జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్!

   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వం నవీన్ యాదవ్‌‌కు మద్దతుగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేలలో ఆయన ముందంజలో ఉండడం బీసీ సామాజికవర్గం మద్దతు ఉండటంతో ఆమోదించినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని రామ్మోహన్ తెలిపారు.  మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను అధిష్ఠానానికి పంపారు.లోకల్ నాయకుడు కావడం గతంలో  జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయటంతో నవీన్ యాదవ్‌ వైపు మొగ్గుచుపినట్లు తెలుస్తోంది.  2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో  మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  

వైజాగ్‌లో సముద్రం వెనక్కి వెళ్ళింది

  విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది తీరం నుంచి సముద్రం దాదాపు 150 నుంచి 200 మీటర్లు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి తేలి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సముద్రపు అలలతో దూరంగా కనిపించే బండరాళ్లు బయటకు వచ్చే వీటిపై నిలబడి సందర్శకులు సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు. ఇంతకీ వెనక్కి వెళ్లిన సముద్రం తిరిగి ముందుకు వస్తుందా అసలు సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది తెలుసుకుందాం   సాధారణంగా తుఫాన్లు సునామీలు వచ్చినప్పుడు సముద్రపు అలల రాకపోకల్లో  మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు తుఫాను సునామి లేని కాలంలో కూడా సముద్రం వెనక్కి వెళ్ళింది. నిజానికి తీరంలో ఆటుపోట్లు అలల ఎత్తు పొలాలు వేగంలో తేడాతో ప్రతిరోజు సముద్రం కొంత వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం జరుగుతుంది అలా రోజులు రెండుసార్లు కచ్చితంగా సముద్రం కొంచెం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వస్తుంది. ఇది రోజు బీచ్ పరిశీలించే మత్స్యకారులకు తెలుస్తుంది కానీ ఇప్పుడు చూస్తే సముద్రం చాలా వరకు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులతో కూడా అలల తాకిడిలో మార్పు  సముద్రపు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు సముద్ర ప్రవాహ దిశ ఒక దిశ నుంచి మరో దిశకు మారే సమయంలో కూడా సముద్రం ముందుకు వెళ్లడం వెనక్కి రావడం జరుగుతుంది . ఈ పరిస్థితి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కనిపిస్తుంది ఆ సమయంలో సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయి గాలులు బలంగా తీరానికి సమాంతరంగా వెళ్ళినప్పుడు సముద్రపు ఉపరితలంపై ఉండే నీటిని స్థానభ్రంశం చెందిస్తూ తీరం నుంచి వెనక్కి తీసుకు వెళుతుంది. అప్పుడు సముద్రం వెనక్కి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించడం కాక అప్పటివరకు నీటిలో ఉన్న బండ రాళ్లు ఇతర వస్తువులు మనకి కనిపిస్తాయి.  అయితే ఇది మళ్లీ బలమైన గాలులు వ్యతిరేక దిశలో వస్తే నీరు ముందుకు వస్తుంది. ఇది ఒకరోజులో మారవచ్చు కొన్నిసార్లు మూడు నాలుగు రోజులు పాటు కూడా ఉంటుంది ఇదంతా వాతావరణ పరిస్థితిలపై ఆధారపడి జరుగుతుందని సముద్ర వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు . ఇప్పుడు కూడా సముద్ర ఉపరితలం మీదుగా వీచే గాలుల కారణంగా సముద్రం వెనక్కి వెళ్లి ఉంటుందని ఓషినో గ్రఫీ అధికారులు చెప్తున్నారు. సందర్శికులు ఏమంటున్నారు   గడిచిన రెండు రోజులుగా సముద్రపు నీరు వెనక్కి వెళ్లడంతో సందర్శిక్కుల్లో సందడిగా అనిపిస్తుంది ఆర్కే బీచ్. వద్ద సముద్రం వెనక్కి వెళ్లడంతో తేలిన బండరాళ్లపై నిలబడి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు ఇది ఒక రకంగా సందర్శకుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు చిన్నప్పుడు నుంచి గమనిస్తున్నావని స్థానిక మత్స్యకారులు ఏ ఎస్ ఆర్ తెలిపారు. ఎక్కువగా తుఫాన్లు సునామి వచ్చినప్పుడు సముద్రం ఇలా వెనక్కి వెళ్లి చాలా వరకు ముందుకు వచ్చిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే సముద్రం వెనక్కి వెళ్లిన పరిస్థితుల్లో మళ్లీ ఏదో ఒక రోజు ముందుకు వస్తుంది అది కొన్నిసార్లు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సముద్రంలో ఫోటోలు దిగడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా నీరు వెనక్కి వచ్చి స్థిరంగా నిలబడినట్లైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పటికే లైఫ్ గార్డ్ సిబ్బంది పర్యాటకులకు చెబుతున్నారు. కానీ చల్లగా అందంగా వాతావరణం మారడం సముద్రం చాలా లోతుగా వెనక్కి వెళ్లడంతో ఇతరుల హెచ్చరికలు పట్టించుకునే స్థితిలో పర్యాటకులు కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితి మరో రెండు రోజుల్లో మారే అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

