలా అవసరం అంటున్నారు. ఉద్యోగ సంస్థలు కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఉద్యోగులని పరామర్శ ద్వారానో, విమర్శ ద్వారానో... అసలంటూ వారు తమ సంస్థలో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. అలాగే ఒకే ఉద్యోగానికి పదులకొద్దీ దరఖాస్తులు వచ్చినప్పుడు కూడా ఈ సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. తిరస్కరించిన అభ్యర్థుల విషయంలో మిన్నకుండి పోకుండా మెయిల్‌ లేదా ఉత్తరం ద్వారా ‘మిమ్మల్ని తిరస్కరిస్తున్నాం’ అని తెలియచేయమంటున్నారు.   - నిర్జర.

ఏది ముందు కావాలి?

'అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె! ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆ ఇంట్లో ఉండేవారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలో ఇంటిపెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు. ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి బయల్దేరారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు. చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది. ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు. మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు. ‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు. ‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు. ‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను,’ అన్నాడు తండ్రి. ‘భలేవారే! మన అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య. ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు. ‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

ఆన్ లైన్ షాపింగ్ భయం ఉన్న వారికి 4 సలహాలు

  ఆన్ లైన్ షాపింగ్ కొందరికి నచ్చితే, చాలా మందికి నచ్చదు. ఇక బట్టల విషయంలో అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ భయానికి గల అసలు కారణం ఏంటంటే ఆన్ లైన్ షాపింగ్ లో పొరపాటున నచ్చని వస్తువు కొన్నా, లేదంటే వస్తువు అనుకున్నట్లుగా లేకపోయినా వాపసు చేయడం ఎలాగా అని? అలాంటి వారి కోసమే ఈ 4 సలహాలు:   1 . మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేస్కోండి: ఒక వస్తువుని కొనేప్పుడు మనం చేసే ప్రథమ తప్పిదం ఏంటంటే మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం. ఒక చొక్కానో, లేక ప్యాంటు కొనేప్పుడు మెజర్మెంట్స్ బాక్స్ లో అన్ని వివరాలు సరిగ్గా గమనిస్తే అది మన సైజు కి సరిపోతుందా లేదా అనే విషయంలో సరయిన అవగాహన వస్తుంది.   2 . డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి: ప్రతి పోర్టల్ కి ఒక డిజైనర్ ఉంటారు. వాళ్ళు తాము చేసే దుస్తులు వీలయినంత వరకు అందంగా కనిపించేలా చూసుకుంటారు. కావున, మనం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మీరు ఇష్టపడిన దుస్తులు ఒక సాధారణ వ్యక్తిపై చాలా భిన్నంగా కనిపించొచ్చు. ఒక్కోసారి వాటికి బెల్ట్ కానీ వేరే ఇతర వస్తువు తగిలించి కనిపించొచ్చు. అయితే అది మనం తీసుకునే వస్తువుతో జత చేయబడి ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి, మీకు అన్ని విషయాల్లో సరయిన అవగాహన వస్తుంది.   3 . సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం: ఏదయినా వస్తువు కొనాలనుకున్నప్పుడు, మీరు ఇంతకు ముందు దానిని చూడని సందర్భంలో, ఆ వెబ్ సైట్ యొక్క ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం. ఎందుకంటే, మీకు ఆ వస్తువును రకరకాల కోణాల్లో చూసే అవకాశం ఉంది. చెప్పలేం, మీకు తెలిసిన వారెవరయినా అది ఇంతకు ముందు ధరించి ఉండవచ్చు కూడా. ఇలా చేయడం వల్ల మీకు ఆ దుస్తులపైన సరైన అవగాహన వచ్చి, మీరు కొనొచ్చో లేదో నిర్ణయం తీసుకోవచ్చు.   4 . ఫాబ్రిక్ విషయంలో జాగ్రత్త వహించండి: ఎల్లప్పుడూ, మీరు కొనే ఫాబ్రిక్ నాణ్యత, సౌకర్యం విషయంలో మీకు ఇంతకు మునుపు ఉన్న బట్టలతో పోల్చి చూడండి. చాలా సందర్భాల్లో మీరు కొనే దుస్తులు మెటీరియల్ వల్ల కానీ లేదా మీకు ఎంత సౌకర్యవంతంగా ఉంది అనే దాని బట్టి ఇష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఓ ఫాబ్రిక్ నిపుణులవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర ఇంతకు ముందు ఉన్న దుస్తుల ఫాబ్రిక్ లో ఏది సౌకర్యవంతంగా ఉందో అదే ఫాబ్రిక్ దుస్తులు తీసుకుంటే మంచిది.  ఈ 4 చిట్కాలను అనుసరించండి ఆన్లైన్ షాపింగ్ నిపుణులు అవ్వండి. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులు మీకు ఇష్టం లేనందున నిరాశ చెందే పని ఉండదు.

