తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత షురూ

నేలమట్టం కానున్న 132ఏండ్ల చరిత్ర చిహ్నం.. 16మంది ముఖ్యమంత్రులు పరిపాలనాకేంద్రం.. భారీ భద్రత మధ్య బ్లాస్టింగ్.. పనులను పరిశీలిస్తున్న సిఎస్, డిజిపి.. జి బ్లాక్ కూల్చివేతపై  లేని స్పష్టత.. ఐదువందల కోట్ల వ్యయంతో కొత్త సచివాలయం.. మంత్రుల పేషీలతో పాటు శాఖల కార్యాలయాన్ని ఒకే చోట.. గత ఏడాదే శంకుస్థాపన చేసిన సిఎం.. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత ప్రారంభమైంది. ఉన్న ఆధునిక పరిపాలనకు అనుగుణంగా సచివాలయం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ  వాదన విన్న హైకోర్టు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం అర్థరాత్రి నుంచి కుల్చివేత పనులు ప్రారంభించారు. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో  భారీ బందోబస్తు మధ్య జరుగుతున్న కూల్చివేత పనులను రాష్ట్ర సిఎస్, డిజిపి పర్యవేక్షిస్తున్నారు.  లిబర్టి నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సి బ్లాకు(సమత)బ్లాక్ ను  భారీ యంత్రాలతో కూల్చి వేస్తున్నారు .కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. 132 ఏండ్ల ఘన చరిత్ర నిజాం నవాబు ల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి ెందిన సచివాలయానికి 132 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన నిజాం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు పరిపాలనా కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలువురి ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పాలనా కొనసాగించారు. 132ఏండ్ల కాలంలో 10బ్లాకుల నిర్మాణం జరిగింది. ఎ బ్లాక్,  డి బ్లాక్, హెచ్ బ్లాక్ ల ను గతంలోనే కూల్చివేసి నూతనంగా నిర్మించారు. ఎల్, బి బ్లాక్‌ , సి బ్లాక్‌లను కొద్ది మార్పులతో వినియోగించారు. జె, కె బ్లాక్‌లు - వీటిలో ఏ మార్పులూ చేయలేదు. అయితే ఈ బ్లాక్ లన్నింటి మధ్యలో ఉన్న జి బ్లాక్ చారిత్రకమైన కట్టడం.సచివాలయ సముయదాంలోని  అతిపురాతన మైన జి బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించారు. దీనిని సైఫాబాద్ ప్యాలెస్ గా పిలుస్తారు. 132 ఎండ్ల చరిత్ర ఉన్న ఈ భవనాన్నికూల్చివేయకుండామ్యూజియంగా మార్చాలని చరిత్రకారులు కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుందో ఇంకా స్పష్టం చేయలేదు. ఐదు వందల కోట్ల అంచనావ్యయంతో... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక ప్రజా పరిపాలన కు అవసరమైన అన్ని హంగులతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదన సిద్ధం చేసింది. కొత్త సచివాలయ నమూనాను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఈ ఆధునిక సచివాలయ నిర్మాణ వ్యయం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు. సూమారు ఆరు లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో అన్ని శాఖలకు కేటాయింపులు ఉండేలా డిజైన్ పూర్తి చేస్తున్నారు. మంత్రుల కార్యాలయాలతో పాటు ఆయా సంబంధిత శాఖల కార్యదర్శుల కార్యాలయాలు,  సెక్షన్లు, మీటింగ్ హాల్స్, వీడియో కాన్ఫరెన్సు హాల్స్ అన్ని కలిపి ఒకే చోట వచ్చేలా కొత్త సచివాలయం నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాదే శంకుస్థాపన కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ సముదాయం నిర్మించాలని గత ఏడాదేప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త సచివాలయం భవనానికి శంకుస్థాపన జరిగింది. సచివాలయలోని కొన్ని కార్యాలయాలను బిఆర్కె భవన్ లోని మార్చారు. మరికొన్ని కార్యాలయాలను సంబంధిత డైరెక్టరేట్ కార్యాలయాల్లోకి మార్చారు. అయితే ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల పై కోర్టుకు వెళ్లడం ఇలాంటి అంతరాలతో సచివాలయం కూల్చివేత కొత్త నిర్మాణం పనులు ఆగాయి. తాజాగా హైకోర్టు ప్రభుత్వ వాదన విన్న తర్వాత పాత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఇందులో ఉన్న చారిత్రాత్మకమైన జి బ్లాక్ పై మాత్రం సందిగ్ధం అలాగే ఉంది.