  బ్యాంకు అకౌంట్లు తెరిచి ఇస్తే డబ్బులు ఇస్తాం.... బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకెందుకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం ..కుబేర సినిమా తరహాలోనే  సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్ప డుతున్నారు.. ఈ సైబర్ నేరగాళ్లు అడ్డ మీద ఉన్న కూలీలను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బుల ఎరగా వేసి బ్యాంకు అకౌంట్లను  తెరిపిం చుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు అయితే నేరుగా కూలీలు ఉండే అడ్డా వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కూలీలతో మాటామంతి కలుపుతారు. బ్యాంకు అకౌంటు తెరిచి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇందు కొరకు మీ ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్తారు... వారి మాటలు నమ్మిన కూలీలు డబ్బుల కోసం బ్యాంకు అకౌంట్లు తెరిచేం దుకు సిద్ధమవు తారు.   ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన  కూలీలను నేరుగా బ్యాంకుకు తీసు కెళ్ళి బ్యాంకులో అకౌంట్ ని తెరిపి స్తారు.ఆ తరువాత ఈ ముఠా బ్యాంకు పాస్ బుక్కు, ఏటీఎం కార్డులు రాగానే వీటన్నిటిని కలెక్ట్ చేస్తారు... ఈ తతంగమంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది... అవునండోయ్ ఇది నిజం... ఇలా కుబేర సినిమా తరహాలో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న కూలీలే టార్గెట్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అడ్డా మీద ఉన్న కూలీలను టార్గెట్ గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బ్యాంకు అకౌంట్లను తెరిపి స్తున్నారు.ఆ తర్వాత పాస్ బుక్, ఏటీఎం కార్డులను నేరుగా కర్ణాటక కు పంపిస్తారు ..అది కూడా కేవలం  బస్సులోనే పంపిస్తారు. ఎవ్వరి కి కూడా ఇక అకౌంట్లు తెరిపిం చినట్లు తెలియదు.బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఈ మూట కూలీలకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడతో వీళ్ళ పని అయిపోతుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది.  ఆ ముఠా నేరుగా ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోని ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ బ్యాంకు అకౌంట్లుల న్నింటినీ కూడా బెట్టింగ్ యాప్లకు కనెక్ట్ చేస్తారు.. ఈ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకొని వెళ్ళిపో తారు.. సైబరాబాద్ లోని ఎస్వోటీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం తో కర్ణాటకలో ఉన్న ముఠాపైన నిఘా పెట్టారు. ఈ ముఠా నేరుగా ఒక కాల్స్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోనీ దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వహి స్తుంది  ..బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చే డబ్బులన్ని టిని కూడా అడ్డా మీద కూలీల ద్వారా ఓపెన్ చేయించిన అకౌంట్లోకి మళ్ళీ స్తారు ..ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే వీటిని క్లోజ్ చేస్తారు అయితే ఇప్పుడు వరకు దాదాపు ఒక సైబరాబాద్ పరిధిలోనే వందల కొద్దీ నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిపిం చినట్లుగా పోలీ సులు గుర్తించారు. నకిలీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫా రమ్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న దొప్పలపూడి నవీన్‌ కుమార్‌, వంకద్రి సందీప్‌ కుమార్‌, చింతల పాటి ప్రుధ్వి రామ రాజు,చింతల పాటి పవన్‌ వెంకట నాగ భారద్వాజ్‌, మామిడి శెట్టి రామాంజనేయులుఅనే ఐదుగురు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తం గా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. నిందితులు నకిలీ గేమింగ్‌ యాప్‌లను రూపొందించి, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ బాధితులను మోసగించేవారని అధికారులు తెలిపారు.  ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు సైబర్‌ గ్యాంగ్‌కు సరఫరా చేసినట్లు విచారణ లో వెల్లడైంది.ఈ గ్యాంగ్‌ టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా 120 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరు సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పని చేసేవారని.... “Dodge book777” అనే గేమింగ్‌ పోర్టల్‌ ద్వారా డబ్బులు మళ్లించారని అధికారులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 ల్యాప్‌టాప్‌లు, 30 మొబైల్‌ ఫోన్లు, 32 చెక్‌ బుక్స్‌, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్‌ కార్డులు, 14 లక్షల నగదు , సంబంధిత ఖాతాలను సీజ్‌ చేసినట్లు అధికా రులు తెలిపారు.ప్రజలు తమ OTPలు, PINలు, బ్యాంక్‌ వివరాలను ఎవరికీ ఇవ్వకూ డదని, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లను ఉప యోగించకుండా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.    

