గ్రాఫిక్సేగా దూకండి.. నేను కింద వెయిట్ చేస్తా: విజయ్ సాయికి వెంకన్న సవాల్ 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించారంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఅంతే ఘాటుగా స్పందించారు. "యుశ్రారైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్..! అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్వీట్ చేసిన సాయిరెడ్డి గారికి దమ్ముంటే అమరావతిలో చంద్రబాబు గారు కట్టిన భవనం పైనుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలి. మూడు ముక్కలాట మొదలెట్టి ఒక్క ఇటుక పెట్టలేదు. మీరా విశాఖలో అద్భుత నగరాన్ని కట్టేది..! బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జనాన్ని పెట్టినంత వీజీ కాదు రాజధాని నిర్మాణం అంటే సాయిరెడ్డి సాబ్. ఎప్పుడు వస్తారో చెబితే మీడియాతో సహా బిల్డింగ్ కింద వెయిట్ చేస్తా'' అంటూ వెంకన్న సెటైర్లు వేశారు.

కోవిద్ 19 వైరస్ అరికట్టే ఇంట్రా నాజిల్ వ్యాక్సిన్

పరిశోధనలు చేస్తున్న పలు దేశాలు.. తుది దశలో ఫలితాలు.. కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ముమ్మరం చేస్తున్న ఈ ప్రపంచ దేశాలు అతి వేగంగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి.  ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోవిద్ 19వైరస్ కు వ్యాక్తిని కనుకోవాలన్న తపనతో దాదాపు 25 దేశాలు పరిశోధనలను వేగవంతం చేశాయి. చాలా దేశాలు తమ పరిశోధనలు ముగింపుకు వచ్చాయి అంటుంటే మరికొన్ని దేశాలు గుట్టు చప్పుడు కాకుండా క్లినికల్ ట్రయల్ కూడా పూర్తి చేసి వ్యాక్సిన్ ను మార్కట్ లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ గురించి వివరాలు మాత్రం రహస్యంగానే ఉంటున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ఇంట్రా మస్కులర్ ఇంజక్షన్ రూపంలో ఉంటుందా, లేక ఇంట్రా నాజిల్ డాప్స్ర్ అంటూ స్ప్రే రూపంలో ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్రా నాజిల్ రూపంలో వ్యాక్సిన్ను తీసుకురావాడానికి కెనడా, ఫిన్లాండ్, భారత్ తదితర దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రాయల్స్  కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే.. సాధారణంగా వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్ ఇంజక్షన్ రూపంలో ఉంటుంది. అయితే కోవిద్ 19 వైరస్ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంట్రా నాజిల్ డ్రాప్స్ గానూ లేదా స్ప్రే కాను ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం,ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు అంటున్నారు. ముక్కు లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్స్ ను కరోనా ఎదుర్కొనేలా ఈ వాక్సిన్ సిద్ధం చేస్తుంది. ముక్కు లో వేసే డ్రాప్స్ ద్వారా లేదా స్ప్రే ద్వారా ఈ వ్యాక్సిన్నుఉపయోగిస్తారు. దీన్ని శ్వాసమార్గంలో కి పంపిస్తారు. కోవిద్ 19 వైరస్ దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీస్ను ఈ  వ్యాక్సిన్ తయారు చేస్తుంది. ముక్కులతో పాటు శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగులు, జననేంద్రియ మార్గాల్లో శ్లేష్మకణాలను ఈ వ్యాక్సిన్ ప్రేరేపిస్తూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సాధారణంగా  ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్  వ్యాధి కారక వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిని ఎదుర్కోనే యాంటీబాడీల్స్ ను తయారు చేస్తుంది. అయితే కోవిద్ 19 వైరస్ ముక్కు ద్వారా సోకి శ్లేష్మం ద్వారా శరీరంలోని ఊపిరితిత్తులు, పేగులు, మూత్రపిండాలకు చేరి వాటిని దెబ్బతీస్తుంది. శ్లేష్మంలో పనిచేసేలా వ్యాక్సిన్ ను రూపొందిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది పరిశోధకుల ఆలోచన. ఇంట్రా  నాజిల్ వ్యాక్సిన్ యాంటీబాడీస్స్ తయారు చేయడంతో పాటు ఊపిరితిత్తులు, పేగులు, జననేంద్రియ మార్గాలలో కూడా రక్షణ అందిస్తుంది. టీ, బీ కణాలు.. ఈ వ్యాక్సిన్ లో టీ కణాలు, బి కణాలు అని రెండు రకాల సెల్యులార్ కాంపోనెంట్స్ ఉంటాయి. బి కణాలు యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తే, టీ కణాలు బి కణాలు యాంటీబాడీస్ తయారు చేసేలా ప్రేరణ కలిగిస్తాయి. కోవిద్ 19 వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ రెండు కణాలు రక్షణ కవచాలుగా పనిచేస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పరిశోధనలన్నీ విజయవంతమై కోవిద్ 19వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించే వ్యాక్సిన్ లు త్వరగా అందుబాటులోకి రావాలని ప్రపంచదేశాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. మరి ఏ దేశం ముందుగా ఈ మహమ్మారిని కట్టడి చేసే మందు కనిపెడుతుందో మనమూ వేచిచూద్దాం.