గ్యాంగ్ స్టర్ దూబే కు బీజేపీ ఎమ్మెల్యేల అండ..!  వీడియో వైరల్..

యూపీలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులలో ఒక డిఎస్పీ తో సహా 8 మందిని గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇపుడు దూబే ను పట్టుకోవడానికి యూపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐతే దూబే గతంలో మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భగవతి ప్రసాద్ సాగర్, అభిజీత్ సంగా అనే ఇద్దరు బీజేపీ ఎమ్మేల్యేలు తనకు అండగా ఉన్నారని అలాగే పలువురు ఇతర స్థానిక నాయకుల పేర్లు కూడా అతను ఆ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. 2017 లో యూపీ ఎస్టీఎఫ్ ఇంటరాగేషన్ లో పోలీసులకు అతడు ఈ వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తాను ఆ నాయకులను వ్యక్తిగతంగా కలిశానని అతడు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఐతే దీని పై స్పందించిన ఎమ్మెల్యే సాగర్ తనకు దూబే తో పరిచయం లేదని అతడి అకృత్యాలకు తాను ఎపుడు సపోర్ట్ చేయలేదని అతడు ఒక నేరస్తుడు కనుక ఎవరి పేరైన చెప్పే అవకాశం ఉందని మీడియా తో అన్నారు. ఈ వీడియో తో తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని అయన అన్నారు. మరో బీజేపీ ఎమ్మెల్యే అభిజీత్ సంగా ఈ వీడియో పై స్పందిస్తూ.. కాన్పూర్ పరిధిలోని తన నియోజకవర్గం బితుర్ చుట్టూ పక్కల గ్రామాల నుండి ప్రజలు సహాయం కోసం తన వద్దకు వస్తారని ఐతే దుబే చేసే అకృత్యాల పై చర్యలు తీసుకోవాలని తాను పోలీసులను కోరినట్లు అయన వివరించారు. ఈ వీడియో పై దర్యాప్తు జరపవలసిందిగా ఈ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పోలీసులకు విజ్ఞప్తి చేసారు.

లెక్క తేలింది.. గాల్వాన్ లోయలో వంద మంది చైనా సైనికులు మరణించారు!!

ఇతర దేశాలకు నష్టం కలిగించాలని చూసి, తానూ నష్టపోయి.. పైకి మాత్రం అబ్బే మాకేం నష్టం జరగలేదు అని చెప్పే దేశం ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు చైనా. ఇటీవల కరోనా కేసులు, గాల్వాన్ లోయ ఘర్షణలు వంటి విషయాల్లో అది మళ్ళీ రుజువైంది. పుట్టింటి నుంచి కరోనాను పంపించి ప్రపంచం వణికేలా చేస్తున్న చైనా.. ఆ దేశంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులను దాచింది. అలాగే, గాల్వాన్ లోయ ఘర్షణలలో కూడా భారత్ సైనికుల చేతుల్లో చావుదెబ్బ తిన్న చైనా.. ఆ దేశ సైనికుల మరణాలను దాచింది. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అయితే చైనాకు చెందిన సైనికులు ఎంతమంది మరణించారనేది ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, చైనాకు చెందిన సైనికులు 40 నుంచి 45 మంది వరకూ చనిపోయి వుండవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా చైనా నుంచే అసలు లెక్కలు బయటకు వచ్చాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా చనిపోయారని ఆ దేశానికి చెందిన పీపుల్స్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించిన ఆయన.. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరఫు నుంచి ఎన్నడూ బయటకు రాదని అన్నారు. భారత భూభాగంలోకి  చైనా సైన్యం వెళ్లిన తరువాత పెద్ద యుద్ధమే జరిగిందని, 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన ఆయన.. ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు భారత్ కే అనుకూలమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను రక్షించేలా...