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

  ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.  ఈ క్రమంలో అమరావతి, విశాఖల్లో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాలను మించిన స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తన పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరు కానున్నారు.  కేంద్రం తెచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఈ సభ నిర్వహాణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని... ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని... సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని.. పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

  స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌‌కు లైన్ క్లియర్ అయ్యింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు పిటిషన్‌పై విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే సమయంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా స్టే ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది.  ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.  రేపు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషనర్‌ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు..సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.   రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు  అక్టోబర్‌ 9 నుంచి తొలివిడుత నామినేషన్లు అక్టోబర్‌ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు  అక్టోబర్‌ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్‌  అక్టోబర్‌ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్‌  

డ్రైవర్ల సమ్మెతో నిలిచి పోయిన అద్దె బస్సులు

    కడప జిల్లా దవ్వూరులో ఆళ్లగడ్డ డిపో  డ్రైవర్ పై ప్రయాణీకుడి దాడికి నిరసనగా  కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలలో విధులు నిర్వహించే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె నిర్వహించారు. దీంతో ప్రయాణీకులు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఈ సందర్బంగా పలువురు ఆర్టీసీ  అద్దె బస్సు డ్రైవర్లు మాట్లాడుతూ ఆళ్లగడ్డ  ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు బయలు దేరిందన్నారు. మార్గమద్యంలో 120 మంది ప్యాసింజర్లు వున్న బస్సు ఆపలేదన్నారు. దీంతో  దువ్వూరు వద్ద కడపకు చెందిన హేమవర్థన్ తన కుటుంబ సభ్యులతో కలసి బస్సులో వున్న డ్రైవర్ పై దాడికి పాల్పడడంతో తల పగిలిందన్నారు.  బస్సులో పరిమితికి మంచి ప్రయాణీకులను ఎక్కించుకున్నా కూడ బస్సు ఆపలేదని  డ్రైవర్ ను క్రిందకు లాగి కొట్టారన్నారు. ఈ విధంగాఇష్టాను సారంగా ప్రయత్నిస్తున్నారన్నారు.  డ్యూటీ చేయాలంటే కష్టతరంగా వుందన్నారు. అదే విధంగా ప్రయాణీకులు ఎక్కపడితే అక్కడ ఆపటం చేస్తున్నారన్నారు. ఒక ఊరికి ఒక స్టేజ్ కాకుండా ఇంటి దగ్గర ఆపుకుంటున్నారన్నారు.  ప్యాసింజర్స్ కు కండక్టర్ సపోర్టు చేసి డ్రైవర్ పై రెచ్చగొట్టిస్తున్నారన్నారు. తమ పై జరుగుతున్న దాడులను అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  పరిమితి మంచి ప్యాసింజర్లను ఎక్కించటం ఆపాలని, ఇష్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ ఆపటం సరికాదన్నారు. అద్దె బస్సు డ్రైవర్స్ అంటే అధికారులకు చులకనగా వుంటోందన్నారు. తమ పై ప్యాసింజర్స్ వల్ల ఎటువంటి సమస్య జరిగినా అధికారులు పరిష్కరించాలని వారు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.  ఈ విషయమై స్పందించిన రాష్ర్ట రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రాసద్ రెడ్డి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

భక్తులకు అందుబాటులో టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

  శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది.  ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక  విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు,  న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు. 

