ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.   వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని,  రాష్ట్రంలో పీపీఈ కిట్లకు ఏమాత్రం కొరత లేదని, 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు... డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, లక్ష మంది పేషెంట్లకైనా చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని కేసీఆర్ చెప్పారు. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

కమ్మ అయితే, తీసి పక్కన పడేస్తారా?

*ముఖ్యమంత్రి జగన్ తీరుపై రాయపాటి మండిపాటు  *కరోనా తగ్గిన తర్వాత ప్రధాని ని కలుస్తా: మాజీ ఎం.పి. రాయపాటి  వైసీపీ ఫెయిల్యూర్స్ అన్ని ఒక కులం మీద వేసి తప్పించుకుంటున్నారంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలన గుడ్జి ఎద్దు చేలో పడినట్లుగా ఉందని, ప్రతి విషయం లో ఒక కులం అని అంటూ తెగ గోల చేస్తున్నారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రెడ్డి కులం వారికి తప్ప ఏ ఒక్క కులానికి  పోస్టింగ్స్ ఇవ్వటం లేదని, అయినా నోరు యెత్తి అడిగే వారు లేరని రాయపాటి వాపోయారు. " కమ్మ అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారు. డిమోషన్.. ఇది మంచిది కాదు. కుట్రలు వైసీపీ చేసి కమ్మ పై వేస్తే సరి అన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నారు," అంటూ రాయపాటి మండిపడ్డారు. రేపు హత్య లు జరిగిన కూడా ఇది ఒక కులం వాడు చేశాడు అని మీ మీద నెట్టేస్తారని, జగన్ కనీసం మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదని,ఎమ్మెల్యేలు అయితే సగం మంది కూడా ఇంకా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని రాయపాటి చెప్పుకొచ్చారు.  " ఎన్నికల కమిషనర్ ను మార్చడం మంచిది కాదు. రమేష్ కుమార్ యొక్క కూతురు, భార్య పేర్లు సోషల్ మీడియా లో పెట్టే విష సంస్కృతి తీసుకుని వచ్చారు," అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రాయపాటి సాంబశివ రావు, ఎన్నికలు వాయిదా వేయకపోతే వేల మంది చనిపోయేవారన్నా విషయం గుర్తు చేశారు. " కరోనా ను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు.వైసిపి ఎమ్మెల్యే ముస్తఫానే క్వారంటైన్ లో ఉన్నాడు అంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కరోనా తగ్గిన తరువాత అమరావతి విషయంలో ప్రధాని తో మాట్లాడతా. రాజధాని  మార్పు తో వైసిపి జీరో అవుతుంది," అని జోస్యం చెప్పిన రాయపాటి, ఎప్పుడు ఎన్నికల జరిగినా వైసిపి  ఓటమి ఖాయమంటూ ఢంకా బజాయించారు.

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 650 కు పెరిగింది!

తెలంగాణలో కొత్తగా బుధ‌వారం నాడు 6 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. మ‌రో వైపు  8 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్ చేశారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో క‌రోనా కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ బుల్లెటిన్ విడుద‌ల చేసింది.  తెలంగాణాలో అత్య‌ధికంగా హైద‌రాబాద్ 267 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వికారాబాద్ (32), సూర్యాపేట (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనగామ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకగా.. వారిద్దరూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆ జిల్లాలో కోవిడ్ ఫ్రీగా మారింది. మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో నలుగురు కోవిడ్ బారిన పడగా.. ఇద్దరు కోలుకున్నారు, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తెలంగాణాలో 259 కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా క‌ఠిన‌మైన‌ చర్యలు తీసుకుంటున్నారు.  ముందు జాగ్రత్తగా భారీ సంఖ్యలో బెడ్లను సిద్ధం చేసింది.  దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌లు వుంటే అందులో  తెలంగాణలో 8 హాట్ స్పాట్లను గుర్తించారు. ఏపీలో 11 జిల్లాలు హాట్ స్పాట్‌లుగా ఉన్నాయి.