రైతులకు మేలు చేసే గ్రామ విత్తనోత్పత్తి పథకం సోషల్ మీడియా ద్వారా అవగాహన  నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి గ్రామ విత్తనోత్పత్తి పథకంగా పేరు పెట్టారు.  రాష్ట్రంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సీడ్ ఫాం లలో పండించిన విత్తనాన్ని ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా రైతులకు ఇచ్చి , వాటిని పండించి అధికారుల సమక్షంలో ధృవీకరించి, టి.ఎస్.ఎస్.డి.సి ద్వారా కొనుగోలు చేసి, మళ్ళీ రైతులకు పంపిణీ చేస్తారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేసే ప్రక్రియలో భాగంగా విత్తనోత్పత్తి పథకం అమలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో రైతులకు, వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ  కమిషనర్  డాక్టర్ బి.జనార్దన రెడ్డి, ఐ ఎ ఎస్ ఈ నెల 7న మధ్యాన్నం 12.30 గంటలకు నిరుపమా చానెల్ యూ ట్యూబ్, టి శాట్ టి వి, టి శాట్ యాప్, ఫెస్బుక్, ట్విట్టర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడతారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న గ్రామ విత్తనోత్పత్తి పథకం గురించి ఆయన వివరిస్తారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి విస్తరణ అధికారులు, సీడ్ కార్పోరేషన్ అధికారులు, సీడ్ సర్టిఫికేషన్ అధికారులకు అవగాహన కల్పించేందుకు  ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నారు. రైతులు, ఇతరులు సంప్రదించవలసిన నెంబర్లు: T.SAT Toll Free Nos.18004254039, 040-23553473

ఏపీ రాజధాని అమరావతి పై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా..!

అమరావతి రైతులు తమ హక్కుల కోసం అలాగే రాజధానిని అమరావతిలోని కోసాగించాలని కోరుతూ మొదలు పెట్టిన ఉద్యమం రెండు రోజుల క్రితం రెండు వందల రోజులకు చేరింది. ఈ సందర్భంగా వైసిపి తప్పించి మిగిలిన అన్ని పార్టీలు ఆ రైతులకు మళ్ళీ సంఘీభావం తెలిపాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కూడా ఈ పోరాటానికి సంఘీభావంగా ట్వీట్ చేసారు. ఇదే సందర్భంలో ఎంపీ సుజనా చౌదరి రాతులను ఉద్దేశించి వర్ట్యువల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తూ రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ విషయంలో ఎవరు భయపడవలసిన అవసరం లేదని రాజధాని అమరావతి నుండి ఒక్క ఇంచ్ కూడా కదలదని స్పష్టం చేసారు. సరైన సమయంలో కేంద్రం దీనిపై జోక్యం చేసుకుంటుందని కూడా అయన తెలిపారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తమ పార్టీ అమరావతికి సంఘీభావం తెలుపుతుందని ఐతే ఈ విషయంలో కేంద్రం మాత్రం జోక్యం చేసుకోదని అన్నారు. ఇపుడు తాజాగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ అమరావతికి మద్దతు ప్రనటించారు. ఐతే ఈ అంశం లో కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. దీంతో అటు అమరావతికి భూములిచ్చిన రైతులలోను, ఇటు రాష్ట్ర ప్రజలలోను అయోమయం నెలకొంది. ఒక పక్క అమరావతికి మద్దతు అంటున్న బీజేపీ నేతలు మరో పక్క కేంద్రం జోక్యం విషయంలో మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతూ ఉండడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో 24శాతం అటవీ ప్రాంతాన్ని 33శాతం చేస్తాం

పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం.. బాసర ట్రిపుల్ ఐటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న 24శాతం అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెంచడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర‌వ విడ‌త హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఆయన మొక్క‌లు నాటారు. పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సీఎం  ప్రణాళికలు రూపొందించారని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఐదేండ్ల నుంచి కొనసాగుతున్న ఆ కార్యక్రమంలో ఇప్పటివరకు  182 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు. ఆరవ విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  బాస‌ర‌లో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 50 వేల  మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 30 వేల మొక్క‌లు నాటారని 20 వేల మొక్క‌లు నాటాల్సి ఉందన్నారు. మొక్కలు పెంచడంతో వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడుతాయని చెప్పారు. ప్రతి గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారని దీని ద్వరా కొంత మందికి ఉపాధి లభిస్తోందన్నారు.  ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని  ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో కరోనా తీవ్రతపై సీఎస్ కు గవర్నర్ ఆదేశాలు

తెలంగాణలో రోజురోజుకు కరోనా తీవ్రమవుతోంది. ప్రతి రోజు వందలుగా నమోదయ్యే పాజిటివ్ కేసులు ఇపుడు ఏకంగా 1500 నుండి 2000 కు మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఇదే విషయం పై చర్చించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ని ఈ రోజు రాజభవన్ కు పిలిపించారు. ఈ సంగతిని ఆమె ఒక ట్వీట్ ద్వారా తెలిపారు ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో జరుగుతున్న కరోనా పరీక్షల విషయంలో గవర్నర్ తమిళిసై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇపుడు తాజాగా ప్రతి రోజు తెలంగాణ లో నమోదవుతున్న కేసుల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపధ్యం లో గవర్నర్ ఈ ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కరోనా చికిత్సలు జరుగుతున్న గాంధీ , కోఠి ఇ ఎన్ టి , ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్స్ లో ఉన్న సదుపాయాలు పిపియి కిట్ల, ఎన్ 95 మాస్కుల లభ్యత పై వివరణ అడిగే అవకాశం ఉంది.  ఇదిలా ఉంటే, సాయంత్రం 4 గంటలకు మీటింగ్ కి రావాలని సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిలను గవర్నర్ కోరగా.. అధికారులు కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదని తెలుస్తోంది. మీటింగ్ రేపు జరిగే అవకాశముందని సమాచారం. మరో పక్క రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24000 కు చేరువ కావడం తో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ను దాటుకుని ముందుకు వెళుతున్న పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఒక్కరోజులో 1,322 కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరిలో 171, అనంతపురంలో 142, కర్నూలులో 136, చిత్తూరులో 120, పశ్చిమ గోదావరిలో 106, విశాఖపట్నంలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే మొదటిసారి. అంతేకాదు, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 20,019కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృతి చెందారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 10,860 యాక్టివ్‌ కేసులున్నాయి.

గాలి ద్వారా సోకవచ్చు.. ఆధారాలున్నాయి అంటున్న శాస్త్రవేత్తలు

మార్గదర్శకాలు మార్చమంటూ డబ్ల్యూహెచ్ఓకు లేఖ భూగోళాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ ను అరకట్టడానికి చేస్తున్న మానవప్రయత్నాలు ఫలితాలు ఇవ్వకముందే  కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో  ఉండటంతో ఇది ఎలా వ్యాప్తిస్తోంది అన్న అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవైపు వైరస్ ను తుదముట్టించే పరిశోధనలు జరుగుతుంటే మరోవైపు వ్యాప్తి ఎలా చెందుతుంది అన్న విషయంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.  కంటిని కనిపించని ఈ వైరస్ వ్యాప్తిపై అనేక కోణాల్లో పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. కారణం గత కొన్ని నెలలుగా ఎన్ని కట్టడి చేసినా.. దశల వారీగా లాక్డౌన్ విధించినా బాధితుల సంఖ్యను మాత్రం నియంత్రించలేక పోతున్నాము. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినట్లుపట్టి మళ్ళీ విజృంభిస్తున్న ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ప్రతి రెండు గంటలకు చేతులను శానిటైజ్ చేసుకోవడం ఇలాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా చాలా మందికి ఈ వ్యాధి సోకడం లో కారణాలేంటో తెలియడం లేదు. ఇదే విషయంపై ఒక శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసి ఫలితాలను డబ్ల్యూహెచ్ఓకు లేఖ ద్వారా తెలిపింది. ప్రస్తుతం వ్యాప్తిని అరికట్టేందుకు రూపొందించిన మార్గదర్శకాలను మార్చాలని వారు కోరారు. ఆధారాలున్నాయి.. కోవిడ్ 19 వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. గాలిలో ఉండే చిన్నచిన్న కణాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది అనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని వారు అంటున్నారు. ఈ బృందంలో 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లలో ఉండే వైరస్  చాలా సమయం గాలిలోనే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. 15 మైక్రాన్ల కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే స్పష్టం చేసింది. తాజాగా శాస్త్రవేత్తల బృందం పరిశోధనల ఫలితాలపై ఏం చెబుతుందో వేచి చూడాలి. గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న అంశాలు నిజమైతే గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంటే మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే ఉత్తమం.  ప్రజలు ఎక్కువ సంఖ్యలో తిరిగే ప్రాంతాల అన్నింటిలోనూ, గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో, మార్కెట్ యాడ్స్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ లాంటి చోట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు చెప్పినా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా వ్యక్తిగత జాగ్రత్త ముఖ్యం అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.

