ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు
ఏపీ అసెంబ్లీలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా మంత్రి తెలియజేశారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని మంత్రి అన్నారు.
బడ్జెట్‌లో ముఖ్యాంశాలు:
వ్యవసాయ రంగానికి రూ.11,891 కోట్లు
వైఎస్‌ఆర్ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు
విద్యశాఖకు రూ.22,604 కోట్లు
వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు
వైఎస్‌ఆర్ గృహవసతికి రూ.3వేల కోట్లు
పీఎం ఆవాజ్ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు
పీఎం ఆవాజ్ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు
బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు
డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
రేషన్ బియ్యానికి రూ.3వేల కోట్లు
వైఎస్‌ఆర్ పెన్షన్ కానుకకు రూ.16వేల కోట్లు
వైఎస్‌ఆర్ ఆసరాకు రూ.6,300 కోట్లు
అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు
జగనన్న విద్యాదీవెనకు రూ.3,009 కోట్లు
వైఎస్‌ఆర్ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ.2 వేల కోట్లు
వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.350 కోట్లు
వైఎస్‌ఆర్ వాహన మిత్రకు రూ.275 కోట్లు
జగనన్న చేదోడుకు రూ.247 కోట్లు
నేతన్న నేస్తం రూ.200 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.109 కోట్లు
హోం శాఖకు రూ. 5,988.72 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమ రంగానికి రూ. 601.37 కోట్లు