దేశంలో తొలి డిజిటల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం

  దేశంలోనే తొలి డిజిటల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో  ప్రభుత్వ-ప్త్రెవేటు భాగస్వామ్యం కింద ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఒక టెర్మినల్‌తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సోంతం. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతు 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి పైగా పెరిగియని తెలిపారు. నవీ ముంబై ఎయిర్‌పోర్టు ఆసియాలో బిగ్గెస్ట్ కనెక్టివిటీ హబ్‌గా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో ముంబైకి ప్రత్యేక స్థానం లభించింది. 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. ఈ సౌకర్యం పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత సంవత్సరానికి తొమ్మిది కోట్ల ప్రయాణికులను, 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో సంవత్సరానికి రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) ప్రకారం, ఈ కొత్త విమానాశ్రయం ముంబై ప్రాంతపు విమాన రవాణా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, కనెక్టివిటీని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన లాభాలను చేకూర్చనుంది. ఇదే సమయంలో, విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) సెప్టెంబర్ 30న ఈ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరు చేసింది. నవీ ముంబై విమానాశ్రయం అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది. ఇందులో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు ఉన్నాయి. 5జీ నెట్‌వర్క్‌లు, అధునాతన సెన్సార్‌లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్‌లు, అలాగే డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్‌ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కార్గో విభాగం పూర్తిగా ఆటోమేషన్ ఆధారంగా పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్‌మెంట్ ట్రాకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అలాగే మందులు, పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక ఉష్ణ నియంత్రిత విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సౌకర్యాలతో నవీ ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యాధునిక విమాన కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది.  

బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా

  బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు నామినేషన్లు దాఖలు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. అటు రేపు మరి కొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్‌.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ కోటా పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285-ఏను సవరించామని అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇంకా లభించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.  

ఏపీలో రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు

  ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 274 రహదారుల మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్‌ హైవేస్‌లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేశారు.  గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదు. జగన్ హయాంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో కొత్త రోడ్లతో పాటు మరమ్మతులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల దృష్టి పెట్టింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో చర్చించింది. మొత్తం 274 రోడ్ల పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది.   

రెండు దగ్గు సిరప్‌లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

  తెలంగాణలో రెండు దగ్గు సిరప్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్‌, రెస్పిఫ్రెష్‌ టీఆర్‌ కాఫ్‌ సిరప్‌లను తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుల్లో కల్తీ ఉన్నట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో దగ్గు సిరప్‌ సేవించి 11 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఆ నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసింది. రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు లేదా జలుబు మందులు సూచించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా సాధ్యమైనంతవరకు సిరప్‌లను ఇవ్వవద్దని హెచ్చరించింది. ఆపై వయస్సు ఉన్న చిన్నారులకు మాత్రం వైద్యుల సూచనతో, సరైన మోతాదు, నిర్ణీత కాలవ్యవధిలో మాత్రమే ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా లేదా ప్రిస్క్రిప్షన్‌ లేకుండా పిల్లలకు ఏ రకమైన దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించింది. పిల్లల విషయంలో స్వయంగా వైద్యం చేయడం ప్రమాదకరమని, ఏ చిన్న అనారోగ్యమైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలంటూ అధికారులు సూచించారు.  

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగురు సజీవదహనం

  అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మందుగుండు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా సంభవించిన భారీ పేలుడు ధాటికి షెడ్డు గోడ కూలిపోగా, శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ స్పందిస్తూ, వారం క్రితమే స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే అగ్నినివారణ పరికరాలు సక్రమంగా వినియోగించారా లేదా అనే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలు, వైద్యసాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఇదే విషయంపై హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆమె మాట్లాడి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  