కాసులిస్తే కరోనా ఉన్నా లేనట్లే.. కొన్ని హాస్పిటల్స్ నిర్వాకం

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో సామాన్య జనం బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు కొంత మందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రజలు మరింత అయోమయానికి గురౌతున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు టెస్ట్ ల విషయంలో మీనమేషాలు లెక్క పెడుతున్నాయి . కొన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ప్రవేట్ ల్యాబ్ లు హాస్పిటల్స్ లో టెస్టులకు అనుమతిచ్చాయి. దీంతో అనుమానం ఉన్నవారు ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఐతే తాజాగా అక్కడ కూడా కొంత మంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా యూపీలోని ఒక ప్రయివేట్ హాపిటల్ లో అడిగినంత సొమ్ములిస్తే పాజిటివ్ వచ్చినా నెగటివ్ అని రిపోర్ట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రూ 2500 ఇస్తే కరోనా ఉన్నా నెగటివ్ గా రిపోర్ట్ ఇస్తామని ఆ హాస్పిటల్, ఉద్యోగులు బేరం ఆడుతున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ ఐంది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి బిల్డింగ్ కు సీల్ వేశారు. అయినా కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఒకపక్క వణికిపోతుంటే దీంట్లో కూడా ఇలా కాసులకు కక్కుర్తి పడేవాళ్లను చూస్తే ఏవగింపు కలుగుతోంది.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం మున్సిపాలిటీలో కొత్తగా 20 ఫాగింగ్, స్ప్రేయింగ్ మిషన్లు.. ఒక్కోక్కదాని ఖరీదు 40వేలు.. వానాకాలంలో సీజనల్ గా వచ్చే వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. దోమల నివారణ కోసం ఖమ్మం కార్పొరేషన్ లోని 50 డివిజన్లలో ప్రతి డివిజన్ కు ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషిన్లు ఆయన పంపిణీ చేశారు. 20 ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషిన్లు పంపిణీ చేశారు. ఒక్కో దాని ఖరీదు రూ.40వేలు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు. ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ఇంట్లో నిలువ ఉన్న నీరు, మురుగు, చెత్తచెదారంను తొలగించి ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