ఏపీ లో ఇప్పటివరకూ 11,615 శాంపిల్స్ టెస్ట్ చేసాం: ఆళ్ళ నాని

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 11,615 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. వీటిలో 11,111 నెగిటివ్, 502 పాజిటివ్ వచ్చినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 16 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని, క్వారెంటీన్స్ లో సదుపాయలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. పేద వారిగా ఉన్నవాళ్లను క్వారెంటీన్ నుండి ఇంటికి పంపేటప్పుడు 2 వేలు ఆర్ధిక సహాయం చేస్తున్నామన్నారు. క్వారెంటీన్ సెంటర్ పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసామనీ, క్వారెంటీన్ నుండి బయటకి పంపేటప్పుడు సర్టిఫికెట్ ఇస్యూ చేస్తామనీ కూడా డెప్యూటీ సి ఎం చెప్పారు. డిశ్చార్జ్ విషయంలో కొంత గందరగోళం ఉంది.. దీనిపై విధివిధానాలు రూపిండిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ మూడు సార్లు సమగ్ర కుటుంబ సర్వే చేసామని, సర్వే ద్వారా 32 వేల మందిని గుర్తించామని,  8 వేల మందికి లక్షణాలు ఉన్నాయని,  అయినా 32 వేల మందికి దశల వారిగా కరోనా టెస్ట్ లు చెయ్యమని సీఎం ఆదేశించినట్టు ఆయన వివరించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య పరికరాల కొరత లేదని, రాష్ట్రంలోనే ప్రతిరోజు సొంతంగా 10 వేలు పీపీఈ కిట్స్ తయారు చేస్తున్నామని, మరో 10 వేలు బయట నుండి తెప్పిస్తున్నామని, N95 తో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని, వీటిపై దుష్ప్రచారం చేయొద్దని, ప్రజల సహకారంతోనే లాక్ డౌన్ విజయవంతంగా అమలు జరుగుతోందని డెప్యూటీ ముఖ్యమంత్రి చెప్పారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏపీలో విజయవంతంగా అమలు అయ్యిందన్నారు. రానున్న రోజుల్లోనూ లాక్ డౌన్ ని మరింతగా పాటించాలన్నారు.

ఈ నెల 20 తర్వాత ఏపీలో కీలక నిర్ణయాలు ఉంటాయా?

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా.. ఈ నెల 20 తర్వాత సడలింపులు ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఓవైపు గుంటూరు, కర్నూలు వంటి జిల్లాలో కేసుల సంఖ్య ప్రమాదకర రీతిలో పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. ఇందులో ప్రధానంగా రాజధాని తరలింపు, స్ధానిక ఎన్నికలతో పాటు రాజధానికి సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే వీటిని ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడైనా అమల్లో పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. రాజధాని తరలింపు కోసం గతేడాది డిసెంబర్ లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు కోసం సీఎం జగన్ చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కోర్టులో న్యాయపరమైన చిక్కులతో పాటు రాజధాని బిల్లులను మండలిలో నెగ్గించుకోలేకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం పట్ల సామాన్యుల్లోనూ ఓ రకమైన భావన ఏర్పడింది. అయినా పట్టువీడని ప్రభుత్వం తాజాగా ఉద్యోగులను మే నెలలో ఎట్టి పరిస్ధితుల్లోనూ విశాఖ తరలించేందుకు సిద్ధం చేస్తోంది. ఆ లోపే కరోనా వైరస్ ప్రభావం పెరిగి లాక్ డౌన్ విధించినా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  అమరావతి నుంచి విశాఖకు వెళ్లేందుకు సీఎం జగన్ మే నెల 2వ తేదీన ఓ ముహుర్తంగా పెట్టుకున్నారనే ప్రచారం మొన్నటివరకూ సాగింది. అయితే తాజాగా ప్రధాని కరోనా వైరస్ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకూ పెంచిన నేపథ్యంలో రెండు లేదా మూడో వారంలో తరలింపుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగుల తరలింపు కుదరకపోయినా ప్రస్తుతానికి సీఎంవో కార్యకలాపాలు మాత్రం విశాఖ నుంచే నడిపించాలనే ఉద్దేశంలో సీఎం జగన్ ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. వీటితో పాటు స్ధానిక ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా ఈ నెల చివరి వారంలో ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు వెలగపూడి సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