బ్రేకింగ్ న్యూస్.. టీడీపీ వాళ్లంతా జైలుకే: విజయ్ సాయిరెడ్డి

టీడీపీ ఎంపీలు ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన మరీ దారుణంగా ఉందంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై సెటైరికల్ కామెంట్స్ చేసారు . "బ్రేకింగ్ న్యూస్... చంద్రబాబు, లోకేశ్, మరియు మాజీ మంత్రుల అవినీతిపై ఎలాంటి విచారణ జరపవద్దని రాష్ట్రపతిని కోరిన టీడీపీ ఎంపీలు" అంటూ న్యూస ఛానల్ హెడ్ లైన్ తరహాలో సెటైర్లు వేశారు. అంతే కాకుండా " జగన్ ప్రభుత్వం టీడీపీ అవినీతిపై కొనసాగిస్తున్న సమగ్ర విచారణ పూర్తయితే ఇక అందరు జైలుకు పోవాల్సి వస్తుందని టీడీపీ నేతల ఆందోళన" అంటూ మరో సెటైర్ చేశారు.

సచివాలయం కూల్చివేత పై హైకోర్టు స్టే మరోసారి పొడిగింపు

కేంద్రం పరిధిలో కూల్చివేత అనుమతులు సచివాలయం కూల్చివేత అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సచివాలయ భవనాల కూల్చివేతలో పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కూల్చివేతలను అపాలంటూ దాఖలైన పిటిషన్ పై మరోసారి విచారణ కొనసాగింది. భవనాల కూల్చివేత కోసం కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరం ఉంటాయో లేదో చెప్పాలని కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018 విరుద్ధంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.  సచివాలయ భవనం కూల్చివేత సమస్య కేంద్రం చేతిలో ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం భవనాలు కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టు సూచించింది. ఎన్విరాన్మెంట్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అనుమతులపై తుది నిర్ణయం వచ్చిన తర్వాతనే సచివాలయం కూల్చివేత పై ప్రకటన ఇస్తామని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత కు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్నది స్పష్టం చేయాలని ఆదేశించింది కోర్టు. పర్యావరణ పరిరక్షణ చట్టం క్లియరెన్స్ కు సంబంధించి గతంలో వెలువడిన అనేక జడ్జిమెంట్ కోర్టు ముందుంచారు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్.‌ జిహెచ్ఎంసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు తీసుకున్నామని సచివాలయం కూల్చివేయడానికి ఈ అనుమతులు సరిపోతాయని  కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత  విచారణ రేపటికి వాయిదా వేసింది.