పెను ప్రమాదంలో బీజేపీ.. హెచ్చరించిన వైసీపీ ఎంపీ

నిత్యం టీడీపీ నేత చంద్రబాబు, లోకేష్ ల పై తన ట్వీట్ల ద్వారా విరుచుకు పడే వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరో సారి టీడీపీ నేతల ను తీవ్రంగా విమర్శిస్తూ బీజేపీ కి జాగ్రత్తలు చెప్పారు. బీజేపీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఒక వైపు కరోనా, మరో వైపు చైనా తో ఘర్షణ, మిడతల దండు యొక్క దాడి పై దృష్టి పెట్టి పని చేస్తోంది. ఐతే ప్రస్తుతం బీజేపీ కి మరో వైవు నుండి ప్రమాదం పొంచివుందని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తన తాజా ట్వీట్ ద్వారా హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారాన్ని కొల్పోయిన టిడిపి మిడతల దండు తాజాగా బిజెపి వైపు కదులుతోందని, అంతేకాకుండా ఇప్పటికే బిజెపిలో చేరిన ఆ దండు తన విధ్వంసాన్ని ప్రారంభించదని అయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుండి బిజెపి ఎలా బయటపడుతుందో వేచి చూడాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. గడచిన సంవత్సర కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్నఈ టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందాని అన్నారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీ లో చేరి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి గ్రహించేలోగానే మిగతావి కూడా ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. తమ స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగెంట్ల అవతారం ఎత్తుతున్నారని, అలాగే ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని, ఇప్పటికే పతనమైన విలువలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని అయన ట్వీట్ చేసారు. ఈ నాయకులంతా కేవలం మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు అని ఎంపీ విజయసాయి రెడ్డి వారి పై మండిపడ్డారు. విశాఖలో ఒక పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న విశాఖ గల్లీ స్థాయి నాయకుడు ఒకరు ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు. అదే విషయాన్ని అప్పట్లో పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి.. ఇప్పుడు తాజాగా సీఎం పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ చంద్రబాబు తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి అంటూ విజయసాయి ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

24 గంటల్లో 24వేలకు పైగా.. మగవారిలోనే ఎక్కువగా...

టెస్టులు చేయకపోవడంతోనే...కరోనా మహమ్మారి విజృంభణ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రతిరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. తాజాగా ఆదివారం 1590 కేసులు పాజిటివ్ గా వచ్చాయి. జిల్లాలలో కరోనా మహమ్మారి తక్కువగానే ఉంది హైదరాబాదులో మాత్రం దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులు ఒకసారి పరిశీలిస్తే 1,15,835 పరీక్షలు చేశారు. వీటిలో 23,902 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. మగవారిలోనే ఎక్కువగా... రాష్ట్రంలో నమోదవుతున్న కేసులో తీరు  పరిశీలిస్తుంటే ఎక్కువగా మగవారిలోని కోవిడ్ వైరస్ సోకుతున్నట్లు  స్పష్టమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,559 మంది కరోనా మహ్మమారి బారిన పడ్డారు. ఈ వైరస్ సోకిన వారిలో మహిళల సంఖ్య 8340గా ఉంది. ఇక వయసుల వారీగా చూసుకుంటే... 20 నుంచి 60 ఏళ్ల మధ్య వారిలోనే ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్య వయస్సు  వారిలో షుగర్ బీపీ ఉన్నవారికి త్వరగా సోకుతుంది. 24 గంటల్లో 24వేల కేసులు మనదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఒక రోజులోనే 248 50 మందిలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 24గంటల వ్యవధిలో అత్యధికంగా  నమోదు అయిన కేసులు ఇవే. దేశ వ్యాప్తంగా  ఇప్పటివరకు 6.73 లక్షల మంది కోవిద్ వైరస బారిన పడ్డారు. రష్యా దాటి..... అత్యధిక కేసులు ఉన్న జాబితాలో పరిశీలిస్తే అమెరికా 29 లక్షలు బ్రెజిల్ 15 లక్షలు రష్యా 6.82 లక్షలుగా ఉంది. రష్యాకు సమీపంలో ఉన్న మన దేశంలో కేసులు మరో 24గంటల్లో రష్యాను దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. టెస్టులు చేయకపోవడంతోనే... కరోనా వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా చేయాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎవరికి వ్యాధి ఉందో... ఎవరికి లేదో తెలియని అయోమయపరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పరీక్షలు వేగవంతం చేస్తే చాలావరకు వ్యాప్తిని అరికట్టవచ్చు.

ఊహించని విధంగా కరోనాకు మరో మందు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు

ప్రపంచం మొత్తం కరోనా తీవ్రత తో అతలాకుతలం అవుతోంది. ఇక భారత్ విషయానికి వస్తే కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచం లోనే మూడవ స్థానానికి చేరుకుంది. దీంతో కరోనాకు విరుగుడుగా మన దేశంలో ఒక పక్క వ్యాక్సిన్ ప్రయోగాలు జోరందుకున్నాయి. మరో పక్క దీనికి తగిన మందుల కోసం పరిశోధకులు తీవ్రంగా శోధిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఇతర వ్యాధుల కు వాడే మందులతో కరోనా పేషంట్ల కు ఇచ్చే ట్రీట్ మెంట్ లో వాడి వాటి ఫలితాలపై అధ్యయనం చేస్తున్నారు. ఐతే ఇదే విషయమై ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర లో కరోనా తీవ్రత చాల ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ముంబై లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సేవ్రి టీబీ హాస్పిటల్ లో 400 మంది టీబీ పేషంట్లు ఉన్నారు. ఈ హాస్పిటల్ లో టీబీ తీవ్రంగా ఉన్న పేషంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తారు. ఐతే ఇక్కడ పని చేస్తున్న 17 మంది నర్సులతో సహా 53 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కానీ ఒక్క టీబీ పేషంట్ కు కూడా కరోనా సోకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన ఈ హాస్పిటల్ డాక్టర్లు దీని పై దృష్టి పెట్టారు. ఇక్కడి టీబీ పేషెంట్లకు ఇస్తున్న టాబ్లెట్ల వల్లే కరోనా రావట్లేదని వారికీ అర్థమైంది. దీంతో ఆ టాబ్లెట్లు వలన కరోనాకు బ్రేక్ పడినటుగా గుర్తించారు. ఇదే విషయాన్ని ఆ డాక్టర్లు వెళ్లి బృహన్ ముంబై కార్పొరేషన్ లోని టీబీ నియంత్రణ అధికారులకు చెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన కార్పొరేషన్ అధికారులు భారత వైద్య పరిశోధనా మండలి(ICMR)కి ఈ సంగతి చేరవేశారు. ప్రజలను బెంబేలు పెడుతున్న కరోనా వైరస్ లాగే పల్మనరీ టీబీ కూడా ఊపిరితిత్తులపైనే దాడిచేస్తుంది. ఈ రెండు వ్యాధుల్లోనూ ప్రధాన లక్షణం దగ్గే కావడం గమనార్హం. ఈ పేషంట్లు కంటిన్యూగా దగ్గుతూనే ఉంటారు. దీనికి తోడు జ్వరం రావడం, ఊపిరి అందకపోవడం అనే లక్షణాలు కూడా ఈ రెండు వ్యాధులలోనూ కామన్ గా ఉన్నాయి. అంతే కాకుండా ఈ టీబీ పేషంట్ల లో ఎక్కువ మంది మురికి వాడలైన మాన్ఖుర్డ్, గోవండీ నుంచి వచ్చినవారే. కరోనా వ్యాపిస్తున్న మొదట్లో అందరికంటే ముందుగా అది టీబీ పేషెంట్లకే వ్యాపిస్తుందని డాక్టర్లు భావించారు. ఐతే ఆశ్చర్యకరంగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది. టీబీ పేషెంట్లలో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోంది అనే విషయం పై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు.