కరోనాతో బెంబేలు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం

ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు జిల్లాపై ప్రభుత్వానికి ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పొరుగు జిల్లాలలో ఉన్న రహదారులను పూర్తిగా మూసేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత కృష్ణాజిల్లాతో ఉన్న సంబంధాలను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నారు.  కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రాకపోకలపైనా నిషేధం విధిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వద్ద సమీపంలోని పులిగడ్డ -పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. వీరికి ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని పోలీసులు చెబుతున్నారు. అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను అధికారులు బంద్ చేశారు. ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగులను సైతం అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్ తొలగింపులో జగన్ సర్కార్ తప్పటడుగులు వేసిందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు అన్ని విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనే వాదనకు మద్దతుగా న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆర్ఢినెన్స్ లో కొన్ని కీలక అంశాలను విస్మరించడంతో పాటు అప్పటికే పదవిలో ఉన్న వ్యక్తికి కొత్త నిబంధనల వర్తింపు వంటివి కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అయితే ఇందులో ఒక అంశానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రెండో అంశం మాత్రం కచ్చితంగా నిమ్మగడ్డను టార్గెట్ చేసి పెట్టిందే అనే భావన న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కమిషనర్ పదవీకాలం సవరణ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డకు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లభించబోదు. అయితే ఆయన సర్వీసు రూల్స్ లో మార్పులు చేసే విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రస్తావించిన సర్వీస్ రూల్స్ మార్పు వ్యవహారం కొత్త కమిషనర్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందే. అయితే ఈ నిబంధన విషయంలో రాజ్యాంగంలో ఉన్న అర్ధం ప్రకారం ప్రస్తుత కమిషనర్ సర్వీస్ రూల్స్ ను మార్చడం ద్వారా ఆయనకు నష్టం కలిగేలా చేయరాదన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్టికల్ 243లోని పదవీకాలం నిబంధన మాత్రమే వాడుకుని నిమ్మగడ్డను తొలగించింది. దీంతో ఇప్పుడు ఇదే విషయాన్ని వచ్చే సోమవారం జరిగే వాదనల సందర్బంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయవాది ప్రస్తావించే అవకాశముంది. అప్పుడు న్యాయస్ధానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇప్పుడాయన ఏజెంట్ 116...

* విజయసాయి రెడ్డి పరిశోధనలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు...  *నిమ్మగడ్డ ఫోర్జరీ వ్యవహారం లో కనకమేడల, వర్ల రామయ్య, టీ డీ జనార్దన్ ఉన్నారంటూ డి జి పి కి ఫిర్యాదు  *నిమ్మగడ్డ సంతకం తెలుగుదేశం పార్టీ ఆఫీసు లోనే ఫోర్జరీ అయిందని విజయసాయి ఆరోపణ  * ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించాలంటూ డి జి పి కి వినతి  నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం , మొత్తానికి తెలుగుదేశం పార్టీని ఇంకా వెన్నాడుతూనే ఉంది. సి ఐ డి ఆఫీసర్ గా అవతారమెత్తిన వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి తాజాగా తన పరిశోధనలో కొత్త అంశాలను వెలికి తీశారు.  కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ రాసిన లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, డి జి పి గౌతమ్ సవాంగ్ కు తాజాగా లేఖ రాయడంతో, ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల, కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్టుగా వెలుగు చూసిన ఒక లేఖ, సంచలనం రేపిన విషయం తెలిసిందే.  దీనిపై తాజాగా, రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేష్ కుమార్‌ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతనే లేదని అనుమానం వ్యక్తం చేశారు.  సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో తయారైందని తమ దగ్గర సమాచారం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, ఆ పార్టీ నాయకులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, ఈ తతంగమంతా రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.

రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం

రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు - ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్ తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్ తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట.

దేశ వ్యాప్తంగా ‘కరోనా’ హాట్ స్పాట్ జిల్లాలు 170: లవ్ అగర్వాల్

*దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించాం *భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదు  *హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్ స్పాట్ కేంద్రాలు, గ్రీన్ జోన్లను గుర్తించామని అన్నారు. భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,439కి చేరిందని, దీని బారిన పడి 377 మంది మృతి చెందారని అన్నారు.

ఐటీ కంపెనీ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు

ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని వంటి సంస్థల్లో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి సింగిల్ డిజిట్ వేతనం పెరిగింది. ఈ సంస్థలోని 84,000 ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ వేతన పెంపు అమలవుతుంది. మిగతా వారికి అప్రైజల్స్ జూలై నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతే కాదు క్యాప్‌జెమిని నాలుగువేల జాబ్ ఆఫర్లు కూడా ఇచ్చింది. ఇందులో 2,000 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. కేవలం క్యాప్‌జెమినియే కాదు వివిధ సేవా సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగాలు ఉండటం కష్టంగా ఉందనే సమయంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు ఊహించని విధంగా వేతన పెంపు, కొత్త ఆఫర్లు ఇవ్వడం గమనార్హం. తమ ఉద్యోగులందరినీ నిలుపుకుంటామని క్యాప్ జెమిని చెబుతోంది. బిల్లబుల్ ప్రాజెక్టుపై లేకుండా బెంచ్‌కు పరిమితమైన వారిని కూడా నిలుపుకుంటామని చెబుతోంది. సాధారణంగా ఉద్యోగులను 60 రోజుల పాటు బెంచ్‌కు పరిమితం చేస్తారు. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 8 శాతం మంది బెంచ్‌కు పరిమితమవుతారు. డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ భారత్‌పే కూడా తమ ఉద్యోగులకు 20 శాతం హైక్ ఇచ్చింది. కాగ్నిజెంట్ ఏప్రిల్ నెలకు గాను బేసిక్ శాలరీలో 25 శాతం అదనపు మొత్తాన్ని ఇస్తోంది. మరోవైపు అసోసియేట్ స్థాయి ఉధ్యోగుల వరకు వేతనం పెంచింది. ఇండియాలో ఈ అమెరికన్ ఐటీ దిగ్గజానికి 2,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిని అమలు చేయడం ద్వారా దాదాపు మూడొంతుల మంది ఉద్యోగులకు వేతనం పెరిగినట్లు. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఐటీ మల్టీ నేషనల్ కంపెనీ తమ ఉద్యోగులకు కొందరికి రూ.10,000 అలవెన్స్ కూడా ఇస్తోందట. రీలోకేషన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, అకామిడేషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొత్తం అందిస్తోంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెడ‌తారా? సీఎంపై టి.కాంగ్రెస్ ధ్వ‌జం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తూ ముఖ్య‌మంత్రికి 22 ప్ర‌శ్న‌లు వేసింది. 1. జన్ ధన్ యోజన పేరిట మహిళల జన్ ధన్ అకౌంట్లలో నెలకురూ.500 చొప్పున మూడు నెలల పాటు కేంద్రం డిపాజిట్ చేయనుంది. శుక్రవారం నుంచే అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఈ స్కీమ్ మొదలైంది.  2.