వైజాగ్‌లో సముద్రం వెనక్కి వెళ్ళింది
posted on Oct 8, 2025 @ 9:09PM
విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది తీరం నుంచి సముద్రం దాదాపు 150 నుంచి 200 మీటర్లు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి తేలి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సముద్రపు అలలతో దూరంగా కనిపించే బండరాళ్లు బయటకు వచ్చే వీటిపై నిలబడి సందర్శకులు సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు. ఇంతకీ వెనక్కి వెళ్లిన సముద్రం తిరిగి ముందుకు వస్తుందా అసలు సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది తెలుసుకుందాం
సాధారణంగా తుఫాన్లు సునామీలు వచ్చినప్పుడు సముద్రపు అలల రాకపోకల్లో మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు తుఫాను సునామి లేని కాలంలో కూడా సముద్రం వెనక్కి వెళ్ళింది. నిజానికి తీరంలో ఆటుపోట్లు అలల ఎత్తు పొలాలు వేగంలో తేడాతో ప్రతిరోజు సముద్రం కొంత వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం జరుగుతుంది అలా రోజులు రెండుసార్లు కచ్చితంగా సముద్రం కొంచెం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వస్తుంది. ఇది రోజు బీచ్ పరిశీలించే మత్స్యకారులకు తెలుస్తుంది కానీ ఇప్పుడు చూస్తే సముద్రం చాలా వరకు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులతో కూడా అలల తాకిడిలో మార్పు
సముద్రపు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు సముద్ర ప్రవాహ దిశ ఒక దిశ నుంచి మరో దిశకు మారే సమయంలో కూడా సముద్రం ముందుకు వెళ్లడం వెనక్కి రావడం జరుగుతుంది . ఈ పరిస్థితి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కనిపిస్తుంది ఆ సమయంలో సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయి గాలులు బలంగా తీరానికి సమాంతరంగా వెళ్ళినప్పుడు సముద్రపు ఉపరితలంపై ఉండే నీటిని స్థానభ్రంశం చెందిస్తూ తీరం నుంచి వెనక్కి తీసుకు వెళుతుంది. అప్పుడు సముద్రం వెనక్కి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించడం కాక అప్పటివరకు నీటిలో ఉన్న బండ రాళ్లు ఇతర వస్తువులు మనకి కనిపిస్తాయి.
అయితే ఇది మళ్లీ బలమైన గాలులు వ్యతిరేక దిశలో వస్తే నీరు ముందుకు వస్తుంది. ఇది ఒకరోజులో మారవచ్చు కొన్నిసార్లు మూడు నాలుగు రోజులు పాటు కూడా ఉంటుంది ఇదంతా వాతావరణ పరిస్థితిలపై ఆధారపడి జరుగుతుందని సముద్ర వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు . ఇప్పుడు కూడా సముద్ర ఉపరితలం మీదుగా వీచే గాలుల కారణంగా సముద్రం వెనక్కి వెళ్లి ఉంటుందని ఓషినో గ్రఫీ అధికారులు చెప్తున్నారు. సందర్శికులు ఏమంటున్నారు
గడిచిన రెండు రోజులుగా సముద్రపు నీరు వెనక్కి వెళ్లడంతో సందర్శిక్కుల్లో సందడిగా అనిపిస్తుంది ఆర్కే బీచ్. వద్ద సముద్రం వెనక్కి వెళ్లడంతో తేలిన బండరాళ్లపై నిలబడి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు ఇది ఒక రకంగా సందర్శకుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు చిన్నప్పుడు నుంచి గమనిస్తున్నావని స్థానిక మత్స్యకారులు ఏ ఎస్ ఆర్ తెలిపారు. ఎక్కువగా తుఫాన్లు సునామి వచ్చినప్పుడు సముద్రం ఇలా వెనక్కి వెళ్లి చాలా వరకు ముందుకు వచ్చిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే సముద్రం వెనక్కి వెళ్లిన పరిస్థితుల్లో మళ్లీ ఏదో ఒక రోజు ముందుకు వస్తుంది అది కొన్నిసార్లు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి సముద్రంలో ఫోటోలు దిగడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా నీరు వెనక్కి వచ్చి స్థిరంగా నిలబడినట్లైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పటికే లైఫ్ గార్డ్ సిబ్బంది పర్యాటకులకు చెబుతున్నారు. కానీ చల్లగా అందంగా వాతావరణం మారడం సముద్రం చాలా లోతుగా వెనక్కి వెళ్లడంతో ఇతరుల హెచ్చరికలు పట్టించుకునే స్థితిలో పర్యాటకులు కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితి మరో రెండు రోజుల్లో మారే అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.