లాక్ డౌన్ తో లక్ కలిసి వచ్చిన కంపెనీలు

ఇకామర్స్, గేమింగ్ , ఫార్మా, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలదే హవా.. వంద కంపెనీల జాబితాలో 22 కంపెనీలు చైనావే.. 370 బిలియన్ డాలర్ల  లాభాలు అందుకున్న చైనా కంపెనీలు.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ప్రజా జీవితాన్ని యుటర్న్ తీసుకునేలా చేసిన కోవిడ్ వైరస్ 19 వ్యాప్తి కారణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచమంత ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు అతలాకుతలం అయిపోయాయి. కానీ కొన్ని రంగాల్లో మాత్రం బిలియన్ డాలర్ల మార్కెటింగ్ జరిగింది. అంతేస్థాయిలో లాభాలు ఆర్జించాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో కొన్ని కంపెనీలకు లక్ కలిసొచ్చింది.  చాలా కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం, ఆన్ లైన్ మీటింగ్స్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్లు, వీడియో గేమ్స్, మూవీస్, షాపింగ్ ఇలా అన్ని అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను, సాఫ్ట్ వేర్ ను అందించిన కంపెనీలు బిలియన్ డాలర్లలో లాభాలను అందుకున్నాయి. ఇకామర్స్ , గేమింగ్ , ఫార్మా, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలదే హవా కనిపిస్తోంది. కరోనా కాలంలో అత్యధికంగా మన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి 100 కంపెనీల జాబితాను పరిశీలిస్తే అందులో ఇరవై రెండు కంపెనీలు చైనా వే కనిపిస్తాయి. చైనాకు చెందిన టెన్సెంట్ గేమింగ్ కంపెనీ 93 బిలియన్ డాలర్ల మార్కెటింగ్తో ఐదోస్థానంలో నిలిచింది.  విండో ఆన్లైన్ షాపింగ్ కంపెనీ 52.2 బిలియన్ డాలర్ల మేరకు మార్కెటింగ్ చేసింది.  చైనాకు చెందిన మరో కంపెనీ అలీబాబా ఆన్లైన్ షాపింగ్,  హెల్త్ కేర్ ప్రాడక్ట్సతో మార్కెట్లో దూసుకుపోతుంది.  వైద్య పరికరాల కంపెనీలు,  ఫార్మా, ఫుడ్, ఆటోమొబైల్ పార్ట్స్ కంపెనీలు లాక్ డౌన్ టైమ్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. అంతేకాదు ఎడ్యుకేషన్ ఆఫ్ ఆన్ ఎడ్యుకేషన్ టెక్నో కంపెనీలు కూడా లాభాలను ఆర్జించాయి. చైనాకు చెందిన ఇరవై రెండు కంపెనీలు దాదాపు 370 బిలియన్ డాలర్ల బిజినెస్ ను చేసినట్లుగా తెలుస్తోంది. అత్యధిక లాభాలు ఆర్జించి నా జాబితాలో అమెజాన్ ముందు ఉంది. ఇంటికి పరిమితమైపోయిన ప్రజలు షాపింగ్ కోసం ఎక్కువగా ఈ సైట్ ను ఉపయోగించారు.  నాలుగు వందల 1.1 బిలియన్ డాలర్ల లాభాలను ఈ కంపెనీ ఆర్జించింది.  ఇక రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ 269.9 బిలియన్ డాలర్ల లాభాలతో ఉంది. వర్క్ ఫ్రొం హోమ్ పెరగడంతో  మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కు బాగా డిమాండ్ పెరిగింది. దాంతో ఈ కంపెనీ లాభాల బాట పట్టింది. కరోనా లాక్ డౌన్ టైం లోనూ ఆపిల్  అమ్మకాలు బాగానే జరిగాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ఆపిల్ స్టోర్ లు మూసి వేసినప్పటికీ ఆన్లైన్ షాపింగ్ లో ఆపిల్ కొత్తగా రిలీజ్ చేసిన ఐ ఫోన్, ఐమాక్, మ్యాక్స బుక్ ఎయిర్ అమ్మకాలు బాగానే జరిగాయి. ఈ కంపెనీ 219 పాయింట్ వన్ బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసింది.

వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీ,.. 20మందికి కరోనా పాజిటివ్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన... కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని.. పార్టీలు, ఫంక్షన్స్ చేయవద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. మాకెందుకు వస్తుంది అన్న ధీమా చాలామందిలో కనిపిస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇతరులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ప్రజలకు కరోనా పై ఎంత మాత్రం భయం లేదన్న విషయం స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో  ఒక బంగారు, వజ్రాల వ్యాపారి తమ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు, బంధు మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నారు. నగరంలోని ప్రముఖ బంగారు వ్యాపారులు , రాజకీయ నాయకులు 150 మంది వరకు హాజరయ్యారు. అంతా బాగానే జరిగింది అనుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పార్టీకి హాజరైన ఒక బంగారు వ్యాపారి కరోనా వ్యాధితో చనిపోయారు. దాంతో పార్టీకి హజరైన మిగతవారిలో భయం మొదలైంది. వారంతా పరీక్షలు నిర్వహించుకోగా దాదాపు 20 మందికి పైగా కరోనా సోకినట్లు సమాచారం. 15 రోజుల కిందట జరిగిన ఈ పార్టీలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడ పాల్గొనట్లు వినికిడి.