తెలంగాణలో అంతయోదయ, ప్రయారిటీహౌస్ హోల్డర్స్ జాబితా ప్రకారం కోటీ 92లక్షల మంది ఉన్నారు. వారందరికీ మూడు నెలల పాటు ప్రతి నెల ఉచితంగా 5 కిలోలబియ్యం, కిలో పప్పును ఇస్తోంది. అంటే 15కిలోల బియ్యం, 3 కిలోల పప్పు ప్రతి రేషన్కార్డు హోల్డెర్ కు అందనుంది. 3.తెలంగాణ లో ఉన్న తెల్ల కార్డులు ఉన్నవారు 87.59 లక్షలు. 4.తెలంగాణ లో ఉన్న రేషన్ డీలర్లు 17022 మంది.  5.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ. వెయ్యి చొప్పున పెన్చన్ను 3 నెలల పాటు కేంద్రం అందించనుంది. దీనివల్ల రాష్ట్రంలో ఆసరా పిన్షస్.  పొందుతున్న 30 లక్షల మందికి పైగా లబ్జి చేకూరే అవకాశముంది. 6.ఉపాధి హామీ కార్మికులకు రోజూ వారి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచింది. రాష్ట్రంలో 59 లక్షల మందికి లబ్ధి. ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.4,431 కోట్లను విడుదల చేసింది. 7. తెలంగాణ లో  ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులు  10,75,202.  8. దీపం పథకం కింద TOI చమురు కంపెనీల డాటా ప్రకారం తెలంగాణ లో ఉన్న కుటుంబాలు 1.04cr. ఉన్న గ్యాస్ కనెక్షన్లు 1.14cr. 9.కేంద్ర ప్రభుత్వం నెలకు 5 kg బియ్యం, 1kg పప్పు ఇస్తే, ముఖ్య‌మంత్రి  KCR 22.3.2020, GoMs 45 ప్రకారం ప్రకటించి న 12kg బియ్యం కలిపితే లబ్దిదారులకు రావలసింది. 5kg+12kg+=17kg బియ్యం,  1kg పప్పు = నెలకు 18kg.  మరి ఇప్పుడు లబ్ధిదారులకు వచ్చింది 12kg. బియ్యం మాత్రమే, మిగతా 5kg బియ్యం,1 kg పప్పు ఏమైనట్టు ? ఈ 12kg లు కేంద్ర వాటా నా! రాష్ట్ర వాటా నా! రాష్ట్ర వాటా ఐతే కేంద్ర వాటా ఎక్కడ? 11.GoMs45 లో 87.59 లక్షల కార్డు లబ్ధిదారులకు 12kg ల బియ్యం ఈ ఒక్క నెల నేనా? కేంద్రం లాగా 3 నెలలా అనేది స్పష్టత లేదు.  ఓక వేల 3 నెల లైతె ...15kg+36kg+=51kg బియ్యం, 3kg పప్పు = నెలకు 54kg. 12. ముఖ్య‌మంత్రి KCR ప్రకటించిన 22.3.2020,GoMs 45 ప్రకారం 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఇస్తామన్నా 1500 రూ ఆర్థిక సహాయం ఇంకెప్పుడూ ఇస్తారు. 13.తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉండి పొందని వారు 18 లక్షల మంది పరిస్థితి ఏంటి? 14.లాక్ డౌన్  మొదలైనది ఏప్రిల్ 22 న ఈ రోజుకులాక్డౌన్ 22 రోజులు. మీ ఆర్థిక సహాయం ఇంకా ఎన్నడు ఇస్తారు? 15. తెలంగాణ ఆర్థిక శాఖా 19.3.2020 నాడు 1500cr కు DIPR RO NO 2686-DP/CL/Advt/2019-20 బాండ్ వేలం కోసం ప్రకటన చేసింది.  16. మార్చి 23 నే  వేలం డబ్బులు వచ్చాయి. అవి ఎక్కడకు పోయాయి? 17. కేంద్రం నుండి మొదటి విడత కోరన విపత్తు కింద 269 cr. వచ్చాయి. మరి జీతభత్యా ల్లో కోత విధించారు.  18. దాతలు ఇచ్చిన కోట్ల రూపాయలు ఏమైనాయి. 19. భవన నిర్మాణ సంక్షేమ నిధులు వాడుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చిందా? లేదా? ఇస్తే  ఎన్ని  వేల కోట్లకు అనుమతి ఇచ్చింది.  20.GHMC పరిధిలో వలస కూలీలు 3 నుండి  4 లక్షల మంది ఉన్నారు. వారి వసతి, తిండి పరిస్థితి ఏంటి? 21. మీరు ఏర్పాటు చేసిన 200 food centers ఎక్కడ? వాటి బాధ్యతలను ఎవరూ చూస్తున్నారు.  22. రోజుకు average గా ఎంత మందికి క‌రోనా టెస్టులు చేస్తున్నారు.  Doctor's కి, nurse లకు ఎలాంటి రక్షణ వస్తువులు వాడుతున్నారు, సరిపడా అందుబాటులో ఉన్నాయా? N95 మాస్క్ లు ఎన్ని ఉన్నాయి? కాలనీ వైస్ గా ఉన్న డాక్టర్ లను సంప్రదించి వారి ఏరియా పరిది లో ఉన్న ప్రజలకు డోర్ to డోర్ covid screening చేస్తే తొందరగా ఈ ప్రమాదం నుండి బయట పడవచ్చ‌ని తెలంగాణా కాంగ్రెస్ సూచించింది.