బీహార్ ఎన్నికలు.. ట్రంప్ కార్డుగా పీకే పార్టీ?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య  తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయే, ఇండియా కూటములు మధ్య పోరు హోరాహోరీ అని పరిశీలకులు సైతం ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ సారి బీహార్ లో హంగ్ ఖాయమని చెబుతున్నారు. అంతేనా బీహార్ లో ఎన్డీయ, ఇండీ కూటములు సొంతంగా అవసరమైన స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హంగ్ ఖాయమనీ, దాంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్  కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ లో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రశాంత్ కిశోర్ మద్దతు అనివార్యమౌతుందని చెబుతున్నారు. అంటే ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా, ట్రంప్ కార్డుగా మారతారన్న మాట.  అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ,  ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీకే పార్టీ పట్ల యువత ఆకర్షితులౌతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.  అలాగే చిరాగ్ పాశ్వాన్ గతంలో పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సారీ కూడా అదే ఫలితం రావచ్చని అంటున్నారు.   గత రెండు నెలలుగా ప్రచారంలో ఎన్డీఏ, ఇండీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా . రాహుల్ గాంధీ 64 లక్షల ఓట్లు చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ పై ఆరోపణల అస్త్రాలు సంధించడంతో అందరి చూపు బీహార్ ఎన్నికల పై మళ్లింది. ఎన్నికల కమిషన్ మళ్లీ ఓటర్ల జాబితాను పున:పరిశీలించి కొత్తగా 14 లక్షల ఓట్లు చేరాయని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.4 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అది పక్కన పెడితే రాహుల్ ఓట్ చోరీ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.   దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ కీలక నేత అయిన తేజస్వీయాదవ్ అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి మారింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్నది ఇంకా నిర్ణయించలేదంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఓట్ చోరి యాత్ర ద్వారా వచ్చిన మైలేజీయే ఇందుకు కారణమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  ఇది ఆ కూటమిలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక సందర్భంలో హెచ్చరించారు కూడా. అది పక్కన పెడితే లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో పొత్తు విషయంలో నితీష్ వారసుడిగా కావాలని ఆశిస్తున్నారు. అయితే  ఇందుకు బీజేపీ అవకాశాలు లేవు. దీంతో చిరాగ్ పశ్వాన్ పీకే పార్టీ జన  సురాజ్ తో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జన సురాజ్ తో పొత్తుపై చిరాగ్ పశ్వాన్ సూచన ప్రాయంగా సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అది బీజేపీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలను సాధించాలన్న ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడిందని చెప్పారు. ఆప్ కూడా రాష్ట్రంలో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇక జేడీయూ విషయానికి వస్తే దాదాపు రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎన్డీయే కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఎన్డీయే కూటమిలో వ్యక్తం అవుతోంది.  సరే అది పక్కన పెడితే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు గానూ పొత్తులో చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన స్థానాలను మినహాయించి 205 స్థానాలలో చెరిసగంగా బీజేపీ, జేడీయూలు పోటీలోకి దిగాలని  యోచిస్తున్నాయి. అయితే చిరాగ్ పశ్వాన్ మాత్రం తమ పార్టీకి కూటమి పొత్తులో భాగంగా ఇవ్వజూపిన పాతిక స్థానాలతో సంతృప్తి చెందడం లేదు. మరో వైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. .వామపక్ష ఎంఎల్ పార్టీ 30 సీట్లు డిమాండ్ చేస్తున్నది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య కూడా సీట్ల పంపిణీలో పీటముడులు పడే అవకాశం ఉందంటున్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే పీకే కింగ్ మేకర్ గా మారతారన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

జ‌గ‌న్ హెలికాప్ట‌ర్ వివాదం

జ‌గ‌న్ విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. జ‌గ‌న్ స‌హా ప‌ది వాహ‌నాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేష‌న‌ల్ హైవే మీద వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. రోడ్ షోలు, జ‌న‌స‌మీక‌ర‌ణ చేస్తే ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా ఆపేస్తామ‌ని ష‌ర‌తులు విధించారు. అయితే రోడ్డు మార్గంలో జ‌గ‌న్ న‌ర్సీప‌ట్నం వెళ్లేందుకు మాత్రం అనుమ‌తి లేద‌న్నారు అన‌కాప‌ల్లి ఎస్పీ. అయితే అనుమ‌తులు లేకున్నా స‌రే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జ‌రిగి తీరుతుందంటున్నారు వైసీపీ నేత‌లు.  జగన్‌ పర్యటన రోజు అక్టోబ‌ర్ 9న‌, విశాఖలో మహిళల ప్రపంచకప్‌   మ్యాచ్‌ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు విశాఖ సీపీ. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేష‌న‌ల్ హైవే బ్లాక్‌ అవుతుందని.. అలా జ‌రిగితే  తమిళనాడులోని క‌రూరులో  విజయ్‌ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేద‌ని సీపీ తెగేసి చెప్పారు. కాబ‌ట్టి జ‌గ‌న్ కి హెలికాప్ట‌ర్ లో వెళ్ల‌ాలని సూచించారు.  అయితే  హెలికాప్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌కైతే ఓకే అంటున్న పోలీసుల తీరును  వైసీపీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. అదే ప‌నిగా హెలికాప్ట‌ర్ ప్ర‌స్తావ‌న చేస్తున్నారంటే ఇందులో మ‌రేదో కుట్ర కోణం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. అయితే గ‌త రాఫ్తాడు ప‌ర్య‌ట‌న‌లోనూ జ‌గ‌న్ చాప‌ర్ వివాదం సంగ‌తి తెలిసిందే.  జ‌గ‌న్ చాప‌ర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దానిపైకి కూడా జ‌నం దూసుకొచ్చేశారు. దీంతో ఆ చాప‌ర్ పైల‌ట్ జ‌గ‌న్ లేకుండానే తిరిగి వెళ్లిపోయాడు. ఏది ఏమైనా జగన్ పర్యటన వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. అసలు అధికారం కోల్పోయిన తరువాత జగన్ చేపట్టిన ప్రతి పర్యటనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు 