ఫేస్‌బుక్‌తో ఆయుష్షు పదిలం

‘లేచిన దగ్గర్నుంచీ ఆ ఫేస్‌బుక్‌ ముందరే తగలడతారేంటి?’ అని భార్యలు తిట్టవచ్చుగాక! ‘పిదపకాలం పిదప పోస్టులు’ అంటూ పెద్దలు విసుక్కోవచ్చుగాక! కానీ ఫేస్‌బుక్‌ అంటే పడిచచ్చేవారికి సంతోషం కలిగించేలా ఓ పరిశోధన జరిగింది. ఫేస్‌బుక్‌తో జీవితకాలం పెరుగుతుందని సదరు పరిశోధన రుజువుచేస్తోంది.   12 శాతం ఎక్కువ సామాజిక సంబంధాలు దృఢంగా ఉన్నవారు సుదీర్ఘకాలం బతుకుతారన్న విషయం ఇప్పటికే రుజువైంది. అయితే ఇది ఆన్‌లైన్‌లో సామాజిక వెబ్‌సైట్లకు ఎంతవరకు వర్తిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాకు చెందిన ఫేస్‌బుక్‌ యూజర్ల జాబితాను సేకరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ జాబితాలో ఉన్నవారి ఆరోగ్యం ఎలా ఉందో బేరీజు వేశారు. ఫలితం! ఫేస్‌బుక్‌ వాడేవారు ఇతరులతో పోలిస్తే 12 శాతం సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు తేలింది.   అకౌంట్‌ ఉంటే సరిపోదు కేవలం ఫేస్‌బుక్‌ అకౌంటు ఉంటే సరిపోదు, అందులో చురుగ్గా పాల్గొంటున్నా సరిపోదు! పరిశోధకుల లెక్కల ప్రకారం వీలైనంతమంది ఎక్కువ ఫేస్‌బుక్ నేస్తాలు ఉన్నవారికే ఆయుష్షుపరంగా మేలు జరుగుతోంది. పైగా ఏదో నామమాత్రంగా పోస్టులు పెట్టడం, లైకులు కొట్టడం వల్ల ఉపయోగం లేదట. ఎక్కువమంది మిత్రులు ఉన్నవారు, ఆ మిత్రులతో తమ ఫొటోలను పంచుకుంటున్నవారే ఫేస్‌బుక్‌ వల్ల లాభపడుతున్నట్లు తేలింది.   కారణం! ఈ పరిశోధన ఏదో వందలు, వేలమంది మీద జరిగింది కాదు. ఆషామాషీగా సాగిందీ కాదు. దాదాపు కోటిమందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లను గమనించిన తరువాత తేల్చిన విషయం. సామాజికంగా దృఢమైన సంబంధాలు ఉన్నవారు ఇతరులకంటే ఎక్కువకాలం జీవిస్తారనే విషయం దాదాపు 35 ఏళ్ల క్రితమే రుజువయ్యింది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఫేస్‌బుక్‌ కూడా మన సామాజిక బంధాలను కొలిచే ఒక సాధనంగా మారిపోయింది. ఇందులో ఏదో కొందరు నామమాత్రంగా పాల్గొంటే... నిజంగా నలుగురిలో కలిసే మనస్తత్వం ఉన్నవారు వీలైనంత ఎక్కువమంది స్నేహితులను ఆకర్షించడం, తమ ఫొటోలను వారితో పంచుకోవడం చేస్తుంటారు. సహజంగానే ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, చొరవా, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి దృక్పథం వారి ఆరోగ్యం మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అదే వారి సుదీర్ఘమైన ఆయుష్షుకి కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనకి మనం కూడా ఒక లైక్‌ కొడదాం మరి!   - నిర్జర.

అందుకనే మనిషి గొప్పవాడు

  అది ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఉన్న జీవాలన్నీ ఓ మిట్టమధ్యాహ్నం కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ‘అసలు జీవితం అంటే ఏమిటి?’ అన్న చర్చ మొదలైంది.   ‘జీవితం అంటే తనివితీరా పాడటం. అలా ఆటలా పాటలా సాగేదే అసలైన జీవితం,’ అని మైమరపుతో చెప్పింది ఓ కోయిల. చెప్పడమే కాదు, వెంటనే ఓ కూనిరాగం తీయడం మొదలుపెట్టింది.   ‘పాటా పాడా! జీవితం అంటే భయం భయంగా బతకడం. ఎవరి కంటా పడకుండా భయపడతూ నక్కి నక్కి తిరగడం,’ అని చెప్పిందో పందికొక్కు.   ‘అబ్బే అంత భయపడటం ఎందుకు? జీవితం అంటే అందం, జీవితం అంటే సంతోషం,’ అంటూ రెక్కలు చాస్తూ గిరగిరా తిరుగుతూ చెప్పింది ఓ అందమైన సీతాకోకచిలుక.   ‘నిరంతరం అలా తిరుగుతూ ఉంటే ఇక పనిచేసేదెప్పుడు. అసలు జీవితం అంటేనే పని. పని చేయకపోతే జీవితానికి అర్థమే లేదు,’ అని నిట్టూర్చింది ఓ తేనెటీగ.   ‘నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం. సంతోషం సంగతి పక్కన పెట్టండి. నిరంతరం పనిచేయకపోతే జీవించి ఉపయోగం లేదు,’ అని తేనెటీగ మాటలను బలపరిచింది చీమ.   ఇంతలో ‘మీతో నేను ఏకీభవించను,’ అంటూ గంభీరంగా ఓ స్వరం వినిపించింది. ఆ స్వరం ఎక్కడిదా అని పైకి చూసిన జీవులన్నింటికీ ఓ గద్ద కనిపించింది. ‘జీవితం అంటే స్వేచ్ఛ. అల్లంత ఎత్తున ఆకాశంలో తిరుగుతూ కిందకి చూస్తుంటే ఆ మజానే వేరబ్బా!’ అంటూ నిశ్చలంగా ఆకాశంలో తేలుతూ చెప్పింది.   నిదానంగా ఈ చర్చలోకి మొక్కలు కూడా తలో మాటా కలిపాయి. ఎత్తైన దేవదారు వృక్షం గద్దతో ఏకీభవించింది. అడవిపూలేమో చీమని బలపరిచాయి. గులాబీ మాత్రం అందమే ముఖ్యమన్న సీతాకోకచిలుక మాటలను బలపరిచింది. ఈ హడావుడంతా చూసి పైనున్న మబ్బులు కూడా గొంతు కలిపాయి. ‘జీవితం అంటే కన్నీళ్లు, కష్టాలు, ఊహించని విపత్తులు,’ అంటూ సాగిపోయాయి.   మబ్బులు మాట్లాడటం చూసి నదులు కూడా అరిచాయి ....’అదేమీ కాదు! జీవితం అంటే ఓ అంతులేని ప్రవాహం,’ అంటూ ముందుకు ఉరికాయి.   అలా జీవితం అంటే ఏమిటంటూ నిదానంగా మొదలైన చర్చ ఓ భీకరమైన వాదన కిందకి దారితీసింది. అన్ని జీవాలూ కలగాపులగంగా అరుచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఆకాశవాణి వినిపించింది... ‘మీరు చెప్పిన జవాబులన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి. నిజానికి జీవితం అంటే ఏ ఒక్క లక్షణమో కాదు. అందం, ఆటాపాటా, సంతోషం, స్వేచ్ఛ ఒకవైపునా..... కష్టం, బాధా, కన్నీరు, భయం, పని మరోవైపు సమంగా ఉండేదే జీవితమంటే. అలాంటి జీవితాన్ని అనుభవించే అదృష్టం ఒక్క మనిషికి మాత్రమే ఉంది,’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ మాటలతో జీవాలన్నీ ఏకీభవించక తప్పలేదు. మరి మీరో! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