మీరు కూడా రాజకీయాలు చేస్తే ఎలా.. రమణ దీక్షితులు కు టిటిడి చైర్మన్ కౌంటర్

తిరుమల తిరుపతి దేవస్థానంలో 15 మంది అర్చకులకు కరోనా సోకినట్లు తిరుమల గౌరవ అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరో 25 మంది రిపోర్ట్ రావలసి ఉందని ఆ ట్వీట్ లో ఆయన తెలిపారు. ఈ పరిస్థితులలో భక్తుల దర్శనాలను కొనసాగించడం వల్ల తీరని నష్టం జరిగే అవకాశం ఉందని తాను చెపుతున్నా ఇవో, ఎఇఓ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తన ట్వీట్ ద్వారా అయన ఆందోళన వ్యక్తం చేసారు. ఆ ఇద్దరు అధికారులు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలనే పాటిస్తున్నారని విమర్శించారు. రమణదీక్షితులు ట్విట్టర్ ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టారు. టీటీడీ విషయంలో రమణదీక్షితులు రాజకీయాలు చేయడం మంచిది కాదని వైవీ అన్నారు. సీఎం జగన్ రమణ దీక్షితులుని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని ఈ సందర్బంగా అయన గుర్తు చేశారు. అర్చకుల భద్రత విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. టీటీడీకి ఆయన ఆగమ సలహాదారుడు కూడా అయిన రమణదీక్షితులుని పిలిచి మాట్లాడమని అధికారులతో చెప్పానని అయన తెలిపారు. ఇక ముందు ఆయన ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే గౌరవ టీటీడీ బోర్డుకు ఇవ్వాలని, మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.

ఎన్జీటీలో తెలంగాణ సచివాలయం కూల్చివేత పై విచారణ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత పై పర్యావరణ అనుమతులు లేవని, దీనిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖలను ప్రతివాదులుగా చేస్తూ ఆయన వేసిన పిటిషన్ చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్లో విచారణ జరిగింది. సచివాలయ భవనం కూల్చివేత పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నేషనల్ ట్రిబ్యునల్ కు వివరించారు. హైకోర్టులో విచారణ పూర్తి అయిన తర్వాతే ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగిస్తామంటూ కేసును సోమవారానికి వాయిదా వేశారు.‌

మా సంసారంలో నిప్పులు పోయకండి

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు, సూచనల కోసం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశానని, రాజకీయాలు ఏవీ చర్చించలేదని అన్నారు. బీజేపీలో చేరే అవకాశాలు లేవని, ఒక ఎంపీగా మాత్రమే కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడగొట్టాలని కొంతమంది చూస్తున్నారని ఆరోపించారు.  తనకు, పార్టీకి మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. తనకు, పార్టీకి మధ్య అగాధం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తానెప్పుడు పార్టీని పల్లెత్తుమాట అనలేదని, మీడియానే మా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తోందని, అలాంటి పనులు మానుకోవాలని సూచించారు.  పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షునికి గానీ తాను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు. పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని.. అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానన్నారు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడానన్నారు. పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, పార్టీకి ప్రజలు దూరం కాకూడదని, పార్టీ మరో 20-25 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి ఆ సూచనలు చేశానని రఘురామకృష్ణంరాజు అన్నారు.

కరోనా కు చెక్ పెట్టనున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్..

కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ లక్షల మందికి సోకగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. మరో పక్క వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా తో కలిసి సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ కరోనాను ఎదుర్కోవడంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం పై ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే రెండు దశల వ్యాక్సిన్ పరీక్షలు పూర్తీ కాగా మూడో దశ పరీక్షలను కూడా మొన్నజూన్ నెలలో బ్రెజిల్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసందే. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న బ్రెజిల్ లో వేలాది మంది పై ఈ వ్యాక్సిన్ తో జరిపిన ప్రయోగం విజయవంతమైందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్, తన బ్లాగ్ లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీ బాడీలు, టీ-సెల్ (కరోనా వైరస్ కిల్లర్ సెల్) లను జనరేట్ చేసిందని, ఐతే దీని గురించిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఈ రోజు తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ తో జరిపిన ప్రయోగాలు పూర్తిగా సక్సెస్ ఐతే వచ్చే సెప్టెంబర్ లో భారీ స్థాయిలో తయారు చేసి ప్రజలకు అందిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఏపీని కాపాడమని రాష్ట్రపతిని కోరిన టీడీపీ నేతలు