నిర్బంధంలోకి ముఖ్య‌మంత్రి విజయ్ రూపానీ

గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. అయితే, ఆయ‌న‌కు కరోనా నిర్దారణ కావడానికి ఆరు గంటల ముందే ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గాంధీనగర్‌లోని సెక్రటేరియల్‌లో స‌మావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమై.. అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా కలిసి మాట్లాడారు.  అదే రోజు సాయంత్రం ఇమ్రాన్ ఖేడెవాలాకు పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ సెల్ఫ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రుద్దీన్, ఆయన భార్యకు కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిగిన సమావేశంలో సామాజిక దూరం పాటించారని ప్రభుత్వం చెబుతున్నా.. అహ్మదాబాద్ మిర్రర్ వెల్లడించిన ఫోటోల్లో మాత్రం వీరంతా మాస్క్‌లు తీసేసి, పక్కపక్కనే కూర్చున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయని అధికారులు తెలిపారు. ఆరోగ్యం సాధారణంగా ఉందన్నారు. అయితే, సీఎం మాత్రం స్వీయ నిర్బంధంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆయనను కలుసుకోడానికి వారం రోజుల వరకూ ఎవర్నీ అనుమతించ‌రు. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్‌లు కూడా ఇళ్లకే పరిమితమ్యారు. దరియాపూర్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ కూడా ఇమ్రాన్ కారులో ప్రయాణించారు.  జమల్‌పూర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

హమ్మో.. ఏపీలో కరోనా లెక్క ఝడిపిస్తోంది...

*ఏపీలో 502కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు  *గుంటూరు లో అత్యధికంగా 114 కేసులు  ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహహ్మారి విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరుకుంది. 114 కేసులతో గుంటూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 96, నెల్లూరు జిల్లా 54 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీఓ లను కొట్టివేసిన ఏపీ హై కోర్ట్ 

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని జీఓ సవాలు చేస్తూ , ఇంద్రనీల్ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఆ పిల్ ను విచారించిన హై కోర్టు, ఆ జి ఓ లను కొట్టివేసింది.  ఇలా తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై లోగడ వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం, ఈ రోజు  జీఓ లు కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విడతల వారీగా 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేయాలనీ ప్రభుత్వ ఉద్దేశంగా అప్పట్లో జారీ అయిన ఉత్తర్వుల ద్వారా తెలిసింది.   2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.  దీనిపై మార్గదర్శకాలు ఇలా  ఉన్నాయి.  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1-8 తరగతులను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపాలి.  ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి. టీచర్లలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లిష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ సెంటర్లు, డిస్ట్రిక్ట్‌ ఇంగ్లిష్‌ సెంటర్లను.. డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి.సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించడానికి వీలుగా.. వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, వారికి అవసరమైన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది.