బహుమతులు - వాటి ఫలితాలు

శుభకార్యాలకు బహుమతులు ఇవ్వడం లేదా పుచ్చుకోవడం సహజం. అయితే, కొందరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో, ఎలాంటివి  తీసుకోకూడదో తెలీదు. ఏదో ఒకటి కొంటారు, వెళ్లి తమ స్నేహితులకో, బంధువులకో ఇస్తారు. అలా ఏదంటే అది కొనుక్కొని వెళ్లి ఇవ్వకూడదని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరైనా  టవల్స్, కర్చీఫ్ లు బహుమతులుగా ఇస్తే తీసుకోకూడదట. వివాదాలు వస్తాయట. బహుమతిగా ఇస్తే వద్దని చెప్పాలట లేదా వారి చేతిలో ఒక నాణెం పెట్టాలట. చైనా జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం  నీళ్లతో వున్న వస్తువులు (అక్వేరియం) బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మీదగ్గర ఉన్న అదృష్టం వారివద్దకు వెళుతుందట. మీరు తరచూ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారట. అలాగే పదునైన వస్తువులు ఇవ్వడం లేదా స్వీకరించడం కూడా దురదృష్టమే. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయట. తిరస్కరించడం ఉత్తమమని కొందరి జ్యోతిష్యుల భావన.  

ఎక్కువకాలం చదవండి, ఎక్కువకాలం జీవించండి...!

  ఎక్కువకాలం చదువుకునేవారు, మరియు కొత్త అనుభవాల కోసం ఉవ్విల్లూరేవారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. దీర్ఘాయువు కోసం జన్యువుల మీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం, విద్యను సుదీర్ఘ కాలం అభ్యసిస్తే, పాఠశాల చదువు దాటి ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని ఏళ్ళ ఆయుష్షు పెరుగుతుందట.   అధిక బరువు ఉన్న వ్యక్తులు ప్రతి అదనపు కిలోగ్రాము బరువుకు రెండు నెలల ఆయుష్షు తగ్గుతుందని ఆ అధ్యయనం సూచించింది. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు తమ తల్లిదండ్రుల జీవితకాల రికార్డులతో పాటు 600,000 మందికి పైగా ఇతర వ్యక్తుల నుండి జన్యు సమాచారాన్ని విశ్లేషించారు.   మన జీవనశైలి:- ఉదాహరణకు మద్యం సేవించడం, సిగరెట్ తాగడం లేదా వీటికి బానిస అవ్వడం DNA పైన విపరీతమయిన ప్రభావితం చూపిస్తుంది. సిగరెట్ అలవాటు ఉన్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తద్వారా వారి జీవితకాలం తగ్గుతుందని వారు కనుగొన్నారు.    ఒక రోజుకి సగటున ఒక సిగెరెట్ ప్యాకెట్ తాగితే, జీవితకాలంలో ఏడు సంవత్సరాలు తగ్గుతుందని వారు లెక్కించారు. అయితే, పొగత్రాగేవారు ఆ అలవాటు మధ్యలో మానుకుంటే అలవాటు లేని వారు ఎంత కాలం బ్రతుకుతారో వీళ్ళు అంతే కాలం బ్రతుకుతారు. శరీరంలో కొవ్వు మరియు మధుమేహం తెచ్చే ఇతర కారకాలు కూడా జీవితకాలం పైన ప్రభావం చూపిస్తాయి.   మొత్తంగా ఈ అధ్యయనం చెప్పేది ఏంటంటే, మనం ఎన్నేళ్లు చదువు మీద శ్రద్ధ ఉంచాం, మనకు ఎన్ని మంచి లేదా చెడు అలవాట్లు ఉన్నాయి, మన శరీరంలో ఎంత కొవ్వు ఉంది లాంటి కారకాలు మనం ఎన్నేళ్లు జీవిస్తామో నిర్ణయిస్తుంది.    

మేమున్నామనీ.. మీకేం కాదనీ....

ఆత్మహత్య... ఈమధ్యకాలంలో మనం తరచూ వింటున్నాం ఆ మాటని. చదువుకున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, చివరికి పిల్లలు కూడా  ఆత్మహత్యలకి పాల్పడటం చూస్తున్నాం. ఒకోసారి కుటుంబం, కుటుంబం మొత్తం ఆత్మహత్య  చేసుకోవటం వింటుంటే బాధనిపిస్తుంది. ఎందుకని ఇలా జరుగుతోంది? చుట్టూ కావలసిన వాళ్ళు ఎంతో మంది వుండీ ఎందుకంత ఒంటరితనం? మనసులో బాధ పక్కవారితో పంచుకోవటానికి ఎందుకంత ఆలోచన? ఇలాంటి ప్రశ్నలకి మానసిక నిపుణులు చెబుతున్న సమాధానం ఒక్కటే. చుట్టూ ఎంతమంది వున్నా వారితో మనసులో మాట చెప్పుకునేంత దగ్గరితనం లేకపోవటం ఓ కారణం. బాధ అనిపించగానే ఎవరికి చెప్పుకోవాలో తెలియక... ఆ సమస్యని ఎదుర్కోవటం ఎలాగో తెలియక జీవితాన్ని చాలిస్తున్నారు. అదే ఆ సమయంలో ఓ ఓదార్పు మాట వారికి అందితే  చాలు ఎన్నో ఆత్మహత్యలు జరగవు. నిజానికి వారి మాటలని ఓపికగా వినేవారు కావాలి ఆ సమయంలో. సమస్యకి పరిష్కారం కన్నా... ఆ సమస్యని ఎదుర్కునే ధైర్యం నూరిపోసేవారు కావాలి. అలా జరగాలంటే అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఎవరితో ఒకరితో మాట్లాడాలి. అయితే తనని అర్థం చేసుకోరనో లేదా మరింకేదో ఆలోచనతో వారు చుట్టు పక్కల వారితో మాట్లాడటానికి ఇష్టపడరు .అలాంటి సమయంలో వారికి అందుబాటులో ఉండేందుకు కొన్ని సంస్థలు హెల్ప్ లైన్ సేవలని అందిస్తున్నాయి. మన దేశంలో ప్రతి నగరంలో ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. అక్కడకి నేరుగా వెళ్ళచ్చు లేదా వాళ్ళ హెల్ప్ లైన్ నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడచ్చు. వారితో మాట్లాడిన మాటలన్నీ చాలా రహస్యంగా ఉంచబడతాయి. మన హైదరాబాద్‌లో కూడా అలా సేవలు అందిస్తున్న కొన్ని సంస్థల గురించి తెలుసు కుందాం. ఆ వివరాలు.. ఫోన్ నెంబర్లు తెలిసిన వారందరితో పంచుకుంటే... ఎప్పుడు ఎవరికి మనిషి తోడు అవసరమో తెలియదు కాబట్టి వారికీ సహాయ పడినవారు అవుతారు. SEVA ... అనే సంస్థ ఫ్రీ కౌన్సిలింగ్ అందిస్తోంది. అక్కడకి నేరుగా వెళ్ళచ్చు.. లేదా వారి ఫోన్ నెంబరుకి ఫోన్ చేయచ్చు. వారి ఫోన్ నెంబర్  09441778290..  ల్యాండ్ లైన్  నెంబర్  (040) 27504682.  అలాగే ఫోన్ ద్వారా కూడా కౌన్సిలింగ్ అందించే మరో సంస్థ రోషిని  040 - 66202000, 040 - 66202001  .. వారి mail  -   roshnihelp@gmail.com  ఇక మరో హెల్ప్ లైన్ నెంబర్ 7893078930 .. ఈ హెల్ప్ లైన్ సర్వీస్‌ని అందిస్తున్నది 1 లైవ్ సంస్థ. మనసులో కలిగిన బాధని ఎవరితో ఒకరితో పంచుకుంటే ఆ నిమిషంలో కలిగే ఆవేశం చల్లారుతుంది. ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోరు అప్పుడు. ఈ సంస్థలు ఆ భరోసానే అందిస్తున్నాయి. -రమ ఇరగవరపు

Life and Lights of Christmas

  Like Diwali in India, Christmas is a festival of lights in the Western countries...their only big festival to celebrate and decorate. It starts with the Christmas tree at home. Even offices are showing off their Christmas spirit by setting up a tree. There is Christmas music everywhere, in malls, restaurants, airports..Parks and Riverside lawns arrange Christmas lights in themes, every evening the whole month of December, these places are open for visitors to drive around and take pictures. We have read in story books that Santa visited homes for children, and we all know that it is just a fantasy..but Santa comes alive during this time, in malls and parks, sitting on a throne or his sledge, ready for pictures with children and families, one for a memorable album.     Most Houses are so amazingly decorated with lights during this month..it is so exciting to go on a car ride passing by these bright lit houses..tell me about the kids!! Guests come for the holidays and we love taking them for such rides after dark..never to forget the camera. Christmas treats are oh so famous around the world !! Be it the cold, lazy season or the festival spirit..show me one person who doesnot want to sit warm on a couch, sipping hot cocoa, craving sweets and cookies during this time of the year?! I am just waiting for my box of cookies our American friends send every year..this festive spirit starts in November with Thanksgiving and continues till end of year through Christmas. January is the weight loosing month for most, here. When are you visiting your friends and family in the western countries to taste these festivities ?!! Happy Christmas...Hohoho -Prathyusha

ఆయన అనుభవాలు - మన జీవితాన్నే మర్చివేస్తాయి!