టీడీపీ నేతలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ను కలిశారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని, ఆయనకు అనుకులంగా ఉండే విధంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరామని ఎంపీ రామ్మోహన్ చెప్పారు. దీనిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందిచారని, దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుంటామని హామీ ఇచ్చారని ఎంపీ రామ్మోహన్ తెలిపారు. రోజు రోజుకు ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అందుకే తాము రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు.

ఏపీ కొత్త మంత్రులు వీళ్లే..!!

మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కు కేటాయిస్తారని సమాచారం. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా అప్పలరాజు కూడా అదే సామాజిక వర్గం. ఈయన స్వతహాగా డాక్టర్. ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించాయి. కేబినెట్ లోకి తీసుకుంటే అప్పలరాజుకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్ర బోస్ తో ఖాళీ అయిన స్థానాన్ని శెట్టి బలిజ వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కు ఇవ్వనున్నారని సమాచారం. పిల్లి సుభాష్ కూడా శెట్టి బలిజ సామాజిక వర్గం వారే. మొత్తానికి ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను, మళ్ళీ అవే సామజిక వర్గాలకు చెందిన నేతలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఒక్క గంటలో రూ.50 వేల కోట్లు

కరోనా వైరస్ ఎన్నో రంగాలపై ప్రభావం చూపించింది. ఎన్నో కంపనీలు డీలా పడ్డాయి. అయితే, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాత్రం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే, ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించింది. 11.5 శాతం వృద్ధితో  4233 కోట్లు నికర లాభాలను సాధించింది. దీంతో గురువారం నాటి మార్కెట్‌ లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఇన్ఫోసిస్‌ షేరు రికార్డు లాభాల్లో దూసుకుపోతోంది. సెషన్ ఆరంభంలోనే 15 శాతం పైగా లాభపడి ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్ఫోసిస్ వాటాదారులు కేవలం గంట వ్యవధిలోనే రూ.50 వేల కోట్లకు పైగా దక్కించుకోవడం విశేషం.

పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?

ఏపీ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ. 5 కోట్లకు పైగా డబ్బులు పట్టుబడటం, ఆ కారుపై మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండటం కలకలం రేపుతోంది. వైసీపీ నేతల అక్రమ సంపాదనకు ఇది నిదర్శనం అంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "వైఎస్ జగన్ గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుంది." అని లోకేష్ విమర్శించారు. "ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?" అని లోకేష్ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే స్టిక్కర్ కారులో 5 కోట్లకు పైగా నగదు పట్టివేత.. ఏపీలో రాజకీయ దుమారం

ఏపీ బోర్డర్ కు దగ్గరలో తమిళనాడు లోని గుమ్మడిపూండి దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు లో 5.27 కోట్లను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆ కారులో ఉన్న ఒంగోలుకు చెందిన ముగ్గ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నై కి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఆరంబాక్కం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడంతో తెల్లవారుజామున ఎలావురు లోని చెక్ పోస్ట్ వద్ద వాహనాల ను చెక్ చేయడం మొదలు పెట్టారు. అపుడే అటుగా ఎమ్మెల్యే స్టిక్కర్ తో వచ్చిన కారును చెక్ చేయగా వెనుక సీటులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా వాటిలో ఏకంగా 5 కోట్లకు పైగా నగదు ఉండడంతో దానిని స్వాధీనం చేసుకుని ఆ వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వీరిని ఒంగోలుకు చెందిన వసంత్, నాగరాజు, కారు డ్రైవర్ సత్యనారాయణ గా గుర్తించారు. ఐతే నగదు తరలిస్తున్న కారు మాత్రం తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు సమాచారం. ఐతే ఈ కారు పై ఒంగోలుకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం తో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా తనిఖీ జరిగే సమయంలోనే మరో ఇద్దరు తప్పించుకు పారిపోయారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు, మరో బంగారు వ్యాపారి ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఘటన పై లోతైన దర్యాప్తు కోరిన మంత్రి బాలినేని ఈ ఘటన తో ఇపుడు ఏపీలో తీవ్ర దుమారమే రేగుతోంది. ఆ ఘటన పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ చెన్నై వెళుతున్న ఒక కారుపై నా పేరుతొ ఉన్న స్టిక్కర్ ఉన్నట్లుగా మీడియాలో ఈ ఉదయం వార్తలు వచ్చాయి. ఆ స్టిక్కర్ ఫోటో జిరాక్స్ కాపీ. అంతే కాకుండా అరెస్ట్ ఐన వారు ఒంగోలుకు చెందిన వారు కావడంతో తనకు అంటగడుతున్నారని వాపోయారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 5 కోట్లకు పైగా నగదు ఉందని చెపుతున్నారు. దీని పై అన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు.

ట్రంప్ మాస్క్ పెట్టాడు.. మీరు కూడా పెట్టండి సారూ

కొద్ది రోజుల క్రితం ఎపి సీఎం సలహాదారుల బాధ్యతలలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులతో ముఖ్య సలహాదారులుగా ఉన్న కల్లం అజేయ రెడ్డి, పీవీ రమేష్ కు ఉన్న అధికారాలను కట్ చేసి సీఎం ఓ లోని ప్రవీణ్ ప్రకాష్ తదితర అధికారులకు అప్పగించారు. మళ్ళీ ఏమైందో ఏమో మొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ఢిల్లీ పర్యటనలో అజేయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలహాదారుగా ఉన్న అజేయ్ అధికారాలలో ఎటువంటి మార్పు లేదని కేవలం పీవీ రమేష్ అధికారులలో మాత్రమే కోత పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ తాజా ట్వీట్ ఎపి రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎపుడు మాస్క్ పెట్టని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితం మాస్క్ తో దర్సనమిచ్చాడు. దీనిని ఉదాహరణ గా చూపిస్తూ ప్రపంచంలోని నాయకులందరూ మాస్క్ లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రమేష్ ట్వీట్ చేసారు. ఐతే సీఎం జగన్ ను ఉద్దేశించి రమేష్ ఈ ట్వీట్స్ చేసారా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఎపి సీఎం కూడా చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే మాస్క్ ధరించి కనిపించారు.  

కోవిద్ 19 మూలాలు చెరిపేస్తున్న క్యూబా

చిన్నదేశమే అయినా ప్రపంచానికి సాయం.. మూడు దశల్లో జన జీవితాన్ని పునరుద్ధించే ప్రయత్నం.. హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్... కోవిద్ 19 వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా క్యూబా చేసిన ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. తమ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాల్లో కోవిద్ 19 రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. క్యూబా వైద్యసిబ్బంది సేవలను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ పొందిన ఈ వైద్యసిబ్బంది గతంలోనూ పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ను అరికట్టడంలోనూ విశేష సేవలందించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలన్న ప్రచారం జరుగుతోంది. కోవిద్ 19ను ఎదుర్కోవడంలో.. కోవిద్ 19ను సమర్థవంతంగా ఎదుర్కొన్న క్యూబాలో ఇప్పటివరకు 2399 కేసులు నమోదు కాగా వారిలో 2,242 మంది పూర్తిగా కోలుకున్నారు. మరికొందరు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య కేవలం 86 మాత్రమే. మరణించిన వారిలో సగం మంది ఆ దేశ రాజధాని  హవానా నగరంలో నివసించేవారే...మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వివిధ దేశాల్లో వైద్యసేవలందిస్తున్న వారిలోనూ కోవిద్ 19 వైరస్ సోకింది. అమెరికా, బ్రెజిల్లో వందలాంది మంది వైద్యసిబ్బంది చనిపోయారు. అయితే క్యూబాకు చెందిన వైద్యసిబ్బందిలో ఏ ఒక్కరిలోనూ కోవిద్ 19 వైరస్ వ్యాప్తించలేదు. ఇందుకు కారణం వారు తీసుకుంటున్న జాగ్రత్తలు. వైద్యసేవలు అందించడంలోనూ ఎంతో కఠిమైన, వైవిధ్యమైన శిక్షణను వారి తీసుకున్నారు. మూడుదశల ప్రక్రియ ద్వారా... క్యూబా ద్వీపాల సముదాయం. ఇక్కడి జనాభా కోటి పది లక్షలకు పైగా ఉంటారు. కోవిద్ వైరస్  ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగానే క్యూబాలోనూ వ్యాపించింది. అయితే అక్కడి ప్రభుత్వం చాకచక్యంగా రక్షణ చర్యలు తీసుకున్నారు. దశల వారీగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజలు వ్యాధి బారిన పడకుండా అవగాహన కల్పించారు. ఈ దేశంలోని 15ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ.. ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పన్నులు, విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపు వాయిదా వేశారు. ఒంటరిగా నివసించే వృద్ధులకు సామాజిక కార్యకర్తలు ఆహారాన్ని అందించారు. ప్రజలు వీధుల్లోకి రాకుండా నివారించారు. ఎలా సోకింది అరా తీస్తూ.. ప్రజారోగ్య అధికారులు వైరస్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించినప్పుడల్లా  వారికి ఎలా సోకింది వివరాలు తెలుసుకుని.. ఆ వ్యక్తితో కంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విధంగా చేయడం వల్ల లక్షణాలు కనిపించని పాజిటివ్ వ్యక్తులను కూడా గుర్తించి వారిని 14 రోజులు ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నవారిని ప్రతిరోజూ డాక్టర్లు పరీక్షించారు. వారిలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం ఉంటే వెంటనే హాస్పిటల్ కు తరలించేలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను సన్నద్దం చేశారు. అయితే ఇంటింటికి పరీక్షలు చేయడం ద్వారా వ్యాప్తిని అరికట్టి ఆసుపత్రి సౌకర్యాలు 60శాతం కన్నా తక్కువే వినియోగించారు. ఈ రోజుకు కూడా ప్రతిరోజూ సుమారు 2 వేల పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజా జీవనం మెరుగుపడేలా.. ప్రారంభంలోనే  దేశ సరిహద్దులను, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేవారి రద్దీని నివారించడానికి బస్సుల్లో, బస్ స్టాప్ ల్లో భౌతిక దూరం పాటించేలా, మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించారు. ట్యాంకర్లు, ట్రక్కులు, పంపుల ద్వారా వీధులను క్లోరిన్‌తో పిచికారీ చేశారు. ప్రతి ఉదయం తొమ్మిది గంటలకు, పబ్లిక్ హెల్త్ బులిటెన్ జాతీయ టీవీలో ప్రసారం చేశారు. కోవిద్ వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు తెలియజేశారు. కచ్ఛితమైన గణాంకాలు చెప్పడం ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి కల్పించారు. పర్యాటకులను అనుమతిస్తూ.. క్యూబా ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 75శాతం వైద్య సేవలను ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా వస్తోంది.  మానవ వనరులను ఆర్థిక వనరులుగా మలుచుకోవడంతో విజయవంతమైన దేశం. అక్కడి పర్యాటక ప్రాంతాలు ఆర్థికవనరులు.  కోవిద్ 19 వైరస్ కారణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం స్తంభించి పోయింది. అయితే క్యూబాలో పర్యాటకులను అనుమతిస్తున్నారు.  పూర్తి ఆరోగ్య భద్రత చర్యలు తీసుకుంటూ పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం సిద్ధం చేస్తున్నారు. 

ఏపీలో ఒక్కరోజే 2,412 కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీలో ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 468 నమోదు కావడం గమనార్హం. గుంటూరు తర్వాత ఆ స్థాయిలో కర్నూలు జిల్లాలో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,451 కి చేరింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 44 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 452 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 16,621 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం కమిటీని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.  పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చింది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.