బిఆర్ శెట్టి ఒప్పందాన్ని ఆవిరి చేసిన టీడీపీ సర్కార్

* అమరావతి లో 950 పడకల ఆస్పత్రి తో సహా మెడికల్ సిటీ కి ప్రతిపాదన  * ఒప్పందం సమయంలో భారీ మొత్తలు చేతులు మారాయని ఆరోపణలు  * సి బి ఐ ఆధ్వర్యం లో మొదలైన విచారణ  * 2018 లో బీ ఆర్ ఎస్ మెడిసిటీ పూర్తయ్యుంటే, ఈ రోజున రాజధాని ప్రాంతానికి ఈ కష్టం వచ్చి ఉండేది కాదు  తెలుగుదేశం ప్రభుత్వం తో ఒప్పందం ప్రకారం, ప్రస్తుత రాజధాని ప్రాంతం లో ప్రతిపాదించిన - 950 పడకల గల ఒక అత్యాధునిక ఆస్పత్రిని బి ఆర్ శెట్టి నిర్మించి సేవలు ప్రారంభించి ఉంటె, ఈ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యుండేది కాదు. అవును, ఇది నిజం. 950 పడకల ఆస్పత్రి మాట దేవుడికెరుక. అది కనీసం వంద పడకల ఆసుపత్రిగా కూడా రూపుదిద్దు కాకపోవటం గమనార్హం. రాజధాని ప్రాంతంలో కారుచౌకగా 100 ఎకరాలను బిఆర్ శెట్టి మెడిసిటీ సంస్థకు ఒక మెడికల్ యూనివర్సిటీ ప్రారంభించే ఒప్పందంతో తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ సంస్థ పట్ల ప్రత్యేక ప్రేమతో నిబంధనలను కూడా సడలించింది అయినప్పటికీ ఈ సంస్థ మెడికల్ యూనివర్సిటీ నిర్మాణ దిశగా గాని, 950 పడకల ఆధునిక ఆసుపత్రి నిర్మాణ దిశగా గాని ఎటువంటి చర్యలు తీసుకున్నట్లుగా మనకి కనిపించదు, ఇదే 100 ఎకరాలను నిజాయితీగల సంస్థలకు ఇచ్చి ఉన్నట్లయితే ఈ విపత్కర పరిస్థితులలో ఉన్నత స్థాయి ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే వాళ్ళు. అదేవిధంగా మెడికల్ సీట్లు కూడా రాష్ట్రానికి వచ్చి ఉండేవి. తమ స్వార్థం కోసం వందల ఎకరాలను కాజేసే దుర్బుద్ధితో నే మెడిసిటీ పేరిట గత టిడిపి ప్రభుత్వం లోని పెద్దలు ఈ స్థలాలను దోచుకున్నారనే అంశం మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ, సి బి ఐ విచారణ కూడా నడుస్తున్నాయి కూడా.  అయితే, అదే ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి సంస్థలచేత, లేదా టాటా గ్రూప్ చేత గానీ అత్యవసర ప్రాతిపదికన ఒక వంద పడకల ఆస్పత్రిని సిద్ధం చేయాలనీ విజిల్ బ్లోయర్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.

పేదల వైద్యుడు కె. ఎం. ఇస్మాయిల్ హుస్సేన్‌ కన్నుమూత

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 6 గంటలకు మృతి చెందారు. ఉస్మానియా కాలేజ్ ఎదుట ఆస్పత్రిని ఏర్పాటు చేసి గత 45 ఏళ్లుగా పేదోళ్ల కోసం డాక్టర్‌ ఇస్మాయిల్‌ విశేష సేవలు అందించారు. ఫీజు అడగకుండా రూ.20 ఇచ్చినా, రూ. 30 ఇచ్చినా.. ఇవ్వలేమని చెప్పినా... చిరునవ్వుతో వైద్యం చేయడం ఆయన విశిష్టత. పేదల కోసం కార్పొరేట్ హంగులుతో పెద్ద నర్సింగ్ హోమ్ కట్టించి పేదలు ఇచ్చినంత తీసుకుని వైద్య సేవలు అందిచారాయన. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.. కుమారుడు డాక్టర్ కె. ఎం ఇక్బాల్ హుస్సేన్ కూడా ప్రభుత్వ వైద్యుడు. ముగ్గురు అల్లుళ్ల లో ఒకరు ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మహమ్మద్ కాగా, మరో ఇద్దరు అల్లుళ్లు విదేశాల్లో ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.