  సుబ్రతో బాగ్చీ – చాలామంది ఈ పేరుని వినే ఉంటారు. ఐటీ నిపుణుడిగా, రచయితగా సుబ్రతో పేరు భారతీయులకి సుపరిచితమే! ఈ స్థాయికి చేరుకోవడానికి సుబ్రతో చాలానే కష్టపడి ఉండవచ్చు. కానీ తన తల్లిదండ్రులు నేర్పిన విలువలే తన విజయానికి బాటలు వేశాయంటారు సుబ్రతో. 2006లో సుబ్రతో, కాన్పూర్ IIM విద్యార్థులతో తన జీవితపాఠాలను పంచుకున్నారు. భారతీయులు ఇచ్చిన అత్యద్భుత ఉపన్యాసాలలో ఇదీ ఒకటని అంటారు. వాటిలోని ముఖ్య అంశాలు....   - మా నాన్నగారు ఓ చిన్న ప్రభుత్వోద్యోగి. ఆయన టూర్లకి వెళ్లేందుకు ప్రభుత్వం ఒక జీప్ ఇచ్చింది. కానీ ఆ జీప్లో ఎప్పుడూ ఆయన మమ్మల్ని కూర్చోనిచ్చేవారు కాదు. అంతేకాదు! టూర్లకి వెళ్లేందుకు తప్పితే ఆయన కూడా దానిని వాడేవారు కాదు. ఆఫీసుకి కూడా రోజూ నడిచేవెళ్లేవారు. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులలో కనపడని నిబద్ధత ఇది!   - మా జీపు డ్రైవరుని ఆయన ఎప్పుడూ పేరుతో పిలవనిచ్చేవారు కాదు. ‘దాదా’ (పెద్దాయనా) అనే పిలవమనేవారు. నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారికంటే, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికే ఎక్కువ గౌరవం ఇవ్వాలన్న మర్యాద నాకు అలా అలవడింది.   - మా నాన్నగారికి రేడియో కానీ, సొంత ఇల్లు కానీ ఉండేవి కావు. అదేమని అడిగితే ‘నా పిల్లలే నా ఆస్తిపాస్తులు’ అనేవారు. వ్యక్తిగత విజయానికి ఆస్తులు కొలబద్ద కాకూడదన్న పాఠం అలా ఆయన నుంచి నేర్చుకున్నాను.   - ఉద్యోగరీత్యా మా నాన్నగారికి తరచూ బదిలీ అవుతుండేది. కొత్త ప్రదేశంలో మాకు ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్స్ ఎలాంటి ప్రహరీ లేకుండా బోసిగా ఉండేవి. మా అమ్మ కష్టపడి ఇంటి ముందు ఒక కంచె వేసి పూల మొక్కలు నాటేది. వాటిని చెదలు తినేస్తే మళ్లీ నాటేది. తీరా ఆ మొక్కలు పెరగి పెద్దవయ్యేలోగా మేము వేరేచోటకి బదిలీ అయిపోయేవారం. ‘మీరు చేసే పనితో మీ తర్వాత వారే లాభపడతారు. మరి ఇంత శ్రమెందుకు తీసుకుంటారు?’ అని ఇరుగుపొరుగూ అడిగేవారు. దానికి అమ్మ ‘నేను అడుగుపెట్టిన ప్రతి చోటనీ మరింత అందంగా మార్చాలి కదా!’ అంటూ జవాబిచ్చేది. ‘విజయం అంటే నీకోసం సృష్టించుకునేది కాదు, నువ్వు వదిలివెళ్లేదే నిజమైన విజయం’ అని నాకు ఆరోజున అర్థమైంది.   - అమ్మకి శుక్లాలు రావడంతో ఆమెకోసం వార్తాపత్రికలు చదివి వినిపించేవాడిని. ఆ వార్తల గురించి మేం చర్చించుకునేవారం కూడా. ప్రపంచం చాలా విశాలమైందన్న అనుభవం ఆ వార్తల వల్లే కలిగింది. నా సృజనకు పదునుపెట్టే అవకాశం దక్కింది. సృజన (creativity) ఉంటే భవిష్యత్తుని ముందుగా ఊహించగలం. ఆ ఊహని నిజం చేసుకోగలం. మనం నిజం చేసుకున్న ఊహలో మరికొందరు జీవించే అవకాశాన్నీ కల్పించగలం!   - మా అమ్మకి శుక్లాల ఆపరేషన్ చేసిన వారం రోజులకే పరిస్థితి విషమించి చూపు పోయింది. కానీ ఆ తర్వాత 32 ఏళ్ల పాటు అలా చూపులేకుండానే గడిపగలిగింది. ఆమె తీరు చూసి ఆశ్చర్యం వేసిన నేను ఓసారి ‘నీకు చీకటి మాత్రమే కనిపిస్తుందా!’ అని అడిగాను. దానికి ఆమె ‘లేదు! నాకు కళ్లు లేకపోయినా వెలుతురు మాత్రమే కనిపిస్తుంది,’ అని జవాబిచ్చింది. అలా ఆమెకు 80 ఏళ్లు వచ్చేవరకూ రోజూ ఉదయాన్నే యోగా చేయడం, తన గదిని శుభ్రం చేసుకోవడం, తన బట్టలు ఉతుక్కోవడం చేసేది. స్వతంత్రంగా బతకడమే విజయం అని ఆమె నుంచి నేర్చుకున్నాను. ప్రపంచాన్ని చూడటం కాదు, వెలుగుని చూడటమే విజయం అని తెలుసుకున్నాను.   - మా నాన్నగారిని ఓసారి తీవ్రమైన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నర్సులు రోగులతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. ఓసారి మా నాన్నగారి రక్తపు బాటిల్ నిండుకుందని, నేను నర్సుతో చెప్పినా కూడా ఆమె వినిపించుకోలేదు. కాసేపటికి కళ్లు తెరిచిన మా నాన్నగారు ఆ నర్సుని చూసి ‘నువ్వింకా ఇంటికి వెళ్లకుండా పనిచేస్తున్నావా!’ అని పరామర్శించడం చూసి ఆశ్చర్యపోయాను. సాటి వ్యక్తి పట్ల మనం చూపగలిగే కరుణకు హద్దులు ఉండవని ఆ సంఘటనతో తెలుసుకున్నాను.   - 82 ఏళ్ల వయసులో మా అమ్మగారికి పక్షవాతం వచ్చిందని తెలిసి ఆమెను చూడటానికి విదేశాల నుంచి వచ్చాను. పక్షవాతంతో కదల్లేని ఆమె దగ్గర రెండువారాలు గడిపాను. చివరికి నేను వెళ్లాల్సిన సమయం దగ్గరపడటంతో ఆమెని ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పాను. దానికామె ‘నన్ను కాదు! వెళ్లి ప్రపంచాన్నే ముద్దు పెట్టకో!’ అని చెప్పింది. జీవితంలో అన్నిరకాల కష్టాలూ చూసిన మనిషి ‘వెళ్లి ప్రపంచాన్ని ముద్దు పెట్టుకో!’ అని ఎంత ఉదారంగా చెప్పిందో! జీవితమంటే ఈ ప్రపంచంతో అనుబంధం ఏర్పరుచుకోవడం అనీ, జీవితం నుంచి తీసుకున్నదానికంటే ఎక్కువ ఇవ్వగలగడం అనీ, సాధారణ జీవితంతో అసాధారణమైన విజయాలను సొంతం చేసుకోవడం అనీ నాకు తెలిసొచ్చింది.   (సుబ్రతో బాగ్చీ Go Kiss the World ప్రసంగం ఆధారంగా. ఇదే పేరుతో ఆయన తర్వాత ఓ పుస్తకాన్ని రాశారు) - నిర్జర.    

భారం

  ఒక కాలేజీలో రెండు గ్రూపులు ఉండేవి. అవి ఎప్పుడు చూసినా తగాదాలలో మునిగితేలుతూనే ఉండేవి. ఎవరో ఒకరి తల పగలకుండా నెల గడవడం కష్టంగా ఉండేది. లెక్చరల్లు, అధికారులు ఆఖరికి ప్రిన్స్‌పాల్స్ కూడా వీటిని చూసీ చూడకుండా సాగిపోయేవారు. చివరికి ఓ ప్రిన్స్‌పాల్‌ రానేవచ్చాడు. వారంపాటు కాలేజీని పరిశీలించాక ఆయనకు విషయం అర్థమైపోయింది. ఒక రోజు, ఆ రెండు గ్రూపులవారినీ కాలేజీ హాల్లో సమావేశపరిచాడు. ప్రిన్స్‌పాల్‌ తమకి ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లిపోతాడనీ, ఆ కాసేపు ఓపిక పడదామనీ, అంతా సరదాగా కూర్చున్నారు. కానీ ప్రిన్స్‌పాల్‌ తన ఉపన్యాసం మొదలుపెట్టలేదు సరికదా, తన ముందు ఉన్న టేబుల్‌ మీద పెట్టిన నీళ్ల గ్లాసుని చేతిలోకి తీసుకున్నాడు. ‘ఈ గ్లాసు చాలా బరువు ఉంటుంది కదా!’ అని అడిగాడు ప్రిన్స్‌పాల్. ‘నీళ్ల గ్లాసు బరువుండటం ఏంటి? అసలు దాన్ని మనం అలా తాగి ఇలా అవతల పెట్టేస్తాం కదా!’ అన్నాడు ఓ కుర్రాడు. ‘ఒకవేళ బరువే కొలవాలనుకుంటే, మహా అయితే ఓ వంద గ్రాములు ఉంటుందేమో!’ అన్నాడు ఇంకో కుర్రాడు. ‘ఇప్పుడు మీరు ఫిజిక్స్‌ పాఠం చెప్పబోతున్నారా!’ అని ఎగతాళిగా అడిగాడు మరో కుర్రాడు. ప్రిన్స్‌పాల్‌ ఈ వ్యాఖ్యలేవీ పట్టించుకోలేదు ‘అయితే ఈ గ్లాసు పెద్దగా బరువు ఉండదని మీరంతా ఒప్పుకుంటున్నారు కదా! మరి ఇదే గ్లాసుని కాసేపు పట్టుకుంటే...’ ‘ఎప్పుడెప్పుడు కింద పెట్టేద్దామా అనిపిస్తుంది’ అని వెనుక బెంచీలోంచి జవాబు వినిపించింది. ‘మరి కింద పెట్టేసే అవకాశం ఉన్నా రోజంతా అలాగే పట్టుకుని ఉంటే...’ రెట్టించాడు ప్రిన్స్‌పాల్‌. ‘చెయ్యి చచ్చుబడిపోతుంది. చూసేవాళ్లకి మనం పిచ్చివాళ్లమని అనిపిస్తుంది,’ మరో విసురైన జవాబు వచ్చింది. ‘ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే కదా!’ అన్నాడు ప్రిన్స్‌పాల్‌ నిదానంగా.   ప్రిన్స్‌పాల్‌ తమని పిచ్చివాళ్లతో పోల్చడంతో ఒక్కసారిగా కుర్రవాళ్ల మొహాలన్నీ ఎర్రబారాయి. కానీ ఆయన అదేమీ పట్టించుకోకుండా ఇలా చెప్పుకొచ్చాడు ‘అహంకారం, కోపం, ఆశ... ఇవన్నీ మనిషికి సహజమే! వాటిని అవసరమైనప్పుడు ఇలా తీసి వాడుకుని, అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. కానీ అలా కాకుండా నిరంతరం మనతోనే మోసుకుంటూ పోతే మన వ్యక్తిత్వానికే ప్రమాదం వస్తుంది. అహం మదంగా మారుతుంది; కోపం ద్వేషంగా పరిణమిస్తుంది; ఆశకి అంతులేకుండా పోతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే! మీ భవిష్యత్తునీ, మీ తల్లిదండ్రుల ఆశలనీ పణంగా పెట్టి ఆధిపత్యం కోసమో, ద్వేషాన్ని చల్లార్చుకోవడం కోసమో మీరు పడుతున్న గొడవలు... మీ జీవితాలనే నాశనం చేస్తున్నాయి. కావాలంటే ఒక్క క్షణం మీరే ఆలోచించుకుని చూడండి,’ అంటూ నిదానంగా ఆ హాల్లోంచి వెళ్లిపోయాడు. విద్యార్థులంతా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.....  (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