జగన్ రోడ్ షోకు నో పర్మిషన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయనకు రోడ్డు మార్గంలో అనుమతి లేదని అనకాపల్లి పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ దాదాపు 63 కిలోమీటర్లు రోడ్ షో చేయాలని భావించారు. అయితే ఇటీవల  తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించాన సంఘటనను పేర్కొంటూ.. జగన్ రోడ్ షోకు అనకాపల్లి పోలీసులు అనుమతి నిరారించారు. అయన వైజాగ్ నుంచి  నేరుగా హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు. అసలింతకీ విషయమేంటంటే.. జగన్ గురువారం (అక్టోబర్ 9) విశాఖకు 63 కిలోమీటర్ల దూరంలో ఉనన వాకవరపాలెంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఇందు కోసం ఆయన వైజాగ్ నుంచి రోడ్ మార్గం ద్వారా 53 కిలోమీటర్లు ప్రయాణించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక వైసీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు.  త‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల్లో 12 కాలేజీల‌ను ప్ర‌వేటు భాగ‌స్వామ్యానికి ఇవ్వ‌డాన్ని తప్పుపడుతున్న జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. త‌న నియోజ‌ క‌వ‌ర్గం లోనూ.. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీ ప్రారంభించి వ‌దిలేశార‌ని   ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.  దానికి జీవో కూడా లేద‌ని.. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేమ‌నీ అన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించిన జగన్.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ,  ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు. అయితే జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కావాలంటే. విశాఖ నుంచి హెలికాప్టర్ లో మాకవర పాలెం వెళ్లాలని సూచించారు.  అయితే వైసీపీ నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్నా లేకున్నా రోడ్ షో జరుగుతుందంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రోడ్డు మార్గంలోనే వెడతానంటూ పట్టుబట్టడం వెనుక శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్న కుట్ర కోణం ఉందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  