ప్రార్థించే చేతులు

  ఆయనో పేరు మోసిన వైద్యుడు. ఏదో కాన్ఫరెన్సులో పాల్గొనేందుకని దేశ రాజధానికి బయల్దేరాడు. కానీ అంత వైద్యుడిని కూడా దురదృష్టం వెన్నాడింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో విమానం కాస్తా మధ్యలోనే మరో ఊరిలో ఆగిపోయింది. ఒక పక్క చాలా అత్యవసరమైన కాన్ఫరెన్స్‌, మరో పక్క వాతావరణం చూస్తే ఇలా! దాంతో వైద్యునికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆ ఊరిలో తనకు తెలిసిన మిత్రులని వాకబు చేసి ఒక కారుని అద్దెకు తీసుకున్నాడు. ఏదైతే అదయ్యిందనుకుంటూ ఆ కారులోనే తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు బయల్దేరాడు.   ఆకాశమే కారుమబ్బులతో కమ్ముకుపోయి ఉంటే... నేల మీద మాత్రం వర్షం కురవకుండా ఉంటుందా! వైద్యుడు కారులో బయల్దేరిన కాసేపటికే హోరున గాలి, జోరున వర్షం మొదలైంది. ఓ రెండు గంటలలో గమ్యం చేరుకుందామనుకున్న వైద్యుడి ఆశ నిరాశగా మారిపోయింది. ఎడతెరిపిలేని ఆ వర్షంలో ఆయన కారు ఎటుపోతోందో కూడా అర్థం కావడం లేదు. అటుతిరిగీ ఇటుతిరిగీ చివరికి ఆ కారు ఓ పల్లెటూరికి చేరుకుంది. వర్షం తగ్గేదాకా తాను ప్రయాణం కొనసాగించడం అసాధ్యమని తేలిపోయింది వైద్యుడికి. దాంతో ఆ పల్లెటూరి చివర ఉన్న ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ తలుపు తెరుచుకుని వచ్చిన యువతికి వైద్యుడిని చూడగానే పరిస్థితి దాదాపుగా అర్థమైపోయింది. వెంటనే అతడిని లోపలికి ఆహ్వానించింది. యువతి ఇచ్చిన వేడి వేడి టీ తాగి, చలిమంట దగ్గర కాసేపు సేదతీరి... చలి నుంచి, వర్షం నుంచి హాయిగా కోలుకున్నాడు వైద్యుడు. ‘భగవంతుడు దయతలిస్తే త్వరలోనే వర్షం తగ్గిపోతుంది. మీరు ఎలాంటి ఇబ్బందీ లేకుండా గమ్యం చేరిపోతారు,’ అంటూ ఊరడించింది ఆ యువతి. ‘ఇందులో భగవంతుడు దయతలిచేది ఏముంది. మన జీవితం మన చేతుల్లో అన్నా ఉంటుంది లేకపోతే ప్రకృతి చేతుల్లో అన్నా ఉంటుంది. మధ్యలో భగవంతుడు ఎవరు?’ అంటూ కాస్త చిరాకుపడ్డాడు వైద్యుడు.   వైద్యుని మాటలకు ఆ యువతి ఏం బదులు చెప్పలేదు. నిశ్శబ్దంగా లోపలి గదిలోకి వెళ్లిపోయింది. లోపలకి వెళ్లిన యువతి ఎంతకీ రాకపోవడంతో ఆమె ఏం చేస్తోందో చూడాలనిపించింది వైద్యుడికి. ఓ నాలుగడుగులు వేసి లోపల గదిలో అడుగుపెట్టిన అతనికి ఓ ఊయల పక్కనే మోకరిల్లి భగవంతుని ప్రార్థిస్తున్న యువతి కనిపించింది. ఆమె ఛాదస్తానికి మరోసారి నవ్వుకొని- ‘ఎందుకలా ఊయల పక్కనే ఉండి ప్రార్థిస్తున్నారు? భగవంతుడికీ ఊయలకీ ఏంటి సంబంధం?’ అని అడిగాడు వైద్యుడు.   వైద్యుని మాటలలో వ్యంగ్యాన్ని పట్టించుకోలేదు ఆ యువతి. ‘ఈ ఊయాలలో ఉన్న పిల్లవాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకుని బతుకుతున్నాను. వీడు పుట్టగానే వాళ్ల నాన్న చనిపోయాడు. ఇప్పుడు వీడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది,’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది.   ఆ మాటలు వినగానే వైద్యుడిలో ఆసక్తి మొదలైంది. చటుక్కున ఊయల దగ్గరకి వెళ్లి బాబుని చూస్తూ ‘ఏమైంది బాబుకి!’ అంటూ ఆదుర్దాగా అడిగాడు. ‘బాబు గుండె చాలా బలహీనంగా ఉందట. పిల్లలకి సంబంధించి ఎవరన్నా హృద్రోగ నిపుణుడు మాత్రమే వీడికి వైద్యం చేయగలడట. నేనా పేదరాలిని. అలాంటి నిపుణుల ఖర్చుని నేను ఎలా భరించగలను. అందుకే ఏదో ఒక మార్గం చూపమని ఆ దేవుడిని నిరంతరం వేడుకుంటూ ఉంటాను. నా ప్రార్థనలు ఫలిస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తుంటాను,’ అంటూ చెప్పుకొచ్చింది.   ఆ యువతి చెప్పిన మాటలు విన్న వైద్యుడికి మతిపోయినంత పనయ్యింది. అప్రయత్నంగా అతని కంటివెంట నీరు రాలింది. ‘నా పేరు డా॥ అబ్రహాం. పిల్లలకి సంబంధించిన గుండెజబ్బులను నయం చేయడంలో నిపుణుడిని. నీ ప్రార్థనలే ఫలించాయో, లేక నాకు నీ సేవ చేసుకునే అదృష్టమే వరించిందో.... దేశమంతా తిరిగి చివరికి నీ ఇల్లు చేరుకున్నాను. నీ పిల్లవాడికి ఉచితంగా చికిత్స చేసే బాధ్యత నాది,’ అంటూ ఆ పిల్లవాడిని చేతులలోకి తీసుకున్నాడు.   మనం మానవ ప్రయత్నాన్ని ఎన్నడూ విడనాడకూడదన్నది మంచిమాటే! కానీ పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు... ఒకోసారి ప్రార్థనలు బలాన్ని చేకూరుస్తాయి. భగవంతుడే పలుకుతాడో లేకపోతే మన మనసులోని శక్తే దారిచూపుతుందో... కారణం ఏదైతేనేం, అసాధ్యం అనుకున్న సమస్యకి అనుకోని సులువు లభిస్తుంది. భగవంతుడే లేడనుకుంటే అది వేరే విషయం. కానీ అతని అస్తిత్వాన్ని నమ్మినప్పుడు మాత్రం ప్రార్థన తప్పకుండా ఫలితాన్ని అందిస్తుంది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)     - నిర్జర.

జపాన్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఇదే..

  జపాన్ ఈ పేరు వినగానే ముందుగా కళ్లేదుట కనిపించేది హిరోషియా, నాగసాకి అణు విలయం. జపానికి లొంగిపోవడానికి సిద్ధపడింది. అయినా అమెరికా అత్యంత అమానవీయ పద్ధతిలో ఈ రెండు నగరాలపై అణుబాంబులు వేసింది. ఈ దాడులలో దాదాపు 2 లక్షలకు పైగా చనిపోయారు. ఆ దాడుల దుష్ఫరిణామాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయంటే నాటి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నిత్యం భూకంపాలతో సహవాసం, అగ్నిపర్వతాల విస్పోటనాలు, కబళించే సునామీలు అలాంటి దేశం ఆత్మవిశ్వాసంతో, ప్రజల శ్రమశక్తితో, దేశభక్తితో అభివృద్ధి విషయంలో అగ్రరాజ్యాల సరసన నిలబడింది.                 ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్ పౌరుడు. ఆయన తొంభై సంవత్సరాల వయసు వరకు పనిచేస్తూనే ఉన్నాడు. అంతే కాదు జపనీయుల సగటు జీవిత కాలం 86.3 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో జపాన్‌కు అది ఎలా సాధ్యమైంది అంటే అందుకు కారణం వారి శ్రమ శక్తి, ఆహారపు అలవాట్లు.   * వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరిఅన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా        తీసుకుంటారు.   * మన దేశాల్లో వృద్ధులంటే చిన్పచూపు. ఎప్పుడెప్పుడు వారిని వదిలించుకుందామా అంటూ ఎదురుచూస్తారు వాళ్ల పిల్లలు.    కాని జపాన్‌‌లో వృద్ధుల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వైద్య  సదుపాయం తేలిగ్గా అందుబాటులో  ఉంటుంది.   * జపాన్ ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల మీద మంచి    ప్రభావాన్ని చూపుతోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వీటన్నింటిపై వారి శ్రద్ధ కనిపిస్తోంది.  దానికి తోడు అక్కడ షింటో అనే సంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా  ఉండాలని జపాన్ వారు నమ్ముతారు.   * వీరిలో ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలల్లోనూ..కర్మాగారాలు, కార్యాలయాల్లో ఆరోగ్య పరీక్షలు జరుగుతుంటాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది.   * ఆహారాన్ని పీకల దాకా తొక్కకుండా, 80 శాతం పొట్టనిండగానే తినడం ఆపేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు.   సో..జపాన్ చాలా గొప్పదేశమండీ..నాశనం అయినా ఎంత గొప్పగా డెవలప్ అయ్యిందో చూశారా..? అని స్టాటిస్టిక్స్ చూసి ముఖం చిట్లించుకోనక్కరలేదు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమి ఓవర్ టైం చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. మొత్తానికి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే  జపాన్‌ని ప్రపంచంలో అత్యున్నత  స్ధితిలో నిలబెట్టింది.