నార్కో టెర్రర్ కేసులో ఎనిమిది మందిపై ఎన్ఐఏ చార్జిషీట్

  లష్కరే తోయిబాతో లింకులు ఉన్న నార్కో టెర్రర్ కేసులో ఎనిమిది మందిపై   చార్జీషీట్‌  దాఖలు అయ్యింది. పాకిస్థాన్  నుంచి సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌ తీరానికి డ్రగ్స్‌ను తరలించి, స్మగ్లింగ్‌ చేసిన అంతర్జాతీయ నార్కో టెర్రర్‌ నెట్‌వర్క్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 8 మందిపై చార్జీషీట్‌ దాఖలు చేసింది. నిందితులు ఈ డ్రగ్స్‌ ద్వారా వచ్చిన డబ్బును ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కార్యకలాపాలకు నిధులుగా వినియోగించినట్లు ఎన్ఐఏ విచారణ లో తేలింది.ఈ కేసులో ఇది   ఎనిమిదవ అనుబంధ చార్జీషీట్‌.    ఇటలీకి చెందిన సిమ్రంజీత్‌ సింగ్‌ సంధు, ఆస్ట్రేలియా కు చెందిన తన్వీర్‌ సింగ్‌ బేడీ, భారత్‌కు చెందిన అంకుష్‌ కపూర్‌ లు ఈ నార్కో టెర్రర్‌ కుట్రకు  సూత్రధారులుగా ఎన్ఐఏ నిర్ధారించింది.  డిజిటల్‌, టెక్నికల్‌, డాక్యుమెంటరీ ఆధారాలతో సహా  అహ్మదాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ  చార్జీషీట్‌ దాఖలు చేసింది.  ఈ ముగ్గురితో పాటు పాకిస్తాన్‌ కు చెందిన తారిక్‌ అలియాస్‌ భాయ్‌జాన్‌, గగన్‌దీప్‌ సింగ్‌ అరోరా, తమన్నా గుప్తా, సుఖ్‌బీర్‌ సింగ్‌ అలియాస్‌ హ్యాపీ, అన్వర్‌ మసీహ్‌ లను కూడా ఎన్ఐఏ చార్జిషీట్ లో నిందిుతులుగా పేర్కొంది.  నిందితులు పాకిస్తాన్‌ నుంచి 500 కిలోల హెరాయిన్‌ను గుట్టు చప్పుడు కాకుండా గుజరాత్‌ సముద్ర తీరానికి అక్రమంగా రవాణా చేసి అనంతరం పంజాబ్‌కు తరలించినట్లు పేర్కొంది. ఆలా డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలోసంపాదించిన సొమ్మును లష్కరే తోయిబా  ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.   ఈ నార్కోటెర్రర్‌ నెట్‌వర్క్‌ గుజరాత్‌, ఢిల్లీ, పంజాబ్‌, చండీగఢ్‌లలో మాత్రమే కాకుండా ఇటలీ, ఆస్ట్రేలియా, యూఏఈ, పాకిస్తాన్‌, ఇరాన్‌, థాయిలాండ్‌ లకు కూడా విస్తరించి ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.   భారతదేశంలో అంకుష్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషించి, పంజాబ్‌లో ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాలను సమన్వయం చేశాడు. డ్రగ్స్‌ నిల్వ, రవాణా, పంపిణీ, అలాగే దేశీయంగా, విదేశాల్లో నిధుల మళ్లింపులో అతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సిమ్రంజీత్‌ సింగ్‌ ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ కు సూత్రధారి కాగా, అక్రమంగా డ్రగ్స్‌ రవాణా, నిల్వ, ప్రాసెసింగ్‌, ఉగ్ర నిధుల సేకరణలో   కూడా కీలకపాత్ర పోషించాడు.  ఇక తారిక్‌ అలియాస్‌ భాయ్‌జాన్‌ పాకిస్తాన్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్‌ రవాణా చేయడం, దాని పంపిణీ, లష్కరే తోయిబా ఆపరేటివ్‌లకు నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆస్ట్రేలియాలో ఉన్న తన్వీర్‌ బేడీ అంతర్జాతీయ హవాలా మార్గాల ద్వారా డ్రగ్‌ డబ్బులను లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాలకు చేరవేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. త గుజరాత్‌ ఏటీఎస్‌ ఈ కేసులో తొలి చార్జీషీట్‌ దాఖలు చేయగా, ఎన్ఐఏ ఇప్పటివరకు ఏడు సప్లిమెంటరీ చార్జీషీట్లు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ   26 మందిని అరెస్ట్‌ చేయగా, ఎనిమిది మంది   పరారీలో ఉన్నారు.

బనకచర్ల డీపీఆర్ తయారీకి నోటిఫికేషన్

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.  ప్రాజెక్ట్‌ డిజైన్‌తో పాటు లిఫ్ట్‌లు, టన్నెళ్లు కట్టే చోట ఇన్వెస్టిగేషన్‌ చేయడం, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు వీలుగా నివేదిక  తయారు చేయాలని నోటిఫికేషన్‌లో పేరొన్నది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుందనీ నోటిఫికేషన్ లో  పేర్కొంది.   కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆ కన్సల్టెన్సీదేనని పేర్కొంది. ఇందు కోసం  9.20 కోట్లు కేటాయించింది ఆ నోటిఫికేషన్ మేరకు బుధవారం (అక్టోబర్ 8) నుంచి 22వ తేదీవరకూ అనుభవజ్ణులైన కన్సెల్టెన్సీలు బిడ్ లో పాల్గొనేందుకు వీలుగా టెండర్లు దాఖలు చేయవచ్చు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. బుథవారం (అక్టోబర్ 8) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం (అక్టోబర్ 7)  శ్రీవారిని మొత్తం 71,634 మంది దర్శించున్నారు. వారిలో 24,980 మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  4 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది.